ముంబై: ఆర్‌బీఐ పాలసీ విధానంపై బ్యాంకుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఎస్‌బీఐ వంటి కొన్ని బ్యాంకులు మినహా మిగతావి స్వాగతించాయి. బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలను తగ్గించే దిశగా సమతుల్యమైన, ఆచరణాత్మకమైన చర్యగా అభివర్ణించాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని (ఎంఎస్‌ఎఫ్) తగ్గించడం వల్ల తమ బ్యాంకు నిధుల సమీకర ణ వ్యయాలు తగ్గుతాయని, అయితే రెపో రేటు పెంపు వల్ల ఆ ప్రయోజనాలు దక్కకుండా పోతాయని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఆర్‌బీఐ తాజాగా రెపో రేటు పెంచిన ప్రభావం.. వడ్డీ రేట్లపై తక్షణమే పెద్దగా ఉండకపోవచ్చని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏకే గుప్తా తెలిపారు. ఆర్‌బీఐ ఒక విధంగా సమతుల్యం పాటించే ప్రయత్నం చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడిపైనే ప్రధానంగా దృష్టి నిలపడం మంచిదేనని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కంట్రీ సీఈవో సునీల్ కౌశల్ చెప్పారు. మార్కెట్ ప్రారంభంలో తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ, తాము ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది. దీన్ని వృద్ధి విఘాత చర్యగా భావించరాదని తెలిపింది. స్వల్పకాలికంగా మనీమార్కెట్ రేట్లు, డిపాజిట్ రేట్లూ తక్షణమే దిగి రాగలవని, బ్యాంకులకు కొంత ఊరట లభించగలదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం నరేంద్ర తెలిపారు.
వడ్డీ రేట్లు పెరుగుతాయ్..
పండున సీజన్ సమయంలో రుణాలకు భారీ డిమాండ్ ఉం టుంది. దానికి అనుగుణంగా బ్యాంకు లూ డిపాజిట్ల సమీకరణలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్ రేట్లు పెరగొచ్చు.. అలాగే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరగొచ్చు. బేస్ రేటు అనేది పాలసీ రేటుపై కాకుం డా బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత, డిపాజిట్లు..రుణాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
- ప్రతీప్ చౌదరి, చైర్మన్, ఎస్‌బీఐ
సమతౌల్యమైన విధానం..
సమీప భవిష్యత్‌లో సమస్యలను పరిష్కరించే దిశగా ఇది సమతౌల్యమైన విధా నం. స్వల్పకాలంలో మార్కెట్లలో స్థిరత్వం, దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేదిగా దీన్ని సానుకూల దృక్పథంతో చూడాలి.
- చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్
బ్యాంకులు అటూ.. ఇటూ..
Published Sat, Sep 21 2013 12:55 AM | Last Updated on Tue, Oct 9 2018 2:28 PM
Advertisement