Public sector banks
-
ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్
గత ఆర్థిక సంవత్సరం(2023–24) ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ చెల్లింపులు 33 శాతం ఎగశాయి. ఉమ్మడిగా రూ.27,830 కోట్లు చెల్లించాయి. ఇది పీఎస్‌యూ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి భారీగా మెరుగుపడినట్లు తెలియజేస్తోంది. అంతక్రితం ఏడాది(2022–23) ప్రభుత్వ బ్యాంకులు డివిడెండ్ రూపేణా రూ.20,694 కోట్లు అందించాయి. వీటితో పోలిస్తే గతేడాది చెల్లింపులు 33 శాతం బలపడ్డాయి. కాగా.. వీటిలో 65 శాతం అంటే రూ.27,830 కోట్లు వాటా ప్రకారం ప్రభుత్వానికి అందించాయి.ఇదేవిధంగా 2022–23లో ప్రభుత్వ వాటాకు పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ.13,804 కోట్లు చెల్లించాయి. గతేడాది ఎస్బీఐసహా 12 ప్రభుత్వ బ్యాంకులు పీఎస్‌యూ బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్లకుపైగా నికర లాభం ఆర్జించాయి. దీనిలో ఎస్బీఐ వాటా విడిగా 40 శాతంకావడం గమనార్హం! 2022–23లో రూ.1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ.1.29 లక్షల కోట్ల నికర లాభం సాధించిన విషయం విదితమే. ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!ఎస్బీఐ 22 శాతం జూమ్గతేడాది ఎస్బీఐ రూ. 61,077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది సాధించిన రూ. 50,232 కోట్లతో పోలిస్తే 22 శాతం అధికం! పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం అత్యధికంగా 228 శాతం దూసుకెళ్లి రూ. 8,245 కోట్లను తాకింది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్ లాభం 62 శాతం వృద్ధితో రూ. 13,249 కోట్లకు చేరగా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 61 శాతం ఎగసి రూ. 2,549 కోట్లయ్యింది. ఇతర సంస్థల లాభాలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం ఎగసి రూ. 4,055 కోట్లకు, ఇండియన్ బ్యాంక్ 53 శాతం అధికంగా రూ. 2,549 కోట్లకు చేరాయి. 2017–18లో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నష్టాలు నమోదుచేయగా.. 2023–24కల్లా ఏకంగా రూ. 1,41,203 కోట్ల నికర లాభం ఆర్జించి సరికొత్త రికార్డ్ సాధించడం కొసమెరుపు!! -
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, లిస్టెడ్ ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలకు ఆహ్వానం పలికింది. రెండు రకాల ప్రతిపాదనల(రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్–ఆర్ఎఫ్పీ)కు తెరతీసింది. దీనిలో భాగంగా మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను మూడేళ్ల కాలానికి దీపమ్ ఎంపిక చేయనుంది. గడువును మరో ఏడాది పొడిగించేందుకు వీలుంటుంది. ఎంపికైన సంస్థలు వాటాల విక్రయం విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించవలసి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో వాటాల విక్రయంలో ప్రభుత్వానికి తగిన విధంగా సహకారం అందించవలసి ఉంటుంది. ఇందుకుగాను మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 27వరకూ దీపమ్ గడువు ప్రకటించింది. అయితే రెండు కేటగిరీలలో మర్చంట్ బ్యాంకర్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్లస్ విభాగంకింద రూ. 2,500 కోట్లు లేదా అంతకుమించిన పరిమాణంగల లావాదేవీల నిర్వహణ ఉంటుంది. ఏ కేటగిరీలో రూ. 2,500 కోట్ల విలువలోపు వాటాల విక్రయంలో ప్రభుత్వానికి మద్దతివ్వవలసి ఉంటుందని దీపమ్ తెలియజేసింది. ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ప్రభుత్వ రంగ సంస్థలలో వాటా విక్రయ వ్యవహారాలను పర్యవేక్షించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను పలు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమలు చేయవలసి ఉంది. ఇందుకు ప్రభుత్వం 2026 ఆగస్ట్ 1వరకూ గడువునిచ్చింది. తద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడంతోపాటు.. పబ్లిక్ వాటా పెంచవలసి ఉంది. ఐదు బ్యాంకులు ప్రధానంగా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 98.3 శాతంకాగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 96.4 శాతం, యుకో బ్యాంక్‌లో 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.1 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.5 శాతం చొప్పున వాటా కలిగి ఉంది. ఇదే విధంగా ఐఆర్ఎఫ్సీలో 86.36 శాతం, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 82.4 శాతం చొప్పున ప్రభుత్వానికి వాటా ఉంది. వెరసి ఈ సంస్థలలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. -
మొండిబకాయిలు రూ.3 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (సెప్టెంబర్ 30) ముగిసే నాటికి రూ.3,16,331 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 3.09 శాతమని వివరించారు.ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు రూ.1,34,339 కోట్లని తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 1.86 శాతంగా వివరించారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... 2024 మార్చి 31 నాటికి 580 మంది ప్రత్యేక రుణగ్రహీతలు (వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా), ఒక్కొక్కరు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ రుణ బకాయిలను కలిగి ఉన్నారు. వీరిని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించాయి.ప్రస్తుత దివాలా కేసుల తీరిది... మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది. బ్యాంకులతో సహా రుణదాతల మొత్తం క్లెయిమ్ రూ. 11.45 లక్షల కోట్లు కాగా, మొత్తం లిక్విడేషన్ విలువ రూ. 2.21 లక్షల కోట్లు. -
పీఎస్బీల్లో సీజీఎం పోస్టుల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వ్యాపారం, లాభదాయకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పోస్టులను పెంచే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. 2019 నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం పీఎస్బీల్లో ఒక సీజీఎం, నలుగురు జనరల్ మేనేజర్లు ఉండొచ్చు. అప్పట్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిలో విలీనం చేసిన అనంతరం జీఎం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుకు మధ్య సీజీఎం పోస్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి వ్యాపారం మెరుగుపడిన నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా పోస్టులను పెంచుకునే అవకాశాలు కలి్పంచాలని కేంద్ర ఆర్థిక శాఖను పీఎస్‌బీలు కొన్నాళ్లుగా కోరుతున్నాయి. దీంతో తదుపరి వృద్ధి అవకాశాలను బ్యాంకులు అందిపుచ్చుకోవడంలో తోడ్పాటు అందించే దిశగా సీజీఎం పోస్టుల పెంపు ప్రతిపాదనలను ఆర్థిక సేవల విభాగం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12 పీఎస్బీల్లో దాదాపు 4 లక్షల మంది ఆఫీసర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు 35 శాతం పెరిగి రూ. 1.4 లక్షల కోట్ల స్థాయిని దాటాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటా ఏకంగా 40 శాతం పైగా (రూ. 61,077 కోట్లు) ఉంది. -
పేదల నుంచి బ్యాంకులు గుంజేసింది బిలియన్ డాలర్లపైనే...
డబ్బులు లేనందుకు డబ్బులే జరిమానాగా చెల్లించాల్సి వస్తే!!. పేదలు కనక పెనాల్టీ చెల్లించాలంటే!!. ఈ దారుణ పరిస్థితి ఇపుడు మన బ్యాంకుల్లో చాలామంది కస్టమర్లకు అనుభవంలోకి వచ్చింది. ఖాతాల్లో కనీస నిల్వలు లేవన్న కారణంతో... ఉన్న కాసింత నగదునూ జరిమానా రూపంలో బ్యాంకులు గుంజేసుకోవటం సాధారణమైపోయింది. అందుకేనేమో... గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ బ్యాంకులకు ఈ జరిమానాల రూపంలోనే బిలియన్ డాలర్లకు పైగా సొమ్ము వచ్చి పడిపోయింది. మరి ఈ జరిమానాలు కట్టినవారంతా ఎవరు? శ్రీమంతులు కాదు కదా? ఖాతాల్లో కనీసం రూ.5వేలో, 10వేలో ఉంచలేక.. వాటిని కూడా తమ అవసరాలకు వాడుకున్నవారే కదా? ఇలాంటి వారి నుంచి గుంజుకుని బ్యాంకులు లాభాలు ఆర్జించటం... అవికూడా ప్రభుత్వ బ్యాంకులు కావటం మన దౌర్భాగ్యం కాక మరేంటి!.డిజిటల్ పేమెంట్ల యుగం వచ్చాక బ్యాంకు ఖాతా లేని వ్యక్తులెవరూ లేరన్నది వాస్తవం. పది రూపాయలు పార్కింగ్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చేస్తున్న పరిస్థితి. నెలకు రూ.5-10 వేలు సంపాదించే వ్యక్తులకూ పేటీఎం, ఫోన్‌పేలే దిక్కు. వీళ్లంతా తమ ఖాతాల్లో రూ.5వేలో, లేకపోతే రూ.10వేలో అలా వాడకుండా ఉంచేయటం సాధ్యమా? అలా ఉంచకపోతే జరిమానా రూపంలో వందలకు వందల రూపాయలు గుంజేసుకోవటం బ్యాంకులకు భావ్యమా? బ్యాంకులు లాభాల్లోకి రావాలంటే ‘డిపాజిట్లు- రుణాల’ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవాలి తప్ప ఇలా జరిమానాలతో సంపాదించడం కాదు కదా? గడిచిన ఐదేళ్లలో మన ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులు కలిసి అక్షరాలా ఎనిమిదివేల నాలుగువందల తొంభై ఐదు కోట్ల రూపాయల్ని ఈ మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి గుంజేసుకున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎస్బీఐ మానేసింది కనక...2014-15లో ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయటంతో పాటు సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విధించింది. వాటికి లోబడి ఆ ఛార్జీలు ఎంతనేది బ్యాంకులే సొంతంగా నిర్ణయం తీసుకుంటాయి. వసూలు చేయాలా? వద్దా? అన్నది కూడా సదరు బ్యాంకుల బోర్డులో నిర్ణయిస్తాయి. 2019-20లో ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులూ ఈ జరిమానాల కింద రూ.919.44 కోట్లు వసూలు చేస్తే... 2023-24కు వచ్చేసరికి అది అమాంతం రూ.2,331.08 కోట్లకు పెరిగిపోయింది. అంటే రెండున్నర రెట్లు. నిజానికి మన బ్యాంకుల వ్యాపారం కూడా ఈ స్థాయిలో పెరగలేదు. మరో గమనించాల్సిన అంశమేంటంటే 2019-20లో వసూలు చేసిన రూ.919 కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాయే ఏకంగా రూ.640 కోట్లు. అంటే 70 శాతం. ఖాతాదారుల అదృష్టం బాగుండి.. 2020 నుంచి ఈ రకమైన జరిమానాలు వసూలు చేయకూడదని ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎస్బీఐ కూడా ఇప్పటికీ వీటిని వసూలు చేస్తూ ఉంటే ఈ ఐదేళ్లలో మొత్తం జరిమానాలు రూ.15వేల కోట్లు దాటిపోయి ఉండేవేమో!!. అత్యధిక వసూళ్లు పీఎన్‌బీవే...ఈ ఐదేళ్లలో 13 బ్యాంకులూ కలిసి రూ.8,495 కోట్లు జరిమానాగా వసూలు చేసినా... అందులో అత్యధిక వాటా నీరవ్ మోడీ స్కామ్‌లో ఇరుక్కున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుదే. ఎస్బీఐ జరిమానాలు వసూలు చేయటం లేదు కాబట్టి ఆ తరువాతి స్థానంలో ఉండే పీఎన్బీ ఏకంగా రూ.1,537 కోట్లను ఖాతాదారుల నుంచి జరిమానాగా వసూలు చేసింది. అత్యంత తక్కువగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.19.75 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియన్ బ్యాంకు రూ.1466 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1250 కోట్లు, కెనరా బ్యాంకు రూ.1157 కోట్లతో పీఎన్బీ తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకులు నెలవారీ కనీస నిల్వలు లేవన్న కారణంతో... మరికొన్ని బ్యాంకులు క్వార్టర్లీ కనీస నిల్వలు లేవన్న కారణంతో ఈ జరిమానాలు వసూలు చేశాయన్నది మంత్రి వ్యాఖ్యల సారాంశం.-రమణమూర్తి.ఎం -
కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను చెల్లించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెక్ రూపేణా మొత్తం రూ. 6,481 కోట్లు అందించాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2023–24)గాను ప్రభుత్వానికి ఉమ్మడిగా డివిడెండ్‌ను చెల్లించాయి. దీనిలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 2,514 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 1,838 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 1,193.5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 935.5 కోట్లు చొప్పున డివిడెండ్‌ను అందించాయి. అంతేకాకుండా వీటికి జతగా ఎగ్జిమ్ బ్యాంక్ సైతం రూ. 252 కోట్ల డివిడెండ్ చెక్‌ను ప్రభుత్వానికి అందజేసింది. -
పీఎస్‌బీలపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంగళవారం భేటీ కానున్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను లోగడ తీసుకురావడం తెలిసిందే. వీటి కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి రుణసాయం ఏ విధంగా అందుతోందన్న దానిపై భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి, ముద్రా యోజన తదితర పథకాల పురోగతిపై పరిశీలన జరగనుంది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అందరికీ ఆర్థిక సేవల చేరువ విషయంలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెపె్టంబర్లో ప్రధాని ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కింద హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి నామమాత్రపు వడ్డీపై రుణ సాయం లభించనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.13,000 కోట్ల సాయం అందించనున్నారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం కింద సొంతంగా సంస్థలను స్థాపించే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు బ్యాంక్‌ల ద్వారా రుణ సాయం లభించనుంది. -
మహిళలకు శుభవార్త.. బ్యాంకుల్లో ప్రత్యేక స్కీమ్స్!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మహిళల కోసం, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఫౌండర్ల కోసం త్వరలోనే ప్రత్యేక ఆర్థిక పథకాలను ప్రారంభించనున్నాయి.ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (ఈఎస్ఈ 7.0) సంస్కరణల ఎజెండాలో భాగంగా మహిళా కస్టమర్లకు మద్దతు ఇచ్చే వ్యూహాన్ని రూపొందించాలని ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను కోరినట్లు ‘లైవ్ మింట్’ కథనం పేర్కొంది. ఈఎస్ఈ 7.0 రిస్క్‌ను అంచనా వేయడం, నిరర్థక ఆస్తుల నిర్వహణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి పెడుతుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏకు ఎక్కువ మంది మహిళలు ఓటేశారని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రత్యేక పథకాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు, తమ వెంచర్లకు ఆర్థిక సహాయం కోరుకునే వారికి 'లోన్ మేళాలు' వంటివి తాజా ఈఎస్ఈ సంస్కరణల్లో ఉన్నాయి. మహిళా వ్యవస్థాపకులను స్టార్టప్ ఇంక్యుబేటర్లతో అనుసంధానం చేసి వారి వెంచర్లను విస్తరించడానికి సహాయపడే కార్యక్రమాలను కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా నిర్వహించున్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి దీనిపై స్పందన రాలేదు. -
ప్రభుత్వ బ్యాంకుల భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చితో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో భారీ డివిడెండ్‌ను చెల్లించే వీలుంది. ఇందుకు లాభదాయకత మెరుగుపడటం సహకరించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది పీఎస్‌యూ బ్యాంకులు రూ. 15,000 కోట్లకుపైగా డివిడెండును చెల్లించే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటికే తొలి మూడు త్రైమాసికాల(ఏప్రిల్–డిసెంబర్)లో 12 పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 98,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. గతేడాది(2022–23)లో ఉమ్మడిగా సాధించిన నికర లాభానికంటే రూ. 7,000 కోట్లుమాత్రమే తక్కువ. గతేడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 66,540 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది ప్రభుత్వం పీఎస్‌యూ బ్యాంకుల నుంచి 58 శాతం అధికంగా రూ. 13,804 కోట్ల డివిడెండ్‌ను అందుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 8,718 కోట్ల డివిడెండ్ మాత్రమే చెల్లించాయి. వెరసి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి పీఎస్‌యూ బ్యాంకులు డివిడెండును చెల్లించనున్నట్లు అంచనా. కాగా.. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6 శాతానికంటే తక్కువగా నమోదైన బ్యాంకులు మాత్రమే డివిడెండ్ ప్రకటించేందుకు వీలుంటుంది. అయితే వచ్చే ఏడాది(2024–25) నుంచి మాత్రమే తాజా మార్గదర్శకాలు అమలుకానున్నాయి. -
FICCI-IBA Bankers survey: ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది. మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అధికంగా ఎన్పీఏలు ఉన్నాయి. ► వచ్చే ఆరు నెలల్లో ఆహారేతర పరిశ్రమలకు రుణాల వృద్ధి 12 శాతం పైగానే ఉండొచ్చని 41 శాతం బ్యాంకులు, 10–12 శాతం ఉండొచ్చని 18 శాతం బ్యాంకులు భావిస్తున్నాయి. 36% బ్యాంకులు ఇది 8–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ► రాబోయే ఆరు నెలల్లో ఎన్పీఏలు 2.5–3 % స్థాయిలో ఉండొచ్చని 14% బ్యాంకులు తెలిపాయి. ► టర్మ్ డిపాజిట్లు పుంజుకోగా, మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా తగ్గిందని 70 శాతం బ్యాంకులు తెలిపాయి. దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లకు డిపాజిట్లను లాకిన్ చేయాలనే ధోరణిలో కస్టమర్లకు ఉండటమనేది టర్మ్ డిపాజిట్లకు సానుకూలంగా మారింది. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ .. ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ కోసం డిమాండ్ నెలకొంది. -
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు. 2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి. -
Ayodhya: 22న బ్యాంక్యులు పనిచేసేది సగం రోజే!
ముంబై: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) జనవరి 22న సగం రోజు మాత్రమే పనిచేస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత వ్యవహారాలు, శిక్షణా శాఖ కూడా ఒక కీలక ఉత్వర్వులు జారీచేస్తూ, జనవరి 22న కేంద్ర ప్రభుత్వ స్థాపనను సగం రోజు పనిదినాన్ని ప్రకటించింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న మనీ మార్కెట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు (ప్రాధమిక– ద్వితీయ), విదేశీ మారకద్రవ్యం, ద్రవ్య మార్కెట్లు, రూపీ ఇంట్రస్ట్ డెరివేటివ్‌లలో ఎటువంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఇక రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే, డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కూడా 22వ తేదీ ఉండదని ఆర్బీఐ మరో సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ సౌలభ్యం తిరిగి జనవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. ‘‘భారత ప్రభుత్వం ప్రకటించిన సగం రోజు పని దినం కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనూ 2024 జనవరి 22, సోమవారం రూ. 2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు’’ అని సెంట్రల్ బ్యాంక్ ప్రకటన తెలిపింది. -
తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: మొండి బకాయిలను (ఎన్పీఏ) తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న చర్యలు తగిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత తొమ్మిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రికవరీ చేశాయి. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ.10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. ► 2018–19 చివరి నాటికి మొండి బకాయిలు రూ.7,09,907 కోట్లు. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ విలువ రూ.6,32,619 కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి ఈ విలువ మరింతగా రూ.2,66,491 కోట్లకు తగింది. ► 2018 మార్చి 31వ తేదీ నాటికి ఎన్పీఏల విలువ రూ.10,36,187 కోట్లు. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏల నిష్పత్తి 11.18 శాతం. 2023 నాటికి విలువ రూ.5,71,515 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్పీఏ నిష్పత్తి 3.87 శాతం. కీలక చర్యల ఫలితం... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడినట్లు ఇటీవలి ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ ఖరాద్ లోక్‌సభకు తెలిపారు. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు/డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రోత్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. -
బ్యాంక్ చీఫ్‌లతో నేడు ఆర్థికమంత్రి భేటీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జూలై 6) సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 12 బ్యాంకుల ఆర్థిక పనితీరు, ప్రభుత్వ పథకాల అమల్లో భాగస్వామ్యం ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు సమాచారం. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమైన తర్వాత బ్యాంకింగ్‌లో ఈ తరహా సమావేశం జరగడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రభుత్వ బ్యాంకుల లాభం రూ.1,04,649 కోట్లు. దీనిలో దాదాపు సగం వాటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. 2017–18లో రూ.85,390 కోట్ల నికర నష్టం నుంచి బ్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడం గమనార్హం. -
తొమ్మిదేళ్లలో మూడింతలు
న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) లాభాలు గత తొమ్మిదేళ్లలో మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడేలా భవిష్యత్‌లోనూ ఈ ధోరణిని పీఎస్‌బీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,270 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల లాభాలు 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఈ విజయాలను చూసి పొంగిపోతూ పీఎస్‌బీలు అలసత్వం వహించరాదని, అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను, నియంత్రణ సంస్థ నిబంధనలను, పటిష్టమైన అసెట్–లయబిలిటీ .. రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను పాటిస్తూ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆమె సూచించారు. గతంలో ఇటు బ్యాంకులు అటు కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లూ ఒత్తిడిలో ఉండేవని .. ప్రస్తుతం అటువంటి పరిస్థితి నుంచి బైటపడ్డాయని మంత్రి చెప్పారు. బ్యాంకుల అసెట్లపై రాబడులు, నికర వడ్డీ మార్జిన్లు, ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి మొదలైనవన్నీ మెరుగుపడ్డాయన్నారు. రుణాల వినియోగం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలపై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై, బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రచార కార్యక్రమాల ద్వారా మహిళా సమ్మాన్ బచత్ పత్రాలకు ప్రాచుర్యం కలి్పంచాలని చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల కోసం ఉద్దేశించిన నిధులను గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి బదలాయించడం కాకుండా, ఆయా లక్ష్యాల సాధన కోసం పూర్తి స్థాయిలో వినియోగించడంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికాబద్ధంగా అనుకున్న ప్రకారం ముందుకు సాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ‘‘బ్యాంకు ప్రైవేటీకరణ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది. దానిలో ఎటువంటి మార్పు లేదు’’ అని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె ఇక్కడ ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా, 2021-22 సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరిలో చెప్పారు. ప్రస్తుతానికి, ఈ విషయంలో కొంచెం పురోగతి కనిపించింది. తాజా నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను 2021 ఏప్రిల్ లో ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినందున, ప్రైవేటీకరించనున్న ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల తాజా జాబితాను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
బీమా విక్రయాలపై బ్యాంకులకు లక్ష్యాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల విక్రయాలకు సంబంధించి 2023–24 సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం లక్ష్యాలు విధించింది. అలాగే, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ లక్ష్యాలు విధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈ పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. చౌక ధరకే బీమా రక్షణ కల్పించాలన్నది వీటి ఉద్దేశ్యం. 2023 మార్చి నాటికి పీఎంజేజేబీవై పరిధిలో 15.99 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, పీఎంఎస్బీవై పరిధిలో 33.78 కోట్ల మంది సభ్యులుగా చేరారు. గతేడాది పీఎంజేజేబీవై ప్రీమియంను ఏడాదికి రూ.330 నుంచి రూ.436కు పెంచగా, పీఎంఎస్బీవై ప్రీమియాన్ని ఏడాదికి రూ.12 నుంచి రూ.20 చేశారు. పీఎంజేజేబీవై అనేది రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీనిస్తుంది. పీఎంఎస్బీవై అనేది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి స్థాయి అంగవైకల్యం పాలైన సందర్భంలో రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం లభిస్తుంది. పీఎంజేజేబీవైని 18–50 ఏళ్ల వారు, పీఎంఎస్బీవైని 18–70 ఏళ్ల వారు తీసుకోవచ్చు. బ్యాంకుకు దరఖాస్తు ఇస్తే, వారి ఖాతా నుంచి ప్రీమియాన్ని డెబిట్ చేస్తారు. ప్రోత్సహించాలి.. కస్టమర్లు ఏటా ఈ పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒకటికి మించిన సంవత్సరాలకు కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. గత వారం పీఎస్‌బీల సారథులతో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు గాను వివిధ పథకాల పరిధిలో 2023–24 సంవత్సరానికి విధించిన లక్ష్యాలను బ్యాంకులు సాధించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలపై మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 1ను ప్రారంభించడం గమనార్హం. బ్యాంకులు తమ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా మరింత మంది కస్టమర్లతో ఈ బీమా పథకాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్‌దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్‌లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్‌దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
ఆ పథకాలపై ఫోకస్.. పీఎస్‌యూ బ్యాంకులతో ఆర్థిక శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 13న సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన ముద్రా యోజన, జన సురక్షా తదితర పథకాలపై సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పాయి. (జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి పథకాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల పరిధిలో సంతృప్త స్థాయికి చేరుకునే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్! -
రూ.35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంటుకు తెలియజేశారు. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవని ఆయన వెల్లడించారు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. -
వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి బదిలీ చేశాయి. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి చివరి నాటికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసిన డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తాజాగా లోక్‌సభలో తెలియజేశారు. (రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు) ఆర్బీఐకి బదిలీ చేసిన రూ. 35,012 కోట్ల అన్ క్లయిమ్డ్ డిపాజిట్లలో అత్యధికంగా రూ. 8,086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు సంబంధించినవి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులవి రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 3,904 కోట్లు ఉన్నాయి. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్‌లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్‌లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. -
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్‌బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్‌బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్‌బీలు బిగ్ డేటా అనలైటిక్స్‌ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్‌ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభాల పంట
న్యూఢిల్లీ: వసూలు కాని మొండి బకాయిల ఫలితంగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) ఇక కోలుకుంటాయా?.. ఐదేళ్ల క్రితం ఎదురైన ప్రశ్న ఇది. కానీ, ఈ అనుమానాలన్నింటినీ తొలగిస్తూ ఐదేళ్లలోనే భారీ లాభాలను నమోదు చేసే స్థితికి తమ బ్యాలన్స్ షీట్లను పీఎస్‌బీలు పటిష్టం చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.66,539 కోట్ల లాభాలను సొంతం చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.లక్ష కోట్ల లాభాల మార్క్‌ను చేరుకుంటాయని అంచనా. బ్యాలన్స్ షీట్లలో నిరర్థక రుణాలు (వసూలు కానివి/ఎన్పీఏలు) భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో 11 పీఎస్‌బీలను ఆర్బీఐ తన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చి ఆంక్షలు విధించింది. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకున్న తర్వాత వాటిపై ఆంక్షలను ఆర్బీఐ తొలగించడం గమనార్హం. మరోవైపు పీఎస్‌బీల బ్యాలన్స్ షీట్ల పటిష్టతకు కేంద్ర సర్కారు సైతం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో భాగంగా కేటాయిస్తూ వచ్చింది. లేదంటే బ్యాంకులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఉండేది. ఇంకోవైపు దివాలా పరిష్కార ప్రక్రియల రూపంలోనూ మొండి బకాయిలను బ్యాంక్‌లు కొంత వరకు వసూలు చేసుకోగలిగాయి. ఐదేళ్లలో భారీ నష్టాలు పీఎస్‌బీలు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.2,07,329 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇందులో అత్యధిక నష్టాలు 2017–18లో రూ.85,370 కోట్లుగా ఉన్నాయి. 2015–16లో రూ.17,993 కోట్ల నష్టాలు రాగా, 2016–17లో రూ.11,389 కోట్లు, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్ల చొప్పున నష్టాలు వచ్చాయి. సంస్కరణల ఫలితం ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న సంస్కరణలు మేలు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేపట్టిన వ్యూహాత్మక విధానంలో భాగంగా.. 2016–17 నుంచి 2020–21 మధ్య పీఎస్బీలకు రూ.3,10,997 కోట్ల నిధులను (రీక్యాపిటలైజేషన్‌లో భాగంగా) కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అండతో పీఎస్‌బీలు కూలిపోయే ప్రమాదం నుంచి బలంగా లేచి నిలబడ్డాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో నిధులు అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడింది. వేటికవి చిన్న బ్యాంక్‌లుగా కార్యకలాపాల నిర్వహణతో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకుని, దాన్ని అధిగమించేందుకు, బలమైన బ్యాంకుల రూపకల్పనకు వీలుగా పీఎస్‌బీల మధ్యపెద్ద ఎత్తున వీలీనాలను కూడా కేంద్రం చేపట్టింది. 2017 నాటికి 27 పీఎస్‌బీలు ఉండగా.. వాటి సంఖ్యను 12కు కుదించింది. చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లో కలిపేసింది. ఇతర చర్యలు మరోవైపు 3.38 లక్షల షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను (నిధులు మళ్లించేందుకు వినియోగిస్తున్నవి) కేంద్రం స్తంభింపజేయడం కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. దీనివల్ల బ్యాంక్‌ల నుంచి రుణాల రూపంలో నిధులను కాజేసే చర్యలకు బ్రేక్ పడింది. 2018–19లో రికార్డు స్థాయి నిరర్థక రుణ వసూళ్లు కావడంతో పీఎస్‌బీల స్థూల రుణాల్లో క్రెడిట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 80.3 శాతం నుంచి 63.9 శాతానికి దిగొచ్చింది. గాడిన పడకపోతే ప్రైవేటీకరించేందుకు సైతం వెనుకాడేది లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం పంపించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా సెమీ ప్రైవేటీకరణ చేసింది. బ్యాంకులను భారీగా ముంచిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, నీరవద్ మోదీ తదితర కేసుల్లో బ్యాంక్‌లు కఠిన చర్యలకు దిగాయి. మోసపూరిత రుణ వ్యవహారాలతో సంక్షోభంలో పడిన యస్ బ్యాంక్‌ను సైతం ఆర్బీఐతో సమన్వయం చేసుకుని కేంద్రం గట్టెక్కించింది. టర్న్ అరౌండ్ ఈ చర్యల ఫలితాలు ఒక్కోటి తోడయ్యి పీఎస్‌బీలు గాడిన పడి, తిరిగి బలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి పటిష్టమయ్యాయి. దీని ఫలితమే గతేడాది రూ.5,66,539 కోట్ల లాభాలు రావడం అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు కేంద్రం నుంచి నిధుల సహకారాన్ని అర్థించే స్థితిలో ఉన్నవి కాస్తా, మార్కెట్ నుంచి స్వయంగా నిధులు సమీకరించుకునే స్థాయికి బలపడ్డాయి. ప్రైవేటు బ్యాంక్‌లతో పోటీ పడే స్థితికి వచ్చాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరానికి చాలా పీఎస్‌బీలు వాటాదారులకు డివిడెండ్లను సైతం పంపిణీ చేశాయి. ఎస్బీఐ సహా తొమ్మిది పీఎస్‌బీలు ప్రకటించిన డివిడెండ్ రూ.7,867 కోట్లుగా ఉంది. పీఎస్‌బీలు బలమైన పునాదులపై పనిచేస్తున్నాయని, నికర లాభాల్లో అనూహ్యమైన వృద్ధిని చూస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఏస్ రాజీవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎస్‌బీల ఉమ్మడి లాభాలు ప్రసత్తు ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా రూ.80,000–1,00,000 కోట్ల మధ్య ఉండొచ్చన్నారు. రుణ ఎగవేతలను కట్టడి చేశామని, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడుతున్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ స్వరూప్‌కుమార్ మెహతా సైతం చెప్పారు. -
పీఎస్బీ సీఈవోల పదవీకాలం పదేళ్లకు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సీఈవో, ఎండీల గరిష్ట పదవీకాలాన్ని 10 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిబంధనను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతిభావంతులను పీఎస్‌బీలు వదులుకోకుండా అట్టే పెట్టుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడనుంది. ఇప్పటివరకు గరిష్ట పదవీకాలం 60 ఏళ్ల సూపర్ యూన్యుయేషన్‌కు లోబడి 5 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) హోల్–టైమ్ డైరెక్టర్లకు కూడా ఇదే వర్తిస్తోంది. ఎండీలు, హోల్–టైమ్ డైరెక్టర్లకు ప్రాథమికంగా పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుందని, రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల మేరకు దీన్ని గరిష్టంగా 10 ఏళ్ల వరకూ పొడిగించవచ్చని ప్రభుత్వం తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. పదవీకాలం ముగియడానికి ముందుగానే వారిని ఏ కారణం వల్లనైనా తొలగించాల్సి వస్తే మూడు నెలల ముందు రాతపూర్వక నోటీసులు ఇవ్వాలి. లేదా మూడు నెలల జీతభత్యాలు చెల్లించాలి. చదవండి: అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు లాభాలు! -
All India bank strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. -
మొండి బకాయిల కట్టడి చర్యలు ఫలితాలిస్తున్నాయ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకృత నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. ► రెండవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నికర లాభం భారీగా 74 శాతం ఎగసి రూ.13,265 కోట్లుగా నమోదయ్యింది. ► కెనరా బ్యాంక్ లాభం 89 శాతం వృద్ధితో రూ.2,525 కోట్లుగా నమోదయ్యింది. ► కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ లాభం 145% పెరిగి రూ.504 కోట్లుగా ఉంది. ► బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో లాభం 59 శాతం పెరిగి రూ.3,312.42 కోట్లుగా ఉంది. ► కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాల్లో ఉన్నా, ఇవి 9–63 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే మొండిబకాయిలకు అధిక కేటాయింపులు (ప్రొవిజినింగ్) దీనికి నేపథ్యం. పీఎన్బీ ప్రొవిజనింగ్స్ భారీగా రూ.2,693 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు చేరాయి. ఇక బీఓఐ విషయంలో ఈ కేటాయింపులు రూ.894 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు ఎగశాయి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 13 నుంచి 145 శాతం శ్రేణిలో ఉన్నాయి. యుకో బ్యాంక్ అత్యధికంగా 145 శాతం పెరిగితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 103 శాతం పెరిగింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికం ఇలా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. మొదటి త్రైమాసికంలో కూడా పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, సమీక్షా కాలంలో (2022 ఏప్రిల్–జూలై) రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ప్రొక్యూర్మెంట్ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
మీకు లోన్ కావాలా.. అది కూడా గంటలోపు.. ఇలా అప్లై చేస్తే చాలు..
ఇటీవల కాలంలో యువత చేస్తున్న ఉద్యోగాలలో వాళ్లకిచ్చే జీతం వారి జీవన విధానానికి సరిపోవడం లేదు. అందుకు కొంత మంది రెగుల్యర్ జాబ్‌తో పాటు ఫ్రీలాన్సర్‌గా చేస్తూ ఆర్జిస్తుంటే, మరి కొంతమంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. అయితే అధిక శాతం మాత్రం వారి అవసరాల కోసం ముందుస్తుగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందేకు మొగ్గు చూపుతున్నారు. గతంలో లోన్ తీసుకోవాలంటే రోజుల తరబడి బ్యాంక్ చూట్లూ తిరిగి, డ్యాంకుమెంట్లు సమర్పించి, ఆపై వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తి చేసి చేతికి డబ్బులు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ రోజులు పోయాయి. మీ వద్ద కావాల్సిన డ్యాకుమెంట్లు అన్నీ ఉంటే ఒక్క రోజులోనే మీ లోన్లు మంజూరవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ (PSB Loan in 59 Minutes) అని ఓ ప్లాట్‌ఫామ్ కూడా రూపొందించింది. మొదట్లో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ లాంటి అనేక సేవలు అందిస్తోంది. అసలేంటి పీఎస్బీ(PSB).... ఏం పని చేస్తుంది! పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్( psbloansin59minutes.com) ప్లాట్‌ఫామ్ 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఇది బిజినెస్ లోన్ కేటగిరీలో 2,01,863 రుణాలు మంజూరై, రూ.39,580 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. రీటైల్ లోన్ కేటగిరీలో 17,791 రుణాలు మంజూరు కాగా, రూ.1,689 కోట్లు మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో మీరు కూడా ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. వ్యాపారం కోసం అయితే జీఎస్‌టిఐఎన్, జీఎస్టీ యూజర్ నేమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా రిజిష్టర్ చేసుకోండి: 1: PSB అధికారిక వెబ్సైట్ psbloansin59minutes.comకి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేయండి 2: రిజిష్టర్ ప్రక్రియలో పేరు, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ నింపి, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి 3: మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఆ ఎంటర్ చేయండి 4: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి అంగీకరించండి 5: అక్కడ ఉన్న కాలమ్స్ నింపిన తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి 6: మీరు రిజిష్టర్ అయినా అకౌంట్‌కు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇలా చేస్తే లోన్ వచ్చేస్తుంది.. 1: మీరు క్రియేట్ చేసిన అకౌంట్లోకి లాగిన్ అవ్వండి 2: వ్యాపారం లేదా ఎంఎస్ఎంఈ(MSME) లోన్ పొందడానికి మీ ప్రొఫైల్‌ను ‘బిజినెస్’గా ఎంచుకోండి, లేదా (పర్సనల్ లోన్ కోసం రీటైల్ ఎంచుకోండి) తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి 3: ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆపై మీ వ్యాపార పాన్ వివరాలను నమోదు చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి 4: గత 6 నెలలకు సంబంధించిన మీ GST వివరాలు, పన్ను రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లను నింపండి 5: మీ ITRని అప్లోడ్ చేయండి, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి 6: మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి 7: మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి. అలాగే ఇప్పటికే ఉన్న ఏదైనా లోన్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 8: మీకు OTP వస్తుంది దీని ద్వారా మీ ఈమెయిల్ వెరిఫై చేయబడుతుంది. 9: ఆ తర్వాత ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో కనిపిస్తుంది. అందులో మీరు అప్లై చేయాలనుకున్న బ్యాంక్‌తో పాటు ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకు బ్యాంకు నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. చదవండి: పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! -
కేసీసీ హోల్డర్లకు రుణాలివ్వండి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాలకు ఊతమిచ్చే దిశగా కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) హోల్డర్లకు రుణాల లభ్యతలో ఇబ్బందులు లేకుండా, సజావుగా ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు కూడా అందించాలని పేర్కొన్నారు. గురువారం పీఎస్‌బీల సీఈవోలతో భేటీలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేసీసీ స్కీమును సమీక్షించడంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమకు సంస్థాగత రుణాల లభ్యత తదితర అంశాలపై చర్చించినట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా తెలిపారు. మరోవైపు, డిజిటలీకరణలో ఆర్ఆర్బీలకు స్పాన్సర్ బ్యాంక్ తగు సహకారం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్ వివరించారు. -
అదానీ కాపర్ యూనిట్‌కు రూ,6,071 కోట్ల రుణం
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కాపర్ తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఎస్బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,071 కోట్ల రుణాన్ని సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఏడాదికి మిలియన్ టన్నుల కాపర్ తయా రీ యూనిట్‌ను గుజరాత్‌లోని ముంద్రాలో, అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ ‘కుచ్ కాపర్ లిమిటెడ్’ ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా 0.5 మిలియన్ టన్నులతో కూడిన మొదటి దశకు సిండికేటెడ్ క్లబ్ లోన్ రూపంలో ఫైనాన్షియల్ క్లోజర్ (రుణ ఒప్పందాలు) పూర్తయినట్టు తెలిపింది. ఎస్ బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం (బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర)తో ఒప్పందం చేసుకున్న ట్టు ప్రకటించింది. ప్రాజెక్టు తొలి దశ 2024లో మొదలవుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ వినయ్ ప్రకాశ్ తెలిపారు. ‘‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ రిఫైనరీ కాంప్లెక్స్‌ల్లో ఒకటి అవుతుంది. బెంచ్‌మార్క్ ఈఎస్జీ (పర్యావరణ అను కూల) పనితీరు ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, డిజిటైజేషన్‌తో ఉంటుంది’’ అని చెప్పారు. -
యూనియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు
ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అన్ని కాలపరిమితులకు సంబంధించి డిపాజిట్లపై వడ్డీరేట్లను శుక్రవారం పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం దేశీయ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్ రేటు(రూ.2 కోట్లు లోపు)పై 46–90 రోజుల మధ్య 55 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 3.50 శాతం నుంచి 4.05 శాతానికి చేరింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను మే, జూన్ నెలల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. -
20న బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 20న భేటీ కానున్నారు. బ్యాంకుల పనితీరు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై వారు సాధించిన పురోగతిని మంత్రి సమీక్షించనున్నారు. 2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇదే మొదటి సమీక్ష సమావేశం. 2021–22లో ఈ 12 బ్యాంకులు తమ నికర లాభాన్ని రెండింతలు కంటే అధికంగా రూ.66,539 కోట్లకు పెంచుకున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో సహా ఎదురుగాలులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఉత్పాదక రంగాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను మంత్రి కోరే అవకాశం ఉంది. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..!
న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి మూలధన సమీకరణ ద్వారా బ్యాలెన్స్ షీట్లను పటిష్టంగా ఉంచుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ఆర్థికశాఖ నిర్దేశించింది. మెరుగైన మూలధనం బ్యాంకులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఉత్పాదక రంగాలలో క్రెడిట్ వృద్ధిని పెంచడానికి దోహదపడతాయని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పీఎస్‌బీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన మంథన్ 2022 (బ్యాంకింగ్‌పై మేథోమదనం) సమావేశంలో సంజయ్ మల్హోత్రా ఈ మేరకు ప్రసంగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకతతో సహా అన్ని కొలమానాలపై మెరుగైన పనితీరును కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమలో తాము సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలని అన్వేషించాలని కోరారు. అలాగే కార్యకలాపాలకు సంబంధించి పెద్ద బ్యాంకులు తమ ఉత్తమ పద్ధతులను చిన్న రుణదాతలతో పంచుకోవాలని, మరింత నైపుణ్యం అవసరమైన రంగాలలో వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. బ్యాంకులు దీర్ఘకాలిక లాభదాయకత, వినియోగదారు ప్రయోజనాలే పరిరక్షణగా తగిన విధానాల దిశలో వ్యూహాలను అన్వేషించాలని మల్హోత్రా సూచించారు. ఆరు గ్రూపుల ఏర్పాటు వినియోగ సేవలు, డిజిటలైజేషన్, హెచ్ఆర్ ప్రోత్సాహకాలు, పాలనాతీరు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో పరస్పర సహకారం సహా కీలకమైన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడానికి మంథన్ 2022లో ఆరు గ్రూపులు ఏర్పాటయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కాగా, పీఎస్బీ మంథన్ తొలి సమావేశం 2014లో జరిగింది. కరోనాకు ముందు 2019లో చివరిసారిగా ఈ సమావేశం జరిగింది. సంస్కరణలకు ప్రాధాన్యత బ్యాంకింగ్ పటిష్టత, వ్యవస్థలో తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించడం, ఈఏఎస్‌ఈ (ఎన్‌హెన్డ్స్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్స్‌లెన్స్) దిశలో పురోగతి లక్ష్యంగా మంథన్ 2022 జరగడం హర్షణీయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల అగ్ర నాయకత్వంతో ఆలోచనాత్మకంగా దీనిని నిర్వహించడం సానుకూలాంశం. – అతుల్ కుమార్ గోయల్, ఐబీఏ చైర్మన్ సవాళ్లను తట్టుకోగలగాలి.. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు, నూతన చొరవలకు, అత్యుత్తమ ప్రమాణాల అన్వేషణకు మంథన్ దోహదపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని సముపార్జించాలి. మూలధనం సమీకరణ ద్వారా రుణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! కొత్త నిబంధనలను ప్రకటించిన ఆర్బీఐ..! -
బ్యాంకులకు 15,000 కోట్ల అదనపు మూలధనం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బలహీనంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం రూ. 15,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. ఇందులో సింహభాగాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైనవి దక్కించుకోనున్నాయి. గత ఏడాది వడ్డీ రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకున్న బ్యాంకులకు ఈ అదనపు మూలధనం లభించనుంది. సదరు బాండ్ల వేల్యుయేషన్‌ను.. ముఖ విలువ కంటే తక్కువగా లెక్క గట్టారంటూ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. దీనితో, నిధులు సమకూర్చుకున్నప్పటికీ ఆయా బ్యాంకుల టియర్ 1 మూలధన నిల్వలు.. నిర్దేశిత స్థాయికన్నా తక్కువగానే ఉన్నాయని ఆర్బీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పీఎస్బీలకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఒమిక్రాన్‌పై పోరులో సహకరించండి: కేంద్రం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే రంగాలకు చేయూతను అందించాలని ప్రభుత్వ రంగం బ్యాంకులకు (పీఎస్బీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల సీఎండీలు, ఎండీలతో ఆమె శుక్రవారం వర్చువల్‌గా ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్–19 ప్రభావాలను ఎదుర్కొనడంలో వారి సన్నద్ధతను సమీక్షించారు. సవాళ్లను ఎదుర్కొనే వ్యవసాయం, రిటైల్, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు తగిన చేయూతను అందించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సమావేశానికి సంబంధించి ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న వివిధ చొరవలను అమలు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకున్న వివిధ చర్యలను ఆర్థికమంత్రి సమీక్షించారు. అలాగే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడంలో సన్నద్ధత గురించి చర్చించారు. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీసీ) వల్ల ఒనగూరిన ప్రయోజనాలను ఆమె ప్రస్తావిస్తూ, అయితే ఈ విజయాలపై ఆధారపడి విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదని అన్నారు. కోవిడ్–19 మహమ్మారి నిరంతర దాడి కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు మద్దతిచ్చే దిశగా సమష్టి కృషి కొనసాగాలని పిలుపునిచ్చారు. ► అంతర్జాతీయ ప్రతికూలతలు, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు ఉన్నప్పటికీ దేశంలో వ్యాపార దృక్పథం క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ► రిటైల్ రంగంలో వృద్ధి, మొత్తం స్థూల ఆర్థిక అవకాశాల మెరుగుదల, రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో రుణ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ► 2021 అక్టోబర్‌లో ప్రారంభించిన క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.61,268 కోట్ల రుణ మంజూరీలు జరిపాయి. ఇక 2020 మేలో ప్రారంభించిన రూ. 4.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం ద్వారా నవంబర్ 2021 నాటికి రూ.2.9 లక్షల కోట్ల (కేటాయింపు నిధుల మొత్తంలో 64.4 శాతం) మంజూరీలు జరిగాయి. ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ రంగం ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిందన్న గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ పథకం వల్ల 13.5 లక్షల చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందాయని, రూ.1.8 లక్షల కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారకుండా రక్షణ పొందాయని, దాదాపు ఆరు కోట్ల మంది కుటుంబాలకు జీవనోపాధి లభించిందని ఆర్థికశాఖ పేర్కొంది. ►ఈసీఎల్జీఎస్ వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదిక తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. ఒక్కొ క్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించిం దని తెలిపింది. ఈ పథకం వల్ల లబ్ధి పొం దిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్ ఉంది. -
‘బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకే ఈ కుట్ర'!
కొరిటెపాడు (గుంటూరు): జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని జాతీయ బ్యాంకు ఉద్యోగులు మొదటి రోజు గురువారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 12 జాతీయ బ్యాంకుల పరిధిలో 450 శాఖలు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. జిల్లాలోని 450 ప్రభుత్వరంగ బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకులు మూతపడటంతో దాదాపు రూ.120 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా ప్రభుత్వ బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మెలో భాగంగా గురువారం జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రతి పౌరుడు, ప్రతి ఖాతాదారుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. గతంలో అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో సొమ్ము వసూళ్లు చేసి పారిశ్రామిక సామ్రాజ్యం అవసరాలకు వాడుకొని దివాళా తీయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కారణంగానే దేశ ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకుందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, యూనియన్ల నేతలు వి.రాధాకృష్ణమూర్తి, సురేష్, హనుమంతరెడ్డి, లక్ష్మీనారాయణ, హరిబాబు, బాషా, మురళీ నాగేంద్ర, రవి, షరీఫ్, వేణు, రామారావు, క్రాంతి, పావని, జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
Bank Strike: బ్యాంకులు బంద్.. సేవలకు విఘాతం
Bank Unions Strike: సమ్మె నోటీసుకు అనుగుణంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ, రేపు బంద్ పాటించనున్నారు. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో బుధవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా.. గురువారం ఉదయం సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడకపోవడంతో బుధవారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగాయి బ్యాంక్ యూనియన్లు. దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో (డిసెంబర్ 16, 17 తేదీలు) బ్యాంకుల సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మాకోసం కాదు.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య వేదిక– యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమణ ఉంటుందని యూనియన్లు స్పష్టం చేస్తుండగా, అటువంటి హామీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. #BankStrike #16December pic.twitter.com/XB9tUOszGH — Rajesh Sinha (देवघर,झारखंड) (@theRajeshSinha) December 16, 2021 ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. ఈ సమ్మె తమ కోసం కాదని, బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్‌లో పడతాయని హెచ్చరిస్తోంది Union Forum Of Bank. మొత్తం తొమ్మిది యూనియన్లు యూఎఫ్‌బీయూ నేతృత్వంలో ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. కుట్ర జరుగుతోంది ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తోంది. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుస్తోందని. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు రైల్వే యూనియన్ సహా ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. #BankStrike #BankPrivatisation #stoprivatisationofbank pic.twitter.com/5Gg1BNf9J8 — Singh Rashmi🇮🇳 (@rsrashmi9) December 16, 2021 ఈ సమ్మెతో స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూసీవో బ్యాంక్ సహా పలు ప్రైవేట్‌రంగ బ్యాంకుల సేవలకు విఘాతం కలగనుంది. బ్యాంకింగ్ సేవలతో పాటు ఏటీఎం, ఇతర సేవలపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ.. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే.. -
రెండు రోజులు బ్యాంకుల సమ్మె.. ఎస్బీఐ రిక్వెస్ట్
SBI Statement On Two Days Bank Strike: పబ్లిక్ సెక్టార్‌లోని రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ United Forum of Bank Unions (UFBU) డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులపాటు కార్యకలాపాలన్నీ ఆగిపోతాయని, సేవలు నిలిచిపోతాయని బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ సైతం జారీ చేశాయి. ఈ తరుణంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సమ్మెకు దూరం ఉండాలని తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది ఎస్బీఐ. సమ్మెలో పాల్గొనడంపై పునరాలోచించుకోవాలని, తద్వారా లావాదేవీలకు, ఇతర సేవలకు విఘాతం కలగకుండా చూడాలని కోరింది. ‘కరోనా సమయంలో సమ్మెల వల్ల సేవలకు విఘాతం కలుగుతుంది. ఈ స్ట్రయిక్ పట్ల బ్యాంక్, ఇన్వెస్టర్లు, ఖాతాదారులకు ఎలాంటి ఆసక్తి ఉండబోదు. ఈ రెండు రోజులపాటు బ్యాంకులు సాధారణంగానే పని చేస్తాయని, అయితే కస్టమర్లకు అందించే సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అని ప్రకటనలో పేర్కొంది ఎస్బీఐ. An appeal to all Bank Staff. pic.twitter.com/EZFGpfnK0a — State Bank of India (@TheOfficialSBI) December 13, 2021 ఈ నేపథ్యంలో కస్టమర్లను వీలైనంత మేర డిజిటల్ ట్రాన్జాక్షన్స్ వైపు మొగ్గు చూపాలని కోరింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఈ రెండు రోజులపాటు అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని కస్టమర్లకు సూచించింది. అయితే ఏటీఎంలలో క్యాష్ పరిస్థితి గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చదవండి: బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం! -
రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్నట్లు 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రకటించారు. ‘‘డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన వివిధ అంశాల పరిశీలన, ఇందులో బ్యాంకు(ల) ఎంపిక అంశాలను క్యాబినెట్ కమిటీ పరిశీలిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఈ విషయంలో (ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తాజాగా లోక్‌సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ ద్వారా రూ.175 లక్షల కోట్ల సమీకరించాలని కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులు బ్యాంక్ యూనియన్ల సమ్మె!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతామని బ్యాంక్ యూనియన్లు నోటీసులు ఇచ్చాయి. రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం సమాయత్తం అయిన నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రోజుల సమ్మె బాట పట్టాయి. పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ, 2019లో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీకి మెజారీటీ వాటా విక్రయం ద్వారా ఐడీబీఐని కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరించింది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను కూడా కేంద్రం విజయవంతంగా పూర్తిచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాలను 26 శాతానికి తగ్గించుకోడానికి వెసులు బాటు కల్పించడానికి ఉద్దేశించి బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి వీలుగా బ్యాంకింగ్ చట్ట (సవరణ) బిల్లును కేంద్రం లిస్ట్ చేసింది. ఆయా చర్యలను నిరసిస్తూ, రెండు రోజుల సమ్మె నిర్వహించాలని బ్యాంకింగ్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)కు యూఎఫ్‌బీయూ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. -
పీఎస్‌బీలతో సీతారామన్ భేటీ, ఎస్బీఐ మాజీ చీఫ్ లోన్ కుంభకోణంపై చర్చ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో సమావేశం కానున్నారు. దేశంలో రుణ లభ్యత, ఆర్థిక వ్యవస్థ పురోగతి తత్సంబంధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా సమీక్ష జరపనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థికాభివృద్ధికిగాను ఉత్పాదక రంగాలకు రుణ లభ్యతను పెంచాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు సూచించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్సహా పలు ప్రభుత్వ పథకాలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. బ్యాంకర్లతోపాటు వివిధ మంత్రిత్వశాఖలు సీనియర్ అధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా మౌలిక, వ్యవసాయ సంబంధిత విభాగాల అధికారులు ఆయా రంగాలు ఎదుర్కొంటున్న రుణ సవాళ్లను బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళతారని సమాచారం. చర్చించే అంశాలివి... ►భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ పథకం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఇటీవలే ఒక ట్వీట్లో తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్నాయి. దీనిపై సమావేశంలో దృష్టి సారించే వీలుంది. ►బ్యాంకింగ్ రంగం పురోగతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిస్ట్రక్చరింగ్ 2.0 స్కీమ్ అమలు, రూ. 4.5 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పునరుద్ధరణ వంటి అంశాలపై సమీక్షించవచ్చు. ►మొండిబకాయిల సమస్యపై కూడా సమావేశం దృష్టి సారించే అవకాశం ఉంది. మొండిబకాయిలు 2019 మార్చి 31 నాటికి రూ.7,39,541 కోట్లకు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు, ఆపై 2021 ముగిసే నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చాయని, తన వ్యూహాలు, సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంటోంది. గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల రికవరీ జరిగినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ►ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రతీప్ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో ఈ అంశాన్ని బ్యాంకర్లు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. బ్యాంకర్లు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది. చదవండి: ప్రపంచ దేశాలన్ని భారత్‌ను ప్రశంసిస్తున్నాయి: సీతారామన్ -
IBPS Exam: 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ క్లర్క్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ రిక్రూట్మెంట్లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్ రిక్రూట్మెంట్లలో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. క్లరికల్ కేడర్ కోసం పరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఐబీపీఎస్ ప్రారంభించిన పరీక్ష ప్రక్రియను నిలివేయాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్పీఎస్ కింద బ్యాంకు యజమాని అందించే సహకారాన్ని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. దీని వల్ల బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పెరగనుంది. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్ పొందనున్నారు. ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ రూ.30,000-35,000కు పెరగనున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) తెలిపింది.(చదవండి: కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు) పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెంపు ఇంతకు ముందు వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను ఎలాంటి క్యాప్ లేకుండా చూడాలని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(ఐబీఏ) ప్రభుత్వానికి నివేదించింది. వేలాది బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో ఉన్న పెన్షన్ కాంట్రిబ్యూషన్ 10 శాతం నుంచి 14 శాతానికి పెరుగుతుంది అని డీఎఫ్ఎస్ కార్యదర్శి దేబాషిష్ పాండా తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం లాభదాయకంగా మారాయని, వారు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందరని, మార్కెట్ నుంచి డబ్బును సేకరిస్తున్నారని పాండా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.26,016 కోట్ల నష్టంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.31,817 కోట్ల లాభాన్ని నివేదించాయి. ఐదేళ్ల నష్టాల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు లాభాన్ని నివేదించడం ఇది మొదటిసారి. మార్చి 2021 నాటికి మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు రూ.6.16 లక్షల కోట్లుగా ఉన్నాయి, మార్చి 2020 నుంచి రూ.62,000 కోట్లు తగ్గాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉన్న మోసల సంఖ్యతో 3,704తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మోసాల సంఖ్య 2,903కు తగ్గినట్లు" ఆమె పేర్కొన్నారు. -
బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్ఐఆర్లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దురుద్దేశాలను ఒప్పుకుంది.. ఇండ్–భారత్ లిమిటెడ్ 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అగ్రిమెంట్(టీఆర్ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్–భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్ విచారణ జరపాలని కోరారు. రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్–భారత్ పవర్(మద్రాస్), దాని మాతృసంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 250 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 3,571 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. స్టాండెలోన్ ఫలితాలివి. అయితే మొత్తం ఆదాయం రూ. 12,216 కోట్ల నుంచి రూ. 11,380 కోట్లకు క్షీణించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 2,160 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 2,957 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 49,066 కోట్ల నుంచి రూ. 48,041 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ4లో తాజా స్లిప్పేజెస్ రూ. 7,368 కోట్లను తాకగా.. మొత్తం ప్రొవిజన్లు 70 శాతం తక్కువగా రూ. 1,844 కోట్లకు పరిమితమయ్యాయి. మార్జిన్లు డీలా మార్చికల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 14.78 శాతం నుంచి 13.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.88 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఏకే దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది స్థూల ఎన్పీఏలను 2.5 శాతంవరకూ తగ్గించుకోనున్నట్లు చెప్పారు. అయితే దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.18 శాతం నుంచి 2.16 శాతానికి నీరసించాయి. ఈ ఏడాది మార్జిన్లను 2.5 శాతానికి మెరుగుపరచుకోనున్నట్లు దాస్ తెలియజేశారు. కనీస మూలధన పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.1 శాతం నుంచి 14.93 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 82.3 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో రెండు ఎక్సే్చంజీలలోనూ కలిపి దాదాపు 5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
ప్రైవేటీకరించే బ్యాంకుల జాబితా సిద్ధం
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించే ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ ఖరారు చేసింది. ఈ జాబితాను డిజిన్వెస్ట్‌మెంట్‌పై కార్యదర్శులతో ఏర్పాటైన కీలక గ్రూప్ (సీజీఎస్డీ)కి సమర్పించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలోని సీజీఎస్ నుంచి క్లియరెన్స్ లభించాక.. ఖరారైన పేర్లను ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం)కు పంపుతారు. అటుపైన తుది ఆమోదం కోసం ప్రధాని సారథ్యంలోని క్యాబినెట్‌కు పంపుతారు. క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాత ప్రైవేటీకరణకు వెసులుబాటు కల్పించేలా నియంత్రణపరమైన నిబంధనల్లో సవరణలు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించాలని 2021–22 కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. వాటిని ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కి అప్పగించింది. -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్‌బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్‌బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్‌బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్‌ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్‌లను అధ్యయనం చేసేందుకు పీఎస్‌బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్‌బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్‌బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్‌బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్‌కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్‌కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
విలీనాల తర్వాత బ్యాంక్ ‘సేవలు’ ఎలా ఉన్నాయ్?
ముంబై: బ్యాంకింగ్ విలీనాల తర్వాత కస్టమర్లు ఎలాంటి సేవలు పొందుతున్నారు? ఆయా అంశాల పట్ల వారిలో సంతృప్తి ఎలా ఉంది? వంటి అంశాలను బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలుసుకోనుంది. ఈ మేరకు ఒక సర్వే నిర్వహణకు తగిన కసరత్తు ప్రారంభించింది. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే... ►కస్టమర్ల సేవల కోణంలో విలీనాల వల్ల ప్రయోజనం ఏదైనా ఉందా? అన్న ప్రధాన ప్రశ్నతోపాటు 22 ప్రశ్నలు సర్వేలో భాగం కానున్నాయి. ►ఎంపికకు వీలుగా ఐదు ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్లీ ఎగ్రీ, ఎగ్రీ, న్యూట్రల్, డిస్‌ఎగ్రీ, స్ట్రాంగ్లీ డిస్‌ఎగ్రీ (గట్టిగా ఆమోదిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, తటస్థం, వ్యతిరేకిస్తున్నా, గట్టిగా వ్యతిరేకిస్తున్నా) అనే ఐదింటిలో ఒకదానికి వినియోగదారు ఓటు చేయాల్సి ఉంటుంది. ►తెలుగురాష్ట్రాలుసహా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు మొత్తం 21 రాష్ట్రాల నుంచి 20,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరగనుంది. ►22 ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు ప్రత్యేకంగా కస్టమర్లకు అందుతున్న సేవలు, 2019, 2020ల్లో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్ బ్రాంచీల్లో వివాద పరిష్కార యంత్రాంగం పనితీరుకు సంబంధించినవై ఉంటాయి. ►‘విలీనాల తర్వాత నేను ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనలేదు’, ‘సాధనం(సాధనాలు), సేవలు, ఏరియా అంశాలకు సంబంధించి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను’, ‘సాధనం(సాధనాలు), సేవలు, ఏరియా అంశాలకు సంబంధించి నేను ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే...’ వంటి ప్రశ్నలు ఉంటాయి. ►‘బ్యాంక్ కస్టమర్లు– సేవల విషయంలో వారి సంతృప్తికి సంబంధించి సర్వే’ అనే పేరుతో నిర్వహించాలనుకుంటున్న ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి ఆర్బీఐ అప్పగించనుంది. ఈ విషయంలో కొటేషన్ల దాఖలుకు సంస్థలను ఆహ్వానిస్తోంది. ►నియమిత ఏజెన్సీ కస్టమర్ అభిప్రాయ సేకరణ జరుపుతుంది. ఈ అభిప్రాయాన్ని తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్, రాష్ట్రం, బ్రాంచీ, ఖాతా నెంబర్, పేరు వంటి వివరాలను కస్టమర్ నుంచి సవివరంగా తెలుసుకోవాలి. ►సర్వేకు వీలుగా 21 రాష్ట్రాల్లో ఎంపికచేసిన బ్యాంక్ బ్రాంచీల కస్టమర్ల ఫోన్ నెంబర్లను నియమిత ఏజెన్సీకి ఆర్బీఐ సమకూర్చుతుంది. ఏజెన్సీ 2021 జూన్ 22వ తేదీ నాటికి సర్వే పూర్తిచేసి ఆర్బీఐకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 27 నుంచి 12కు బ్యాంకులు.. పలు విలీన చర్యల నేపథ్యంలో 2017 మార్చిలో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 12కు పడిపోయింది. 2019లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసింది. దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఐదు అనుబంధ బ్యాంకులను అలాగే భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసింది. ఇక 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాలుగింటిగా మార్పుతూ చేసిన విలీన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం చేసింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌తో విలీనంకాగా, అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌తో కలిసిపోయింది. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్‌లో విలీనమయ్యింది. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. రూ.1.75 లక్షల కోట్ల సమీకరణకు ఉద్దేశించి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ విలీన విధానానికి కేంద్రం అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను స్వయంగా ఆర్థికమంత్రి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ, ఎస్బీఐ పరిమాణం తరహాలో భారత్‌కు మరికొన్ని దిగ్గజ బ్యాంకుల అవసరం ఉందని పేర్కొంటున్నారు. విలీనాలకు నిరసనగా బ్యాంకింగ్ సిబ్బంది సమ్మె సమస్యలను ప్రస్తావిస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటున్నారు. పైన పేర్కొన్న ఆరు(ఎస్బీఐ,బీఓబీ, పీఎన్బీ, కెనరా బ్యాం క్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సిస్బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. -
నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం నాలుగు మధ్య స్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌తో మొదలయ్యే 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేటీకరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సంఖ్యాపరంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో సిబ్బంది ఒక మోస్తరుగానే ఉన్నందున ముందుగా ఆ బ్యాంకుతోనే ప్రైవేటీకరణ ప్రారంభం కావచ్చన్న అంచనా లు ఉన్నాయి. అలాగే ఐవోబీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో దానిపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేయొచ్చని, దీంతో అందులోనూ వాటాల విక్రయం సజావుగా జరగవచ్చని ఆశిస్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియ వాస్తవంగా ప్రారంభం కావడానికి 5–6 నెలలు పట్టేయొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఉద్యోగుల సంఖ్య, ట్రేడ్ యూనియన్ల ఒత్తిళ్లు, రాజకీయపరమైన పరిణామాలు మొదలైనవి తుది నిర్ణ యంపై ప్రభావం చూపవచ్చని వివరించాయి. దీనివల్ల ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయం ఆఖ రు నిమిషంలో కూడా మారవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి నాలుగింటినీ అనుకున్నా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు బ్యాంకులనూ ప్రైవేటీకరించాలని సర్కారు ముందుగా భావించినప్పటికీ ఉద్యోగుల యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు హెచ్చరించడంతో ప్రణాళికలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ విడతలో మధ్య స్థాయి, చిన్న స్థాయి బ్యాంకులనే ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. రాబోయే రోజుల్లో పెద్ద బ్యాంకులపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల వారికి రుణ లభ్యత పెంచడం తదితర లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మాత్రం మెజారిటీ వాటాలను కొనసాగించవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పెద్ద బ్యాంకులను పరిశీలించాలి: ఎన్పీఏలతో కుదేలవుతున్న బలహీన, చిన్న బ్యాంకులను తీసుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. పైగా వీటిని విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక వనరులు కూడా భారీగా సమకూరే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎన్బీ లేదా బీఓబీ వంటి పెద్ద బ్యాంకులను ప్రైవేటీకరించే అంశాన్ని పరిశీలించాలంటున్నారు. ప్రక్షాళనకు చర్యలు.. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే సింహ భాగం వాటా ఉంటోంది. అలాగే మొండిబాకీల (ఎన్పీఏ) విషయంలోనూ వీటిపై గణనీయంగా భారం పడుతోంది. కరోనా వైరస్ పరిణామాల కారణంగా కొన్ని పద్దులను మొండిబాకీలుగా వర్గీకరించడంపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నప్పటికీ .. ఇవి తొలగిన మరుక్షణం ఎన్పీఏలు భారీగా పెరిగిపోయే ముప్పు ఉందన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొండిబాకీలు పేరుకుపోయి కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కానీ పీఎస్బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. ఎకాయెకిన పీఎస్‌బీలను భారీ యెత్తున ప్రైవేటీకరిస్తే ఇటు ఉద్యోగులపరంగా అటు రాజకీయంగా రిస్కీ వ్యవహారం అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రక్రియనైతే మొదలుపెట్టాలని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. -
ఆర్బీఐతో కలసి బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ
ముంబై: బడ్జెట్లో ప్రకటించినట్టు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళిక అమలు విషయంలో ఆర్బీఐతో కలసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముంబై వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల నిర్వహణ చూసేందుకు బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటాల ఉపసంహరణతోపాటు, మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ వాటాల ఉపసంహరణ ప్రతిపాదనలను మంత్రి బడ్జెలో భాగంగా ప్రకటించడం గమనార్హం. తాను కేవలం ప్రకటన మాత్రమే చేశానని, అంశాలపై కసరత్తు కొనసాగుతోందంటూ.. ఈ విషయంలో ఆర్బీఐతో కలసి ముందుకు వెళతా మని మంత్రి చెప్పారు. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు విషయమై స్పందిస్తూ.. నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వం కొంత మేర హామీనిస్తుందంటూ.. ఇటువంటిది బ్యాంకుల నుంచి రావాలని, వాటి నిర్వహణలోనే ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకుల ఎన్పీఏలు అంతా గతంలో చేసిన దుర్వినియోగం కారణంగా వచ్చిన వారసత్వ సమస్యగా పేర్కొన్నారు. బడ్జెట్లో చేసిన ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై ప్రతిపక్షాల విమర్శలను సోమరి ఆరోపణలుగా ఆర్థిక మంత్రి సీతారామన్ అభివర్ణించారు. -
బ్యాంకింగ్ రేస్‌లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్‌లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్‌నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్‌నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్‌నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్‌ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లకు మాత్రమే అప్పుడు లైసెన్స్‌లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్‌లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్‌పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్‌పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్‌లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్‌లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్‌గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్‌గా ఆచార్య పనిచేస్తున్నారు. -
ప్రైవేటు బ్యాంకింగ్ మరింత బలోపేతం
న్యూఢిల్లీ: నష్టాలను సర్దుబాటు చేసుకోతగినంత నగదు నిల్వలు కలిగిన ప్రైవేటు బ్యాంకులు.. అదే సమయంలో నష్టాలను తట్టుకోగల సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ‘‘తగినన్ని నిధులున్న బ్యాంకులు ముందుగానే నష్టాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోగలవు. ఈ క్రమంలో పెద్దగా ఇబ్బంది పడకుండానే మార్కెట్ వాటాను పెంచుకోగలవు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి (రుణాలకు డిమాండ్) స్తబ్దుగా ఉన్నందున తక్షణమే మార్కెట్ వాటాను పెంచుకుంటాయని భావించడం లేదని, కరోనా సమసిపోయిన తర్వాత స్థిరమైన వృద్ధిని చూపిస్తాయని తెలిపింది. ప్రైవేటు బ్యాంకులు 14.4% మార్కెట్ వాటాను.. ఆస్తులు, రుణాల పరంగా 18.5% వాటాను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి కైవసం చేసుకున్నాయని, ఇందులో అధిక శాతం వాటా గత ఐదేళ్ల కాలంలో సంపాదించుకున్నదేనని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం వాటి మార్కెట్ స్థానాన్ని స్థిరీకరించుకునేందుకు గత కొన్నేళ్లలో సాయపడిందని.. కానీ, భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునేందుకు, వృద్ధికి అవసరమైన నిధులను అవి సమీకరించుకోకపోతే మాత్రం వాటి మార్కెట్ వాటాను మరింత కోల్పోతాయని విశ్లేషించింది. ఆర్బీఐ సూచనల మేరకు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా నిధులను సమీకరించినప్పటికీ.. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే చాలా పరిమితమేనని పేర్కొంది. ‘‘కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా మూలధన నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించాయి. ఎప్పటిలోపు సమీకరించేదీ ప్రకటించలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ తరహా అస్పష్ట పరిస్థితి వెంటనే మెరుగుపడాల్సి ఉంది’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. -
మూడు నెలల్లో రూ. 6.45 లక్షల కోట్ల రుణాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు బ్యాంకులు భారీగా రుణాలను మంజూరు చేశాయి. ఈ ఏడాది మార్చి-మేలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రూ 6.45 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 15 వరకూ పీఎస్‌బీలు రూ 6.45 లక్షల కోట్ల రుణాలను ఎంఎస్ఎంఈ, రిటైల్, వ్యవసాయ, కార్పొరేట్ రంగాలకు చెందిన 54.96 లక్షల ఖాతాలకు మంజూరు చేశాయని తెలిపింది. ఇకమార్చి 20 నుంచి మే 15 వరకూ పీఎస్‌బీలు రూ 1.03 లక్షల కోట్ల మేర తక్షణ రుణాలు, వర్కింగ్ కేపిటల్ రుణాలను పీఎస్‌బీలు సమకూర్చాయని పేర్కొంది. కరోనా కట్టడికి మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోఉన్న లాక్డౌన్ ఇటీవల ప్రకటించిన భారీ సడలింపులతో ఈనెల 31 వరకూ కొనసాగనున్న సంగతి తెలిసిందే. చదవండి : ఇప్పుడు అంతా వెతుకుతున్న కొత్త పదాలు -
దేశీ బ్యాంకింగ్ రంగానికి నవోదయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మెగా విలీనంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇది నవోదయంగా అభివర్ణించింది. ‘మరింత పటిష్టమైన, భారీ పీఎస్‌బీలు ఇంకా మెరుగైన ప్రత్యేక పథకాలు, మరింత వేగంగా రుణ ప్రాసెసింగ్ సేవలను కస్టమర్లకు అందించగలుగుతాయి. అవసరాలకు అనుగుణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలను విస్తరించగలుగుతాయి‘ అని ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం.. మ్రైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. నాలుగు పీఎస్బీల్లో ఆరు పీఎస్‌బీల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా పరమైన లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో పీఎస్‌బీల విలీనం యథాప్రకారం అమల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీనం చేసుకున్న యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలన్నీ తమ బ్రాంచీలుగా సేవలు అందిస్తున్నాయని పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడిం చింది. తమ బ్యాంకుకు ఇకపై 11,000 పైచిలుకు శాఖలు, 13,000 పైగా ఏటీఎంలు, ఒక లక్ష మంది పైగా ఉద్యోగులు, రూ. 18 లక్షల కోట్ల పైచిలుకు వ్యాపారం ఉంటుందని పీఎన్బీ ఎండీ ఎస్ఎస్ మల్లికార్జునరావు తెలిపారు. మెగా విలీనంలో భాగంగా.. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు.. యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేశారు. -
యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సమస్యలు ఉన్నప్పటికీ .. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ యథాప్రకారంగానే కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విలీనాలు అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా బ్యాంకుల విలీనానికి డెడ్‌లైన్ పొడిగించే అవకాశముందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ .. ‘ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు‘ అని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డెడ్‌లైన్‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలంటూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండటంతో బ్యాంకింగ్ సేవలపైనా ప్రతికూల ప్రభావం ఉంటోంది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు భారీ బ్యాంకర్లుగా విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. విలీన ప్రక్రియ పూర్తయితే ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న బ్యాంకులు ఉంటాయి. ప్రణాళిక ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్.. కార్పొరేషన్ బ్యాంకును విలీనం చేస్తున్నారు. -
క్రెడిట్ స్కోరును గుడ్డిగా అనుసరించొద్దు
న్యూఢిల్లీ/గువాహటి: రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. ‘‘బ్రాంచ్ బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలి. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదు. డేటా విశ్లేషణ, బిగ్ డేటా వినియోగాన్ని కోరుకుంటున్నప్పటికీ.. శాఖల స్థాయిల్లో కస్టమర్లు మీ నుంచి వ్యక్తిగత స్పందనను కోరుకుంటారు’’ అని ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో గురువారం జరిగిన సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. ఆర్బీఐ కానీ, ప్రభుత్వం కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను గుడ్డిగా అనుసరించాలంటూ ఎటువంటి ఆదేశాన్ని జారీ చేయలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో వ్యక్తిగత అనుసంధానత, డేటాను వినియోగించుకోవడం అవసరమన్నారు. శాఖల స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనలను విని, వారిలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాలని బ్యాంకు ఉన్నతోద్యోగులకు సూచించారు. రుణ వితరణను పెంచాలి.. రుణాల పంపిణీని మరింత పెంచాలని బ్యాంకుల చీఫ్‌లను మంత్రి సీతారామన్ కోరారు. వ్యవస్థలో తగిన డిమాండ్ లేదంటూ వారు చెప్పినా.. రుణ వితరణ పెంపు దిశగా తగిన విధానాలను చేపట్టాలని ఆమె కోరడం గమనార్హం. పెట్టుబడులపై ‘సీఏఏ’ ప్రభావం ఉండదు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన హింసాత్మక చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఇటీవల తాను భేటీ అయిన ఇన్వెస్టర్లు భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారన్నారు. ఇప్పటిౖMðతే కరోనా వైరస్ ప్రభావం మన దేశంపై లేదన్నారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడకపోతే పరిశ్రమకు చేదోడుగా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. 1.18 లక్షల రుణ దరఖాస్తులను పరిష్కరించాలి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద పెండింగ్‌లో ఉన్న 1.18 లక్షల దరఖాస్తులను మార్చి 15వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. రుణ సాయంతో స్వయం ఉపాధి కింద వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడమే పీఎంఈజీపీ పథకం ఉద్దేశ్యం. ఎంఎస్ఎంఈ రంగ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఎంఎస్ఎంఈ రుణాల పునరుద్ధరణపై కూడా చర్చించారు. -
ప్రభుత్వ బ్యాంకులపై తగ్గుతున్న ‘మొండి’ భారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తగ్గుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఈ మొండిబకాయిల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్‌లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► సెప్టెంబర్ 2019తో ముగిసిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.2.03 లక్షల కోట్ల రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది. ► ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12 లాభాలను నమోదు చేసుకున్నాయి. ► ఏడున్నర సంవత్సరాల్లో అత్యధిక ప్రొవిజన్ కవరేజ్ రేషియో (మొండిబకాయిలకు కేటాయింపుల నిష్పత్తి) కేటాయింపులు జరిగాయి. ► బ్యాంకింగ్ వ్యవస్థ కుదుటపడుతోందని డిసెంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రచురించిన బ్యాంకింగ్ ట్రెండ్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే 2019 మార్చిలో 14.3 శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల క్యాపిటల్ అడిక్వసీ రేషియో 2019 సెప్టెంబర్ నాటికి 15.1 శాతానికి పెరిగింది. ► రియల్టీ, ఎన్‌బీఎఫ్‌సీలుసహా వివిధ విభాగాల్లో మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి దివాలా పరిష్కార పక్రియసహా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ► రుణ చెల్లింపుల్లో వైఫల్యం, మోసాలు, ద్రవ్య లభ్యత వంటి సవాళ్లతో తాజా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కొంత సంశయించిన విషయం వాస్తవం. అయితే ఈ సవాళ్ల పరిష్కారం దిశలో తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ ప్రత్యక్ష పన్ను వివాదాలపై సమీక్ష ఆర్థికమంత్రి సోమవారం పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకంపై వారితో చర్చించారు. పన్ను బకాయిల చెల్లింపు, ఇందుకు సంబంధించి వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపు వంటి అంశా లు ఈ పథకంలో ప్రత్యేకతలు. దాదాపు రూ. 9 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. ఆయా వివాదాల పరిష్కార లక్ష్యంగా లోక్‌సభలో ప్రభుత్వం గత వారం ‘‘డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్లు, 2020’’ని ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై అవుతుంది. తాజా సమావేశంలో ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలు తమ సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
ఏదైనా కొత్త పేరు కావాలి
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) విలీన ప్రక్రియ పూర్తి కావడానికి సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ఆయా బ్యాంకులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకుకు కొత్త పేరేదైనా పెట్టాలని, కొత్తగా బ్రాండింగ్ చేయాలని కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు సిండికేట్ బ్యాంక్ కూడా విలీన సంస్థకు కొత్త పేరు పెట్టాలంటూ కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది. కొన్నాళ్ల క్రితమే రెండు బ్యాంకుల విలీనంతో భారీ సంస్థగా ఆవిర్భవించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తరహా అనుభవం పునరావృతం కాకూడదని తాజాగా విలీనం కాబోయే బ్యాంకులు భావిస్తుండటమే ఇందుకు కారణం. బీవోబీలో విజయా, దేనా బ్యాంకు విలీనం తర్వాత.. మూడింటి లోగోలను కలిపి ఒక లోగోను తయారు చేశారు. దీనికి పవర్ ఆఫ్ 3 అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది. అయితే, ఇందులో మిగతా రెండు బ్యాంకుల కన్నా బీవోబీ లోగో ప్రముఖంగా కనిపిస్తుంటుంది. దీంతో, ఈసారి మాత్రం ఈ తరహా బ్రాండింగ్ వద్దని కొత్తగా విలీనం కాబోయే (నాన్–యాంకర్) బ్యాంకులు కోరుతున్నాయి. ‘విలీనంతో ఏర్పడే బ్యాంకు పేరు.. మూడు బ్యాంకుల అస్తిత్వాన్ని తెలియపర్చే విధంగా పేరు ఉండాలి. దానికి తగ్గట్టే ఏదైనా కొత్త పేరు పెట్టాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం’ అని యునైటెడ్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో తమ బ్యాంకు గుర్తింపు కూడా ఉండాలని తామూ కోరుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కొత్త బ్రాండ్ సులువేనా.. ప్రస్తుతం పీఎన్బీలో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ విలీన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక కమిటీ.. కొత్తగా బ్రాండింగ్పైనా కసరత్తు చేస్తోంది. విలీన బ్యాంకుకు తగిన పేరును సూచించేందుకు బ్రాండింగ్ ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. అయితే, విలీన బ్యాంకుకు కొత్త పేరు పెట్టాలన్న డిమాండ్‌తో విభేదిస్తున్న బ్యాంకులూ ఉన్నాయి. అలహాబాద్ బ్యాంక్ వీటిలో ఒకటి. ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న పేర్లను పూర్తిగా మార్చేయడం వల్ల బ్రాండ్ రీకాల్ విలువ దెబ్బతినవచ్చని అలహాబాద్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నాయి. ఇక, విలీన సంస్థ పేరు మార్చాలంటూ నాన్–యాంకర్ బ్యాంకులు కోరుతున్నా.. అదంత సులువైన వ్యవహారం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి పార్లమెంటు ఆమోదం కావాల్సి ఉంటుందని, గెజిట్ నోటిఫికేషన్ అవసరమని పేర్కొన్నాయి. ఇందుకు చాలా సమయం పట్టేస్తుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట. విలీనమయ్యే బ్యాంకులివే.. కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు.. యాంకర్ బ్యాంకులుగా వ్యవహరించనున్నాయి. మిగతావి నాన్–యాంకర్ బ్యాంకులుగా ఉంటాయి. పీఎన్బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలవడం ద్వారా దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కానుంది. అలాగే, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం కానుంది. ఇక, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కలుస్తాయి. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది. -
రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్, నవంబర్లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి. వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి పునరుత్తేజం లక్ష్యంగా రుణ వృద్ధి మెరుగుపడాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. బ్యాంకులు వినియోగదారులను చేరుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన అన్ని నిబంధనలూ అనుసరించి రుణ పంపిణీలు జరగాలనీ ఆరి్థకమంత్రి నిర్మలా సీతారామన్ సెపె్టంబర్లో బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆరి్థకవృద్ధిలో ఇది కీలక అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బ్యాంకులు దేశ వ్యాప్తంగా 374 జిల్లాల్లో ప్రత్యేక రుణ మేళాలు నిర్వహించాయి. ప్రత్యేకించి రుణ పంపిణీల విషయంలో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కార్పొరేట్లు, రిటైల్, వ్యవసాయ విభాగాలపై దృష్టిపెట్టాయి. రుణ పంపిణీలకు సంబంధించి నిబంధనల్లో ఏ మాత్రం రాజీ పడలేదని మంగళవారం గణాంకాల విడుదల సందర్భంగా ఆరి్థకమంత్రిత్వశాఖ పేర్కొంది. అక్టోబర్‌లో రూ.2.52 లక్షల కోట్లు, నవంబర్‌లో రూ.2.39 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు వివరించింది. రెండు నెలల్లో ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలకు రూ.72,985 కోట్లు, కార్పొరేట్లకు రూ.2.2 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు తెలిపింది. రూ.27,225 కోట్ల గృహ రుణాలు మంజూరు అయ్యాయి. వాహన రుణాల విలువ రూ.11,088 కోట్లుగా ఉంది. విద్యకు సంబంధించి ఈ మొత్తం రూ.1,111 కోట్లు. వ్యవసాయ రుణాలు రూ.78,374 కోట్లు. -
ఆర్బీఐతో ఎన్బీఎఫ్సీ ఆస్తుల కొనుగోలు?
న్యూఢిల్లీ: తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) చేదోడుగా నిలవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్బీఎఫ్సీ రంగానికి చెందిన నాణ్యమైన ఆస్తులను (రుణాలు) ప్రభుత్వరంగ బ్యాంకులతో కొనుగోలు చేయించే దిశగా గతంలోనే ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా ఈ రంగానికి సంబంధించి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఆస్తులను (మొండి బకాయిలు) ఆర్బీఐతో కొనుగోలు చేయించే దిశగా కార్యాచరణపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చర్చలు ఉన్నత స్థాయిలో మొదలయ్యాయని, 2008లో అమెరికా ప్రభుత్వం అనుసరించిన ట్రబుల్డ్ అస్సెట్ రిలీఫ్ ప్రొగ్రామ్ (సమస్యాత్మక ఆస్తులకు సంబంధించి ఉపశమనం కల్పించే కార్యక్రమం/టీఏఆర్పీ) తరహాలో ఇది ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అగ్ర స్థాయి 25 ఎన్బీఎఫ్సీ సంస్థల సమస్యాత్మక ఆస్తులను కొనుగోలు చేసే పథకంపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ఆర్బీఐ మద్దతుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ/ప్రత్యేక అవసరాల కోసం ఉద్దేశించిన వేదిక) లేదా విడిగా ఒక ఎస్పీవీని ఏర్పాటు చేసి, దానితో ఎన్బీఎఫ్సీ సంస్థల ఒత్తిడి రుణాలను కొనుగోలు చేయించాలన్నది ప్రభుత్వం ఆలోచన. తద్వారా ఎన్బీఎఫ్సీ రంగం ఇబ్బందులను తొలగించొచ్చని భావిస్తోంది. ‘‘చర్చలు మొదలయ్యాయి. చిన్నపాటి టీఏఆర్పీ తరహా కార్యక్రమంపై ఇప్పటికే ఆర్బీఐతో పలు విడతల పాటు చర్చలు జరిగాయి’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఆ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో జరిగినట్లే.... 2008 లెహమాన్ సంక్షోభ సమయంలో అమెరికా కేంద్ర బ్యాంకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ టీఏఆర్పీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరి్థక సంస్థల వద్దనున్న సమస్యాత్మక రుణ ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆరి్థక రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇదే విధంగా మన దేశంలోనూ ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి ఒత్తిడిలోని రుణాలను ఆర్బీఐతో కొనుగోలు చేయించాలన్నది కేంద్రం ప్రయత్నంగా తెలుస్తోంది. అయితే, తన బ్యాలన్స్ షీటులోని నిధులతో ఎన్బీఎఫ్సీ సమస్యాత్మక రుణ ఆస్తులను కొనుగోలు చేయించే ఆలోచనను ఆర్బీఐ వ్యతిరేకించినట్టు ఓ అధికారి తెలిపారు. అయినప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొ న్నారు. ఎన్బీఎఫ్సీ రంగానికి కేంద్రం ఇప్పటికే పలు విధాలుగా సహకారం అందించింది. ప్రభుత్వరంగ బ్యాంకులతో రూ.21,850 కోట్ల విలువైన ఎన్బీఎఫ్సీ రుణ ఆస్తులను అక్టోబర్ 16 నాటికి కొనుగోలు చేయించింది. అలాగే, నేషనల్ హౌసింగ్ బ్యాంకు రూ.30,000 కోట్ల వరకు అదనంగా ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల సాయాన్ని పెంచింది. -
నేడు ఆంధ్రా బ్యాంక్ చివరి వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవో జె.పకీర్‌సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. -
అక్టోబర్‌లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఎవరికి ఎంత మేర.. ♦ కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు ♦ వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు ♦ ఎంఎస్ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు ♦ గృహ రుణాలు రూ.12,166 కోట్లు ♦ వాహన రుణాలు రూ.7,058 కోట్లు ♦ ఎన్బీఎఫ్సీ రంగానికి రూ.19,627 కోట్లు -
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్‌తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు
న్యూఢిల్లీ: గత నెలలో ఆర్బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్ విభాగం, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో ఆధారిత రుణ రేటు నవంబర్ 1 నుంచి 8 శాతంగా ఉంటుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు(0.15శాతం), ఏడాది కాల ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే వివిధ కాల పరిమితుల రుణాలపై రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.40 శాతానికి దిగొచ్చింది. రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించి 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు, అక్టోబర్ 10 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో సెంట్రల్ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గగా, ఎంఎస్ఈ రుణ రేట్లు 8.95–9.50 శాతానికి తగ్గాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సైతం ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటును 8.4 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వడ్డీ తగ్గింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (పీపీబీ) సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ రేటును అర శాతం తగ్గించి 3.5 శాతం చేసింది. నవంబర్ 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పీపీబీ ప్రకటించింది. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం మేర తగ్గించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు పీపీబీ సీఈవో, ఎండీ సతీష్‌కుమార్ గుప్తా తెలిపారు. 7.5 శాతం వడ్డీ రేటుతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని కూడా పీపీబీ ప్రకటించింది. పీపీబీ భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ఈ వడ్డీ రేటు పొందొచ్చు. -
నేటి నుంచే రుణ మేళాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన రుణ మేళా కార్యక్రమాలు గురువారం నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ప్రారంభమవుతాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలతో కలసి వీటిని నిర్వహిస్తాయి. రిటైల్ కస్టమర్లతోపాటు వ్యాపారస్థులకు కూడా రుణాలను అప్పటికప్పుడు మంజూరు చేయడమే వీటి నిర్వహణ ఉద్దేశ్యం. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) వ్యాపార పరమైన రుణాలను బ్యాంకులు అందించనున్నాయి. ముఖ్యమైన పండుగల సమయంలో రుణాల మంజూరీని పెంచడం ద్వారా నిదానించిన డిమాండ్‌ను, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వరంగ బ్యాంకులను రుణ మేళాలు నిర్వహించాలని కోరింది. దీంతో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ఇందులో పాలు పంచుకునేందుకు ప్రైవేటు బ్యాంకులు కూడా ఆసక్తి తెలిపాయి. 48 జిల్లాల్లో ఎస్బీఐ... ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), కార్పొరేషన్ బ్యాంకులు పండుగల సమయంలో రుణాల డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో ఎస్బీఐ లీడ్ బ్యాంకర్‌గా ముందుండి నడిపించనుంది. 17 జిల్లాల్లో బీవోబీ లీడ్బ్యాంకర్గా వ్యవహరించనుంది. ఇదే సమయంలో బరోడా కిసాన్ పఖ్వాడా పేరుతో వ్యవసాయ రుణాల మంజూరీపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు బీవోబీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకు సేవలు కస్టమర్లకు మరింత చేరువ కానున్నాయి. తొలి దశలో రుణ మేళాలు జరిగే 250 జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను బ్యాంకులు చేపట్టనున్నాయి. స్థానిక వర్తకుల ద్వారా రుణ మేళాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయనున్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. ఇక రెండో దశ కింద దేశవ్యాప్తంగా మరో 150 జిల్లాల్లో రుణ మేళాలు ఈ నెల 21 నుంచి 25 వరకు జరుగుతాయి. -
చిన్న సంస్థలకు వరం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని మొండి బాకీగా(ఎన్పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్రం బ్యాంకులను కోరింది. వాటి రుణాలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్యాంకుల పనితీరు, రుణ వృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏగా ప్రకటించొద్దంటూ ఆర్బీఐ జూన్ 7న ఉత్తర్వులు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ ఆదేశాలను అనుసరించాలని, 2020 మార్చి వరకు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించొద్దని కోరినట్టు చెప్పారు. రుణాల పునరుద్ధరణకు పనిచేయాలని సూచించామన్నారు. ఇది ఎంఎస్ఎంఈ రంగానికి మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో వసూలు కాని నిరర్ధక ఆస్తులుగా మారే అవకాశం ఉన్న వాటిని ఒత్తిడిలోని రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని ఎన్బీఎఫ్సీలను గుర్తించాయని.. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. దాంతో లిక్విడిటీ మెరుగవుతుందని, అవసరమైన వర్గాలకు రుణాలు అందుతాయన్నారు. రుణ మేళాలు...: దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అక్టోబర్ 3 నుంచి రుణమేళాలు నిర్వహిస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. తాము టై అప్ అయిన ఎన్బీఎఫ్సీలతో కలసి గృహ కొనుగోలుదారులకు, రైతులకు, ఇతరులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా అక్టోబర్ 3–7వ తేదీల మధ్య 200 జిల్లాల్లో, మిగిలిన 200 జిల్లాల్లో అక్టోబర్ 11 తర్వాత నుంచి ఈ సమావేశాల ఏర్పాటు ఉంటుందన్నారు. పండుగల సమయంలో సాధ్యమైనన్ని రుణాలను అందించడమే వీటి ఉద్దేశంగా చెప్పారు. -
నిజాయతీగా ఉంటే... భయపడాల్సిన పనిలేదు!
న్యూఢిల్లీ: బ్యాంకులు దేశ ప్రయోజనాల కోణంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు వేధింపులకు గురి చేస్తాయన్న భయం వద్దని కేంద్ర ఆరి్థక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ముంబైలో బుధవారం జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి మద్దతుగా నిలబడుతుంది. మంచి విశ్వాసంతో, నిజాయతీగా బ్యాంకులు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా భవిష్యత్తులో ఏ దర్యాప్తు సంస్థ సైతం తీవ్రంగా పరిగణించడం జరగదు. ఈ విషయంలో నాది హామీ. బ్యాంకులు, దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఠాకూర్ పేర్కొన్నారు. ఇటీవల చోటుచేసుకున్న భారీ మోసాలు, రుణ అవకతవకలు, ఎన్పీఏ కేసుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉన్నతోద్యోగులు సమన్లు అందుకుని విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాల మంజూరి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్లకు అంతగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
‘బీమా’ సంగతేంటి..?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మధ్య మెగా విలీనానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న బీమా, ఇతర ఆర్థిక వ్యాపారాల పరిస్థితి ఏంటన్న సందేహం తలెత్తుతోంది. 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 4 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో పలు బ్యాంకులు అనుబంధంగా బీమా వ్యాపార కంపెనీలను నిర్వహిస్తున్నాయి. వీటిని ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానాలు లభించాల్సి ఉంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనలు.. ఒక సంస్థ ఒకటికి మించి బీమా కంపెనీలను నిర్వహించరాదు. ప్రభుత్వరంగ బ్యాంకులు పలు బీమా కంపెనీలకు ప్రమోటర్లుగా ఉండడంతో ఇప్పుడు చిక్కు వచ్చి పడింది. ఉదాహరణకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు స్టార్ యూనియన్ దైచి లైఫ్ ఇన్సూరెన్స్‌లో 25.10 శాతం వాటా ఉంది. అలాగే, తాను విలీనం చేసుకోబోతున్న ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 30 శాతం వాటా ఉంది. అలాగే, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటా ఉంది. ఇక పీఎన్బీ విలీనం చేసుకోనున్న ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) బ్యాంకుకు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 23 శాతం వాటా ఉంది. ఇదే హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్‌లో కెనరా బ్యాంకు 51 శాతం వాటా కలిగి ఉంది. అలహాబాద్ బ్యాంకుకు యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రణాళికల ప్రకారం... పీఎన్బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనమై పీఎన్బీగా కొనసాగుతాయి. యూనియన్ బ్యాంకు అయితే ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం చేసుకోనుంది. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకు విలీనం చేసుకోనున్నాయి. కన్సాలిడేషన్ తప్పదు.. ‘‘ఓ బీమా కంపెనీలో 15 శాతానికి మించి వాటాలు కలిగి ఉంటే ప్రమోటర్ అవుతారు. 15 శాతం కంటే తక్కువ ఉంటే ఇన్వెస్టర్‌గా పరిగణించడం జరుగుతుంది. రెండు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా ఉన్న రెండు బ్యాంకులను విలీనం చేస్తుంటే.. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకు రెండు బీమా కంపెనీల్లో ప్రమోటర్‌గా కొనసాగడానికి లేదు. కనుక రెండింటిలోనూ తన వాటాలను 15 శాతానికి తగ్గించుకోవడం ద్వారా ఇన్వెస్టర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. లేదా ఒక బీమా కంపెనీలో వాటాలను పూర్తిగా విక్రయించి, మరో బీమా కంపెనీలో ప్రమోటర్‌గా కొనసాగొచ్చు’’ అని ఐఆర్డీఏఐ మాజీ సభ్యుడు ఒకరు తెలిపారు. నిపుణులు ఏమంటున్నారు..? ‘‘విలీనానంతర బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలను కలిగి ఉంటే అప్పుడు.. ఒక బీమా సంస్థ ఒప్పందం చేసుకుంటే, రెండోది దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. అయితే, దీనిని ఎవరు చేయాలన్నదే ప్రశ్న. బ్యాంకులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో బీమా కంపెనీల్లో వాటాలను తీసుకుంటుంటాయి. పాలసీలను విక్రయించడం ద్వారా అవి ఆదాయం సంపాదిస్తాయి’’ అని అశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ ఎండీ అశ్విన్ పరేఖ్ అన్నారు. ‘‘బీమా కంపెనీల్లో క్రాస్ హోల్డింగ్స్‌ను పరిష్కరించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు స్టార్ యూనియన్ దైచీ లైఫ్‌లో యూనియన్ బ్యాంకు తనకున్న వాటాలను విక్రయించొచ్చు. ఎందుకంటే ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్‌లో ఇంతకంటే అధిక వాటాలు ఉన్నాయి. లేదంటే రెండు బీమా సంస్థల్లోనూ 10 శాతం చొప్పున వాటాలతో ఇన్వెస్టర్‌గా కొనసాగొచ్చు’’ అని ఓ ప్రైవేటు జీవిత బీమా సంస్థ సీఈవో అన్నారు. అయితే, భవిష్యత్తు వ్యాపార అవకాశాల దృష్ట్యా విలీనానంతర బ్యాంకు.. బీమా సంస్థల్లో మైనారిటీ వాటాలను కొనసాగిస్తూ, వాటి ఉత్పత్తులకు పంపిణీదారుగా వ్యవహరించడం సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని యూనియన్ బ్యాంకు ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. అయితే, విలీనం తర్వాత వాటాలు కలిగి ఉన్న ఒకటికి మించిన బీమా సంస్థలను విలీనం చేసుకోవచ్చు. కానీ, అవన్నీ ప్రైవేటు బీమా కంపెనీలు. పైగా వాటిల్లో విదేశీ భాగస్వాములు కూడా ఉన్నారు. కనుక విలీనానికి అంగీకారం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. -
ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీ నాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానిం చారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటింన సంగతి తెలిసిందే. నవ భారత ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్ పేర్కొన్నారు. పంజాబ్ నేషనన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో ఆరు బ్యాం కులను విలీనం చేయడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో ఉన్న 27 నుంచి ప్రస్తుతం 12కు పరిమితం తగ్గను న్నాయి. దీంతో ప్రపంచస్థాయిలో ఆరు మెగా బ్యాంకులు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారంలో భాగంగానే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నారని కుమార్ చెప్పారు. ‘ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే భారీ స్థాయి బ్యాంకులు అవసరం. తాజా మెగా విలీన నిర్ణయం ఈ దిశగా అడుగులు వేయడం కోసమే. భారీ మూలధన నిధులతో మనకు ఇప్పుడు ఆరు మెగా బ్యాంకులు ఉంటాయి’ అని అన్నారు. -
59 నిమిషాల్లోనే బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రుణాలు’ పోర్టల్ సేవలు రిటైల్ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి. ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎంఎస్ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. -
ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ ఇలా ఎన్నో రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇవి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీని భారీగా పెంచుతూ గత బడ్జెట్లో చేసిన ప్రకటన దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరిచింది. దీంతో సర్‌చార్జీ పెంపును తొలగించాలన్న ఎఫ్‌పీఐల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పరిశ్రమలకు చౌకగా మూలధన నిధుల రుణాలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల(హెచ్ఎఫ్సీ)కు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) నుంచి అదనంగా రూ.20,000 కోట్ల నిధుల మద్దతు (మొత్తం రూ.30,000 కోట్లు అవుతుంది), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు నిధుల కొరత సమస్య తీర్చేందుకు గాను వారికి జీఎస్టీ రిఫండ్లను 30 రోజుల్లోనే చేసేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయం, ఇన్ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల లభ్యత పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం, రిజిస్టర్డ్ స్టార్టప్‌లపై ఏంజెల్‌ట్యాక్స్ రద్దు, సహా ఎన్నో నిర్ణయాలు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ భారం తొలగింపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం మన్నించింది. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయంపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఎటువంటి చర్యల్లేకపోవడంతో... నాటి నుంచి ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల వరకు నిధులను వెనక్కి తీసుకున్నారు. సర్‌చార్జీ పెంపును ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్ కూడా చేశారు. ‘‘క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ యాక్ట్ 2019 ద్వారా స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై విధించిన సర్‌చార్జీ పెంపును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేర ఆశించిన ఆదాయం రాకుండా పోతుంది. సర్‌చార్జీ ఉపసంహరణ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందరికీ వర్తిస్తుంది. స్టార్టప్‌లకు ఊరట రిజిస్టర్డ్ స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ నుంచి ఉపశమనం కల్పించడం ప్రభు త్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ‘‘స్టార్టప్‌లు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఆదాయపన్ను చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి వెల్లడించారు. ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు, ఏంజెల్ ట్యాక్స్ రద్దును నిపుణులు స్వాగతించారు. క్యాపిటల్ మార్కెట్లకు ఇవి జోష్‌నిస్తాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజేష్ గాంధీ అభిప్రాయపడ్డారు. రుణాలు ఇక చౌక! గృహ, వాహన, వినియోగ రుణాలు చౌకగా మా రనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్ఆర్ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెపో రేటు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమైన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, ఫలితంగా గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాల ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు. అలాగే, వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల వరకు అదనపు లిక్విడిటీ, రుణ వితరణ సాధ్యపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక రుణాల వితరణ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు పీఎంఎల్ఏ, ఆధార్ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయనుంది. రుణాలను తీర్చేసిన 15 రోజుల్లోపు వాటి డాక్యుమెంట్లను రుణ గ్రహీతలకు ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ఇకపై తప్పనిసరి. దీనివల్ల కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పిపోతాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల మద్దతు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎఫ్సీలకు లోగడ ఎన్‌హెచ్‌బీ ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం. దీనివల్ల హౌసింగ్ రంగానికి నిధుల వితరణ పెరగనుంది. ఆధార్ ఆధారిత కేవైసీని వినియోగించేందుకు ఎన్బీఎఫ్సీలను అనుమతించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్షిక క్రెడిట్ స్కీమ్‌ను ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించగా, ప్రతీ బ్యాంకు స్థాయిలో దీనిపై అత్యున్నత స్థాయిలో సమీక్ష చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మన దగ్గరే వృద్ధి వేగం... అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి అంచనాలను 3.2 శాతానికి సవరించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఆర్థిక రంగం వృద్ధి వేగంగా ఉందన్నారు. ఆటో రంగానికి ఉద్దీపనలు దేశంలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ రంగానికి ఉద్దీపనం కల్పించే నిర్ణయాలను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును వాయిదా వేసింది. ప్రభుత్వ విభాగాలు పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను మాత్రం పట్టించుకున్నట్టు లేదు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలనే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బీఎస్–4 వాహనాల నిల్వలు పెరిగిపోతుండడం, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో... 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ గడువు వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నట్టు మంత్రి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటర్నల్ కంబస్టన్ వాహనాలకూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆటో రంగంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలకు గండి పడినట్టు నివేదికలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మార్చి వరకు కొనుగోలు చేసే వాహనాలపై తరుగుదలను 15 శాతానికి బదులు 30 శాతానికి పెంచుతున్నట్టు మంత్రి చెప్పారు. వాహనాలను తుక్కుగా మార్చడం సహా పలు చర్యలను పరిశీలించనున్నట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు వేగంగా రిఫండ్లు ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రిఫండ్లను ప్రభుత్వం ఇకపై 30 రోజుల్లోపు చెల్లించనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ సంబంధిత బకాయిలు అన్ని వేళలా సగటున రూ.7,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జీఎస్టీ బకాయిలను 30రోజుల్లోపు పూర్తి చేయడం అన్నది ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, అంతిమంగా ఉపాధి అవకాశాల పెంపునకు దారితీస్తుందని ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఎంఎస్ఎంఈలకు ఒకటే నిర్వచనం ఇచ్చే దిశగా చట్ట సవరణను పరిశీలించనున్నట్టు చెప్పారు. మరిన్ని ముఖ్యాంశాలు... ► రూ.100 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల రంగంపై వెచ్చించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... ఇన్ఫ్రా ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ► అలాగే, మౌలికరంగ, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల వితరణ పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరపూరిత చర్యగా పరిగణించబోమని, సివిల్ లయబులిటీగానే చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ► ఆదాయపన్ను శాఖ నుంచి ఆదేశాలు, నోటీసుల జారీకి కేంద్రీకృత వ్యవస్థ. ► స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సీబీడీటీలో సెల్ ఏర్పాటు. భారతీయ కంపెనీలను కాపాడాలి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంపిటిషన్ కమీషన్ సన్నద్ధం కావాలని మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ సంస్థల నుంచి పోటీ పరంగా భారత కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శాఖ వ్యవహరాలనూ కూడా మంత్రి నిర్మలా సీతారామనే చూస్తున్నారు. సీసీఐ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పోటీ పరంగా దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సీసీఐ స్వచ్చందంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారతీయ వినియోగదారులను, భారత కంపెనీలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఊతమిస్తాయి... ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు విశ్వాసాన్ని పెంచి, ఆర్థిక రంగంలో సహజ స్ఫూర్తి ఫరిడవిల్లేలా చేస్తాయని దేశీయ పరిశ్రమలు అభిప్రాయపడ్డాయి. ఆటో రంగం టర్న్ అరౌండ్ అయ్యేందుకు తోడ్పడుతుందని పరిశ్రమ పేర్కొంది. ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్వెస్టర్ల లాభాలపై సర్‌చార్జీని తొలగించడం కీలకమైన ప్రకటన. ఇది తిరిగి ఉత్సాహాన్ని పాదుకొల్పుతుంది. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ అద్బుతమైన ప్యాకేజీ. ఆర్థిక రంగాన్ని తదుపరి దశకు తీసుకెళుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ మందగమనం సంకేతాలను ఇస్తున్న ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వ చర్యలు ఎంతో మేలు చేస్తాయి. వ్యాపారాలు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఈ చర్యలు తప్పకుండా నిలబెడతాయి. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్. ప్రభుత్వ ప్యాకేజీ మొత్తం మీద ఆర్థిక రంగానికి భారీగా మేలు చేస్తుంది. ఎందుకం టే ఇది వాస్తవంగా నిర్వహణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలు సైతం తమవంతుగా రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించేందుకు ముందుకు రావాలి. – భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ప్రభుత్వ చర్యలు ఆటో పరిశ్రమకు తక్షణ ఉపశమనాన్నిస్తాయి. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఆటో రంగానికి తోడ్పాటునివ్వడంతోపాటు స్పష్టమైన రోడ్ మ్యాప్‌నకు వీలు కల్పిస్తాయి. ఈ నిర్ణయాలు అమలైతే వృద్ధికి, ఆటో రంగంలో డిమాండ్‌కు దారితీస్తాయి. – మార్టిన్ ష్యూవెంక్, మెర్సెడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్కెట్లకు ఉద్దీపనల ప్యాకేజీ మేలు చేస్తుంది. ఎఫ్‌ఫీఐలపై సర్‌చార్జీని తొలగించడం తిరిగి విదేశీ నిధులు మన మార్కెట్ల వైపు వచ్చేలా చేస్తుంది. పండుగల సీజన్‌కు ముందు ఈ ఉద్దీపనల ప్యాకేజీ ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. – గౌతం ష్రాఫ్, ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ కోహెడ్ -
బ్యాంకింగ్ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ నెల పాటు బ్రాంచ్‌ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దిగువ స్థాయి నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని, బ్రాంచ్‌ల స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగుతుందని ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలుత బ్రాంచ్ లేదా ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సలహాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం, ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం ఉంటుంది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో కీలక భాగస్వాములైన ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తోంది. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం
సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేరు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు వద్దన్నాయి. ఆర్బీఐ కూడా సరికాదని చెప్పింది. అయినాసరే... 50 ఏళ్ల కిందట ఇదే రోజున(1969, జూలై 19) ఇందిర తను అనుకున్నదే చేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్‌తో 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. నిజానికి ఈ జాతీయీకరణ ఆశించిన మేర కొన్ని ప్రయోజనాలనైతే ఇచ్చింది. కానీ... ఆ ప్రయాణంలో బ్యాంకులు ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మల్లా మారిపోయాయి. చివరికిపుడు శక్తికి మించిన మొండి బాకీల్ని మోస్తూ కుదేలవుతున్నాయి. చివరికి వీటిని ప్రైవేటీకరించాలన్న సలహాలూ వస్తున్నాయి. అంటే... మళ్లీ మొదలెట్టిన చోటికే చేర్చమని!!. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జాతీయీకరణ ఎందుకు జరిగింది? ఇపుడు దారేంటి? వీటన్నిటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం... సాక్షి, బిజినెస్ విభాగం బ్యాంకుల జాతీయీకరణ వెనక రాజకీయాలు పక్కనపెడితే ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన చాన్నాళ్ల దాకా బ్యాంకులు స్పెక్యులేటివ్, వాణిజ్య కార్యకలాపాలకు తప్ప ఎక్కువగా పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి రుణాలివ్వటంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అటు నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. దీంతో 300 పైచిలుకు ఉన్న బ్యాంకులను అదుపు చేయడం కష్టంగా మారింది. 1960ల్లో పాలయ్ సెంట్రల్ బ్యాంక్, లక్ష్మి కమర్షియల్ బ్యాంక్ దివాలా తీయడంతో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఒత్తిడితో బ్యాంకుల సంఖ్యను తగ్గించడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. 1960లో 328 పైచిలుకు ఉన్న బ్యాంకుల సంఖ్యను విలీనాలు, మూసివేతలుతో 1965 నాటికి 94 స్థాయికి తెచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 1969 జూలై 19న కనీసం రూ.50 కోట్ల మేర డిపాజిట్లున్న బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులతో పాటు 14 బ్యాంకులు ప్రభుత్వ రంగ పరిధిలోకి వచ్చాయి. అప్పటి బ్యాంకింగ్ రంగంలోని మొత్తం డిపాజిట్లలో వీటి వాటా ఏకంగా 85 శాతం!!. మళ్లీ 1980లో రూ.200 కోట్ల పైగా డిపాజిట్లున్న మరో 6 బ్యాంకులను జాతీయీకరించారు. ఆర్బీఐని తోసిరాజని.. బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియలో ఆర్బీఐ గవర్నర్‌ను కూడా ప్రభుత్వం పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. ఇందిరా గాంధీతో పాటు ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి పీఎన్ హక్సర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎ.బక్షి, డీఎన్ ఘోష్ అనే జూనియర్ స్థాయి అధికారి మాత్రమే ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఆర్బీఐ వర్గాల కథనం ప్రకారం.. బ్యాంకులు అప్పటికే సమగ్రమైన సామాజిక నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నాయని, వాటి జాతీయీకరణ వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా ప్రభుత్వం, ఆర్బీఐపై అనవసర బాధ్యతలు పెరుగుతాయంటూ ఆర్బీఐ గవర్నర్ ఎల్కే ఝా అప్పటికే ఒక నోట్‌ను సిద్ధం చేసుకుని ప్రధానికి తెలిపేందుకు వెళ్లారు. అయితే, ఆయన్ను చూసిన ప్రధాని ఇందిరాగాంధీ ‘మీ చేతిలో భారీ నోట్ ఏదో కనిపిస్తోంది. దాన్ని ఈ పక్కన టేబుల్ మీద ఉంచండి. పక్క గదిలో ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణ ఆర్డినెన్స్‌పై కసరత్తు చేస్తున్న టీమ్‌కు కాస్త సాయం అందించండి‘ అని సూచించడంతో ఝా తప్పనిసరై ఆ ప్రక్రియలో భాగమయ్యారు. బ్యాంకింగ్ విస్తరణకు ఊతం.. జాతీయీకరణకు ముందు బ్యాంకులిచ్చే రుణాల్లో దాదాపు 78 శాతం పెద్ద, మధ్య స్థాయి పరిశ్రమలు, హోల్‌సేల్ వ్యాపారాలకే కాగా... వ్యవసాయం వాటా 2.2 శాతం మాత్రమే. 1969లో రూ.162 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2011 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరాయి. చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలు కూడా రూ.251 కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రంగ రుణాల వాటా 1969లో 15 శాతంగా ఉంటే 2011 నాటికి 41 శాతానికి పెరిగింది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరే కనపర్చాయి. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన్ ధన్ ఖాతాల్లో 80 శాతం అకౌంట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులే (పీఎస్బీ) ఇచ్చాయి. వ్యవసాయం, చిన్న తరహా సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణాల్లో 68 శాతం వాటా వీటిదే ఉంది. మొండిబాకీలతో కుదేలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. తాజా పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. మొండిబాకీలతో బ్యాంకులు కుదేలవుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ చూస్తే పీఎస్‌బీల విలువ దాదాపు రూ.2.97 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. బ్యాంకింగ్ రంగ మార్కెట్ క్యాప్‌లో వీటి వాటా 40 శాతం నుంచి 26కు పడిపోయింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధి 21 శాతంగా ఉంటే పీఎస్బీలది కేవలం 9.6 శాతమే. ప్రైవేట్ బ్యాంకుల డిపాజిట్లు 17.5 శాతం పెరిగితే పీఎస్‌బీలవి 6.5 శాతమే పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్పీఏలు 3.7 శాతం స్థాయిలో ఉంటే పీఎస్‌బీలవి ఏకంగా 12.6 శాతం మేర ఉన్నాయి. దీంతో కేంద్రం దఫదఫాలుగా పీఎస్బీలకు అదనపు మూలధనం సమకూరుస్తూ కుప్పకూలకుండా చూస్తోంది. తప్పెవరిదంటే.. పీఎస్‌బీల పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి బాధ్యులెవరంటే.. ఇటు స్వయంగా బ్యాంకులు అటు ప్రభుత్వం కూడానని చెప్పాలి. ప్రత్యేక ఫైనాన్స్ సంస్థల స్థానంలో భారీ ప్రాజెక్టులకు పీఎస్‌బీలు రుణాలివ్వాల్సి వచ్చింది. ఇలాంటి అంశాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ దీర్ఘకాలిక రుణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయాయి. ఇవే నేటి మొండిబాకీలకు మూలకారణం. పీఎస్బీల్లో కేంద్రం వాటాలు తగ్గించుకుంది కానీ అజమాయిషీ మాత్రం దాని చేతుల్లోనే ఉంది. బ్యాంకింగ్‌తో సంబంధంలేని పనులకూ ఒకోసారి వాటిని ఉపయోగిస్తోంది. ఇక, పీఎస్బీ బ్యాంకర్లకు మార్కెట్ స్థాయిలో జీతభత్యాలు లేకపోవడం, నిరంతరం వారిపై దర్యాప్తు సంస్థల నిఘా ఉండటం వంటి అంశాలు సైతం వారిని సాహసోపేత నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేతులు కట్టేసినట్లుగా ఉంటున్నాయి. తరుణోపాయం ఏంటి? జాతీయీకరణ జరిగి 50 సంవత్సరాలవుతున్న ఈ తరుణంలోనైనా పీఎస్‌బీలపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత దివాలా చట్టంతో మొండిబాకీలకు కొంత పరిష్కారం దొరుకుతున్నా, ఊరట అంతంతమాత్రంగానే ఉంటోంది. అవి ఎదగకుండా చేతులు కట్టేసి.. మూలధనాన్ని అందిస్తూ కూర్చోవడమా.. లేక వాటి మానాన వాటిని వదిలేయడమా లేక ప్రైవేటీకరించడమా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలనేది బ్యాంకింగ్ వర్గాల మాట. జాతీయీకరణ ఇలా తొలి విడత 1969లో: అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో విడత 1980లో: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోడల్ మార్చాలి... ప్రభుత్వ రంగ బ్యాంకుల మోడల్ కొన్నాళ్ల పాటు పనిచేసింది. అదనపు మూలధనం రూపంలో పీఎస్‌బీల్లోకి వెడుతున్న ట్యాక్స్‌పేయర్స్ సొమ్ము విలువ ఎంతో కొంత పెరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ పెరగడం మాట అటుంచి ఎందుకు తగ్గుతోంది అన్నదే ప్రశ్నార్థకం. ఒకవేళ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమైతే మోడల్‌ను మార్చే అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలి. – అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ మాజీ చైర్మన్ మెరుగైన బ్యాంకులకు తోడ్పాటు అప్పట్లో ప్రైవేట్ బ్యాంకుల రికార్డు అంత బాగాలేకపోవడంతో బ్యాంకుల జాతీయీకరణ సమంజసమైనదే కావచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగుపడ్డాయి.. కానీ పీఎస్‌బీల పరిస్థితే సందేహాస్పదంగా ఉంది. ఇలాంటప్పుడు పీఎస్‌బీల అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ, ఆర్థికపరమైన అంశాల వల్ల ఈ వ్యవహారం చాలా సంక్లిష్టంగా మారింది. అయితే, అలాగని పీఎస్‌బీలు పూర్తిగా అవసరం లేదని కాదు. బ్యాంకింగ్‌లో నిర్దిష్ట శాతం ప్రభుత్వ రంగంలో ఉండాలని నిర్ణయించాలి. పోటీ ద్వారా ఏ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయో తేల్చి వాటికి తోడ్పాటునివ్వాలి. సరిగ్గా లేని వాటిల్లో షేర్లు అమ్మేసేయాలి. ఎకానమీ అవసరాలను తీర్చేలా ప్రభుత్వ నియంత్రణలో సుమారు 30 శాతం బ్యాంకింగ్ రంగం ఉంటే చాలని అంచనాలు ఉన్నాయి. – వైవీ రెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
న్యూఢిల్లీ: సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) రుణ వితరణ పరంగా సమస్యల్లేకుండా చూసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థం అవుతోంది. పీఎస్‌బీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆన్ లైన్ లో వ్యక్తిగత రుణాలను, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని మంత్రి సూచించారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు కస్టమర్, ఇతర అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను అందుకునే విధంగా ఉండాలన్నారు. ఖాతాదారుల అనుమతితోనే.... ‘‘ఖాతాదారులకు వారి ఖాతాల్లో ఇతరులు చేసే డిపాజిట్ల విషయంలో ప్రస్తుతం పూర్తి నియంత్రణ లేదు. ఖాతాదారుల అనుమతితోనే ఇతరులు డిపాజిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎస్బీల్లో గవర్నెన్స్ బలోపేతం చేసేందుకు సంస్కరణలు కూడా తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనాల ద్వారా ఇప్పటికి 8 బ్యాంకులను తగ్గించినట్టు ప్రకటించారు. బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది. -
మొండి బండ.. మరింత భారం!
మొండి బకాయిలు... ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమస్య తీవ్రత తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్య కారణంగానే గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నిర్వహణ నష్టాలు రూ.50,000 కోట్లకు మించాయి. అంతే కాకుండా భారీ కంపెనీల కొన్ని బకాయిలు మొండిగా మారే ప్రమాదమూ పొంచి ఉంది. మార్చి క్వార్టర్ చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు రూ.7.7 లక్షల కోట్లకు తగ్గింది. అయితే ఇది ఏమంత ఊరటనిచ్చే విషయం కాదని నిపుణులంటున్నారు. దివాలా ప్రక్రియ మంచిదే కానీ... మొండి బకాయిల రికవరీ కోసం రూపొందించిన దివాలా చట్టం మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే తక్కువ మొత్తంలోనే రికవరీ కానుండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించనున్నది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడం కూడా బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి, 5.8 శాతానికి పడిపోయింది. జీడీపీ క్షీణత కారణంగా వ్యవసాయ, రియల్టీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు మొండిగా మారిపోయే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఒత్తిడి ఖాతాల కోసం మూలధన నిధులను కేటాయిస్తున్నాయి. భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ అండ్ మోనెట్ ఇస్పాత్, జెట్ ఎయిర్వేస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, కొన్ని ఎన్బీఎఫ్సీ కంపెనీలు...ఇలా ఒత్తిడి ఖాతాలకు నిధులను కేటాయిస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌లకు సంబంధించిన దివాలా కేసులు పూర్తిగా పరిష్కారమైతే, బ్యాంక్‌లకు మొండి బకాయిల భారం ఒకింత తీరుతుంది. ఈ కేసులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం కల్లా పరిష్కారం అవుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు... గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.52,000 కోట్ల మేర నిధులందించింది. దీంతో కలుపుకొని మొత్తం రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అందించినట్లయింది. ఈ నిధుల్లో అధిక మొత్తాలను బ్యాంక్‌లు మొండిబకాయిల ‘కేటాయింపులకే’ కేటాయించాయి. అయినప్పటికీ, గత క్యూ4లో బ్యాంక్‌ల నష్టాలు తగ్గలేదు. రుణ నాణ్యత తగ్గడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ మంజూరీలు కూడా తగ్గాయి. ప్రైవేట్ బ్యాంక్‌లు జోరుగా రుణాలిస్తుండగా, ప్రభుత్వ బ్యాంక్‌లు మాత్రం రుణ నాణ్యతను మెరుగుపరచుకోవడంపైననే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు చూస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ–డిపాజిట్ నిష్పత్తి 2017లో 64 శాతం, గతేడాది 72 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంక్ రుణ–డిపాజిట్ నిష్పత్తి 95, 91 శాతాలుగా నమోదైంది. కంపెనీలకు తగ్గుతున్న రుణాలు.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.., ఇతర రుణాలతో పోల్చితే కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 12 శాతం తగ్గాయి. మరోవైపు వాహన కొనుగోళ్ల రుణాలు 5 శాతం, ఇతర వ్యక్తిగత రుణాలు 21 శాతం, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల రుణాలు 1 శాతం మేర పెరిగాయి. మధ్య స్థాయి సంస్థలకు ఇచ్చిన రుణాలు 4 శాతం ఎగిశాయి. మెరుగుపడుతున్న రుణ నాణ్యత ఇక రుణ నాణ్యత మెరుగుదల అన్ని బ్యాంక్‌ల్లో ఒకేలా లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) స్థూల మొండి బకాయిలు 23 శాతం తగ్గి రూ.1.73 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. తాజా మొండి బకాయిలపై నియంత్రణ సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార వ్యాఖ్యానించారు. రుణ నాణ్యత మరింతగా మెరుగుపడిందని, ఒత్తిడి ఖాతాలకు తగిన కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. దాదాపు ఏడు క్వార్టర్ల పాటు నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత క్యూ4లో లాభాల బాట పట్టింది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 27 శాతం తగ్గి రూ.12,053 కోట్లకు తగ్గాయి. రుణ నాణ్యత మెరుగుదల పరంగా చూస్తే, ప్రభుత్వ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్ బ్యాంక్‌లదే పై చేయిగా ఉంది. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 14 శాతం తగ్గి రూ.46,292 కోట్లకు చేరాయి. ప్రైవేట్ బ్యాంక్‌లకూ పాకుతున్న సమస్య... మొండి బకాయిల విషయంలో కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోటీ పడుతున్నాయి. స్థూల మొండి బకాయిల పెరుగుదల విషయంలో యస్‌బ్యాంక్‌ను చెప్పుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 200 శాతం ఎగసి రూ.7,883 కోట్లకు పెరిగాయి. ఒక విమానయాన సంస్థ(జెట్ ఎయిర్వేస్ కావచ్చు), మౌలిక రంగ దిగ్గజం(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించామని, అందుకే గత క్యూ4లో మొండి బకాయిలు భారీగా పెరిగాయని యస్ బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 131 శాతం పెరిగి రూ.3,947 కోట్లకు చేరాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించడం వల్ల ఈ బ్యాంక్ మొండిబకాయిలు ఇంతగా పెరిగాయి. ఈ బ్యాంక్‌కు మొండి భారం మరింతగా ఉండనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు, ఎస్సెల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఇతర కొన్ని కంపెనీలకు బాగానే రుణాలిచ్చిందని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లను మొండి బకాయిల సమస్య ఇప్పట్లో వదిలేలా లేదు. -
మూడు నెలలు... 52వేల కోట్లు!
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎన్పీఏలకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు అధికం. విమానయాన సంస్థ, జెట్ ఎయిర్వేస్ కూలిపోవడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ కూడా మూతపడటంతో ప్రభుత్వ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరటంతో ఈ ప్రభావం బ్యాంక్‌ల లాభదాయకతపై బాగానే పడింది. ఎనిమిది బ్యాంక్‌లకు రూ.15,192 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. ఐదు బ్యాంక్‌లకు మాత్రమే నికర లాభాలొచ్చాయి. ఒక్కో బ్యాంక్ నష్టాలు నాలుగంకెల్లో (వెయ్యి కోట్లకు పైగా) ఉండగా, లాభాల్లో ఉన్న బ్యాంక్‌ల లాభాలు రెండు, మూడు అంకెల్లో (రూ.95 కోట్లు నుంచి రూ.838 కోట్ల రేంజ్) మాత్రమే ఉన్నాయి. ఇప్పట్లో కష్టమే.... ఈ మొండి బకాయిల్లో ఎంత మొత్తం బకాయిలు వసూలు అవుతాయో, ఎంత మేర బకాయిలను బ్యాంక్‌లు రద్దు చేస్తాయో, ఎన్ని కోట్ల కేటాయింపులు మళ్లీ వెనక్కి వస్తాయో ఎవరూ జవాబివ్వలేని ప్రశ్నగా మిగిలిపోయింది. కేటాయింపుల పరిమాణం చూస్తే, మొండి బకాయిల బండ ఇప్పట్లో బ్యాంక్‌లను వీడేటట్లు లేదని నిపుణులంటున్నారు. కేటాయింపుల వ్యధ... గత క్యూ3లో రూ.6,006 కోట్లుగా ఉన్న ఎస్బీఐ మొండి కేటాయింపులు గత క్యూ4లో నాలుగు రెట్లు పెరిగి రూ.16,502 కోట్లకు చేరాయి. ఐఎల్ఎఫ్ఎస్కు ఇచ్చిన రూ.3,487 కోట్ల రుణాల్లో 1,125 కోట్ల రుణాలను మొండి బకాయిలుగా ఎస్బీఐ వర్గీకరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.1,200 కోట్ల బకాయిలను కూడా మొండి బకాయిలుగా ఈ బ్యాంక్ గుర్తించింది. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా రూ.1,985 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ కేటాయింపులు రూ.4,502 కోట్లుగా ఉన్నాయి. రానున్న క్వార్టర్లలో ఈ బ్యాంక్ కేటాయింపులు మరింతగా పెరుగుతాయని విశ్లేషకులంటున్నారు. దీంతో మరో రెండు క్వార్టర్ల పాటు ఈ బ్యాంక్‌కు నష్టాలు తప్పవని వారంటున్నారు. దాదాపు ప్రతి బ్యాంక్ పరిస్థితి ఇలాగే ఉంది. రెండు బ్యాంక్‌ల కేటాయింపులు మాత్రం గత క్యూ4లో తగ్గాయి. యునైటెడ్ బ్యాంక్ కేటాయింపులు రూ.1,967 కోట్ల నుంచి రూ.1,688 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేటాయింపులు రూ.4,422 కోట్ల నుంచి రూ.415 కోట్లకు తగ్గాయి. ఈ రెండు బ్యాంక్‌లకు గత క్యూ4లో నికర లాభాలు వచ్చాయి. వడ్డీ ఆదాయం కంటే మొండి బకాయిల కేటాయింపులే అధికం... మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎనిమిది బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం కంటే కూడా మొండి బకాయిల కేటాయింపులే అధికంగా ఉన్నాయి. మొండి బకాయిల ప్రక్షాళన కోసం సదరు ఎనిమిది బ్యాంక్‌లు కనీసం మరో రెండేళ్ల పాటు కేటాయింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం రూ.43,304 కోట్లు. కాగా, మొండి బకాయిలు కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరాయి. -
మరో 3 బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి
ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ధన్లక్ష్మి బ్యాంక్ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల పనితీరును మదింపు చేసిన మీదట పీసీఏపరమైన ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చిన నేపథ్యంలో వాటి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడనుండటం ఇందుకు కారణమని వివరించింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి కార్పొరేషన్ బ్యాంకు వితరణ చేసిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 17.36 శాతంగా ఉండగా, అలహాబాద్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 17.81 శాతం స్థాయికి చేరాయి. దీంతో వీటిని పీసీఏ పరిధిలోకి చేర్చి.. రుణవితరణ, వ్యాపార విస్తరణ మొదలైన కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీసీఏ పరిధిలోని బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే జనవరి 31న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే, ఇప్పటికీ మరో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్) పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. -
పీఎస్బీలకు తగ్గనున్న మూలధన నిధుల సాయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధుల సాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,000–25,000 కోట్ల స్థాయికి తగ్గుతుందని, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడమే దీనికి కారణమని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. నియంత్రణ పరమైన మూలధన అవసరాల కోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ.48,239 కోట్ల నిధులను అందించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1,00,958 కోట్లను సమకూర్చింది. ‘‘కామన్ ఈక్విటీ టైర్–1 రేషియో 8.5 శాతం నిర్వహణకు గాను 2019– 20 ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు రూ.20,000–25,000 కోట్ల నిధులు అవసరం అవుతాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించిన రూ.1.96 లక్షల కోట్ల కంటే ఇది ఎంతో తక్కువ’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిధుల సాయంతో బ్యాంకుల పరపతి పెరుగుతుందని, ఎన్పీఏల కేటాయింపులకు ఊతం లభిస్తుందని పేర్కొంది. కానీ, రుణాలకు సంబంధించిన సమస్యలు ఇంకా అధిక మొత్తంలో పరిష్కారం కావాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అందించే సాయంతో బలమైన పీఎస్‌బీలు రుణాల్లో వృద్ధిని సాధించేందుకు నిధుల వెసులుబాటు లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. -
వ్యవసాయం, చిన్న పరిశ్రమల వృద్ధి ఎలా?
న్యూఢిల్లీ: వ్యవసాయం, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికమంత్రి పియుష్ గోయెల్ దృష్టి సారించారు. ఈ అంశంపై ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఆయా రంగాలకు రుణాల లభ్యత మెరుగుపడేందుకు చర్యలు అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన మద్దతుసహా అవసరమైన సహకారాన్ని అందిం చడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మున్ముందు రోజుల్లో ప్రభుత్వ బ్యాంకులు మరింత క్రియాశీలంగా, లాభదాయకంగా రూపొందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలతో పాటు గృహ రుణాలపై కూడా చర్చ జరిగినట్లు సమావేశం అనంతరం మంత్రి విలేకరులకు తెలిపారు. -
బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి
న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయి. అందుకు సంబంధించి వారికి పూర్తి అనుమతులు ఇచ్చాం’’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గింపుతో సెబీ ‘కనీస ప్రజల వాటా’ నిబంధనలను పాటించేందుకు వీలవుతుందన్నారు. తగిన జాగ్రత్తలతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఇది ప్రోత్సహిస్తుందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రానికి 75%కి పైగా వాటా ఉండటం గమనార్హం. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా కనీసం 25% ఉండాలి. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఇప్పటికే క్యూఐపీ ద్వారా రూ.20,000 కోట్ల మేర షేర్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 58.53% నుంచి తగ్గుతుంది. సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకులు ఇప్పటికే ఉద్యోగులకు షేర్ల అమ్మకం ద్వారా నిధుల సమీకరణ చర్యలను చేపట్టాయి. దీని ద్వారా కూడా ప్రభుత్వం వాటా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
బ్యాంకుల విలీనంతో ఉద్యోగాల కోత ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు నష్టం వాటిల్లదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ వారం మొదట్లో ఆమోదం తెలిపింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ మాదిరిగా పెద్ద బ్యాంకు అవతరిస్తుందని జైట్లీ చెప్పారు. రుణాలపై వ్యయాలు కూడా తగ్గుతాయన్నారు. ప్రభుత్వ రంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులు ఆర్బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలో (పీసీఏ) ఉన్నట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా జైట్లీ చెప్పారు. అధిక ఎన్పీఏలతో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ పీసీఏను అమల్లోకి తెచ్చింది. రూ.3 లక్షల కోట్లను వ్యవస్థలోకి తిరిగి తీసుకొచ్చేందుకు దివాలా చట్టం సాయపడినట్టు మంత్రి తెలిపారు. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహణ పరంగా లాభాల్లోనే ఉన్నప్పటికీ, మొండి బకాయిలకు కేటాయింపులు చేయడం వల్లే నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం రూ.65,000 కోట్లను బడ్జెట్లో కేటాయిం చగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ. 51,533 కోట్ల నిధుల సాయం చేసినట్టు తెలిపారు. -
‘బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కోత ఉండదు’
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్‌లను.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని.. ఫలితంగా రుణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని ప్రకటించారు. కానీ బ్యాంకుల వద్ద ఉన్న ఎన్పీఏలు ఫలితంగా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దివాల చట్టం సాయంతో రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెవడమే కాక ఎన్పీఏలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. దీని గురించి జైట్లీ ‘2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ. 65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్ కోసం కేటాయించాం. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చాం. ఎన్పీఏలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తున్నాయి’ అని జైట్లీ తెలిపారు. -
మొండిబండ 10 లక్షల కోట్లు!
ముంబై: ఆర్బీఐ ఆదేశాలతో దేశీయ బ్యాంకులు చేపట్టిన దిద్దుబాటు చర్యల ఫలితంగా... గడిచిన ఆర్థిక సంవత్సరం (2017–18)లో బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ) ఏకంగా 11.2 శాతం... అంటే రూ.10.39 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్థూల ఎన్పీఏల శాతం 9.3గానే ఉంది. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) వాటా రూ.8.95 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. శాతం వారీగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏలు 14.6 శాతానికి సమానం. 2016–17లో పీఎస్‌బీల స్థూల ఎన్పీఏల శాతం 11.7గా ఉంది. ‘‘2017–18లో ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏల రేషియో 14.6 శాతానికి చేరింది. పునరుద్ధరించిన రుణాలు ఎన్పీఏలుగా మారడం, ఎన్పీఏలను గుర్తించడానికి మరింత మెరుగైన విధానాన్ని అనుసరించటం ఇందుకు కారణం’’ అని ‘2017–18లో బ్యాంకింగ్ రంగ ధోరణులు, ప్రగతి’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ తెలియజేసింది. ముఖ్యంగా పెద్ద రుణ ఖాతాల (రూ.5 కోట్లకుపైన) నుంచి ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద రుణ ఖాతాల వారీగా స్థూల ఎన్పీఏలు 18.1 శాతం నుంచి 23.1 శాతానికి పెరిగాయి. ఎన్పీఏల పరిష్కారం, ఆస్తుల నాణ్యతపై పర్యవేక్షణ కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టంచేసింది. నివేదికలోని ఇతర అంశాలివీ... ప్రభుత్వరంగ బ్యాంకుల నికర ఎన్పీఏలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 6.9 శాతం నుంచి 2017–18లో 8 శాతానికి పెరిగిపోయాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల తక్కువగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతం నుంచి 2017–18లో 4.7 శాతానికి చేరాయి. ఎన్పీఏలను మాఫీ చేయడం ద్వారా ప్రైవేటు రంగ బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను శుభ్రం చేసుకోవడం, మెరుగైన వసూళ్ల వంటి చర్యలు స్థూల ఎన్పీఏలు తగ్గేందుకు దోహదపడినట్టు ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకుల ఆస్తుల నాణ్యత అంతకముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4 శాతం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి మెరుగుపడింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రూ.14,000 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ని మోసగించడంతో... జెమ్స్, జ్యుయలరీ రంగం నుంచి ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నాయి. పీసీఏలోని బ్యాంకుల పనితీరు మెరుగు ఆర్బీఐ స్పష్టమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి 11 ప్రభుత్వరంగ బ్యాంకులు చేరగా, వీటి స్థూల ఎన్పీఏల పెరుగుదల 2017–18లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. అంతేకాదు, ఎన్పీఏల రికవరీలు కూడా పెరిగాయని ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. అయితే, పీసీఏ పరిధిలోని బ్యాంకులు కొత్తగా రుణాలిచ్చేందుకు, డిపాజిట్లు సేకరించేందుకు అవకాశం ఉండదు. దీనివల్ల ఆస్తుల పరంగా రిస్క్ తగ్గి, మెరుగైన ఆస్తులపై దృష్టి పెట్టడానికి వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. పెరిగిపోతున్న మోసాలు రిస్క్ నిర్వహణ పరంగా మోసాలనేవి ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయని, 90 శాతం మోసాలు రుణ పోర్ట్‌ఫోలియో నుంచి ఉంటున్నాయని ఈ నివేదిక తెలియజేసింది. 2017–18లో మొత్తం మోసాల్లో రూ.50 కోట్లు, అంతకుమించి విలువతో ఉన్నవి 80 శాతంగా ఉన్నాయి. రూ.10 లక్షలకు పైగా విలువైన మోసాల్లో 93 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే జరుగుతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా 6 శాతంగానే ఉండడం గమనార్హం. ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్య లేదు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) వృద్ధి స్థిరంగా ఉందని, లిక్విడిటీ (నిధుల లభ్యత) ఆందోళనలు ఉపశమించాయని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. ఎన్బీఎఫ్సీ సంస్థల సహజసిద్ధమైన బలాలు, అదే సమయంలో ఆర్బీఐ వైపు నుంచి నిఘా, నియంత్రణపరమైన పర్యవేక్షణలతో ఈ రంగం వృద్ధి నిలకడగానే ఉందని తన నివేదికలో నిర్ధారించింది. అతిపెద్ద ఎన్బీఎఫ్సీ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వరుసగా పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన తర్వాత ఈ రంగంలో నిధుల సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఆర్బీఐ పలు మార్లు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా వ్యవస్థలోకి నిధుల అందుబాటును పెంచింది. ఎన్‌బీఎఫ్‌సీల లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల్ అడెక్వసీ 2017–18లో మెరుగుపడిందని ఆర్బీఐ తెలిపింది. ఈ సంస్థల కన్సాలిడేటెడ్ బ్యాలన్స్ షీటు 2017–18లోనూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు మరింత విస్తరించిందని వెల్లడించింది. 1,000 ఏటీఎంల మూత గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికరంగా వెయ్యి ఏటీఎంలు మూతపడ్డాయి. 2016–17లో 2.08 లక్షల ఏటీఎంలు పనిచేస్తుంటే, 2017–18కి వచ్చే సరికి వీటి సంఖ్య 2.07 లక్షలకు తగ్గింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఏటీఎంల క్రమబద్ధీకరణ వల్లే తగ్గుదల చోటు చేసుకుందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఆన్సైట్ ఏటీఎంలు (బ్యాంకు బ్రాంచీలకు అనుబంధంగా ఉండేవి) 1.09 లక్షల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.06 లక్షలకు తగ్గాయి. అదే సమయంలో ఆఫ్‌సైట్ ఏటీఎంల సంఖ్య 98,545 నుంచి లక్షకు పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు 1.48 లక్షల నుంచి 1.45 లక్షలకు తగ్గాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల ఏటీఎంలు 58,833 నుంచి 60,145కు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య ఏటీఎంలు మరింత తగ్గి 2.04 లక్షలుగా ఉన్నాయి. ఇక పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ ఎక్కువగా పెరిగాయి. వైట్‌లేబుల్ ఏటీఎంలు (బ్యాంకులు కాకుండా ఇతర సంస్థలు ఏర్పాటు చేసేవి) 15,000 మార్క్ ను అధిగమించాయి. 2013–14 నాటికి ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ల లావాదేవీల మొ త్తం రూ.8,100 కోట్లు కాగా, 2017–18కి రూ.1.42 లక్షల కోట్లకు పెరిగింది. -
సమ్మెతో స్తంభించిన బ్యాంకింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులతో పాటు కొన్ని విదేశీ బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే, కొత్త తరం ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెతో బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్సులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ వంటి బ్యాంకింగ్ సేవలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల విలువ చేసే చెక్కుల లావాదేవీలు నిల్చిపోయినట్లు వివరించాయి. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 7,000 శాఖల్లో సర్వీసులు స్తంభించాయని యూఎఫ్‌బీయూ మధ్యప్రదేశ్ యూనిట్ కో–ఆర్డినేటర్ ఎంకే శుక్లా తెలిపారు. తమ డిమాండ్లు న్యాయమైనవేనని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం సమ్మె సందర్భంగా చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి.. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, వేతనాల పెంపు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు గత వారం రోజుల్లో సమ్మెకు దిగడం ఇది రెండోసారి. గత శుక్రవారం (డిసెంబర్ 21న) ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 3.20 లక్షల మంది అధికారులు ఒక్క రోజు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, చాలామటుకు బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగినట్లు సీనియర్ బ్యాంకర్లు తెలిపారు. ‘కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని చెక్ క్లియరింగ్ సెంటర్స్‌లో బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పగించడం జరిగింది. ట్రెజరీ వంటి మిగతా కార్యకలాపాలు కూడా య«థావిధిగానే కొనసాగాయి‘ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీవోబీలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ మూడింటి కలయికతో ఏర్పడే విలీన బ్యాంకు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా ఎస్బీఐ, ఐసీఐసీఐల తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా ఏర్పడనుంది. కానీ దీనివల్ల ఇటు ఆ బ్యాంకులకు గానీ ఖాతాదారులకు గానీ ఒనగూరే ప్రయోజనాలేమీ లేవని బ్యాంకు ఉద్యోగ యూనియన్లు చెబుతున్నాయి. విలీనం వల్ల పలు శాఖలు మూతబడతాయని, కస్టమర్లకు సమస్యలు పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎఫ్‌బీయూ బుధవారం సమ్మె చేపట్టింది. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కేంద్ర ఆర్థిక శాఖ గతవారం విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదముద్ర కూడా వేసింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఏఐబీఈఏ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) తదితర 9 యూనియన్లు యూఎఫ్‌బీయూలో భాగంగా ఉన్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు య«థావిధిగా పనిచేయగా.. ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు మూతబడ్డాయి. సమ్మె నేపథ్యంలో చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ కాగా.. ప్రైవేట్ బ్యాంకుల చెక్ క్లియరెన్సులు కూడా నిల్చిపోయాయి. గురువారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయి. విలీనాల వంటి దుస్సాహసాలకు దిగకుండా బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మొండిబాకీల సంక్షోభానికి గల కారణాలను అన్వేషించడం, పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా వ్యాఖ్యానించారు. కేవలం పెద్ద బ్యాంకులు మాత్రమే పటిష్టంగా, సమర్ధంగా పనిచేస్తాయనడానికి దాఖలాలేమీ లేవని వెంకటాచలం పేర్కొన్నారు. -
బ్యాంకులకు మూలధనం జోష్!!
న్యూఢిల్లీ: మొండిబాకీలు, నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం మరింత మూలధనం సమకూర్చనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న దానికి అదనంగా రూ.41,000 కోట్లు ఇవ్వనుంది. దీంతో పీఎస్బీలకు ఈ ఏడాది మొత్తం మీద రూ.1.06 లక్షల కోట్లు ఇచ్చినట్లవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఈ విషయాలు తెలియజేశారు. వాస్తవానికి 2018–19లో పీఎస్బీలకు రూ. 65,000 కోట్లు అదనపు మూలధనం ఇవ్వాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో ఇప్పటిదాకా రూ. 23,000 కోట్లు సమకూర్చగా మరో రూ.42,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, అదనంగా ఇవ్వబోయే రూ.41,000 కోట్లు కూడా దీనికి కలిపితే కొత్తగా రూ. 83,000 కోట్లు సమకూర్చినట్లవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో ఈ మొత్తాన్ని పీఎస్బీలకు అందించనున్నట్లు జైట్లీ చెప్పారు. పీఎస్‌బీల రుణ వితరణ సామర్థ్యం మెరుగుపడేందుకు, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బయటకు వచ్చేందుకు రీక్యాపిటలైజేషన్ తోడ్పడగలదని పేర్కొన్నారు. రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ద్వారా రూ.41,000 కోట్లు బ్యాంకులకు సమకూర్చే ప్రతిపాదనకు సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కింద పార్లమెంటు ఆమోదం కోరినట్లు జైట్లీ వివరించారు. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికకు ఇది అదనమని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులను గుర్తించే ప్రక్రియ పూర్తయిందని, మొండిబాకీలు క్రమంగా తగ్గుతున్నాయని అరుణ్ జైట్లీ వివరించారు. ‘ఇకపై ఇవ్వబోయే రూ.83,000 కోట్లతో పాటు మొత్తం రూ.1.06 లక్షల కోట్లను నాలుగు వేర్వేరు అంశాలుగా వినియోగించడం జరుగుతుంది. ముందుగా, నియంత్రణ నిబంధనలకు తగ్గ స్థాయిలో బ్యాంకులకు మూలధనం అందేలా చూస్తాం. కాస్త మెరుగుపడిన బ్యాంకులు సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో నుంచి బైటపడేందుకు కావాల్సిన స్థాయిలో అదనంగా నిధులు అందించడం రెండో అంశం. పీసీఏ అంచుల్లో ఉన్న బ్యాంకులు.. ఆ పరిధిలోకి వెళ్లకుండా అవసరమైన మూలధనాన్ని ముందుగానే సమకూర్చడమనేది మూడో అంశం. విలీనమయ్యే బ్యాంకులకు తగినంత స్థాయిలో మూలధనాన్ని అందించడం నాలుగో అంశం’ అని జైట్లీ పేర్కొన్నారు. మూడు బ్యాంకులు సేఫ్.. ప్రస్తుతం మూడు బ్యాంకులు పీసీఏ అంచున ఉన్నాయని, తాజాగా అదనపు మూలధనం లభిస్తే అవి గట్టెక్కుతాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మొత్తం 21 పీఎస్బీల్లో 11 బ్యాంకులు పీసీఏ చర్యలు ఎదుర్కొంటున్నాయి. మొండిబాకీలు పేరుకుపోయి పీసీఏ పరిధిలోకి చేరిన పీఎస్‌బీల కార్యకలాపాలపై ఆంక్షలు వర్తిస్తాయి. అయితే, దేశీయంగా ఇందుకు సంబంధించిన నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆయా బ్యాంకులు పూర్తి స్థాయిలో కఠినతర నియంత్రణ నిబంధనలు అందుకోగలవని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అదనపు మూలధనం అందుకోబోయే బ్యాంకుల్లో.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్‌లకు నిధుల అవసరం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఎస్‌బీలు రూ. 60,726 కోట్ల మొండిబాకీలు వసూలు చేసుకోగలిగాయని, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది రెట్టింపని కుమార్ చెప్పారు. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండేళ్ల వ్యవధిలో పీఎస్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని 2017 అక్టోబర్‌లో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన కింద బడ్జెటరీ కేటాయింపుల ద్వారా రూ. 18,139 కోట్లు, రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రూ. 1.35 లక్షల కోట్లు సమకూరుస్తోంది. ప్రభుత్వ వాటాలను విక్రయించడం ద్వారా బ్యాంకులు మరో రూ. 58,000 కోట్లు మార్కెట్ల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది. బాసెల్ త్రీ నిబంధనలను చేరేందుకు పీఎస్‌బీలు 2019 మార్చి నాటికి రూ. 58,000 కోట్లు మార్కెట్ల నుంచి సమకూర్చుకోగలవని కేంద్రం ముందుగా భావించింది. అయితే మార్కెట్లు అస్తవ్యస్తంగా మారడంతో బ్యాంకులు ఇప్పటిదాకా ఈ మార్గం ద్వారా రూ. 24,400 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగాయి. పైపెచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో బ్యాంకుల మొండిబాకీలు భారీగా ఎగిశాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు ముందుగా నిర్దేశించుకున్న దానికన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మూలధనం సమకూర్చేందుకు ప్రభుత్వమే సిద్ధమైంది. రూ. 85,948.86 కోట్ల అదనపు వ్యయాలకు ఆమోదం కోరుతూ సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2018–19 రెండో విడత ప్రతిపాదనలను కేంద్రం గురువారం పార్లమెంటు ముందుంచింది. ఇందులో సగభాగం పీఎస్బీలకు అదనపు మూలధనం కింద పోనుంది. నగదు రూపంలో వ్యయాలు నికరంగా రూ. 15,065.49 కోట్లు ఉండనున్నాయి. ఎయిరిండియాకు రూ. 2,345 కోట్లు.. ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం మరిన్ని నిధులు అందించనుంది. ఎయిరిండియాకు ఈక్విటీ రూపంలో రూ. 2,345 కోట్లు, ఎయిరిండియా అసెట్ హోల్డింగ్‌కు మరో రూ. 1,300 కోట్లు సమకూర్చనుంది. ప్రస్తుతం ఎయిరిండియా రుణభారం దాదాపు రూ. 55,000 కోట్ల మేర ఉంది. -
నేడు పీఎస్‌యూ బ్యాంక్ ఉద్యోగుల నిరసన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఒక రోజు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు (అక్టోబరు 9న) దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, రాష్ట్ర రాజధానులలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ వెంకటాచలం వెల్లడించారు. గత నెల 29న జరిగిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబరు 12న మళ్లీ ముంబైలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు. -
మోసాలు, ఎగవేతలకు చెక్
న్యూఢిల్లీ: మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. 8 శాతం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగం వృద్ధి చెందడం వల్ల బ్యాంకుల సామర్థ్యం కూడా బలపడుతుందని మంగళవారం ఢిల్లీలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక సమీక్షలో చెప్పారాయన. పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ... ‘‘ఆర్థిక రంగ జీవనాడి అయిన బ్యాంకులు... ఎదిగే ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలకు తీర్చే విధంగా వాటి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. అదే సమయంలో రుణాల విషయంలో తమ వైపు నుంచి లోపాలకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలు చోటు చేసుకుంటే కఠిన చర్య తీసుకోవడం ద్వారా బ్యాంకులపై ఉన్న విశ్వాసానికి న్యాయం చేకూర్చాలి. పరిశుద్ధమైన, వివేకంతో కూడిన రుణాలు జారీ చేసే సంస్థల్లా బ్యాంకులు పనిచేయాలి’’ అని సూచించారు. ఇటీవలే ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఖరారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించగా, ఇదే సమయంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. మొండి బకాయిల(ఎన్పీఏల) రికవరీకి ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ చర్యల్ని ముమ్మరం చేశాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలంలో (జూన్ క్వార్టర్) రూ.36,551 కోట్లను వసూలు చేశాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోలిస్తే 49% అధికంగా వసూలు చేసుకున్నాయి. దీనిపై జైట్లీ మాట్లాడుతూ... ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి మరింత సానుకూలంగా ఉందన్నారు. ఎన్పీఏల పరిష్కారం, వసూళ్లు, వీటికి నిధుల కేటాయింపులు, రుణ వృద్ధి అంశాల్లో సానుకూల ఫలితాలను చూపిస్తున్నాయని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రాధాన్యాన్ని జైట్లీ గుర్తు చేశారు. అదే సమయంలో నాన్ రిటైల్ బ్యాంకింగ్ సేవల విషయంలో ఇతర రుణదాతల నుంచి మద్దతు సరిపడా లేదని పేర్కొన్నారు. స్థిరంగా 8 శాతం వృద్ధి ‘‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ), జీఎస్టీ, డీమోనిటైజేషన్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆర్థిక రంగాన్ని వ్యవస్థీకృతం చేశాం. దీనివల్ల ఆర్థిక సామర్థ్యం, సవాళ్లను మరింతగా అంచనా వేయటం సాధ్యమైంది. సమ్మిళిత వృద్ధి, కొనుగోలు సామర్థ్యం వంటివి భారత ఆర్థిక వృద్ధిని నడిపించనున్నాయి’’ అని జైట్లీ వివరించారు. భారత్ 8% స్థిరమైన వృద్ధి రేటు సాధించేందుకు ఇవి తోడ్పడతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 8.2%గా అంచనా వేసింది. ఐబీసీ యంత్రాంగం నుంచి వస్తున్న సానుకూల ఫలితాలను ప్రస్తావించిన జైట్లీ... డీఆర్టీ ద్వారా వసూళ్లను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘ఐఎల్ఎఫ్ఎస్’... చూస్తూనే ఉన్నాం: జైట్లీ ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు చెల్లింపుల్లో విఫలం కావడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందన్న ఆందోళనలు నెలకొనడంతో... ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని తెలియజేశారు. వివిధ రంగాలకు అవసరమైన మేర నిధులను అందుబాటులో ఉంచే విషయమై బ్యాంకులు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయని ప్రభుత్వరంగ బ్యాంకుల సమీక్ష అనంతరం జైట్లీ చెప్పారు. ‘‘ఐఎల్ఎఫ్ఎస్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ విషయంలో ఎల్ఐసీ చైర్మన్ చెప్పిన దానికి అదనంగా నేను చెప్పేదేమీ లేదు’’ అని జైట్లీ స్పష్టం చేశారు. ఓ వాటాదారుగా ఐఎల్ఎఫ్ఎస్ను మునిగిపోకుండా చూస్తామని ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ పేర్కొన్న విషయం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ సీఆర్ఆర్ తగ్గించాలి న్యూఢిల్లీ: వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్.. ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) కూడా తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ‘లిక్విడిటీ నిర్వహణకు రిజర్వ్ బ్యాంక్ ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్) వంటి సాధనాలుంటాయి. అలాగే, సీఆర్ఆర్ను తగ్గించడం ద్వారా కూడా మార్కెట్లో తక్షణం తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చు‘ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం నిధులను కట్టడి చేయడం కాకుండా ద్రవ్య లభ్యత మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు తమ డిపాజిట్లలో కచ్చితంగా కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాలి. సీఆర్ఆర్గా వ్యవహరించే ఈ నిష్పత్తి ప్రస్తుతం 4 శాతంగా ఉంది. 2013 సెప్టెంబర్ నుంచి దీన్ని మార్చలేదు. -
సీఈఓలపై క్రిమినల్ చర్యలు!
న్యూఢిల్లీ: మొండి బకాయిల విషయమై ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈఓలకు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. రూ.50 కోట్లకు మించిన మొండి పద్దులను బ్యాంక్ సీఈఓలు గుర్తించాలని, అలా చేయని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించినట్లు తెలియవచ్చింది. రూ.2,000 కోట్ల మేర బ్యాంక్ రుణాలను స్వాహా చేసినందుకు భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం పన్నెండుకు పైగా కంపెనీలపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 120బి ప్రకారం చర్యలు.... పరిశోధన సంస్థల దర్యాప్తులో బ్యాంక్ రుణాలకు సంబంధించిన మోసాలు వెలుగులోకి వస్తే... సదరు బ్యాంక్ సీఈఓలపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్ 120బి ప్రకారం చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సలహాను బ్యాంక్ సీఈఓలు అదనపు ముందు జాగ్రత్తగా పరిగణించాలని, న్యాయ వివాదాల్లోకి మునిగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ వర్గాలు తెలిపాయి. మొండి బకాయిల విషయమై అలక్ష్యం వహిస్తే, బ్యాంక్ సీఈఓలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం నిజమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. భూషణ్ స్టీల్, మరో రియల్టీ కంపెనీ విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. మొండి బకాయిల విషయమై సీఈఓలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే, రుణగ్రస్తుల గత ఐదేళ్ల లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే, బ్యాంక్‌లు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించాలని పేర్కొన్నారు. తనిఖీల్లో వెల్లడవుతున్న అవకతవకలు... భూషణ్ స్టీల్ ప్రమోటర్ చేసినట్లే పలు కంపెనీల ప్రమోటర్లు కూడా బ్యాంక్ రుణాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని మరో ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ అవకతవకల కోసం సదరు ప్రమోటర్లు తమ కంపెనీల అనుబంధ కంపెనీలను వినియోగించుకున్నారనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న కంపెనీల ఖాతా పుస్తకాలను ఎస్ఎఫ్ఐఓ తనిఖీ చేస్తోందని వివరించారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా దివాలా కంపెనీలపై విస్తృతమైన ఆడిటింగ్ జరుగుతోందని, ఈ తనిఖీల్లో పలు ఆర్థిక పరమైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐఓకు మరిన్ని అధికారాలు... భారత బ్యాంక్‌లు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. మొత్తం మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు పెరిగాయని అంచనా. వీటికి తోడు పలు బ్యాంక్ రుణాలకు సంబంధించి మోసాలు, కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది జూన్‌లో ఆర్బీఐ 12 ఒత్తిడి ఖాతాలను గుర్తించింది. ఒక్కో ఖాతాలో రూ.5,000 కోట్లకు మించిన రుణాలున్నాయి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్టసీ కోడ్(ఐబీసీ) కింద తక్షణం చర్యలు చేపట్టిన మొత్తం బ్యాంక్‌ల మొండి బకాయిల్లో ఈ మొత్తం 12 ఖాతాల రుణాలు... నాలుగోవంతు వరకూ ఉంటాయని అంచనా. ఇక అదే ఏడాది డిసెంబర్లో మొండి బకాయిలకు సంబంధించి 28 కంపెనీలతో కూడిన మరో జాబితాను ఆర్బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. కంపెనీల చట్టం కింద మోసాలకు, వైట్ కాల ర్ నేరాలకు పాల్పడిన వారిని విచారించే ఎస్‌ఎఫ్‌ఐఓకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో మరిన్ని అధికారాలు ఇచ్చింది. కంపెనీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసే అధికారాన్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు కేంద్రం ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ ఐబీసీ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 655 కేసుల్లో నిర్ణయం తీసుకుంది. -
బ్యాంకులకు రూ.16,600 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) నష్టాలు జూన్ త్రైమాసికంలో ఊహించని స్థాయికి చేరాయి. 21 ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తం మీద ఏప్రిల్–జూన్ కాలంలో రూ.16,600 కోట్ల నష్టాలను ప్రకటించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.307 కోట్ల నష్టాలతో పోలిస్తే 50 రెట్లు పెరిగిపోవడం ఎన్పీఏల పరంగా బ్యాంకులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది. వీటి కోసం చేసిన అధిక నిధుల కేటాయింపుల వల్లే పీఎస్‌బీల నష్టాలు అంతలా పెరిగిపోవడానికి కారణం. అయితే, కొంచెం ఊరట కలిగించే అంశం ఏమిటంటే తాజా ఎన్పీఏలు తగ్గుముఖం పట్టడం. అతిపెద్ద మొండి రుణ ఖాతాలను బ్యాంకులు ఐబీసీ చట్టం కింద దివాలా చర్యలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాండ్ల ధరలు పెరగడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ట్రేడింగ్ నష్టాలు అధికం అయ్యాయి. ‘‘ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరువలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికి ఎన్పీఏలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నాం. ఆర్బీఐ కాల పరిమితి నిర్దేశించింది. ఎన్సీఎల్టీకి నివేదించిన ఎన్పీఏల ఖాతాలు 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం కావాలి. ఒకవేళ ఆలస్యం అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పరిష్కారానికి రావాల్సి ఉంటుంది’’ అని ఇక్రా ఆర్థిక సేవల రంగ రేటింగ్స్ విభాగం హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ తెలిపారు. మూడేళ్లుగా పెరిగిన సమస్యలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత మూడు సంవత్సరాల నుంచి రుణ ఎగువేతల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఐడీబీఐ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల మొత్తం రుణాల్లో 20%కి పైగా ఎన్పీఏలు కావడం గమనార్హం. చాలా పీఎస్‌బీలు ప్రభుత్వ మూలధన నిధుల సాయంతోనే మనుగడ సాగిస్తున్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు. ఈ నిధుల సాయం లేకపోతే అవి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘంచిన పరిస్థితిని ఎదుర్కొనేవి. ఈ పరిస్థితులను గమనించే 11 బ్యాంకులను ఆర్బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి చేర్చింది. పీసీఏ విధానంలో బ్యాంకులు తాజా రుణాల జారీకి అవకాశం ఉండదు. పీసీఏ పరిధిలో ఉన్న బ్యాంకులు నిర్వహణ పనితీరు పరంగా... ముఖ్యంగా ఆస్తుల నాణ్యత పరంగా మెరుగుదలను చూపించలేదని ఎస్ఎంసీ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్‌కు చెందిన బ్యాంకింగ్ విశ్లేషకుడు సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. ఇక జూన్ త్రైమాసికంలో పీఎస్‌బీల స్థూల ఎన్పీఏలు (మొత్తం ఎన్పీఏలు) రూ.7.1 లక్షల కోట్ల నుంచి రూ.8.5 లక్షల కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 18% పెరిగినట్టు. ఇక ఎన్పీఏ నష్టాల కోసం బ్యాంకులు జూన్ త్రైమాసికంలో కేటాయించిన నిధులు రూ.51,500 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న కేటాయింపుల కంటే 28% అధికం. 2017–18లో పీఎస్‌బీలు తమ చరిత్రలోనే అత్యధికంగా రూ.62,700 కోట్ల నష్టాలను చవిచూశాయి. 21 బ్యాంకులకు గాను 19 నష్టాల్లోకి వెళ్లగా, విజయా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు మాత్రమే స్వల్ప లాభాలను చూపించగలిగాయి. గడ్డు కాలం ముగిసినట్టే: రాజీవ్‌కుమార్ ప్రభుత్వరంగ బ్యాంకులకు గడ్డుకాలం ముగిసినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) నుంచి పీఎస్‌బీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే బయటకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 21 పీఎస్బీల్లో 11 పీసీఏ పరిధిలో ఉన్న విషయం గమనార్హం. వీటిలో దేనా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు వ్యాపార కార్యకలాపాల విస్తరణపై ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఐబీసీ అమలు సహా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు మొండి బకాయిలకు కళ్లెం వేయడంతోపాటు, వాటి రికవరీ దిశగా మంచి ఫలితాలను ఇస్తున్నాయని రాజీవ్‌కుమార్ చెప్పారు. ఎన్పీఏలు తగ్గుతుండగా, రుణాల వృద్ధి పెరుగుదల మొదలైనట్టు చెప్పారు. -
పీఎస్‌బీల రికవరీ రూట్
ముంబై: మొండి బాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) క్రమంగా రికవరీ బాట పడుతున్నాయి. బాకీలు రాబట్టుకునేందుకు అవి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయా బ్యాంకులు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు నీరవ్ మోదీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో స్థూలంగా రూ. 7,700 కోట్ల బాకీలను రికవర్ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాబట్టిన రూ. 4,443 కోట్ల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్–సె ప్టెంబర్ మధ్య కాలంలో కనీసం రూ. 20,000 కోట్లు రికవర్ చేసుకోవాలని పీఎన్బీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో మరో రూ. 11,500 కోట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద ఏడు కేసులు తుది దశలో ఉన్నాయని, వీటి నుంచి పెద్ద మొత్తమే రికవర్ కాగలదని పీఎన్బీ వర్గాలు వెల్లడించాయి. అలాగే మరో ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ. 3,537 కోట్లు రాబట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కెనరా బ్యాంక్ రూ. 6,458 కోట్లు రికవర్ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రికవర్ అయిన మొత్తంలో చాలా భాగం రెండు పెద్ద ఖాతాల పరిష్కారం ద్వారా వచ్చినదేనని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషకులు తెలిపారు. ఎన్సీఎల్టీ దగ్గరున్న మరిన్ని కేసులు పరిష్కారమవుతున్న కొద్దీ రికవరీ మరింతగా పెరుగుతుంది కాబట్టి.. త్వరలోనే బ్యాంకుల రుణ నాణ్యత మరింత మెరుగుపడగలదని వివరించారు. రికవరీకి స్పెషల్ టీమ్‌లు .. భారీ మొండి బాకీలను (ఎన్పీఏ) రాబట్టేందుకు పీఎస్‌బీలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేకంగా రికవరీ బృందాలు, ప్రధాన కార్యాలయ స్థాయి నుంచి ఫాలో అప్ చేయడం, బడా సంస్థలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందుకు తీసుకెళ్లడం మొదలైనవి ఇందులో ఉంటున్నాయి. విజయా బ్యాంక్ లాంటివి ప్రత్యేక రికవరీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి .. వాయిదాలు డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలను ఫాలో అప్ చేస్తోంది. ఈ రకంగా ప్రస్తుత క్యూ1లో సుమారు రూ.410 కోట్లు రాబట్టింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది సుమారు రెట్టింపు కావడం గమనార్హం. మొండి బాకీలు తక్కువ స్థాయిలో ఉన్న అతి కొద్ది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయా బ్యాంక్ కూడా ఒకటి. కాల్ సెంటర్ల ఏర్పాటు.. మరికొన్ని బ్యాంకులు మరో అడుగు ముందుకేసి.. ప్రత్యేకంగా కాల్ సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ. 1 కోటి పైబడిన ఎన్పీఏ ఖాతాలను ఫాలో అప్ చేయడం కోసం ఇలాంటి కాల్ సెంటరే ఏర్పాటు చేసింది. అంతే కాకుండా మిషన్ గాంధీగిరీ పేరుతో ప్రత్యేక రికవరీ కార్యక్రమాలు కూడా చేపట్టడం గమనార్హం. బాకీ పడిన రుణగ్రహీతల ఇళ్లు, కార్యాలయాల దగ్గర రికవరీ టీమ్ సిబ్బంది శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 3,000 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. మొండిబాకీల విషయంలో కొంగొత్త వ్యూహాలను అమలు చేస్తుండటంతో క్యూ1లో మొత్తం రూ. 200 కోట్లు రాబట్టుకోగలిగామని సిండికేట్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. -
బ్యాంకు చార్జీల బాదుడు!!
న్యూఢిల్లీ: వివిధ చార్జీల రూపంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) గడిచిన నాలుగేళ్లలో ఖాతాదారుల నుంచి ఏకంగా రూ. 3,324 కోట్లు వసూలు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. బ్యాంకులు అందించే వివిధ సేవలకు నిర్దిష్ట చార్జీలు వసూలు చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉందని, ఈ చార్జీలు సహేతుకమైన స్థాయిలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి జన ధన యోజన సహా పలు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని మంత్రి తెలిపారు. 2017 డిసెంబర్ ఆఖరు నాటికి 30.84 కోట్ల జన ధన అకౌంట్లు సహా మొత్తం.. 53.3 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు ఉన్నాయని వివరించారు. మినిమం బ్యాలెన్స్ లేకపోయినా వీటిపై ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొన్నారు. -
ఆర్బీఐ సమస్యలపై చర్చించేందుకు సిద్ధం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించడంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) సమర్థంగా నియంత్రించేందుకు తమకు పూర్తి అధికారాల్లేవంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 13,500 కోట్ల కుంభకోణం బైటపడటం, పీఎస్‌బీల పర్యవేక్షణలో ఆర్బీఐ విఫలమైందన్న ఆరోపణలు రావడం సంగతి తెలిసిందే. మరోవైపు, 20 పీఎస్బీల్లో కేంద్రానికి ఉన్న మెజారిటీ వాటాలను తగ్గించేసుకోవాలన్న ప్రతిపాదనేదీ లేదని గోయల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం సమకూర్చడం ద్వారా వాటికి తగు తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రమాణాలను, నైతికతను పాటించడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. పీఎస్బీల్లో గతంలో రాజకీయ జోక్యం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితుల్లేవని గోయల్ చెప్పారు. -
ఇచ్చిన నిధులన్నీ నష్టాలతో సరి!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ప్రకటించిన భారీ నష్టాల కారణంగా... కేంద్రం సమకూర్చిన రూ.85 వేల కోట్ల అదనపు మూలధనం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. బలహీనంగా ఉన్న పీఎస్‌బీల పరిస్థితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశాలు కనిపించటం లేదని కూడా స్పష్టంచేసింది. భారీ నష్టాల కారణంగా వాటి లాభదాయకతపై, రేటింగ్స్‌పై కూడా ఒత్తిడి తప్పదని హెచ్చరించింది. ‘‘మొండిబాకీలను సత్వరం గుర్తించేలా... నికర నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) వర్గీకరణలో చేసిన మార్పుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత పేలవమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి వచ్చింది. అయితే, దీర్ఘకాలంలో బ్యాంకింగ్ రంగ పరిస్థితి మెరుగుపడేందుకు ఈ ప్రక్షాళన తోడ్పడుతుంది. ఎన్పీఏల వర్గీకరణ వల్ల మొత్తం బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు ఊహించిన దానికన్నా మరింత అధికంగా పెరిగి 9.3% నుంచి 12.1%నికి చేరాయి. పీఎస్‌బీల సగటు ఎన్పీఏలు 14.5 శాతానికి ఎగిశాయి.’’అని పేర్కొంది. ప్రభుత్వం మరిన్ని నిధులిస్తే తప్ప...: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకుల్లో... దిగ్గజం ఎస్బీఐసహా 19 బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించాయి. పీఎన్‌బీసహా ఆరు పీఎస్‌బీల మూలధనం... కనిష్ట స్థాయికన్నా దిగువకి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ఇవి నిర్దేశిత 8 శాతం స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఫిచ్ పేర్కొంది. 2018–19లో ప్రభుత్వం ఇస్తామన్న రూ.72 వేల కోట్ల అదనపు మూలధనం సాయంతో నియంత్రణ సంస్థల చర్యల నుంచి బ్యాంకులు తప్పించుకున్నా... అవి స్థిరపడటానికి, వృద్ధి సాధించడానికి, నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు సాగించడానికి కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఫిచ్ వివరించింది. -
బ్యాంకింగ్ స్కాంలతో భారీ నష్టం, కోట్లకు కోట్లు ఆవిరి
ఇండోర్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్ కుంభకోణాలతో దేశంలో ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.25,775 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంకేనని తెలిసింది. ఈ ఏడాది ముగింపు వరకు వివిధ రకాల కుంభకోణాలతో పీఎన్బీకి అత్యధిక మొత్తంలో రూ.6461.13 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్టీఐ డేటాలో తేలింది. చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బ్యాంకింగ్ కుంభకోణాల్లో అతిపెద్దది డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలది. వీరు పీఎన్బీ అధికారులతో కుమ్మకై, బ్యాంకులో దాదాపు రూ.12,636 కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకింగ్ కుంభకోణాల వల్ల రూ.2390.75 కోట్ల నష్టం వచ్చినట్టు ఆర్ఐటీ సమాధానంలో తెలిసింది. ఇదే కాలంలో బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.2,224.86 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడాకు రూ.1,928.25 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1520.37 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,303.30 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.1,224.64 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.1,116.53 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,095.84 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,084.50 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు రూ.1,029.23 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.1,015.79 కోట్ల నష్టం వచ్చినట్టు వెల్లడైంది. కుంభకోణాలతో ప్రస్తుతం బ్యాంకులు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఎకనామిస్ట్ జయంతిలాల్ భండారి అన్నారు. దీని వల్ల ప్రస్తుతం బ్యాంకులు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా... భవిష్యత్తులో కొత్త రుణాలు అందివ్వడంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని హెచ్చరించారు. -
ప్రభుత్వ బ్యాంకులు.. కుదేలు!
ముంబై: మొండిబాకీలు, స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా ఫలితాలు ప్రకటించిన పది బ్యాంకుల్లో రెండింటిని మినహాయిస్తే.. మిగతావాటన్నింటి పరిస్థితీ ఇదే. మొత్తం ఎనిమిది నష్టాలు ఏకంగా రూ. 39,803 కోట్ల మేర ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిధుల కొరత నుంచి గట్టెక్కించడానికి కేంద్రం గత ఆర్థిక సంవత్సరం ఆఖర్లో అందించిన రూ. 80 వేల కోట్ల అదనపు మూలధనంలో ఇది సగానికి సమానం కావడం గమనార్హం. ఈ గణాంకాలు కేవలం ఎనిమిది బ్యాంకులవి మాత్రమే... ఇంకా పలు బ్యాంకులు ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 12,282 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 5,871 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. విజయ బ్యాంక్ (రూ. 727 కోట్లు), ఇండియన్ బ్యాంక్ (రూ. 1,258 కోట్లు) మాత్రమే వార్షిక లాభాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం కనీసం రూ. లక్ష కోట్లయినా సమకూర్చాల్సి రావొచ్చనేది విశ్లేషకుల అంచనా. బ్యాంకులకు పీసీఏ చిక్కులు .. ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఇంకా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ బ్యాంకులు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులు.. మొండిబాకీల ప్రొవిజనింగ్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలతో మరిన్ని నష్టాలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. దీంతో కేంద్రం సమకూర్చిన అదనపు మూలధనంలో ఏకంగా 75–85 శాతం వాటా హరించుకుపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం 11 పీఎస్‌యూ బ్యాంకులు పీసీఏ కింద ఉన్నాయి. వరుసగా రెండేళ్ల పాటు నష్టాలు ప్రకటించి, మొత్తం మొండిబాకీలు పది శాతం దాటేసిన పక్షంలో రిజర్వ్ బ్యాంక్ పీసీఏ అమలు చేయాలని ఆదేశిస్తుంది. పీసీఏ విధించిన పక్షంలో ఆయా బ్యాంకులు కొత్తగా మరిన్ని శాఖలు తెరవడంపైనా, సిబ్బందిని తీసుకోవడంపైనా, రిస్కు ఎక్కువగా ఉండే రుణగ్రహీతలకు రుణాలివ్వడంపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ద్వితీయార్థంలో మెరుగ్గా పరిస్థితులు.. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు మరో రెండు త్రైమాసికాలకు మాత్రమే పరిమితం కావొచ్చని, ఆ తర్వాత నుంచి పనితీరు మెరుగుపడొచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. బినాని సిమెంట్, ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్ మొదలైన వాటి దివాలా ప్రక్రియలు మొదటి లేదా రెండో త్రైమాసికాల్లో పూర్తయిపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి నుంచి రావాల్సినది ఎంతో కొంత వచ్చినా... ఆదాయాలు మెరుగుపడటానికి ఉపయోగపడొచ్చని వారంటున్నారు. బ్యాంకులపై నేడు కేంద్రం సమీక్ష న్యూఢిల్లీ: మొండిబాకీల ప్రక్షాళన తదితర అంశాలకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు(పీసీఏ) అమలవుతున్న 11 ప్రభుత్వ బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ గురువారం సమీక్ష నిర్వహించనుంది. వాచ్ లిస్ట్ నుంచి బయటపడేందుకు ఆయా బ్యాంకుల చర్యలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులపై పలు నియంత్రణలుంటాయి. శాఖల విస్తరణ, రుణాల మంజూరు, సిబ్బంది నియామకాలు మొదలైన విషయాల్లో ఆంక్షలు వర్తిస్తాయి. ప్రస్తుతం కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఏడాది కనిష్టానికి 9 బ్యాంక్ షేర్లు.. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించడం, తాజా రుణాలు జారీ చేయకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో 9 ప్రభుత్వ బ్యాంక్ షేర్లు బుధవారం తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఈ షేర్లన్నీ చివరకు 2–12 శాతం నష్టాలతో ముగిశాయి. అలహాబాద్ బ్యాంక్(రూ.38.80 ముగింపు ధర), ఓబీసీ (రూ.78.85), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (రూ32.10), పీఎన్బీ (రూ.75.55), దేనా బ్యాంక్ (రూ.16.25), బ్యాంక్ ఆఫ్ మహారాష ్ట్ర(రూ.13.12), కార్పొరేషన్ బ్యాంక్ (రూ.26), సిండికేట్ బ్యాంక్ (రూ.43.85), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు (రూ.11.02) ఈ జాబితాలో ఉన్నాయి. -
ఓపెన్ ఆఫర్ నుంచి కేంద్రానికి మినహాయింపు
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వరంగ బ్యాంకులకు తాజా అదనపు మూలధన సాయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెబీ మినహాయింపు ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, విజయాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నిధుల సాయంతో వీటిల్లో కేంద్రం వాటా పెరగనుంది. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత మేర వాటా పెంచుకుంటే ప్రస్తుత వాటాదారులకు కేంద్రం ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తాజా నిధుల సాయం తర్వాత కూడా ఆయా బ్యాంకుల నియంత్రణలో ఎటువంటి మార్పు ఉండనందున ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం అందిస్తున్న సాయం ఆయా బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలు (మూలధన అవసరాలు) చేరుకునేందుకు వీలు కల్పిస్తుందని, తర్వాత ఈక్విటీ క్యాపిటల్‌ను మరింత పెంచుకునేందుకు అవసరమైన అదనపు పరపతి లభిస్తుందని సెబీ పేర్కొంది. తాజా మూలధన సాయంతో పీఎన్బీలో ప్రభుత్వం వాటా 5.21 శాతం, కెనరా బ్యాంకులో 6.25 శాతం, సిండికేట్ బ్యాంకులో 9.73% మేర పెరగనుంది. అలాగే, విజయా బ్యాంకులో 5.48%, బ్యాంకు ఆఫ్ బరోడాలో 5.33%, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 11.91% మేర కేంద్రం వాటా పెరుగుతుంది. -
ప్రభుత్వరంగ బ్యాంకులపై నియంత్రణ పరిమితమే
గాంధినగర్ (గుజరాత్): ప్రభుత్వరంగ బ్యాంకులపై ఆర్బీఐకి అధికారాలు పరిమితమని కేంద్ర బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. ప్రైవేటు బ్యాంకుల మాదిరే ప్రభుత్వరంగ బ్యాంకులపైనా పోలీసు మాదిరిగా వ్యవహరించే అధికారాలను ఇవ్వాలని కోరారు. ఇందుకు సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ‘‘ఈ రోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. బ్యాంకుల్లో మోసాలు, అవకతవకలపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఎంతో కోపంతో, బాధతో ఉంది. వ్యాపార సమూహంలో కొందరు రుణదాతలతో కుమ్మక్కు అయి చేసే ఈ విధమైన చర్యలు మన దేశ భవిష్యత్తును దోచుకోవడమే’’ అని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,000 కోట్ల రూపాయిల నీరవ్‌మోదీ స్కామ్ బయటపడిన తర్వాత ఈ అంశంపై ఉర్జిత్ పటేల్ తొలిసారిగా గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. పీఎన్బీ స్కామ్‌పై స్పందిస్తూ... బ్యాంకుల్లో మోసాల నివారణకు గాను ఆర్బీఐ 2016 నుంచి మూడుసార్లు సర్క్యులర్లు జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికీ పీఎన్బీలో అక్రమాలను నివారించడంలో అంతర్గత వ్యవస్థ వైఫల్యం చెందిందని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో మొండి బకాయి (ఎన్పీఏ)లపైనా తక్షణమే ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ‘‘బ్యాంకు బ్యాలన్స్ షీట్ల లో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల ఎన్పీఏల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రమోటర్–బ్యాంకుల మధ్య ఉన్న రుణ బంధంలోనే వీటి మూలాలు ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టాలి’’ అన్నారు. నిబంధనల మేరకు వసూలు కాని రుణాలను ఎన్పీఏలుగా గుర్తించకపోవడంపై చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని మోసాలను ముందే నివారించలేం: ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో ఎన్నో పరిమితులు ఉన్నాయని ఉర్జిత్ పటేల్ చెప్పారు. ‘‘డైరెక్టర్లను తొలగించలేం. యాజమాన్యాన్ని మార్చలేం. విలీనం లేదా దివాలా చర్యలు చేపట్టలేం. దేశంలో అన్ని బ్యాంకులు ఆర్బీఐ నియంత్రణలో ఉన్నా యి. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకులను అధిక వాటా కలిగిన ప్రభుత్వం కూడా నియంత్రిస్తోంది. దీంతో బహుళ నియంత్రణ వ్యవస్థకు దారితీస్తోం ది’’ అంటూ ఉర్జిత్ పటేల్ ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో తమ కాళ్లకు బంధనాలున్నాయని స్పష్టం చేశారు. మోసాలు బయటపడిన తర్వాత ఆర్బీఐ వీటిని పట్టుకుని ఉండాల్సిందనే తరహా ప్రకటనలు వస్తుంటాయన్న ఆయన, ఏ బ్యాంకింగ్ రెగ్యులేటర్ కూడా అన్ని మోసాలనూ ముందుగానే నివారించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. విషాన్ని మింగి అమృతాన్ని సాధిస్తాం... నీలకంఠుడిలా కేంద్ర బ్యాంకు విషాన్ని మింగి, విమర్శలు ఎదుర్కొని అయినా వ్యవస్థను మరింత మెరుగ్గా మార్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తుందని ఉర్జిత్ పటేల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్బీఐ ప్రయత్నాలను పురాణ కథనాలకు అన్వయించి ఆసక్తికరంగా చెప్పారు ‘‘మందర పర్వతంతో సముద్ర మథనం చేసినట్టుగా ఆర్బీఐ దేశ రుణ సంస్కృతిని పరిశుభ్రపరిచే ప్రయత్నాన్ని చేపట్టింది. ఈ మథనం పూర్తయ్యే వరకు, దేశ భవిష్యత్తు స్థిరంగా, సురక్షితంగా ఉండే అమృతం మాదిరి ఫలితం వెలుగుచూసే వరకు బయటకు వచ్చే విషాన్ని ఎవరో ఒకరు మింగాల్సిందే’’ అని ఉర్జిత్ పటేల్ వివరించారు. -
రుణాలకు పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి
ముంబై : నీరవ్ మోదీ లాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారి నుంచి పాస్‌పోర్ట్ వివరాలు కచ్చితంగా స్వీకరించాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది. భారీ మొత్తంలో రుణం తీసుకుని, వాటిని ఎగొట్టి దేశం విడిచి పారిపోయేందుకు వీలు లేకుండా.. నిరోధించేందుకు పాస్‌పోర్టు వివరాలను సేకరిస్తున్నట్టు టాప్ అధికారి ఒకరు చెప్పారు. పాస్‌పోర్ట్ వివరాలతో సరియైన సమయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, దేశం విడిచి పారిపోకుండా సంబంధిత అథారిటీలకు వారి గురించి వెంటనే సమాచారం అందించడం కుదురుతుందని పేర్కొన్నారు. '' స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌ను అందించడమే తర్వాతి చర్య. రూ.50 కోట్లకు పైబడి రుణం తీసుకునే వారి పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరిగా సేకరించాలి. మోసం జరిగిన సమయంలో వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది'' అని ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్‌పోర్ట్ వివరాలను బ్యాంకులు 45 రోజుల్లోగా సేకరించాలని కూడా ఆదేశాలు జారీచేశారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి, విజయ్ మాల్యా, జతిన్ మెహతా వంటి పలువురు డిఫాల్టర్లు, బ్యాంకులను భారీ మొత్తంలో మోసం చేసి, దర్యాప్తు ఏజెన్సీలకు చిక్కకుండా విదేశాలకు పారిపోయారు. పీఎన్బీలో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల విచారణకు కూడా సహకరించడం లేదు. ఈ క్రమంలో రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్‌పోర్ట్ వివరాలను బ్యాంకులు సేకరించాలని ఆర్థికమంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. -
గతేడాది రూ.81,683 కోట్ల రైటాఫ్!
న్యూఢిల్లీ: అంతకంతకూ కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) భారీ మొత్తంలోనే రుణాలను మాఫీ చేస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పీఎస్‌బీలు రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్స్ షీట్ రైటాఫ్ కింద చూపిస్తాయని... సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టంచేశారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.20,339 కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు ఆయన తెలియజేశారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో (2017–18) సెప్టెంబర్ వరకూ పీఎస్‌బీలు రూ.28,781 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్లకు పైబడిన మొండి బకాయిలను (పూర్తిస్థాయిలో ప్రొవిజనింగ్ చేసిన వాటితో సహా) బ్యాంకులు వాటి బ్యాలెన్స్ షీట్ల నుంచి తొలగిస్తాయి. దీన్నే సాంకేతికంగా రైటాఫ్ కింద పరిగణిస్తారు. అయితే, చట్టపరంగా ఈ బకాయిల వసూలు ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని, అందువల్ల రైటాఫ్‌తో రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూర్చినట్లు భావించకూడదని జైట్లీ వివరించారు. బ్యాంకింగ్ మోసాలు ః రూ.52,717 కోట్లు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2013 ఏప్రిల్ 1 నుంచి) బ్యాంకింగ్ రంగ మోసాలకు సంబంధించి 13,643 కేసులు వెలుగుచూశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా పార్లమెంటులో చెప్పారు. ఈ మోసాల విలువ రూ.57,717 కోట్లుగా ఆయన తెలిపారు. ఇక బినామీ చట్టం–2018 కింద ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఆస్తులను ప్రాథమికంగా జప్తు (అటాచ్) చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీటి విలువ రూ.3,800 కోట్లకు పైగానే ఉంటుందని శుక్లా వివరించారు. -
రూ.2,450 కోట్లు లూఠీ : బ్యాంకు స్టాఫర్లే..
బెంగళూరు : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఎన్బీ స్కాం మాదిరిగానే బ్యాంకుల్లో మోసాలు భారీగానే జరుగుతున్నాయని వెల్లడైంది. ఈ మోసాల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయమే ఎక్కువగానే ఉంటుందని తెలిసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా డేటాలో ఈ విషయం తెల్లతేటమైంది. 2013 ఏప్రిల్ నుంచి 2016 జూన్ వరకున్న డేటాలో బ్యాంకుల్లో రూ.2,450 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఇవి ఎక్కువగా ఉద్యోగుల సహకారంతోనే జరిగినట్టు తెలిసింది. వీటిల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 49 శాతం కేసులు నమోదయ్యాయని, కానీ మొత్తం రూ.462 కోట్ల నగదునే కోల్పోయినట్టు ఆర్బీఐ డేటా పేర్కొంది. అయితే మొత్తం కేసుల్లో చాలా తక్కువగా 3 శాతం మాత్రమే నమోదైన రాజస్తాన్‌లో, భారీగా రూ.1,096 కోట్ల నగదును బ్యాంకులు పోగొట్టుకున్నట్టు తెలిపింది. బ్యాంకు ఉద్యోగుల ప్రమేయముండే ఇలాంటి మోసపూరిత కేసులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, అదేవిధంగా రాజస్తాన్, ఛండీగర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా బాగానే నగదు లూటీ అవుతుందని తెలిసింది. లక్ష, ఆపై మొత్తాల మోసాల కేసుల్లో బయట వ్యక్తులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సాయంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆర్బీఐ డేటా పేర్కొంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవడానికి కారణం, ఆ రాష్ట్రాల్లో బ్యాంకు బ్రాంచులు అధికంగా ఉన్నాయని ఓ బ్యాంకు మేనేజర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా బ్యాంకు బ్రాంచులున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ప్రమేయముండే ఈ మోసాలను అసలు ఉపేక్షించేది లేదని కూడా తేల్చి చెప్పారు. బ్యాంకు మోసాలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో 170 కేసులతో తమిళనాడు తొలి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 157 కేసులతో రెండో స్థానంలో ఉంది. అనంతరం కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్తాన్, ఛండీగర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. -
18వేల మంది బ్యాంకు ఉద్యోగులు బదిలీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగుల బదిలీకి తెరలేసింది. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 18వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయ్యారు. సోమవారమే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ బదిలీ విషయంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఓ ప్రకటన జారీచేసింది. 2017 డిసెంబర్ 31 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ ఎవరైతే 2017 డిసెంబర్ 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటారో వారిని కూడా బదిలీ చేయాలని తెలిపింది. వెంటనే ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు దాదాపు 18 వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయినట్టు తెలిసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల మేరకు, ప్రతి మూడేళ్లకు ప్రతి అధికారిని బదిలీ చేస్తుంటామని ఓ బ్యాంకు చెప్పింది. మూడేళ్ల కంటే ఎక్కువగా ఒకే పోస్టులో ఆఫీసర్ ఉంచమని పేర్కొంది. క్లరికల్ స్టాఫ్ విషయంలోనూ ఇదే అమలు చేస్తామని తెలిపింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీకి, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్ అధికారి మెహుల్ చౌక్సికి ఐదేళ్ల కంటే ఎక్కువగా ఆ బ్యాంకులో పనిచేస్తున్న అధికారులే సాయం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైందని, అప్పటి నుంచి బ్యాంకు అధికారులు నీరవ్ మోదీకి సాయం చేసినట్టు వెల్లడైంది. నీరవ్ సాయం చేసిన ఇద్దరు పీఎన్బీ అధికారులు గత ఐదారేళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. నిజానికి ఇలా జరగకూడదు, ఈ హోదాలో పని చేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. కానీ ఆ విధమైన మార్పు పీఎన్బీలో జరుగలేదు. ఈ క్రమంలో బ్యాంకు అధికారుల బదిలీలు చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది. -
బ్యాంకులను ప్రైవేటీకరించడం మంచిదా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను భారీగా దోచుకొని పారిపోయారనే లాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే డిమాండ్ ముందుకు వస్తుంది. ఈసారి కూడా మన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ఇదే మాటన్నారు. భారత వాణిజ్య మండళ్లు, పారిశ్రామిక సమాఖ్య ఇదే డిమాండ్ చేసింది. భారత పారిశ్రామిక, అనుబంధ వాణిజ్య మండళ్ల సంస్థ దీనికే పిలుపునిచ్చింది. ఇక ‘అబ్బే! ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ సరిగ్గా ఉండదు. ప్రైవేటు బ్యాంకుల ఉన్నతాధికారులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకు ఉన్నతాధికారులకు చాలా తక్కువ జీతాలు ఉంటాయి. ప్రోత్సహకాలు కూడా పెద్దగా ఉండవు. దాంతో వారికి ప్రభుత్వ బ్యాంకుల అభివద్ధి పట్ల అంత శ్రద్ధ ఉండదు, పైగా ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారుల మాటలు వినాల్సి వస్తుంది. అందుకుని వారిపై షేర్ హోల్డర్లకు కూడా పట్టు ఉండదు’ లాంటి మాటలు మధ్యతరగతి మేథావుల దగ్గరి నుంచి తరచూ వినిపిస్తాయి. అంటే ప్రభుత్వ బ్యాంకులకన్నా ప్రైవేటు బ్యాంకులు సక్రమంగా నడుస్తున్నాయా? ప్రైవేటు బ్యాంకుల్లో అవినీతి చోటుచేసుకోవడం లేదా? 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశం మొత్తం మీద 12,778 బ్యాంకు కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, వాటిలో ప్రభుత్వ బ్యాంకుల్లో 8,622 కుంభకోణాలు, ప్రైవేటు బ్యాంకుల్లో 4,156 కుంభకోణాలు చోటు చేసుకున్నాయని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకుల్లో కూడా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, కాకపోతే తక్కువ సంఖ్యలో. బ్యాంకుల్లో కుంభకోణాలు జరగడానికి కారణం ప్రధానంగా నియంత్రణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నియంత్రణా వ్యవస్థ సరిగ్గా ఉన్నట్లయితే కుంభకోణం మొదలైన 2011 సంవత్సరంలోనే అది బయటపడి ఉండేదని వారంటున్నారు. నియంత్రణా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశాన్ని చర్చించకుండా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఓ చాప కింది మట్టిని మరో చాప కిందకు నెట్టడమే అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. -
నిధులు ఇచ్చినా ఫలితం సున్నా
న్యూఢిల్లీ: ప్రజాధనాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్లక్ష్యంగా వాడేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి భారీగా మూలధన సాయం పొందుతూ కార్పొరేట్లకు పెద్ద చేత్తో రుణాలుగా సమర్పించుకుంటున్నాయి. వాటిని తిరిగి వసూలు చేసుకోలేక భారీ స్థాయిలో ఎన్పీఏలను మూటగట్టుకుంటున్నాయి. తిరిగి మరింత సాయం కోసం ప్రభుత్వం దగ్గర చేయి చాస్తున్నాయి. దీంతో కేంద్ర సర్కారుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ఓ పెద్ద సమస్యగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. బ్యాంకులకు నిధులు సర్దుబాటు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా చెమటోడ్చాల్సి వస్తోంది. గత 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వరంగంలోని బ్యాంకులకు కేంద్ర సర్కారు కేటాయింపులు రూ.2.6 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర సర్కారు ఇటీవలి బడ్జెట్లో చేసిన కేటాయింపుల కన్నా రెట్టింపు స్థాయి. రహదారులకు కేటాయించిన దానితో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువ. నాటి యూపీఏ హయాంలోని ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరం నుంచి ప్రస్తుత అరుణ్‌జైట్లీ వరకూ వరుసగా ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధులు కేటాయించుకుంటూ వస్తున్నారు. పోనీ ఈ స్థాయిలో నిధులు తీసుకుంటూ బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను బలోపేతం చేసుకుంటున్నాయా...? అదీ లేదు. మరిన్ని స్కామ్‌లు బయట పడుతున్నాయి. మన బ్యాంకుల్లో గడిచిన ఐదేళ్లలో నీరవ్ మోదీలాంటి వారు రూ.64 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇవీ కేటాయింపులు ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కోసం కేంద్ర సర్కారు రూ.1.45 లక్షల కోట్లను అందించనుంది. ఇక 2010–11 నుంచి 2016–17 వరకు రూ.1.15 లక్షల కోట్లను బ్యాంకులు ప్రభుత్వం నుంచి పొందాయి. ఈ కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు రూ.1.8 లక్షల కోట్లు. భారీ స్థాయిలో చేరిన ఎన్పీఏలకు కేటాయింపుల నేపథ్యంలో దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మరిన్ని నిధులను ఎన్పీఏలకు పక్కన పెడుతోంది. ఇక 18 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఎస్బీఐ ఓ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించింది. గడిచిన డిసెంబర్ క్వార్టర్లో ఇది చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి కూడా ఇంతే. ‘‘పీఎస్బీల్లో ఎన్పీఏల పరంగా దారుణ పరిస్థితి ఇంకా ముగియలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో మరింత స్పష్టత వస్తుంది’’ అని రేటింగ్ ఏజెన్సీ కేర్ పేర్కొంది. చెత్త పనితీరుకు నిదర్శనాలు నష్టాలన్నవి సహజంగానే ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధన రాబడుల (ఆర్‌వోఈ)ను ప్రభావితం చేస్తాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఆర్‌వోఈ 12 శాతం వరకూ ఉంటే, ఎస్బీఐలో ఇది మైనస్ 0.7 శాతంగాను ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మైనస్ 2.8 శాతంగానూ ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యాపారంలో మాత్రం 70 శాతం వాటా ప్రభుత్వరంగ బ్యాంకులదే. 2016–17లో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల వేతన బిల్లు 8.7 శాతం అయితే, ఎస్బీఐ గ్రూపులో ఇది 12.7 శాతం, ఇతర జాతీయ బ్యాంకుల్లో 10.7 శాతం స్థాయిలో ఉంది. అంటే భారీ స్థాయిలో వేతనాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ పనితీరు తీసికట్టుగా ఉంది. అందుకే పీఎస్బీల్లో ప్రైవేటు రంగానికి చోటివ్వాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం లోగడ ఓ సందర్భంలో స్వయంగా సూచించారు. ప్రభుత్వ బ్యాంకులు రుణాల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
ఆ స్కాంకు వారందరూ బలయ్యారు!
లక్నో : నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సికి చెందిన డైమాండ్ సంస్థల వల్ల నష్టపోయింది కేవలం బ్యాంకుల మాత్రమేనా అంటే ? కాదని తెలిసింది. వీరు చేసిన మోసానికి కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాక, 24 కంపెనీలు, 18 మంది వ్యాపారవేత్తలు బలైనట్టు వెల్లడైంది. వీరందరూ 2013 నుంచి 2017 మధ్యకాలంలో నీరవ్ మోదీ, చౌక్సి జువెల్లరీ బ్రాండులకు ఫ్రాంచైజీలు నిర్వహించారు. ఈ ఇద్దరు చేసిన మోసానికి తామందరం బలైనట్టు ఆర్థిక దివాలా కింద క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేశారు. వీరందరూ ఢిల్లీ, ఆగ్రా, మీరుట్, బెంగళూరు, మైసూర్, కర్నల్, రాజస్తాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో చౌక్సికి చెందిన గీతాంజలి జువెల్లరీ, గిలీ పేరుతో ఫ్రాంచైజీ షోరూంలు ఏర్పాటుచేశారు. ఫ్రాంచైజీల నుంచి రూ.3 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్యలో సెక్యురిటీ డిపాజిట్లు తీసుకుని డైమాండ్ స్టాక్స్‌ను, విలువైన జెమ్స్‌ను చౌక్సి సంస్థలు వీరికి పంపేవి. వీటిలో చౌక్సి సంస్థలు క్రిమినల్ కుట్ర, మోసం, ఒప్పందాల ఉల్లంఘన వంటి వాటికి పాల్పడినట్టు వ్యాపారవేత్తలు, కంపెనీలు ఆరోపిస్తున్నాయి. నీరవ్ మోదీ, చౌక్సి సంస్థలపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశాయి. కాగ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.11,400 కోట్లు నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి కన్నం వేసిన సంగతి తెలిసిందే. ఇన్ని కోట్ల మోసం చేసిన వీరు, పీఎన్బీ ఈ స్కాం బయటపెట్టే లోపలే దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం వీరి డైమాండ్ సంస్థలను, జువెల్లరీ షోరూంలను, ప్రాపర్టీలను, ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్‌చేస్తోంది. అంతేకాక వీరిని పట్టుకోవడానికి తీవ్ర ఎత్తున ప్రయత్నిస్తోంది. తొలిసారి ఈ స్కాంను ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ కురానియా బయటపెట్టారు. 2013లో చౌక్సి సంస్థల్లో ఈ మోసాన్ని ఆయన గుర్తించారు. రాజోరి గార్డెన్లో వైభవ్ ఓ రిటైల్‌స్టోర్‌ను ఏర్పాటుచేశారు. చౌక్సి సంస్థ గీతాంజలి పేమెంట్ తీసుకున్నప్పటికీ రూ.3 కోట్ల స్టాక్స్‌ను అతనికి పంపించకపోయే సరికి వైభవ్ తన రిటైల్ స్టోర్‌ను క్లోజ్ చేశారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఈ షోరూంలో ధర దానికి 3 నుంచి 4 సార్లు ఎక్కువగా ఉంటుందని తాజా ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారు. -
కాస్ట్లీగా మారబోతున్న ఏటీఎం లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్య ప్రజలపై మరో భారం పడబోతుంది. ఏటీఎం ఆపరేటర్లు, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం లావాదేవీల ఇంటర్-బ్యాంకు ఛార్జీలను పెంచాలని నిర్ణయిస్తున్నాయి. ఓ వైపు డిమానిటైజేషన్, మరోవైపు నిర్వహణ వ్యయాలు పెరుగడంతో, ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు పేర్కొన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విషయంపై వేరువేరుగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దీనిపై చర్చించినట్టు తెలిసింది. ఇంటర్ బ్యాంక్ ఛార్జీని ఓ బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎంలను వాడుకున్నందుకు ఆ బ్యాంకుకు విధిస్తారు. దీంతో చిన్న ఏటీఎం నెట్వర్క్స్ కలిగి ఉన్న బ్యాంకులకు భారంగా మారుతోంది. వ్యయాల భారం పెరిగిపోతుంది. దీంతో బ్యాంకులు వ్యయాల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు తరలించాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇంటర్-బ్యాంకు ఫీజులను పెంచాలని కోరుతుండగా.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ ఇంకా వీటిని పెంచితే, తమ కట్టుబాట్లను కోల్పోతామని పేర్కొంటున్నాయి. ఫీజుల పెంపుకు మరో కారణం, ఏటీఎం కంపెనీలు ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతుండటం అని కూడా తెలుస్తోంది. డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగి, ఏటీఎం వాడకం భారీగా తగ్గిపోయింది. దీంతో ఏటీఎం కంపెనీలు ఒత్తిడిలో పడిపోయాయి. -
బ్యాంకుల మూతపై ఆర్బీఐ, ప్రభుత్వం స్పందన
న్యూఢిల్లీ : కొన్ని బ్యాంకులను ప్రభుత్వం మూసివేస్తుందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దానిలో నిజమెంతో తెలియకుండానే ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తున్నారు కొందరు. అయితే ఏ ప్రభుత్వ రంగ బ్యాంకును తాము మూసివేయడం లేదని ఇటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, అటు కేంద్ర ప్రభుత్వం రెండూ నేడు క్లారిటీ ఇచ్చేశాయి. గత కొంత కాలంగా విపరీతంగా చక్కర్లు కొడుతున్న రూమర్లకు చెక్‌పెట్టాయి. పీసీఎ కింద కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేస్తున్నారంటూ కొన్ని సెక్షన్ల మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారం సర్క్యూలేట్ అవుతుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రూమర్లను కేంద్ర ప్రభుత్వం కూడా కొట్టిపారేస్తుందని, దీనికి భిన్నంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసే ప్రణాళికలో తామున్నట్టు కేంద్రం పేర్కొంది. రూ.2.11 లక్షల రీక్యాపిటలైజేషన్ ప్లాన్‌తో బ్యాంకులను ప్రభుత్వం బలపరుస్తుందని ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం సంస్కరణల రోడ్‌మ్యాప్‌ను కూడా రూపొందించినట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియాపై సత్వర దిద్దుబాటులు చర్యలు(పీసీఏ) తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ పీసీఏ ఫ్రేమ్‌వర్క్ సాధారణ ప్రజలకు బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రించటానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇదే రకమైన స్పష్టతను సెంట్రల్ బ్యాంకు జూన్‌లో కూడా ఇచ్చింది. -
ప్రభుత్వ బ్యాంకులకు మరింత క్యాపిటల్ కావాలి
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత పెట్టుబడుల అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబైలో నిర్వహించిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాలెన్స్ షీట్ల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ భారీ రీకాపిటలైజేషన్ అవసరమవుతుంది. నగదు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రీకాపిటలైజేషన్ అవసరమవుతుందని ఆర్బీఐ గవర్నర్ పటేల్ చెప్పారు. అదనపు నిధులు కావాలన్నారు. మార్కెట్ నుంచి నిధులను సమీకరించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను తగ్గించడంతో పాటు పలు రంగాల్లో అదనపు క్యాపిటల్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది అధిక నిష్పత్తిలో కొనసాగుతోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏ నిష్పత్తి 9.6 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని వివిధ బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో తెలిపారు. అలాగే బ్యాంకుల బ్యాడ్ లోన్ల సమస్య పరిష్కరించేందుకు హెయిర్ కట్ అవసరం పేర్కొన్నారు. -
ప్రైవేట్ బ్యాంకులూ.. ‘మొండి’కొండలే!
లెక్కల్లో చూపని ఎన్పీఏలు ఎక్కువే ► ఆర్బీఐ మదింపు నిబంధనలతో బయటపడుతున్న నిజాలు ► యస్ బ్యాంక్‌లో రూ. 4,930 కోట్లు, ఐసీఐసీఐలో 7 శాతం, యాక్సిస్‌లో 4.5 శాతం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓవైపు మొండి బాకీల నష్టాలతో కుదేలవుతుంటే .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇప్పటిదాకా ప్రకటిస్తూ వచ్చిన ఆకర్షణీయ ఫలితాల్లో వాస్తవమెంత? వాటిల్లో మొండిబకాయిలు నిజంగానే తక్కువగానే ఉన్నాయా? ఈ ప్రశ్నలకు కాదు అనే సమాధానం వస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఎన్పీఏలు భారీగానే ఉన్నాయని.. కాకపోతే అవి వాటిని సగం పైగా తక్కువ చేసి చూపిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. 2015–16లో యస్ బ్యాంక్ సొంత లెక్కల ప్రకారం స్థూల ఎన్పీఏల శాతం 0.76 శాతంగానే ఉండగా.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇవి 5 శాతం మేర ఉన్నాయి. యస్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల ఎన్పీఏలు చూపించగా .. ఆర్బీఐ ప్రకారం ఇవి రూ. 4,930 కోట్లుగా ఉన్నాయి. ఇక మరో కన్సల్టెన్సీ గణాంకాల ప్రకారం యాక్సిస్ బ్యాంకు ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 4.5 శాతం పైగా ఉన్నాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ ఇవి 1.78 శాతం మాత్రమే ఉంటాయని చూపించింది. అటు ఐసీఐసీఐ కూడా మొండి బకాయిలు 5.85 శాతంగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ.. వాస్తవానికి ఇవి 7 శాతం మేర ఉంటాయి. ఈ రెండు బ్యాంకులు ఇంకా తమ వార్షిక నివేదికలు ప్రచురించాల్సి ఉంది. లెక్కలు చెప్పక తప్పదు.. ఆర్బీఐ గతేడాది అసెట్ క్వాలిటీ సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ మొండి బకాయిల్లో చాలా భాగాన్ని దాచి ఉంచుతున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిబంధనల ప్రకారం ఆర్బీఐ మదించిన గణాంకాలు, తమ సొంత లెక్కల మధ్య వ్యత్యాసం 15 శాతం పైగా ఉన్న పక్షంలో రిజర్వ్ బ్యాంక్ గణాంకాలను బ్యాంకులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని ప్రైవేట్ బ్యాంకుల్లోని ఎన్పీఏల వాస్తవ లెక్కలు ప్రజల ముందుకు రావొచ్చని భావిస్తున్నారు. బ్యాంకుల సొంత లెక్కలకు, ఆర్బీఐ గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్న నేపథ్యంలో 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆడిట్ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా తగ్గాయి: యస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న దిద్దుబాటు చర్యలతో మొండిబకాయీల్లో చాలా భాగం తగ్గాయని యస్ బ్యాంక్ పేర్కొంది. కొన్ని ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించామని, కొన్ని ఖాతాలు మెరుగుపడ్డాయని.. ఫలితంగా మొత్తం రావాల్సిన స్థూల ఎన్పీఏలు 2017 మార్చి 31నాటికి రూ. 1,039.9 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. ఇందులో ఒకే ఖాతాదారు నుంచి రూ. 911.5 కోట్లు రావాల్సి ఉండగా.. సమీప భవిష్యత్‌లో రాబట్టుకోగలమని తెలిపింది. ఈ ఖాతా కోసం ప్రత్యేకంగా రూ. 227.9 కోట్ల ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ మొండి బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించాల్సిన పరిస్థితి ఉండదని తెలిపింది. ఎన్పీఏలపై ఆర్బీఐ, ఆర్థిక శాఖ సమావేశం.. మొండిబకాయిల సమస్యల పరిష్కారం అంశంపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖలో సీనియర్ అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్పీఏల విషయంలో కఠినంగా వ్యవహరించేలా రిజర్వ్ బ్యాంక్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిలకడగానే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు: ఆర్బీఐ నివేదిక 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్య లోటు 3.4 శాతానికి పెరిగినప్పటికీ.. మొత్తం మీద చూస్తే మాత్రం ఆర్థిక స్థితిగతులు దీర్ఘకాలంలో నిలదొక్కుకునేలాగే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ)విధానం వాటికి సానుకూలంగా ఉండగలదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై వార్షిక నివేదికలో ఆర్బీఐ ఈ అంశాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల ప్రకారం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రాష్ట్రాల స్థూల ద్రవ్య లోటు (జీఎస్ఎఫ్డీ) .. బడ్జెట్లో ప్రతిపాదించిన 3 శాతాన్ని దాటేసి 3.4 శాతానికి పెరిగింది. విద్యుత్ డిస్కమ్‌లకు తోడ్పాటునిచ్చేందుకు ఉద్దేశించిన ఉదయ్ బాండ్ల జారీనే దీనికి ప్రధాన కారణమని.. దాన్ని మినహాయిస్తే.. జీఎస్ఎఫ్డీ 2.7 శాతంగానే ఉండొచ్చని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. పాతిక పెద్ద రాష్ట్రాల గణాంకాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నివేదికను రూపొందించింది. 12 బ్యాంకులపై ఆర్బీఐ చర్యలకు రంగం సిద్ధం? మొండి బకాయిల పరిష్కారం దిశగా సవరించిన నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) అస్త్రాన్ని ప్రయోగించనున్న బ్యాంకులు సుమారు డజను దాకా బ్యాంకులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులే కాగా.. పాత తరం ప్రైవేట్ బ్యాంక్ ధన్‌లక్ష్మీ బ్యాంక్ కూడా ఉండనుంది. అసెట్ క్వాలిటీ నిబంధనల ప్రకారం స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) నికర రుణాల్లో 6 శాతాన్ని మించితే చర్యలు తప్పవు. దీన్ని బట్టి చూస్తే 11 బ్యాంకులు ఇప్పటికే ఈ పరిమితిని దాటేశాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అత్యధికంగా 14.32 శాతం మేర నికర ఎన్పీఏలు ప్రకటించింది. 10.66 శాతంతో దేనా బ్యాంక్, 10.62 శాతంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సుమారు 9.61 శాతం నికర ఎన్పీఏలు ఉన్న ఐడీబీఐ బ్యాంకుపై ఆర్బీఐ ఇప్పటికే పీసీఏ చర్యలు ప్రారంభించింది. పీసీఏతో ఆంక్షలు.. పీసీఏ చర్యలు గానీ అమల్లోకి వస్తే సదరు బ్యాంకులు చెల్లించే డివిడెండ్లు, లాభాల పంపిణీ మొదలైన వాటిపై ఆంక్షలు విధిస్తారు. బ్యాంకులు తమ శాఖల నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఉండదు. అధిక స్థాయిలో ప్రొవిజనింగ్ జరపాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ వేతనాలు, డైరెక్టర్ల ఫీజులపై పరిమితులు అమల్లోకి వస్తాయి. -
ఏడు ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్లను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమించింది. క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. వివరాలు... ► ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న రాజ్‌కిరణ్ రాయ్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం మూడేళ్లు. ► కార్పొరేషన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సునీల్ మెహతా తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ తాజాగా అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈమె 2018, ఆగస్ట్ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సుబ్రమణియ కుమార్ అదే బ్యాంక్ ఎండీ, సీఈవోగా 2019 జూన్ 30 వరకూ పదవిలో కొనసాగనున్నారు. ► కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న దీనబంధు మొహపత్ర ఇకపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారు. ► సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఎం.ఒ.రెగో నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్నారు. ► ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆర్.ఎ.శంకర నారాయణన్ తాజాగా విజయా బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించనున్నారు. -
ప్రభుత్వ బ్యాంకులకు మారబోతున్న అధినేతలు
న్యూఢిల్లీ : కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధినేతలు మారబోతున్నారు. అధినేతలను పునర్వ్యస్థీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకుల ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం, మొండిబకాయిల సమస్యల పరిష్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధినేతలను మార్చుతున్నట్టు సమాచారం. పునర్ వ్యవస్థీకరించే బ్యాంకుల్లో ఐడీబీఐ కూడా ఉందట. చాలా నిశీతంగా పరిశీలించిన అనంతరం అధినేతలను మార్చే ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐడీబీఐ బ్యాంకుకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషోర్ ఖరాట్ ను వేరే బ్యాంకుకు బదిలీ చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఫైనాన్సియల్ సెక్టార్లో ఎంతో మార్గదర్శకంగా నిలిచిన ఐడీబీఐ బ్యాంకు 2015-16లో రూ.3664 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ బ్యాంకుకు 2014-15లో రూ.873 కోట్ల నికర లాభాలున్నాయి. ఈ బ్యాంకుకు క్రమేపీ లాభాలు పడిపోతున్నాయని పార్లమెంటరీ కమిటీ రిపోర్టులో తెలిసింది. స్థూల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం, రుణాల రైటాఫ్స్, సరిగా లేని ఆర్థిక ఫలితాలు ఐడీబీఐ బ్యాంకును దెబ్బతీస్తున్నాయని కమిటీ రిపోర్టు పేర్కొంది. దీంతో ఐడీబీఐ బ్యాంకుల్లో ప్రధానంగా ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సమాచారం. -
కేంద్రం విధానాలతో బ్యాంకులు నిర్వీర్యం
→ ఉద్యోగులు కష్టపడినా స్పందన శూన్యం → న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాడతాం → యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ప్రభాకర్ → జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన → పాల్గొన్న 3వేల మంది ఉద్యోగులు సమ్మె విజయవంతం ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ సి.ఎ.ఎస్.ప్రభాకర్ అన్నారు. తమ న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాడతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద యూనియన్ నాయకులు, అధికారులు సమ్మె చేపట్టారు. ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో పెద్దనోట్ల రద్దు తరువాత బ్యాంకు ఉద్యోగులు కష్టపడి పనిచేసినా కేంద్రప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావల్సిన మొత్తాలను ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత లభించే మొత్తాలను పెంచాలని, వీటిపై ఆదాయపన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం బ్యాంకుల పట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. బ్యాంకుల విలీనంపై వ్యతిరేకత బ్యాంకింగ్‌లో ఔట్సోర్సింగ్ విధానాలు విరమించుకోవాలన్నారు. బ్యాంకుల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల చట్టాలను సవరణల ద్వారా నీరు గార్చడం, బ్యాంకులను విలీనం చేయడం వంటివాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని స్థాయిల్లోనూ తగినంత ఉద్యోగ నియామాకాలు జరగాలని, పూర్తి 5 రోజులు బ్యాంకింగ్ సదుపాయాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్.సాంబశివరావు(ఎన్సీబీఈ), యుగంధర్(ఏఐబీఈఏ), జి.వాసుదేవరావు(ఏఐబీవోసీ) బి.రమణమూర్తి(ఏఐబీవోసీ), పలు సంఘాల నాయకులు పి.ఎన్.మల్లేశ్వరరావు, ఆర్.వి.రవికుమార్, జి.రామచంద్రరావు, జె.శంకర్రాజు, ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, ఎస్ఎస్బీఈఏ నాయకుడు కె.ఎస్.కృష్ణ, ఎస్బీహెచ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్బీహెచ్ అధ్యక్షుడు రాజశేఖర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన బ్యాంకింగ్
• ఏటీఎంలు ఖాళీ • దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ప్రభావం న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు లేక నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. వేతనాలతో పాటు వివిధ డిమాండ్లతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తమ సమ్మె విజయవంతమైందని, అన్ని బ్యాంకుల శాఖలు మూతబడ్డాయని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ‘నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ మొదలైన కార్యకలాపాలేవీ జరగలేదు. ప్రభుత్వ ట్రెజరీ లావాదేవీలు, ఎగుమతి..దిగుమతి లావాదేవీలు, మనీ మార్కెట్ కార్యకలాపాలు మొదలైనవి నిలిచాయి‘ అని చెప్పారు. నగదు బదిలీలు, క్యాష్ రెమిటెన్సులపైనా ప్రతికూల ప్రభావం పడింది. రిజర్వ్ బ్యాంక్ పనిచేసినా.. ఉద్యోగులు అందుబాటులో లేక క్లియరింగ్ కార్యకలాపాలకూ విఘాతం కలిగిందని వెంకటాచలం పేర్కొన్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ అయిపోయాయని, పని చేసిన కొన్ని బ్యాంకుల్లోనూ నగదు పరిమిత స్థాయిలోనే ఉందని ఆయన వివరించారు. రూ.1.3 లక్షల కోట్ల లావాదేవీలపై ప్రభావం.. బ్యాంకింగ్ సమ్మె కారణంగా దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల మేర ఫారెక్స్, క్లియరింగ్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడనుందని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. భారీగా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై కేంద్రం కసరత్తు చేయాలని ఆయన పేర్కొన్నారు. డిమాండ్లు ఇవీ... యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు తమ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వెల్లడించాయి. తమ శాఖల్లో కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ.. ఏటీఎంలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఖాతాదారులకు యథాప్రకారం సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. మరోవైపు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. యూఎఫ్‌బీయూలో 9 యూనియన్లు ఉండగా.. 2 యూనియన్లు(భారతీయ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ది నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్) కూడా సమ్మెలో పాల్గొనలేదు. అవుట్సోర్సింగ్ తదితర సంస్కరణలు నిలిపివేయాలని, నోట్ల రద్దు అనంతరం మరిన్ని గంటలు అధికంగా పనిచేసిన ఉద్యోగులు.. అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలని, తదుపరి వేతన సవరణ సమీక్షను సత్వరం చేపట్టాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. అలాగే, అన్ని క్యాడర్లలో సముచిత స్థాయిలో నియామకాలు జరపాలని, మొండిబకాయిల రికవరీకి కఠిన చర్యలు తీసుకోవాలని.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు వేయాలని, టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను జవాబుదారీగా చేయాలన్నవి మిగతా డిమాండ్లు. డీమోనిటైజేషన్ వల్ల బ్యాంకులకు అయిన అదనపు వ్యయాలను సైతం రీయింబర్స్ చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. -
మరింత ప్రమాదకర స్థాయికి మొండిబకాయిలు!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో మొండిబకాయిలు మరింత ప్రమాదకర స్థాయికి పెరిగినట్టు తెలిసింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు సుమారు రూ.80,000 కోట్లకు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో సెప్టెంబర్ 30తో పబ్లిక్ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లకు చేరాయి. జూన్ వరకు ఈ ఎన్పీఏలు రూ.5,50,346 కోట్లగా ఉన్నాయి. ఎన్పీఏలు అధికంగా పెరుగుతున్న ఇన్ఫ్రాక్ట్చర్, పవర్, రోడ్డు, టెక్స్టైల్, స్టీల్ వంటి వాటిలో రంగాల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నేడు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మొండిబకాయిల కోసం ఆర్థిక దివాలా కోడ్(ఐబీసీ)-2016ను తీసుకొచ్చామని, దాంతోపాటు పలు చట్టాలకు సవరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. అంతేకాక ఆర్బీఐ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్పొరేట్ రుణ పునర్నిర్మాణం, జాయింట్ లీడర్స్ ఫోరమ్ ఏర్పాటు, వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ పథకం, వంటి వాటిని ఎన్పీఏల నుంచి బయటపడేందుకు ఆర్బీఐ వాడుతుందని తెలిపారు. ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఇచ్చిన 2.80 లక్షల కోట్ల రుణాల్లో రూ.1.24 లక్షల కోట్లు మొండిబకాయిలుగా మారినట్టు గంగ్వార్ చెప్పారు. కార్పొరేట్‌కు సంబంధించిన ఏ రుణాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదని గంగ్వార్ వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు రుణాలను రైటాఫ్ చేస్తాయని, కానీ బ్రాంచు స్థాయిలో వాటి రికవరీ ఉంటుందని పునరుద్ఘాటించారు. -
రుణ రేట్లను సవరించిన నాలుగు బ్యాంక్‌లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాయి. రెపో తగ్గిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను 9-9.35% రేంజ్లో నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 3 నెలల కాలానికి 9.2 శాతం,ఆరు నెలల కాలానికి 9.25 శాతం, ఏడాది కాలానికి 9.35 శాతంగా ఎంసీఎల్ఆర్ను నిర్ణయించామని వివరించింది. ఇక సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను 9.3-9.45 శాతంగా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల ఏడు నుంచి వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్ 9.05-9.6% రేంజ్లో ఉంది. ఇది ఈ నెల 1 నుంచే వర్తిస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ ఎంసీఎల్ఆర్ 9.3-9.75% రేంజ్లో ఉంది. ఈ నెల 5 నుంచి ఇది వర్తిస్తుంది. -
బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం
2020 నాటికి తప్పదంటున్న మూడీస్ నివేదిక న్యూఢిల్లీ: ఎస్బీఐ సహా తన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2020 నాటికి రూ.1.2 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. బ్యాలెన్స్ షీట్ల పటిష్టతకు అవసరమని పేర్కొన్న ఈ మొత్తం పరిమాణం ప్రభుత్వ ప్రణాళికా పరిమాణానికన్నా అధికంగా ఉండడం గమనార్హం. 2019 మార్చి నాటికి 22 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో ఇప్పటికే కేంద్రం రూ.25,000 కోట్లు సమకూర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకన్నా... అవసరమైతే మరింత సమకూర్చుతామని కూడా కేంద్రం హామీ ఇస్తోంది. కాగా, మార్చి 11వ తేదీ నాటికి ఈ 11 బ్యాంకుల పనితీరును కూడా మూడీస్ సమీక్షించింది. రానున్న 12 నెలల్లో సైతం బ్యాంక్ అసెట్ క్వాలిటీ ఒత్తిడిలో ఉంటుందని పేర్కొంది. -
బకాయిలు.. బాబోయ్!
♦ ఎన్పీఏలు మరింత పెరిగే అవకాశం ♦ బోలెడన్ని ఖాతాల్ని వాచ్‌లిస్ట్‌లో ఉంచామంటున్న బ్యాంకులు ♦ ఇప్పటికే రూ.5.8 లక్షల కోట్లకు చేరిన లిస్టెడ్ బ్యాంకుల ఎన్పీఏలు ♦ మొండిబకాయిలు, నష్టాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల కుదేలు ♦ మున్ముందు పరిస్థితిపై మార్కెట్ వర్గాల ఆందోళన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తాజాగా దేశీ పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఏకంగా లక్ష కోట్ల రూపాయల మొండి బకాయిలు(ఎన్పీఏ) ప్రకటించింది. ఇక మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని చూస్తే గుండె గుభేలుమంటుంది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా తమ వ్యాపారంలో 13-15% వరకూ మొండి బకాయిలున్నట్లు తేల్చాయి. అసలు 15% మొండి బకాయిలుంటే ఇక ఆ బ్యాంకుల నిర్వహణ ఖర్చులెంత? అవి ఇచ్చే రుణాలెంత? ఇవన్నీ చూస్తే అవి బతికి బట్టకట్టగలవా? అని సందేహాలు రేగుతున్నాయి. సాధారణంగా 90 రోజులు దాటిన తరవాత కూడా వాయిదా మొత్తం లేదా వడ్డీ చెల్లింపులు రాకపోయిన పక్షంలో సదరు ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరిస్తారు. ఎందుకంటే వీటిద్వారా బ్యాంకులకు రావాల్సిన ఆదాయం రావడం ఆగిపోతుంది. దీంతో వాటి దృష్టిలో ఇవి నిరర్ధక ఆస్తులుగా మారతాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానంతరం ఎకానమీ మందగించటం, ప్రాజెక్టుల అమల్లో జాప్యం... వంటి అంశాలవల్లే చాలా కంపెనీలు రుణాల్ని తిరిగి చెల్లించలేకపోతున్నాయి. మరోవంక ఉద్దేశపూర్వక ఎగవేతదారులు దీనికి తోడవుతుండటంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అయితే, లాభాలు చూపించుకోక తప్పని ఒత్తిళ్లు, తాపత్రయంలో బ్యాంకులు వీటిని చాన్నాళ్లుగా మరుగున పెడుతూ వచ్చాయి. ఇవి ఏదో ఒక రోజున ఆటంబాంబుల్లా పేలక తప్పదని గుర్తించిన ఆర్బీఐ... నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ చేసేలా అసెట్ క్వాలిటీ సమీక్షకు (ఏక్యూఆర్) ఆదేశించింది. దీంతో బ్యాంకులు ఎన్పీఏ గణాంకాలు బయటకు తియ్యకతప్పలేదు. రికార్డు స్థాయి నష్టాలు... మొండి బకాయిల్లాంటి వాటికి ప్రొవిజనింగ్‌లు తదితర కారణాలతో ఈ మార్చి క్వార్టర్లో 25 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 15 నష్టాలు ప్రకటించాయి. ఇవి ప్రకటించిన నష్టాలు మొత్తం దాదాపు రూ. 23,493 కోట్ల పైచిలుకే. అంతక్రితం క్యూ4లో ఇవి రూ. 8,800 కోట్ల పైగా లాభాలు నమోదు చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)... నష్టాల్లో రికార్డులు సృష్టించింది. దేశీయంగా ఏ బ్యాంకూ ఎరగనంత స్థాయిలో రూ.5,367 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు కూడా అదే బాటలో నడిచాయి. రాష్ట్రానికి వస్తే.. ప్రొవిజనింగ్ తదితరాలకు కేటాయింపులు రూ. 1,023 కోట్లు కేటాయించడంతో క్యూ4లో ఆంధ్రా బ్యాంకు నికర లాభం ఏకంగా 72 శాతం క్షీణించి రూ. 52 కోట్లకు తగ్గిపోయింది. ఇంకా పెరుగుతాయ్..! గతేడాది ఆగస్టులో ప్రభుత్వ బ్యాంకులకు దాదాపు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చేలా ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపాదన చేశారు. 2017 నాటికి బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేసుకోవాలనీ చెప్పారాయన. అయితే బ్యాంకులు కుస్తీ పడుతున్నప్పటికీ.. ఎన్పీఏల సమస్య ఇప్పుడే తీరేట్లు కనిపించడం లేదు. వచ్చే ఏడాది మార్చి దాకా ఇది కొనసాగవచ్చని ఆంధ్రా బ్యాంకు ఎండీ సురేశ్ ఎన్ పటేల్ వ్యాఖ్యానించారు. దాదాపు రూ.2,500-3,000 కోట్ల దాకా విలువ చేసే ఏడెనిమిది ఖాతాలు అనుమానాస్పదంగానే ఉన్నట్లు చెప్పారాయన. ఎస్బీఐ సుమారు రూ.31,000 కోట్ల అసెట్స్‌ను వాచ్ లిస్టులో ఉంచింది. ఇందులో దాదాపు 70% ఖాతాలు సందేహాస్పదమైనవేనని బ్యాంకు చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఇతరత్రా ప్రైవేట్ బ్యాంకులూ ఇలాంటి హెచ్చరికలే చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు రూ. 52,638 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ. 22,000 కోట్ల విలువైన ఖాతాలను వాచ్ లిస్టులో ఉంచినట్లు చెప్పాయి. ఐతే చాలా బ్యాంకులు ఇప్పటికే పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు తీసుకున్నందున రాబోయే రోజుల్లో మొండి బాకీలు, నష్టాల తీవ్రత తగ్గొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్పీఏలు రూ.5.8 లక్షల కోట్లు.. ♦ ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2004-2012 మధ్య సుమారు 4% మాత్రమే ఉన్న ఎన్పీఏల పెరుగుదల 2013-15 మధ్య ఏకంగా 60 %కి ఎగిసింది. ♦ పీఎస్బీల్లో 2011లో రూ. 71,000 కోట్లుగా ఉన్న ఎన్పీఏలు 2015 నాటికి అయిదు రెట్లు పెరిగి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. ♦ 2013-15 మధ్య 29 పీఎస్‌యూలు దాదాపు రూ.1.14 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను రైటాఫ్ చేసేశాయి. ♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రొవిజనింగ్ ఏకంగా 87 శాతం పెరుగుదలతో రూ. 96,698 కోట్ల నుంచి రూ. 1.75 లక్షల కోట్లకు ఎగిసింది. ♦ {పస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్టయిన 38 బ్యాంకుల స్థూల మొండిబకాయిలు 95 శాతం ఎగిసి రూ. 5.8 లక్షల కోట్లకు చేరాయి. -
బ్యాంకులపై ‘బకాయిల’ బండ
♦ ఎన్పీఏలకు భారీ కేటాయింపులతో కుదేల్.. ♦ బ్యాంక్ ఆఫ్ బరోడాకు రెండో సారీ భారీ నష్టం ♦ అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులదీ ఇదే పరిస్థితి... చెన్నై/కోల్‌కత: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మొండి బకాయిలు మోయలేని భారం మోపుతున్నాయి. మొండి బకాయి(ఎన్పీఏ)లకు కేటాయింపులు అంతకంతకు పెరిగిపోతుండటంతో బ్యాంక్‌లకు భారీగా నష్టాలు వస్తున్నాయి. శుక్రవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఆరు బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు నష్టాలనే ప్రకటించాయి. మొండి బకాయిల కేటాయింపులు భారీగా ఉండటంతో ఈ బ్యాంక్‌లు లాభదాయకత దారుణంగా దెబ్బతిన్నది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, దేనా బ్యాంక్‌లు నికర నష్టాలు ప్రకటించగా, ఒక్క యూనియన్ బ్యాంక్‌కు మాత్రం నికర లాభాలు వచ్చాయి. ఈ ఐదు బ్యాంకుల నష్టాలు.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,751 కోట్లకు చేరాయి. నష్టాలు ప్రకటించడంతో ఈ బ్యాంక్ షేర్లు కూడా భారీగా క్షీణించాయి. వివరాలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం రూ.3,230 కోట్లు... మొండి బకాయిలకు భారీ కేటాయింపులతో బ్యాంక్ ఆఫ్ బరోడా కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.3,230 కోట్ల నికర నష్టం వచ్చింది. భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద త్రైమాసిక నష్టం. ఈ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,342 కోట్ల నికర నష్టం పొందింది. భారత బ్యాంకింగ్ చరిత్రలో అత్యంత పెద్ద త్రైమాసిక నష్టం ఇదే. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,057 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,789 కోట్లకు పెరిగింది. కేటాయింపులు రూ.1,817 కోట్ల నుంచి రూ.6,857 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 3.72 శాతం నుంచి 9.99 శాతానికి పెరిగాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సర పరంగా చూస్తే.., గత ఆర్థిక సంతవ్సరానికి రూ.5,386 కోట్ల నికర నష్టం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంతవ్సరంలో ఈ బ్యాంక్ రూ.3,398 కోట్ల నికర లాభం సాధించింది. మొత్తం ఆదాయం రూ.47,366 కోట్ల నుంచి రూ.49,060 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు రూ.16,261 కోట్ల నుంచి రూ.40,521 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.8,969 కోట్ల నుంచి రూ.19,406 కోట్లకు ఎగిశాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 1.7 శాతం క్షీణించి రూ.155 వద్ద ముగిసింది. అలహాబాద్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.581 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ఈ బ్యాంక్ రూ.203 కోట్ల నికర లాభం ఆర్జించింది. కేటాయింపులు రూ.631 కోట్ల నుంచి నాలుగింతలై రూ.2,487 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.5,391 కోటల నుంచి రూ.5,051 కోట్లకు తగ్గింది. ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.621 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.743 కోట్ల నికర నష్టం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.21,712 కోట్ల నుంచి రూ.20,795 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో అలహాబాద్ బ్యాంక్ షేర్ 1.6 శాతం క్షీణించి రూ.53 వద్ద ముగిసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఈ బ్యాంక్‌కు రూ.898 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.617 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4 రెట్లు పెరిగి రూ.2,287 కోట్లకు చేరాయి. స్థూల ఎన్పీఏలు 6.09% నుంచి 11.95%కి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేర్ 0.8% క్షీణించి రూ.78 వద్ద ముగిసింది. యూనియన్ బ్యాంకు లాభం రూ.96 కోట్లు యూనియన్ బ్యాంక్(యూబీఐ)కు మాత్రం లాభాలు వచ్చాయి. 2014-15 ఏడాది క్యూ4లో రూ.444 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 78% తగ్గి రూ.96 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 4.96 శాతం నుంచి 8.7 శాతానికి, నికర మొండి బకాయిలు 2.71% నుంచి 5.25%కి పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.9,384 కోట్ల నుంచి రూ.8,885 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంక్ రూ.1,352 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే అంతక్రితం ఏడాది లాభం(రూ.1,782 కోట్లు)తో పోల్చితే తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ.35,607 కోట్ల నుంచి రూ.35,831 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 1.8 శాతం క్షీణించి రూ.116 వద్ద ముగిసింది. 15.43 శాతానికి యూకో బ్యాంక్ ఎన్పీఏలు ఎన్పీఏలు భారీగా పెరగడంతో యూకో బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,715 కోట్ల నికర నష్టం వచ్చింది. 2014-15లో ఇదే క్వార్టర్‌కు బ్యాంక్ రూ.209 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం రూ.రూ.5,263 కోట్ల నుంచి రూ.4,745 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.968 కోట్ల నుంచి 142 శాతం వృద్ధితో రూ.2,345 కోట్లకు పెరిగాయని బ్యాంక్ తెలిపింది. స్థూల ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 15.43 శాతానికి, నికర మొండి బకాయిలు 4.3 శాతం నుంచి 9.09 శాతానికి ఎగిశాయని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో యూకో బ్యాంక్ షేర్ 5.9 శాతం క్షీణించి రూ.34 వద్ద ముగిసింది. -
ఈ షేర్లు నిజంగా చౌకేనా?
బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్న షేర్లు ♦ పీఎస్‌యూ బ్యాంకులన్నిటిదీ అదే తీరు ♦ మెటల్స్, ఇన్ఫ్రా, హౌసింగ్ షేర్లదీ అదే బాట ♦ పతనాన్ని తప్పించుకున్న కొన్ని ప్రైవేటు బ్యాంకులు ♦ అన్నిటినీ బుక్ వ్యాల్యూతోనే అంచనా వేయొద్దు: నిపుణులు సాక్షి, బిజినెస్ విభాగం: ఈ మధ్య స్టాక్ మార్కెట్ పతనం మామూలుగా లేదు. సెన్సెక్స్, నిఫ్టీలు వాటి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఏకంగా 20 శాతానికిపైగా పతనమై బేర్ మార్కెట్లోకి జారిపోయాయి. ప్రతి పతనం కొనుగోళ్లకు గొప్ప అవకాశమని చెబుతారు తెలివైన ఇన్వెస్టర్లు. ఇతర ఇన్వెస్టర్లకు భిన్నంగా వారు మార్కెట్లు తక్కువ స్థాయిలో ఉన్నపుడే షేర్లు కొంటారు. పెరుగుతున్నపుడు అమ్మేసి లాభాలు సంపాదిస్తారు. కానీ అందరూ ఇలా చేయలేరు. ఒకవేళ మార్కెట్లు తక్కువ స్థాయిలో ఉన్నా మనం కొన్న షేర్లు పెరగాలని లేదు కదా? అలాంటి పరిస్థితుల్లో ఏ షేర్లు కొంటే మంచిది? మంచి షేర్లను కనిపెట్టడమెలా? ఇలా ఆలోచించేవారు ప్రధానంగా చూసే అంశాల్లో బుక్‌వ్యాల్యూ ఒకటి. ప్రస్తుతం బ్యాంకులు, లోహ షేర్లు, ఇన్ఫ్రా- రియల్టీ షేర్లు వాటి బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్నాయి. అసలు బుక్ వ్యాల్యూ అంటే ఏంటి? ఈ రంగాల షేర్లు ఎందుకు బుక్‌వ్యాల్యూ కన్నా తక్కువకు ట్రేడవుతున్నాయి? మున్ముందు ఈ షేర్ల పరిస్థితేంటి? ఇపుడు వీటిని కొనొచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... ఏడాది కిందట రూ.300పైగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఇపుడు అందులో సగం ధరకే దొరుకుతోంది. పతనానికి ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇదే కాదు. స్టాక్ మార్కెట్లో మొత్తం 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు లిస్టవగా... వాటిలో ఒక్కటి కూడా వాటి పుస్తక విలువకన్నా ఎక్కువకు ట్రేడ్ కావటం లేదు. ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం కొన్ని బుక్‌వ్యాల్యూ కన్నా ఎక్కువ ధరకే ట్రేడవుతున్నాయి. ఇక లోహ, రియల్టీ, ఇన్ఫ్రా, హౌసింగ్ రంగాలదీ అదే పరిస్థితి. నిజానికి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చాలా రంగాల పనితీరు పేలవంగా ఉంది. ఈ పతనానికి కారణాలేంటి? షేరు ధర దాని పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడవటానికి కారణాలు చాలా ఉంటాయి. కంపెనీ భవిష్యత్ పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసం లోపించడం ప్రధాన కారణం. కంపెనీ పనితీరు బాగోదన్న అంచనాలతో దాని షేరు పడిపోయి పుస్తక విలువకన్నా తక్కువకు ట్రేడవుతుంది. కం పెనీ తన పుస్తక విలువను పెంచుకోవడానికి ఖాతాల్లో కొన్ని విధానాల్ని అవలంబిస్తున్నదన్న ఇన్వెస్టర్ల అంచనాలూ షేరు ధర పుస్తక విలువకంటే తక్కువ ఉండటానికి మరో కారణం. కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీ తాలూకు రంగం బాగులేనట్లయితే... ఆ కంపెనీ పనితీరు బాగున్నా సరే షేరు విలువ తక్కువే ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు, మెటల్స్, ఇన్ఫ్రా, రియల్ట్లీ షేర్లు.. కంపెనీల పనితీరుతో సంబంధం లేకుండా పుస్తక విలువకంటే దిగువకు రావటానికి కారణమిదే. అన్నింటిలో విలువ ఉన్నట్లేనా?.... సాధారణంగా బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకు ట్రేడవుతున్న షేర్లను ఫండమెంటల్స్ ప్రకారం చౌకగా పరిగణి స్తారు. ఈ సూత్రాన్ని రెండు, మూడు దశాబ్దాల క్రితం అన్ని షేర్లకూ వర్తింపచేసేవారు. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ప్రవేశించకముందు చాలా షేర్ల విలువలు అవి ఉండాల్సిన మార్కెట్ విలువలకంటే తక్కువగా ట్రేడవుతుండేవి. లాభాలకు అప్పుడు కేవలం పుస్తక విలువ సూత్రాన్ని అనుసరించారు. ఇప్పుడలా కాదు. ఎన్నో రకాల సంస్థలు, ఫండ్స్, ధనిక ఇన్వెస్టర్లు, రీసెర్చ్ సంస్థలు మార్కెట్లో పాలుపంచుకుంటూ అధిక షేర్లను జల్లెడ పట్టేశాయి. విలువ ఉందని తెలిస్తే అతివేగంగా దాన్ని అమాంతం పెంచేయటం, లేదని గ్రహిస్తే క్షణాల్లో దించేయడం జరిగిపోతోంది. దీంతో పుస్తక విలువకన్నా తక్కువకు ట్రేడవుతున్న షేర్లన్నిటిలోనూ విలువ ఉందని భావించలేం. కానీ మార్కెట్ పడినపుడు, పెరిగినపుడు ఆ హెచ్చుతగ్గులు అతిగా ఉంటాయి. దాంతో పుస్తక విలువ కిందకు జారిపోవడం సహజం. అందుకే బుక్ వేల్యూను చూసేటపుడు దాని భవిష్యత్ వ్యాపార విలువకంటే అది తక్కువకు ట్రేడవుతోందా? అన్నది గమనించాలి. అంటే.. బుక్ వ్యాల్యూనే కాకుండా కంపెనీ రాబడుల రికార్డు, భవిష్యత్ వ్యాపార అవకాశాలు కూడా పరిశీలించాలి. కొన్ని ఆస్తుల విలువ తగ్గొచ్చు కూడా... ఆయా రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీయే స్వయంగా దాని ఆస్తుల విలువను హఠాత్తుగా పుస్తకాల్లో తగ్గించడం, లేదా రద్దుపర్చడం చేయొచ్చు. అలాంటపుడు దాని పుస్తక విలువ పడిపోతుంది. ఉదాహరణకు టాటా స్టీల్...బ్రిటన్ ఉక్కు కంపెనీ కోరస్‌ను, వేదాంతా లిమిటెడ్, చమురు కంపెనీ కెయిర్న్ ఇండియాను గతంలో కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు, చమురు ధరలు పతనం కావడంతో టాటా స్టీల్, వేదాంతాలు వాటి బుక్స్‌లో చూపిస్తున్న కోరస్, కెయిర్న్ ఆస్తి విలువల్ని భారీగా తగ్గించేశాయి. పీఈ విలువ అనూహ్యంగా మారినపుడు... ఫండమెంటల్స్ ప్రకారం కంపెనీ షేరు విలువను కొలవడానికి ఉపయోగించే మరో సాధనం పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్). ఒక్కో షేరుకు కంపెనీ ఆర్జించే లాభం (ఈపీఎస్)తో పోలిస్తే ప్రస్తుత షేరు ధర ఎంతుందో తెలిపేదే పీఈ. కొన్ని సందర్భాల్లో మారిన పరిస్థితులవల్ల ఒక కంపెనీకి నష్టం రావొచ్చు. లాభాలు పడిపోవొచ్చు. అపుడు షేరు పీఈ పెరుగుతుంది. అంటే పీఈ సూత్రం ప్రకారం అది ఖరీదైపోయిందని లెక్క. అపుడు పీఈని కాక పుస్తక విలువను పరిగణనలోకి తీసుకుని, షేరు కొనాలా... వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ మూలధనాన్ని ఉపయోగించి, వ్యాపారం చేసే కంపెనీల రాబడులు తొలుత తక్కువ ఉంటాయి. నెమ్మదిగా పెరుగుతాయి. అలాంటి కంపెనీల షేర్ల విలువను గుర్తించేందుకు పీఈకంటే పుస్తక విలువ బాగా ఉపకరిస్తుంది. టాటా స్టీల్, సెయిల్, ఎస్బీఐ వంటివి ఈ కోవలోకే వస్తాయి. పుస్తక విలువ అంటే... కంపెనీ ఆస్తుల్లోంచి, అప్పుల్ని, గుడ్‌విల్, పేటెంట్స్ వంటి కనిపించని ఆస్తుల్ని తీసివేయగా వచ్చే విలువనే కంపెనీ పుస్తక విలువగా పరిగణిస్తారు. అంటే...కంపెనీ ఖాతా పుస్తకాల్లో దానికి నికరంగా ఉన్న ఆస్తుల విలువన్న మాట. కంపెనీ పుస్తక విలువను ఆ కంపెనీ తాలూకు మొత్తం షేర్ల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే కంపెనీ షేరు పుస్తక విలువ. దీనికంటే ట్రేడవుతున్న షేరు ధర తక్కువగా ఉంటే దాని ప్రైస్ టు బుక్ వ్యాల్యూ 1 కంటే దిగువనున్నట్లు. బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో మూడోవంతు షేర్ల బుక్ వ్యాల్యూ ప్రస్తుతం 1 కంటే తక్కువే ఉంది మరి. పుస్తక విలువకంటే ఎక్కువ ఉన్నంత మాత్రాన.. కొన్ని కంపెనీల షేర్లు పుస్తక విలువకంటే బాగా ఎక్కువగా వుంటాయి. అంతమాత్రాన వాటిలో విలువ లేదని చెప్పలేం. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని కంపెనీలకు మూలధన అవసరాలు తక్కువ. అందుకని వాటి పుస్తక విలువలకన్నా చాలా ఎక్కువకు అవి ట్రేడవుతూ ఉంటాయి. ఐటీసీ వంటి కంపెనీ షేరు ధర దాని పుస్తక విలువతో పోలిస్తే 8 రెట్లుంది. వాటిని పుస్తక విలువతో కాకుండా భవిష్యత్ వ్యాపారం, భవిష్యత్ ఆర్జన, పీఈ వంటి సాధనాలతో అంచనా వేయాలి. ఏదైనా పరిశ్రమకు చక్రగతిన ఏర్పడే వ్యాపార ఒడిదుడుకుల కారణంగా ఆ పరిశ్రమ మొత్తం కుదేలైపోతుంది. దాంతో ఆ పరిశ్రమకు చెందిన కంపెనీల షేర్లు వాటి పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడ్‌కావొచ్చు. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, మెటల్ కంపెనీల పరిస్థితి అలానే వుంది. భవిష్యత్తులో ఆయా రంగాలు కోలుకుంటే ఆయా షేర్లు బాగా పెరుగుతాయి - మూర్తి గరిమెళ్ళ, స్టాక్ ఎనలిస్ట్ ఇతర ఫండమెంటల్స్ అన్నీ సక్రమంగా వుండి, షేరు దాని పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడవుతుంటే..ఆ కంపెనీ షేరు విలువ వుండాల్సిన స్థాయిలో లేదని అర్థం. డిస్కౌంట్ ధరకు ఆ షేరును స్వంతం చేసుకోవడానికి మంచి చాన్స్. - పంకజ్ పాండే, రీసెర్చ్ హెడ్ ఐసీఐసీఐ డెరైక్ట్ -
బ్యాంకులకు మరింత మూలధనం కావాల్సిందే: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ తాజా మూలధన కేటాయింపులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు తక్షణం ప్రయోజనాన్ని కల్పిస్తాయన్న అంశంలో సందేహం లేదని రేటింగ్ ఏజెన్సీ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) పేర్కొంది. అయితే ఈ నిధులు దీర్ఘకాలానికి పూర్తి స్థాయిలో సరిపోవని పేర్కొంది. రానున్న నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధన కేటాయింపులు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.25,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే అందించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుత మూలధన కేటాయింపులు దీర్ఘకాలానికి, దేశ వృద్ధి అవసరాలకు సరిపోవని విశ్లేషించిన ఎస్అండ్పీ, బలహీన బ్యాంకులు మొండిబకాయిలు ఇబ్బంది కరమేనని విశ్లేషించింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’
నెలరోజుల్లోగా రూ. 20,088 కోట్లు ♦ హోల్డింగ్ కంపెనీ, బ్యాంక్ బోర్డు బ్యూరో ♦ రాజకీయ ప్రమేయం తగ్గింపు ♦ కేంద్రం ఏడు సూత్రాల ప్రణాళిక న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం శుక్రవారం ఏడు సూత్రాల ప్రణాళిక ‘ఇంద్రధనుష్’ను ఆవిష్కరించింది. దీని కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 పీఎస్బీలకు రూ. 25,000 కోట్లు అందించనుంది. ఇందులో రూ. 20,088 కోట్లు నెలరోజుల్లోగాను, మిగతా రూ. 5,000 కోట్లు ఆఖరు త్రైమాసికంలోనూ ఇవ్వనుంది. బ్యాంకుల్లో నియామకాల కోసం బోర్డు ఆఫ్ బ్యూరో ఏర్పాటు, మూలధనం సమకూర్చడం, మొండిబకాయిల తగ్గింపు చర్యలు, రాజకీయ ప్రమేయం తగ్గిస్తూ సాధికారత కల్పించడం, జవాబుదారీతనం పెంచడం, గవర్నెన్స్‌పరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం, హోల్డింగ్ సంస్థ ఏర్పాటు చేయడం అనే ఏడు అంశాలతో ఈ ఇంద్రధనుష్ ప్రణాళికను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం కేంద్రం బ్యాంకుల్లో తన వాటాలకు సంబంధించి బ్యాంక్ ఇన్వెస్ట్ కమిటీ పేరిట ప్రత్యేక హోల్డింగ్ సంస్థను ఏర్పాటు చేస్తుంది. అలాగే పీఎస్బీల్లో ప్రొఫెషనలిజం తెచ్చే దిశగా ప్రభుత్వం 2 బ్యాంకులకు ప్రైవేట్ రంగ బ్యాంకర్లను సారథులుగా నియమించింది. మొండిబకాయిలపై ఆందోళన అక్కర్లేదు .. ఉక్కు, విద్యుత్, హైవేలు, డిస్కమ్‌లు, కొంత మేర చక్కెర తదితర రంగాల్లో మందగమనం వల్లే పీఎస్బీల్లో మొండి బకాయిల సమస్య పెరుగుతోందని, అయితే దీనిపై తీవ్రంగా ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వ్యాపారపరమైన నిర్ణయాలు వ్యాపార దృక్పథంతోనే తీసుకోవాలని, బ్యాంకుల వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలన్నదే తమ లక్ష్యమని జైట్లీ చెప్పారు. భారతీయ మహిళా బ్యాంకును ప్రభుత్వ రంగ ఎస్బీఐలో విలీనం చేయడంపై నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన వివరించారు. ఏప్రిల్ 1 నుంచి బీబీబీ కార్యకలాపాలు.. బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ ఏర్పాటయ్యే దాకా ఆ బాధ్యతలను బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరో (బీబీబీ) చూస్తుందని జైట్లీ చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో బీబీబీ సభ్యులను ఎంపిక చేస్తామని, 2016 ఏప్రిల్ 1 నుంచి ఇది కార్యకలాపాలు మొదలుపెడుతుందని ఆయన వివరించారు. బ్యాంకులో డిజిన్వెస్ట్‌మెంట్ యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. రాజకీయ జోక్యం లేకుండా బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. బ్యాంకుల్లో టాప్ మేనేజ్మెంటుకు ఎసాప్స్ (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్) కూడా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఎస్బీఐకి రూ. 5 వేలకోట్లు.. కేంద్రం అందించే నిధుల్లో అత్యధికంగా ఎస్బీఐకి రూ. 5,531 కోట్లు లభించనున్నాయి. మిగతా వాటిల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,455 కోట్లు, ఐడీబీఐ (రూ. 2,229 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ. 2,009 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 1,786 కోట్లు), పీఎన్బీ (రూ.1,732 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫిండియా (రూ. 1,080 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 947 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ. 857 కోట్లు), దేనా బ్యాంకు (రూ. 407 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 394 కోట్లు), ఆంధ్రా బ్యాంకు (రూ. 378 కోట్లు), అలహాబాద్ బ్యాంకు (రూ. 283 కోట్లు) అందుకోనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో పీఎస్బీలకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చడంలో భాగంగా కేంద్రం ఈ నిధులను అందిస్తోంది. మరో రూ. 1.10 లక్షల కోట్లు అవి మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. 5 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు.. ప్రభుత్వ రంగంలోని ఐదు బ్యాంకులకు కొత్త చీఫ్‌లను(ఎండీ-సీఈఓ) ప్రకటించింది. వీటిలో రెండు బ్యాంకులకు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ నిపుణులు నియమితులయ్యారు. ఈ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరాబ్యాంక్‌లు ఉన్నాయి. ఈ తరహా నియామకాలు ఇదే తొలిసారి. బ్యాంక్ ఆఫ్ బరోడా : వీబీహెచ్సీ వ్యాల్యూ హోమ్స్ సీఈఓ పీఎస్ జయకుమార్(53)ను బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమించారు. కెనరా బ్యాంక్ : ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేష్ శర్మ కెనరా బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా : ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎంఓ రెగో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు. ఐడీబీఐ : యూనియన్ బ్యాంక్ ఈడీ కిషోర్ కారత్ పిరాజి ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ : భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆమె శుక్రవారమే బాధ్యతలు చేపట్టారు. -
బ్యాంక్ షేర్ల ర్యాలీ..ప్రభావం చూపిన
పెట్టుబడులు, రేట్ల కోత ఆశలు - 72 పాయింట్ల లాభంతో 28,187 పాయింట్లకు సెన్సెక్స్ - 10 పాయింట్ల లాభంతో 8,543కు నిఫ్టీ ఆర్బీఐ విధాన సమీక్ష నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగింది. 2 నెలల్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల నిధులు అందించనున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కారణంగా బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. దీనికి తోడు కీలక రేట్ల కోత ఉంటుందనే అంచనాలతో బ్యాంక్, వాహనషేర్లు ఎగిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 72పాయింట్లు లాభపడి 28,187 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 8,543 పాయింట్ల వద్ద ముగిశాయి.సెన్సెక్స్‌కు ఇది ఒక వారం గరిష్ట స్థాయి. నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడింది. ఎఫ్ఐఐల విశ్వాసం... ఈ వారంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రారంభించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. చైనా తయారీ రంగం వృద్ధి జూలైలో రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఆసియా మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. అయినప్పటికీ, ఇక్కడ బ్యాంక్, వాహన షేర్ల ర్యాలీతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు జూలైలో జోరుగా ఉండడంతో వాహన షేర్లుపెరగడం, కొన్ని బ్లూ-చిప్ షేర్ల ఆర్థిక ఫలితాలు బావుండడం కూడా ప్రభావం చూపాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత నెలలో రూ.2,298 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం భారత మార్కెట్‌పై వారి విశ్వాసాన్ని సూచిస్తోందని నిపుణులంటన్నారు. కాగా నేడొక్కరోజే 209 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. -
బ్యాంక్ షేర్ల జోరు 28 వేల పాయింట్లపైకి సెన్సెక్స్
- 240 పాయింట్ల లాభంతో 28,021 పాయింట్లకు ప్రధాన సూచీ - 85 పాయింట్ల లాభంతో 8,453కు నిఫ్టీ... ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెట్టుబడులందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎనిమిది కీలక పరిశ్రమల గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 మార్క్‌ను. నిఫ్టీ 8,400 మార్క్‌ను దాటాయి. సెన్సెక్స్ 240 పాయింట్లు లాభపడి 28,021 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 8,453 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీ లు రెండున్నర నెలల గరిష్టానికి చేరాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. ఒక్కటి మినహా అన్ని సూచీలు లాభాల్లోనే... గ్రీస్ ప్రధాని బెయిలవుట్ ప్యాకేజీకి అంగీకరించనున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను లాభాల్లో ముంచెత్తాయి. ఇది మన మార్కెట్లపై సానుకూలత చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల వల్ల భారత మార్కెట్లోకి నిధులు తరలివస్తాయని, ఈ విశ్వాసం తోనే పలు కంపెనీలు ఐపీఓల కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నాయనే అంచనాలూ మార్కెట్ లాభాలకు తోడ్పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,800- 28,099 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. మార్కెట్ క్యాప్... ఓఎన్జీసీ స్థానంలోకి కోల్ ఇండియా... షేర్ ధర పరుగు కారణంగా... అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీగా కోల్ ఇండియా నిలిచింది. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న ఓఎన్జీసీ రెండో స్థానానికి పడిపోయింది. గురువారం నాటికి కోల్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.2,68,509 కోట్లుగా, ఓఎన్జీసీ మార్కెట్ క్యాప్ 2,68,386 కోట్లుగా ఉన్నాయి. 30కి 23 సెన్సెక్స్ షేర్లు లాభాల్లోనే..: 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,226 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,886 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,75,052 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.75 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.52 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో రూ. 11,500 కోట్లు!
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం మరో రూ. 11,500 కోట్ల మూలధనం సమకూర్చే అవకాశముందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన దాదాపు రూ. 7,940 కోట్లకు ఇది అదనమని ఆయన వివరించారు. ప్రపంచ స్థాయి మూలధన ప్రమాణాలను అందుకునేందుకు, వృద్ధి సాధించేందుకు పీఎస్బీలకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం దాదాపు రూ. 57,000 కోట్ల నిధులు సమకూర్చాలని భావిస్తున్నట్లు మహర్షి ఇటీవలే వెల్లడించారు. -
పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో 12న జైట్లీ భేటీ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 12న సమావేశం కానున్నారు. ప్రధానంగా బ్యాంకుల వార్షిక పనితీరు, మొండిబకాయిల పరిస్థితిపై ఈ భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా వృద్ధికి ఊతమిచ్చేవిధంగా రుణ రేట్ల కోతపై దృష్టిపెట్టాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు బేస్ రేటును తగ్గించగా, మరికొన్ని ఈ బాటలోనే ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకులతో పాటు నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ తదితర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల చీఫ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. కాగా, జన ధన యోజన, ప్రధాన మంత్రి సామాజిక భద్రత పథకాల పురోగతి, రుణ వృద్ధి వంటి అంశాలను కూడా సమావేశంలో సమీక్షించనున్నారు. -
నేడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
నేడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకోసం బుధవారం సమ్మె చేయనున్నారు. దీనితో ఈ బ్యాంకుల్లో చెక్కు క్లియరెన్స్ వంటి సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. వేతన సవరణసహా పలు డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేయాలని ఉద్యోగ సంఘాలు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులకు సమ్మె చేయడం మినహా గత్యంతరం లేకుండా పోయిందని యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతన పెంపును 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గించినా ఐబీఏ స్పందించలేదని అన్నారు. 11 శాతం పెంపుదల ప్రతిపాదన తమకు సమ్మతం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తానికి సంబంధించి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 50,000 బ్రాంచీలలో ఉద్యోగుల సంఖ దాదాపు 8 లక్షలు. -
బాబోయ్... బకాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరుగుతున్న నిరర్థక ఆస్తులతో ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్రంగా సతమతమవుతున్నాయి. మొండిబకాయిల కేసుల్లో చిక్కుకుని పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీల రాజీనామాలు, అరెస్టులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో స్పష్టమవుతోంది. యునెటైడ్ బ్యాంక్‌లో ఎన్పీఏలు ఒక్కసారిగా పెరిగిన కారణం వల్ల ఆ బ్యాంక్ సీఎండీ అరెస్ట్ జరిగితే, పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకున్న భూషణ్ స్టీల్ కంపెనీ రుణాల పునర్ వ్యవస్థీకరించడం కోసం లంచం తీసుకుంటూ సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రూ. 40,000 కోట్ల రుణాలు కలిగిన భూషణ్ స్టీల్ దివాళా తీస్తే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులను అధికంగా భయపెడుతోంది. దేశీయ కార్పొరేట్ ఎన్‌పీఏలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 7,500 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 4,000 కోట్ల ఎన్పీఏలు భూషణ్ స్టీల్ ముందు దిగదుడుపే. అందుకే బ్యాంకులు ఇప్పుడు భూషణ్ స్టీల్ రుణాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు ఈ రుణాల వసూలుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి. చివరకు భూషణ్ స్టీల్ వ్యవహారం ఎటు దారితీస్తోందనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో కొంత నయం ఆర్థిక మందగమనం ప్రభావం రుణ చెల్లింపులపై స్పష్టంగా కనిపించింది. గత నాలుగేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు మూడు రెట్లు పెరిగాయి. 2010-11లో పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండి బకాయిల విలువ రూ. 71,080 కోట్లుగా ఉంటే 2013-14కి రూ. 2.16 లక్షల కోట్లకు పెరిగాయంటే పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కాని ఇదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల వృద్ధి కేవలం 26 శాతంగానే ఉంది. 2011-12లో రూ. 17,972 కోట్లుగా ఉన్న ఎన్పీఏలు, గత మార్చి నాటికి రూ. 22,744 కోట్లకు చేరాయి. ఇచ్చిన రుణాల విలువ పెరగడం వల్ల ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏ విలువ పెరిగినట్లు కనిపిస్తున్నా, మొత్తం విలువలో ఎన్పీఏల వాటాను చూస్తే స్వల్పంగా తగ్గడం విశేషం. 2011 మార్చినాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.84 శాతంగా ఉంటే అది డిసెంబర్, 2013 నాటికి 5.07 శాతానికి చేరింది. ఇదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏ 2.29 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయి. ప్రభుత్వ బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్పీఏలు పెరగడానికి ఒక కారణంగా బ్యాంకు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, ఏదైనా ఒక అకౌంట్ ఎన్పీఏగా మారుతుంటే ముందుగానే వడ్డీ పెంచడం లేదా చెల్లించాల్సిన బకాయిని మొత్తానికి కలిపి రుణ కాలపరిమితిని పెంచుతూ పునర్ వ్యవస్థీకరించడం చేస్తున్నాయని, దీంతో ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్పీఏల శాతం తక్కువగా ఉందంటున్నారు. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడానికి ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఆగిపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల పనులు మధ్యలో ఆగిపోవడంతో వాటికిచ్చిన రుణాల్లో అత్యధిక శాతం ఎన్పీఏలుగా మారాయి. 2011 మార్చిలో ఇన్ఫ్రా విభాగంలో 3.23 శాతంగా ఉన్న ఎన్పీఏలు గత మార్చినాటికి ఏకంగా 8.22 శాతానికి ఎగబాకింది. వీటితోపాటు స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో కూడా ఎన్పీఏలు భారీగా పెరిగాయి. వృద్ధి బాట పడితేనే... ఆర్థిక వృద్ధి మందగమనం వల్లే నిరర్థక ఆస్తులు పెరిగాయని, ఒక్కసారి తిరిగి వృద్ధి బాటలోకి పయనిస్తే ఎన్‌పీఏల్లో తగ్గుదల నమోదవుతుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇక్కడ నుంచి తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిన ఇన్ఫ్రా ప్రాజెక్టులను వేగంగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటే మొండిబకాయిల చిక్కులు సగం తీరినట్లేనని వెల్లడించాయి. -
మళ్లీ ‘మైక్రో’ భూతం!
పరిగి: సూక్ష్మ రుణాల (మైక్రో ఫైనాన్స్) భూతం మళ్లీ తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తోంది. రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేస్తోంది. కొంతకాలం క్రితం ప్రభుత్వ చర్యలతో కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపించినా ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలను మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం వేసిన కమిటీలు నామమాత్రంగా మారడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీల నియామకంతోనే మమ అనిపించిన సర్కారు సూక్ష్మ రుణ సంస్థల వేధింపుల్ని మాత్రం అరికట్టలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా బ్యాంకులు రుణలివ్వకుండా వెనకాడుతుండటాన్ని ఆసరాగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతూ వసూళ్లు ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలంలోని సోండేపూర్ తండాకు చెందిన పలువురికి నోటీసులు అందజేయడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. సుమారు రూ. 20 కోట్ల రుణాలు పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఎల్అండ్టీ, ఎస్కేఎస్, స్పందన తదితర సూక్ష్మ రుణాల సంస్థలు సుమారు రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి. బ్యాంకుల నుంచి తమకు అవసరమైన మేర రుణాలివ్వనందునే ప్రజలు ఆయా సంస్థలను ఆశ్రయిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. నియోజకవర్గంలో ప్రభుత్వరంగ బ్యాంకులు సంవత్సర కాలంలో ఇస్తున్న రుణాలకు దీటుగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అధికంగా ఇచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ.. చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆదుకోని ఆర్థిక చేకూర్పు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సైతం రుణాలిచ్చేందుకు మహిళా సంఘాలనే ఎంచుకుంటున్నాయి. మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలను ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళకు ఏయే అవసరాలున్నాయనే దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనంచేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బంది ప్రణాళిక తయారు చేశారు. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు. -
When a cheque is drawn on a bank..
Banks Special Banking Awareness 1. RBI advised Public Sector Banks not to impose any penalty for? a) Overdue loan installments b) Not maintaining minimum balance in inoperative savings deposit accounts c) Not paying the housing loan installments regularly d) Obtaining statement of acc-ount for the 2nd time in a month e) None of the above 2. With the aim of achieving Fin-ancial Inclusion, Reserve Bank Of India has issued guidelines permitting the banks to em-ploy…to facilitate Business De-velopment. a) business correspondets b) franchisees c) business facilitators d) Both 'a' & 'c' e) None of the above 3. What does the letter 'P' denote in "BPLR", a term seen very fre-quently in banking Industry? a) Priority b) Prime c) Property d) Poverty Line Register e) None of these 4. The time taken to convert cash into raw materials, semi finished goods, finished goods and into cash, is known as? a) Trade cycle b) Cash cycle c) Operating cycle d) Revolving cycle e) None of the above 5. Which of the following term is used in banking field? a) Zero hour b) Sedimentary c) Privilege Motion d) Interest rate swap e) None of these 6. Nationalization of banks aimed at all of the following except? a) Provision of adequate credit for agriculture, SME & expo rts b) Removal of control by a few capitalists c) Provision of credit to big industries only d) Access of banking to masses e) Encouraging big industrialists 7. With reference to a cheque, which of the following is the 'Drawee Bank'? a) The bank that collects the cheque b) The payee's bank c) The endorsee's bank d) The endorser's bank e) The bank upon which the cheque is drawn 8. Reverse mortgage scheme flo-ated by banks is related to? a) Below 12 years children b) Above 12 years age group c) Senior citizens d) All of these e) None of these 9. A stop payment instruction of a cheque can be issued by? a) The payee b) The endorsee c) The drawer d) The drawee e) None of the above 10. RBI issued license to IDFC and Bandhan in April 2014 with in-structions to commence its bu-siness within? a) 12 months b) 15 months c) 18 months d) 24 months e) No such restriction 11. At a Railway station, you with-draw cash from ATM of State Bank of India. SBI is a? a) Paying Banker b) Collecting Banker c) Advising Banker d) Issuing Banker e) None of the above 12. Interest rate on savings account deposit above Rs. 1Lakh is fixed by? a) RBI b) Respective Bank c) The Depositors d) NABARD e) None of these 13. Which of the following is NOT an instrument of credit control? a) Raising and lowering of inte-rest rates b) Raising and lowering of Discount rates c) Targets for priority sector loans d) Raising and lowering of CRR and SLR e) Raising the minimum support price of agriculture produce 14. Which one of the following Non Resident Deposit schemes is not permitted? a) FCNR a/c b) NRNR a/c c) NRE a/c d) NRO a/c e) All of the above 15. The European Union has adopted which of the following as a com-mon currency? a) Dollar b) Euro c) Dinar d) Yen e) Peso 16. Hari issues a stop payment in-structions to his banker to Stop payment of a cheque for Rs. 20,000.00. This is? a) A request from Hari b) An intimation from Hari c) An advice from Hari d) A mandate from Hari e) None of the above 17. Which of the organization is made specifically responsible for empowering Micro, Small and Medium enterprise in India? a) NABARD b) RBI c) SIDBI d) ECGC e) SEBI 18. When a cheque is drawn on a bank, the bank is called the? a) Payee b) Drawee c) Drawer d) Endorsee e) None of the above 19. The minimum percentage of Priority Sector advances to be maintained by foreign banks in India? a) 40% b) 18% c) 32% d) 60% e) None of the above 20. If a bank in India, wants to un-dertake capital market activities, it should? a) Obtain special license from AMFI b) Obtain special license from FIMMDA c) Obtain special permission from RBI d) Register with SEBI e) None of the above 21. Which of the following are called Non Fund based facilities? a) Letters of Credit b) Bank Guarantees c) Co-acceptance of Bills d) Trust Receipt e) a, b & c 22. Investing in the Tax Saver Deposit Account Scheme in a Bank would get benefit under? a) Sales Tax b) Customers Duty c) Excise Tax d) Professional Tax e) Income Tax 23. A company which pools money from investors and invests in stocks, bonds, shares is called? a) A bank b) An insurance company c) Bancassurance d) Mutual Fund e) None of the above 24. Which was the first Mutual Fund started in India: a) SBI Mutual Fund b) Kotak Pioneer Mutual Fund c) Indian Bank Mutual Fund d) BOI Mutual Fund e) None of the above 25. The apex institution which han-dles refinance for agriculture and rural development is called a) RBI b) SIDBI c) NABARD d) SEBI e) None of the above 26. In respect of Regional Rural Banks, the share holding pattern is? a) Central Government 50%, St-ate Government 35%, Spon soring Bank 15% b) Central Government 50%, St-ate Government 15%, Spon-soring Bank 35% c) Central Government 15%, St-ate Government 35%, Spon-soring Bank 50% d) Central Government 35%, St-ate Government 50%, Spon-soring Bank 15% e) None of the above 27. Which of the following is NOT a Consumer Right as per Con-sumer Protection Act 1986? a) Right to Consumer Education b) Right to Safety c) Right to be informed d) Right to Negotiate e) None of these 28. In bank's parlance credit risk in lending is? a) Default of the banker to maintain CRR b) Default of the banker to maintain SLR c) Default of the banker to release credit to the customer d) Default of the customer to repay the loan e) None of the above 29. Which of the following is cla-ssified as Retail Banking? a) Home Loans b) Personal Loans to Individuals c) Credit Cards d) Vehicle loans for personal use e) All of the above 30. Maximum amount of Housing Loan that can be classified as Priority Sector Advance is? a) Rs.10 Lakh b) Rs.15 Lakh c) Rs.20 Lakh d) Rs.25 Lakh e) None of the above 31. How does a certificate of deposit (CD) differs from a fixed deposit (FD)? a) Prepayment of CD is not allowed b) Loan against CD is not allowed c) Minimum period of both CD and FD is 7 days d) a and b e) None of the above 32. Which of the following service is provided only by the Reserve Bank of India? a) Sale of Demand Drafts b) Compilation of economic data c) Issued of currency notes d) Safe deposit lockers for keeping valuable e) All of these 33. The type of finance that nor-mally State Government/ Central Government avails as a Tem-porary Financial Assistance fro-m Reserve Bank of India is called …. a) Temporary Finance b) Short Term Loan c) Ways & Means Advance d) Overdraft e) None of the above 34. The First Electronic ATM was installed in Enfield Town in North London on 27th June 1967 by which bank? a) Bank of England b) Grindlays Bank c) Barclays Bank d) New bank of India e) None of the above 35. Maximum number of share-holders in a public limited com-pany is? a) 100 b) 50 c) 7 d) No limit e) None 36. Reserve bank of India's Fun-ctions are classified into? a) Supervisory & Regulatory b) Refinance Activities c) Promotion & Development d) All of these e) None of the above 37. A worldwide financial mes-saging network which exchanges messages between banks and financial institutions is known as: a) SWIFT b) SFMS c) NEFT d) CHIPS e) CHAPS 38. Smart Card has? a) In-built memory b) No in-built memory c) Punched card d) Volatile memory e) None of the above 39. Which of the following is not a part of public Sector Banks? a) State bank of Hyderabad b) Indian Bank c) RRB Sponsored by a Natio-nalized bank d) ICICI Bank e) None of the above KEY 1) b 2) d 3) b 4) c 5) d 6) e 7) b 8) c 9) c 10) c 11) a 12) b 13) e 14) b 15) b 16) d 17) c 18) b 19) c 20) d 21) e 22) d 23) d 24) e 25) c 26) b 27) c 28) d 29) e 30) d 31) d 32) b 33) c 34) c 35) d 36) d 37) b 38) a 39) d. -
పీఎస్‌యూ బ్యాంకుల మార్కెట్ వాటా పడిపోతుంది!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల మార్కెట్ వాటా 2025కల్లా 20% క్షీణించడం ద్వారా 60%కు పరిమితమవుతుందని రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అంచనా వేసింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో పీఎస్‌యూ బ్యాంకుల వాటా 2000లో 80%గా నమోదైంది. ప్రభుత్వం వాటాలు తగ్గించుకోవడం, బ్యాంకులు పనితీరు మెరుగుపరచుకోవడం వంటి చర్యలను చేపట్టకపోతే మార్కెట్ వాటా పడిపోతుందని తెలిపింది. కాగా, ఇదే సమయంలో ప్రయివేట్ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా మూడో వంతుకు పుంజుకోనున్నట్లు పేర్కొంది. 2000లో ప్రయివేట్ రంగ బ్యాంకుల వాటా 12%గా నమోదైంది. ఇక విదేశీ బ్యాంకుల కార్యకలాపాలు నామమాత్రంగా ఉండనున్నట్లు అభిప్రాయపడింది. ఆస్తుల ఒత్తిడి ... పీఎస్‌యూ బ్యాంకులు అటు మొండి బకాయిలతోపాటు, ఇటు తగినంత మూలధన పెట్టుబడులు లేక ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు ఆర్బీఐ కమిటీ నివేదిక వివరించింది. ఇవి బ్యాంకుల వృద్ధిని అడ్డగిస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 15 ప్రయివేట్ రంగ బ్యాంకులతోపాటు, 30 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. -
ఈ నెల 23న బ్యాంకుల సమ్మె నోటీసు
ముంబై: నాయక్ కమిటీ రికమండేషన్లకు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు ఈ నెల 23న సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ విషయమై యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి. జె. నాయక్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్బీఐ నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతానికి తగ్గించుకోవాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని, బ్యాంకులను కూడా కంపెనీల చట్టం పరిధిలోకి తేవాలని, ఇంకా కొన్ని ఇతర అంశాలను ఈ నాయక్ సూచించింది. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ఇలాంటి రికమండేషన్లను, ఇతర ఏ ప్రయత్నాలనైనా తాము వ్యతిరేకిస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. 10 లక్షల బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు ప్రాతినిధ్యం వహించే ఐదు జాతీయ స్థాయి బ్యాంక్ యూనియన్లు నాయక్ కమిటీ సూచనలను వ్యతిరేకిస్తున్నాయని మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి విశ్వాస్ ఉతాగి పేర్కొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్(ఐఎన్‌బీఓసీ).. ఈ 5 బ్యాంక్ యూనియన్లు నాయక్ కమిటీ సూచనలను వ్యతిరేకిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపనున్నాయి. -
పీఎస్‌యూ బ్యాంకులకు మరో రూ.8 వేల కోట్ల మూలధనం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్ల అదనపు క్యాపిటల్‌ను అందించే అవకాశముంది. తాత్కాలిక బడ్జెట్లో ఇందుకు రూ.11,200 కోట్లు కేటాయించామనీ, ఇంతకంటే ఎక్కువ మొత్తం అవసరం ఉన్నప్పటికీ రూ.6,000 - 8,000 కోట్ల స్థాయిలో సమకూర్చుతామనీ ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సాంధు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో మంగళవారం ఆర్థిక మంత్రి చిదంబరం సమావేశం అనంతరం సాంధు మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేది కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమేనని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14 వేల కోట్ల మూలధనాన్ని పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.రెండు వేల కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.1,200 కోట్లు వెళ్లాయి. గ్లోబల్ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకులన్నీ టైర్-1 క్యాపిటల్‌ను పెంచుకునే యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ప్రమాణాల ప్రకారం భారతీయ బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల అదనపు క్యాపిటల్ అవసరమని రిజర్వు బ్యాంకు అంచనా. నిధుల సమీకరణకు హోల్డింగ్ కంపెనీలు.. విస్తరణకు అవసరమైన నిధుల కోసం హోల్డింగ్ కంపెనీ, స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పీఎస్‌యూ బ్యాంకులకు చిదంబరం సూచించారు. మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితి మెరుగుపడి 4.44 శాతానికి చేరిందనీ, అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.07 శాతంగా ఉందనీ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గాలి - నాయక్ కమిటీ నివేదిక ముంబై: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల్లో సర్కారు తన వాటాను 50 శాతం కంటే తక్కువ స్థాయికి తగ్గించుకోవాలని యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.జె.నాయక్ సారథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సూచించింది. బ్యాంకులను ప్రస్తుతం పాలిస్తున్న తీరును విమర్శించింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక శాఖల పెత్తనం, సీవీసీ, కాగ్ వంటి బాహ్య సంస్థల నిఘా తదితర పరిమితులతో పీఎస్‌యూ బ్యాంకులు సతమతం అవుతున్నాయని నాయక్ కమిటీ రూపొందించిన నివేదిక పేర్కొంది. ‘పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువకు తగ్గిపోతే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బ్యాంకులపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గకుండానే ఆ బ్యాంకుల్లో ప్రధాన వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుంది. తద్వారా బ్యాంకులు మరింత విజయవంతంగా పనిచేయడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బ్యాంకుల పాలనా సంబంధమైన పలు విధులకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. 1970, 80ల నాటికి బ్యాంకుల జాతీయకరణ చట్టాలతో పాటు ఎస్బీఐ చట్టం, ఎస్బీఐ (అనుబంధ బ్యాంకుల) చట్టాలను రద్దు చేయాలి. అన్ని బ్యాంకులనూ కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలి. బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటా బదిలీకోసం బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటుచేయాలి...’ అని కమిటీ సూచించింది. -
ఎన్పీఏలపై బ్యాంకర్లతో చిదంబరం సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల అధిపతులతో ఆర్థికమంత్రి పి.చిదంబరం 12, 13 తేదీల్లో భేటీ కానున్నారు. ఆర్థిక మంత్రి హోదాలో ప్రభుత్వ అధికారులతో చిదంబరం జరిపే చివరి సమావేశం ఇదేనని అధికార వర్గాలు తెలిపాయి. జీవిత, సాధారణ బీమా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో సోమవారం చిదంబరం చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా బీమా సంస్థల పనితీరును ఆయన సమీక్షిస్తారు. మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యే చిదంబరం బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండిబకాయిల సమస్యపైనే ప్రధానంగా దృష్టిపెడతారని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్పీఏలు (నిరర్ధక ఆస్తులు) తగ్గించుకోవాలని, బకాయిల వసూ ళ్లను ముమ్మరం చేయాలని బ్యాంకులకు సూచిస్తారని సమాచారం. 2013 డిసెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.18,933 కోట్ల విలువ మొండిబకాయిలను వసూలు చేశాయి. అయితే మార్చితో ముగిసిన ఏడాది కాలంలో ఈ బకాయిలు 28.5% పెరిగి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన నాటి నుంచి రుణాల ఎగవేత బ్యాంకులకు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు కోట్లలో పేరుకుపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడించిన వరుస త్రైమాసిక ఫలితాల్లో నిరర్ధక ఆస్తులు పెరుగుతూనే వచ్చాయి. ఈ బ్యాంకులన్నిటిలో పేరుకుపోయిన మొత్తం నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.03 లక్షల కోట్లు. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కూడా వసూలు కాని మొండిబకాయిలు లక్షల కోట్లలోనే ఉన్నాయి. బ్యాం కుల్లో మొండి బకాయిలు ఇలానే పెరుగుతూపోతే భవి ష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అసాధ్యమని ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఓఈసీడీ హెచ్చరించింది. -
ఓబీసీ డిపాజిట్ రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. 3 విభిన్న కాలవ్యవధులున్న డిపాజిట్లపై 3.25 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచింది. కొత్త రేట్లు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంక్ పేర్కొంది. తాజా చర్యలతో 31-45 రోజుల వ్యవధిగల డిపాజిట్లపై వడ్డీరేటు ఇప్పుడున్న 6% నుంచి 9.25%కి పెరిగింది. 46-90 రోజుల డిపాజిట్లపై 8.5% నుంచి 9.5%కి; 91-179 రోజుల డిపాజిట్లపై 8.75% 9.75%కి రేట్లను పెంచినట్లు వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్ బేస్‌రేటు కూడా..: అలహాబాద్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేటు) 0.05 శాతం పెరుగుదలతో 10.25 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలతో సహా అన్ని కొత్త రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేనా బ్యాంకు ఎఫ్సీఎన్ఆర్ రేట్ల సవరణ.. ఎఫ్సీఎన్ఆర్(ఫారిన్ కరెన్సీ నాన్-రిపాట్రియబుల్) (బి), ఆర్ఎఫ్సీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను దేనా బ్యాంక్ సవరించింది. దీని ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల దాకా వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 2.57 శాతం నుంచి 2.55 శాతానికి, 4 నుంచి 5 ఏళ్ల దాకా డిపాజిట్లపై 5.24 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గించింది. -
తొలిరోజు సమ్మె సంపూర్ణం
విజయగనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో జాతీయ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సోమవారం నిర్వహించిన తొలి రోజు సమ్మె సంపూర్ణంగా విజయవంతమయింది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ జాతీయ కమిటీల పిలుపుతో జిల్లాలోని వివిధ జాతీయ బ్యాంక్‌ల సిబ్బంది స్పందిం చి సమ్మెలోపాల్గొన్నారు. జిల్లాలో ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వివిధ జాతీయ బ్యాంకులు 156, గ్రామీణ వికాస బ్యాంక్ శాఖలు 79 వరకు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు 900 మంది వరకు ఉన్నారు. వీరంతా విధులకు వెళ్లక పోవడంతో ఆయా బ్యాంకుల్లో సేవలు నిలిచి పోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులో వివిధ రూపాలలో రూ. 130 కోట్ల వరకు లావాదేవీలు స్తంభించాయి. ప్రజావ్యతిరేక విధానాన్ని విడనాడాలి: ఎస్బీఐ రీజనల్ కార్యదర్శి శంకరసూర్యారావు బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాన్ని విడనాడాలని ఎస్బీఐ అధికారుల సంఘం రీజనల్ కార్యదర్శి పి.శంకరసూర్యారావు డిమాండ్ చేశా రు. సమ్మె నేపథ్యంలో స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన నిరసన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత కార్యాలయం ఎదుట నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలు రావడం లేదని గ్రామీణ ప్రాంతాల బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం మూసివేస్తూ చర్యలు తీసుకుంటోందని ఆరోపించా రు. ఉద్యోగ భద్రత లేని అవుట్ సోర్సింగ్ విధానం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని ఆవే దన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరా జు, సీఐటీయూ అధ్యక్షుడు ఎంశ్రీనివాస, ఎస్బీఐ సిబ్బంది రీజనల్ కార్యదర్శి పి.సతీష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు బి.శంకరరావు, మధుసూదనరావు, సభ్యులు సూర్యలక్ష్మి, చక్రపాణి, సంతోష్, గుప్తా, స్వామి, ప్రసాద్, జగదీష్, రవి, అప్పలరాజు, మురళిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘వికాస బ్యాంక్’ సమ్మె సక్సెస్ ఉద్యోగుల వేతన ఒప్పందం సాధన కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులు, ఎంప్లాయీస్ సంఘాలు చేపట్టిన సోమవారం సమ్మె సక్సెస్ అయింది. సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు రెండు రోజుల పాటు సమ్మెకు తలపెట్టారు. స్థానిక బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట తొలుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జోనల్ కార్యదర్శి టి.రవి, అధ్యక్షుడు డీవీఎస్ఏఎన్.రాజు, ఉద్యోగుల సంఘం రీజియన్ కార్యదర్శి ఎన్.ఎన్.రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంవీటీ.నాగేశ్వరరావు, కార్యదర్శి గంగరాజు పాల్గొన్నారు. -
బ్యాంకుల సమ్మెతో స్తంభన
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో ఎక్కడా రూపాయి లేదు. బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకుందామంటే ఒక్క బ్యాంకూ పనిచేయట్లేదు. వేసిన చెక్కులు వేసినట్లే, క్లియరెన్సు లేకుండా ఆగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది, అధికారులు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వేతనాలు సవరించాలని డిమాండు చేస్తూ సిబ్బంది ఈ రెండురోజులూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ లాంటి ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం పని చేస్తుండటంతో వినియోగదారులకు కొద్ది ఊరట లభించింది. వేతనాల సవరణకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ముందుకు రాకపోవడంతో తాము సమ్మెకు దిగక తప్పలేదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతనాలను పది శాతం పెంచుతామంటూ ఐబీఏ చేసిన ఆఫర్‌ను యూనియన్లు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పెంపు ఏమాత్రం సరిపోదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి అశ్వినీ రాణా అన్నారు. -
బ్యాంకులు అటూ.. ఇటూ..
ముంబై: ఆర్బీఐ పాలసీ విధానంపై బ్యాంకుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు మినహా మిగతావి స్వాగతించాయి. బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలను తగ్గించే దిశగా సమతుల్యమైన, ఆచరణాత్మకమైన చర్యగా అభివర్ణించాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని (ఎంఎస్ఎఫ్) తగ్గించడం వల్ల తమ బ్యాంకు నిధుల సమీకర ణ వ్యయాలు తగ్గుతాయని, అయితే రెపో రేటు పెంపు వల్ల ఆ ప్రయోజనాలు దక్కకుండా పోతాయని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆర్బీఐ తాజాగా రెపో రేటు పెంచిన ప్రభావం.. వడ్డీ రేట్లపై తక్షణమే పెద్దగా ఉండకపోవచ్చని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏకే గుప్తా తెలిపారు. ఆర్బీఐ ఒక విధంగా సమతుల్యం పాటించే ప్రయత్నం చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడిపైనే ప్రధానంగా దృష్టి నిలపడం మంచిదేనని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కంట్రీ సీఈవో సునీల్ కౌశల్ చెప్పారు. మార్కెట్ ప్రారంభంలో తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ, తాము ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. దీన్ని వృద్ధి విఘాత చర్యగా భావించరాదని తెలిపింది. స్వల్పకాలికంగా మనీమార్కెట్ రేట్లు, డిపాజిట్ రేట్లూ తక్షణమే దిగి రాగలవని, బ్యాంకులకు కొంత ఊరట లభించగలదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం నరేంద్ర తెలిపారు. వడ్డీ రేట్లు పెరుగుతాయ్.. పండున సీజన్ సమయంలో రుణాలకు భారీ డిమాండ్ ఉం టుంది. దానికి అనుగుణంగా బ్యాంకు లూ డిపాజిట్ల సమీకరణలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్ రేట్లు పెరగొచ్చు.. అలాగే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరగొచ్చు. బేస్ రేటు అనేది పాలసీ రేటుపై కాకుం డా బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత, డిపాజిట్లు..రుణాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. - ప్రతీప్ చౌదరి, చైర్మన్, ఎస్బీఐ సమతౌల్యమైన విధానం.. సమీప భవిష్యత్‌లో సమస్యలను పరిష్కరించే దిశగా ఇది సమతౌల్యమైన విధా నం. స్వల్పకాలంలో మార్కెట్లలో స్థిరత్వం, దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేదిగా దీన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. - చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్