MSF
-
ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌పై దాడి
సాక్షి, పరకాల: ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు ప్రవీణ్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడికి కొండా దంపతులు బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల నరేందర్, జాతీయ కార్యదర్శి సిలువేరు సాంబయ్య డిమాండ్ చేశారు. పరకాల ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్, సాంబయ్యలు మాట్లాడారు. పరకాల పట్టణంలోని ఎస్సీ కాలనీలో యువకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమైన సమయంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు ప్రవీణ్ౖ జోక్యం చేసుకొని వారిని ప్రశ్నించగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి వర్గీయులు దాడి చేసినట్లు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ చేసుకున్న బాధితుడు ప్రవీణ్‌పై పిడిగుద్దులు, బండరాయితో బాధినట్లు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలతో ఓట్లు పడుతాయనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దాడులు చేసే సంస్కృతికి కొండా మురళి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో దళిత కులాల మధ్య చిచ్చుపుట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పరకాల నుంచి కొండా సురేఖను గెలిపిస్తే ప్రజలకు నష్టం తప్ప ఎలాంటి న్యాయం జరగదన్నారు. ప్రవీన్పై దాడి చేసిన నిందితులను తక్షణమే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈదునూరి సారయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి బాబు, మహబూబ్‌నగర్, జనగాం జిల్లా అధ్యక్షులు పందుల సంజీవ, గద్దెట రమేష్, జనగాం జిల్లా అధ్యక్షుడు గడపెంగి ప్రవీణ్, యువసేనా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇల్లందుల రాజేష్ కన్నా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్బీఐకి ‘ధర’ల సెగ!
♦ రెపో రేటు యథాతథం ♦ ధరల పెరుగుదల భయాలే కారణం ♦ అయితే రివర్స్ రెపో పెంపు ♦ బ్యాంకింగ్‌లో అధిక నిల్వల నేపథ్యం ♦ ఎంఎస్ఎఫ్ తగ్గింపు ♦ పాలసీ కమిటీ ఏకాభిప్రాయ నిర్ణయాలు ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 7 నాటి తన సంకేతాలకు అనుగుణంగానే తాజా పాలసీ నిర్ణయం తీసుకుంది. 2017–18 సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ తన మొట్టమొదటి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష వివరాలను గురువారం వెల్లడించింది. రేటు నిర్ణయానికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయ ప్రాతిపదికన సమీక్ష నిర్ణయాలు జరిగినట్లు వివరించింది. దీనిప్రకారం బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను యథాతథంగా 6.25%గా కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద అధిక నిల్వల (లిక్విడిటీ) పరిస్థితి నెలకొనడం, పదేళ్ల బాండ్ ఈల్డ్ భారీ పెరుగుదల దీనితో ద్రవ్యోల్బణం భయాలు, వృద్ధి బాటలో ప్రభుత్వ వ్యయాల వంటి అంశాలు దీనికి నేపథ్యం. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెపో రేటును పావుశాతం చొప్పున రెండుసార్లు మొత్తంగా అరశాతం తగ్గించింది. ఫిబ్రవరి 7 నాటికి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గించకపోగా, తన పాలసీ విధానాన్ని ‘అవసరమైతే రేట్లు తగ్గించే నిర్ణయం’ నుంచి ‘తటస్థం’కు మార్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015 జనవరి నుంచీ రెపో రేటు 1.75% తగ్గింది. రివర్స్ రెపో– ఎంఎస్ఎఫ్ అప్ అండ్ డౌన్... మరోవైపు బ్యాంకులు తమ అదనపు నగదు నిల్వలను డిపాజిట్ చేసినప్పుడు తాను చెల్లించే రేటు– రివర్స్ రెపోను ఆర్బీఐ పావుశాతం పెంచి 6 శాతానికి చేర్చింది. దీనితో రెపో–రివర్స్ రెపో మధ్య వ్యత్యాసం పావు శాతానికి తగ్గినట్లయ్యింది. ఇది మనీ మార్కెట్లో భారీ ఒడిదుడుకులను తగ్గించడానికి దోహదపడుతుంది. డీమోనిటైజేషన్ నేపథ్యం లో బ్యాంకుల వద్ద అధిక నగదు నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం– తమ అదనపు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసి, బ్యాంకులు కొంత మొత్తాన్ని సంపాదించుకునే వీలూ ఏర్పడింది. ఇక అదే సమయంలో వ్యవస్థలో అత్యవసర సమయాల్లో నగదు సర్దుబాటులో భాగంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్)ను ఆర్బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి తగ్గింది. ప్రభుత్వ సెక్యూరిటీలపై బ్యాంకులకుఆర్బీఐ స్వల్పకాలిక (ఓవర్‌నైట్) రుణ సౌలభ్యతను కల్పించడానికి ఉద్దేశించిందే ఈ ఇన్ర్çస్టుమెంట్. పాలసీ ముఖ్యాంశాలు... ⇔ స్థూల విలువ జోడింపు ఆధారిత (జీవీఏ) ఆర్థికాభివృద్ధి గత ఆర్థిక సంవత్సరం 6.7 శాతం. అయితే 2017–18లో ఇది 7.4 శాతానికి పెరిగే వీలుంది. ⇔ రుతు పవనాల పరిస్థితిపై అనిశ్చితి ఉంది. ⇔ ఈ ఆర్థిక సంవత్సరం సగటున మొదటి అర్ధభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా, అటు తర్వాత సగం నెలల్లో 5 శాతంగా ఉండవచ్చని అంచనా. ⇔ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), జూలై–ఆగస్టుల్లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం అంచనా, పే కమిషన్ అవార్డు, ఆర్బీఐ నుంచి లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు మరింతగా బదలాయించే వెసులుబాటు వంటి అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కావచ్చు. దీనితోపాటు ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గడం వల్ల దేశీయంగా పెట్రోలియం ధరలు కూడా తగ్గితే ఇది టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది. ⇔ ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) వంటి స్థూల ఆర్థికాంశాల విషయంలో మెరుగుదల కనిపిస్తోంది. ⇔ ఆహారధాన్యాల రికార్డు నిల్వలు, సేకరణతో ఆహార ధరలపై ఒత్తిడి తగ్గొచ్చు. ⇔ జనవరి 4తో పోల్చితే మార్చి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు లిక్విడిటీ తగ్గుతూ వస్తోంది. డీమోనిటైజేషన్ నుంచి రీమోనిటైజేషన్ ప్రక్రియ వేగవంతమైన అమలు దీనికి కారణం. మౌలిక రంగానికి ఊపు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో(ఐఎన్వీఐటీ)పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులను ఆర్బీఐ అనుమతించింది. నగదు లభ్యతతో సతమతమవుతున్న మౌలిక రంగం ఊపునకు దోహదపడే అంశం ఇదని నిపుణులు భావిస్తున్నారు. తాజా అనుమతుల వల్ల బ్యాంకులు తమ నెట్ ఓన్డ్ ఫండ్ (ఎన్ఓఎఫ్)లో 20 శాతం వరకూ ఈక్విటీ– ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీఎఫ్), ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి మేనెల ముగింపునాటికితగినమార్గదర్శకాలువెలువడతాయనిఆర్బీఐతెలిపింది. ఎండీఆర్ చార్జీలపై త్వరలో తుది మార్గదర్శకాలు ముంబై: డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు సంబంధించి మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)లపై త్వరలో తుది మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ పేర్కొంది. ఎండీఆర్‌కు గతంలోని నిబంధనలే ఇప్పుడు కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. ఆర్బీఐ పాలసీ వెల్లడి సందర్భంగా పటేల్ ఈ వివరాలు వెల్లడించారు. కాగా ‘డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ హేతుబద్ధీకరణ’ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఒక ముసాయిదా సర్క్యులర్‌ను ఆర్బీఐ జారీ చేసింది. బ్యాంక్‌లు, వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ స్థాయిలో ప్రతిస్పందన వచ్చిందని, ఈ సూచనలు, ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పటేల్ పేర్కొన్నారు. ఎండీఆర్ చార్జీలు ప్రస్తుతం రూ.1,000 వరకూ చెల్లింపులకు 0.25%గా, రూ.1,000–2,000 వరకూ 0.5–0.7% వరకూ, రూ.2,000కు మించిన చెల్లింపులకు 1%గా ఉన్నాయి. వినియోగదారులు ఎలాంటి సర్వీస్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదనే నినాదాన్ని వ్యాపారులు డిస్ప్లే చేయాలని కూడా ఈ సర్క్యులర్ పేర్కొంది. రుణాల రద్దు.. చెల్లింపు సంస్కృతికి దెబ్బ: ఉర్జిత్ రుణ రద్దు పథకాలు నైతిక నిబద్ధతకు ప్రమాదమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. నిజాయితీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలన్న సంస్కృతిని ఇలాంటి పథకాలు దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.36,000 కోట్ల వ్యవసాయ రుణాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో పటేల్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఇలాంటి ప్రకటనలు తగవని స్పష్టంచేసిన ఆయన ఈ తరహా ప్రకటనలు చేయకుండా చూసేలా ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని 2017–18 పాలసీ సమీక్ష అనంతరం చేసిన ప్రకటనలో పటేల్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ రుణ భారాలు పెరిగే అవకాశం ఉంటుందనీ, ద్రవ్య సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనీ ఆయన అన్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఈ తరహా ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల రద్దు విషయంలో ఆర్బీఐ గత గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ద్రవ్య లభ్యత, నిర్వహణ అంశాలపై ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని కూడా ఆర్బీఐ గవర్నర్ తాజా పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు: బ్యాంకర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ద్రవ్యోల్బణం కట్టడికి, ఒత్తిడిలో ఉన్న ఆస్తులనిర్వహణకు దోహదపడతాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, వెరసి ఆర్థికాభివృద్ధికి ఈ చొరవలు వీలు కల్పిస్తాయని పలువురుబ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్ వ్యవస్థకు ఊతం ఆర్బీఐ నిర్ణయాలు అన్నీ ఊహించిన విధంగానే ఉన్నాయి. అభివృద్ధి, రెగ్యులేటరీ విధానాల కోణంలో ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో ఫైనాన్షియల్ వ్యవస్థ మెరుగుకు దోహదపడతాయి. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ దృష్టి... భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసానికి, క్యాపిటల్ ఫ్లోస్‌కు మద్దతు కొనసాగడానికి దోహదం చేస్తుంది. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఆర్థికాభివృద్ధికి దోహదం ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై ప్రధానంగా దృష్టి సారించింది. దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధికి ఊతం ఇచ్చే అంశం ఇది. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు బ్యాంకులకు వెసులు బాటు కల్పించడం, దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్ మరింత విస్తృతం కావడానికి దోహదపడే అంశం ఇది. మౌలిక రంగానికి తగిన నిధులు అందుబాటులోకి రావడానికీ ఈ చర్య ఉపయోగపడుతుంది. – చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తగిన పాలసీ విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తోందని నేను భావిస్తున్నాను. ఈ విధానం వల్ల లిక్విడిటీలో ఒడిదుడుకులు తగ్గే వీలుంది. ఆర్థిక స్థిరత్వానికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయి. రేట్ల తగ్గింపునకు వీలైన వ్యవస్థ వృద్ధికీ కలిసి వస్తుంది. – రాణా కపూర్, యస్‌బ్యాంక్ చీఫ్ ఇక బ్యాంకులే తగ్గించాలి.. ఆర్బీఐ నిర్ణయంతో ఇక బ్యాంకులే రుణ రేటును తగ్గించాలని తద్వారా ఇప్పటివరకూ అందిన రెపో ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని పారిశ్రామిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ మున్ముందు రెపో రేటు తగ్గిస్తూ... తన పాలసీ నిర్ణయాన్ని మార్చుకుంటుందని సైతం కొన్ని వర్గాలు అంచనా వేశాయి. ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక ప్రస్తుత ద్రవ్యోల్బణం భయాలను ప్రాతిపదికగా తీసుకుని ఆర్బీఐ తాజా పాలసీ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాం. మున్ముం దు వృద్ధి, డిమాండ్ మెరుగుదల ప్రధాన లక్ష్యంగా రేటు తగ్గింపు దిశలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకుంటుందని విశ్వసిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ ఇక బ్యాంకుల వంతు... వృద్ధి అంశాలకన్నా తక్షణం లిక్విడిటీ (ద్రవ్య) నిర్వహణ, ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యాలుగా ఆర్బీఐ తాజా పాలసీ నిర్ణయం తీసుకుంది. అధిక నగదు నిల్వల నేపథ్యంలో నిధుల సమీకరణ వ్యయాల తగ్గుదల ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలి. – సందీప్ జజోడియా, అసోచామ్ ప్రెసిడెంట్ వినియోగం పెరగాలి గత పాలసీ రేట్ల కోత ప్రయోజనాలు పరిశ్రమకు అందాల్సి ఉంది. ఈ దిశలో బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ఇటు వినియోగం, అటు పెట్టుబడులు పెరగడానికి– రెండింటికీ దోహదపడుతుంది. – పంకజ్ పటేల్, ఫిక్కీ ప్రెసిడెంట్ -
మహాసభలను విజయంతం చేయాలి
నల్లగొండ టౌన్ : నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధ మహాసభలకు మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో జరిగిన విద్యార్థి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీ జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కందుల మోహన్ మాదిగ, ఎం.వెంకటేశ్వర్లు, సునీల్, సంజయ్, శివశంకర్, గణేష్, కోటేష్, అశోక్, శ్రీను, వినోద్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
కడియం ఇంటివద్ద ఎంఎస్ఎఫ్ భిక్షాటన
విద్యారణ్యపురి : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం జాతి కోసం మేము సైతం అం టూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) కేయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మాదిగ విద్యార్థులు మహాభిక్షాటన కార్యక్రమంను నిర్వహించారు. వర్గీకరణ చట్టబద్ధతకు ఈనెల 10న ఢిల్లీలో జరిగే మహాదీక్షకు తరలివెళ్లడం కోసం డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ,నగర మేయర్ నన్నపనేని నరేందర్‌లను ఆ కమిటీ బాధ్యులు కలిసి చలో ఢిల్లీకోసం బిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. ఎమ్మార్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయపరమైన డిమాండ్ అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని లేనిపక్షంలో పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జి మంద భాస్కర్, బాధ్యులు ఎర్రోళ్ల పోచయ్య, బుర్రి సతీష్ మాదిగ, రాగళ్ల ఉపేందర్ మాదిగ, రవీందర్, గంగారపు శ్రీనివాస్, సుకుమార్, భిక్షపతి, భాస్కర్, రాజు, ప్రశాంత్ మాదిగ, శ్రీను, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
హన్మకొండ అర్బన్ : ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ఆందోళనకు మద్దతుగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు బాలసముద్రంలోని ఏకశిలాపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఈక్రమంలో కొద్దిసేపు విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలో సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి సతీష్, నాయకులు ఉపేందర్, మంద భాస్కర్, సుకుమార్,శేఖర్, శిరీష, మాసన, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ ముట్టడి
వీరన్నపేట: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం ఢిల్లీలో జరుగుతున్న దీక్షలకు మద్దతుగా మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి టైగర్ జంగయ్యమాదిగ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పరశురాంమాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 2న వెయ్యి దిష్టిబొమ్మల దహనం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడుని చేస్తామని వెయ్యిసార్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇచ్చిన హామీ విస్మరించి తానే అందలమెక్కేందుకు సిద్ధం అవుతున్నారని మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) జిల్లా అధికార ప్రతినిధి కాశీమల్ల సురేష్, ఆ సంఘం రాష్ట్ర నాయకుడు చెరుకుపల్లి శాంతికుమార్లు విమర్శించారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాట తప్పడాన్ని నిరసిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం రోజున వెయ్యి దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దొరలపాలన తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జూన్ 2న అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేసి అనంతరం కేసీఆర్ తీరును నిరసిస్తూ నల్లజెండాలు ఎగురవేస్తామన్నారు. ముందుగా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి 30వ తేదీన అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం పదవిని దళితులకిచ్చి తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కె.దుర్గయ్య, వెంకన్న, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మెజారిటీ అభిప్రాయం ప్రకారమే రెపో రేటు పెంపు
ముంబై: గత నెలలో జరిగిన రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం మేర పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నందున రెపో రేటును పెంచేందుకు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్)ని పావు శాతం తగ్గించేందుకు నలుగురు సభ్యులు మద్దతు తెలిపారు. ఆర్బీఐ గురువారం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇద్దరు సభ్యులు మాత్రం రెపో రేటును పెంచితే.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ద్రవ్యోల్బణ తగ్గింపు చర్యలకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒక సభ్యుడు మాత్రం ఆర్బీఐ వృద్ధికి ఊతమిచ్చే విధంగా రెపో రేటును పావు శాతం తగ్గించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 23న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సారథ్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్లతో పాటు ఎక్స్టర్నల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా పరిగణిస్తారు. -
రాజన్ మళ్లీ ‘వడ్డి’స్తారా..?
న్యూఢిల్లీ: ధరల మంట తీవ్రతరం అవుతుండటంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరో విడత వడ్డీరేట్లు పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మంగళవారం(29న) చేపట్టనున్న రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో పాలసీ వడ్డీరేటు(రెపో)ను పావు శాతం పెంచొచ్చని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ద్రవ్య సరఫరా(లిక్విడిటీ)ని పెంచే చర్యలు కూడా ఉండొచ్చనేది వారి అభిప్రాయం. ‘కీలక పాలసీ రేటు రెపోను పావు శాతం పెంచవచ్చని భావిస్తున్నాం. లిక్విడిటీని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా.. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)ని కూడా పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయి’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రంజన్ ధావన్ పేర్కొన్నారు. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలద్వారా లేదంటే ఎంఎస్ఎఫ్ తగ్గింపు రూపంలో ద్రవ్యసరఫరాను పెంచే చాన్స్ ఉందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ... పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేసేందుకు రెపో రేటును పావు శాతం పెంచొచ్చని అంచనా వేశారు. ఇదేతరుణంలో బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయాన్ని తగ్గించేందుకు ఎంఎస్ఎఫ్ను కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్బీఐ కొత్తగవర్నర్‌గా సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్... తన తొలి పాలసీ సమీక్షలోనే అనూహ్యంగా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడమే లక్ష్యమని ప్రకటిస్తూ... రెపో రేటును పావు శాతం పెంచారు. దీంతో ఇది 7.5 శాతానికి చేరింది. ఇక రివర్స్ రెపో 6.5 శాతంగా ఉంది. గత సమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ను యథాతథంగా 4 శాతంగానే ఉంచారు. అయితే, ఎంఎస్ఎఫ్ను ముప్పావు శాతం తగ్గించి 9.5 శాతానికి చేర్చారు. తాజాగా మళ్లీ ఈ రేటును మరో అర శాతం తగ్గించడంతో 9 శాతానికి దిగొచ్చింది. బ్యాంకులకు ద్రవ్యసరఫరా కొరత భారీగా తలెత్తినప్పుడు అధిక వడ్డీరేటుకు ఆర్బీఐ నుంచి నిధులను తీసుకోవడం కోసం ఎంఎస్ఎఫ్ ఉపయోగపడుతుంది. ద్రవ్యోల్బణం సెగ... గత రెండు నెలలుగా ధరలు దూసుకెళ్తుండటం... ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపునకు పురిగొల్పుతోంది. ఆహారోత్పత్తులు ప్రధానంగా ఉల్లిపాయలు, కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్న సంగతి తెలిసిందే. కేజీ ఉల్లి రేటు కొన్ని నగరాల్లో ఏకంగా రూ.100కు చేరి దడపుట్టిస్తోంది. ఇది సామాన్యులపై మరింత ధరాభారాన్ని మోపుతోంది. కాగా, సెప్టెంబర్‌లో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి(6.46 శాతం) ఎగబాకడం ఆర్బీఐ పాలసీ రేట్ల పెంపునకు దారితీసే అంశంగా నిలవనుంది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 6.1%, జూలైలో 5.85 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఉల్లి ధర ఏకంగా 323 శాతం దూసుకెళ్లడం గమనార్హం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆగస్టులో 9.52 శాతంగా ఉండగా... సెప్టెంబర్‌లో 9.84 శాతానికి చేరడం కూడా పాలసీపై ప్రభావం చూపనుంది. పావు శాతం పెంచొచ్చు: అసోచామ్ టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణాలు రెండూ అధికంగా ఉండటంతో రానున్న పాలసీ సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం మేర పెంచే అవకాశాలున్నాయని పారిశ్రామిక వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లను మరోవిడత పెంచొచ్చని... స్వల్పకాలానికి పరిశ్రమలకు సమస్యలు తప్పవని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. అయితే రెపో, ఎంఎస్ఎఫ్ మధ్య వ్యత్యాసానికి సాధారణ స్థాయికి(1 శాతానికి) చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 1.5 శాతంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ప్రస్తుత పండుగల సీజన్ కారణంగా 70,000-80,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విత్‌డ్రా చేసే అవకాశం ఉందని, దీనివల్ల ఉత్పాదక రంగాలకు రుణ సరఫరాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్నారు. దీన్ని తట్టుకోవడానికి ఎంఎస్ఎఫ్ తగ్గింపు లేదా సీఆర్ఆర్లో అర శాతం కోత వంటి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
20,000 పైన లాభాల స్వీకరణ
బ్యాంకులకు అత్యవసర నిధులు అందించేందుకు ఉద్దేశించిన మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) వడ్డీ రేటును రిజర్వుబ్యాంక్ తగ్గించిన నేపథ్యంలో మంగళవారం ఉదయుం ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ సూచీలు ర్యాలీ జరిపారు. అయితే బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లలో జరిగిన లాభాల స్వీకరణ ఫలితంగా సూచీలు తొలి లాభాల్ని కోల్పోయూయి. ప్రారంభ సవుయుంలో 230 పాయింట్లు ర్యాలీ జరిపి 21,150 పాయింట్లు స్థాయికి పెరిగిన సెన్సెక్స్ చివరకు 88 పాయింట్ల స్వల్పలాభంతో రెండు వారాల గరిష్టస్థారుు 19,983 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,982 పాయింట్ల గరిష్టస్థారుు నుంచి క్రమేపీ తగ్గుతూ చివరకు 22 పారుుంట్లు వూత్రమే లాభపడింది. 5,928 పాయింట్ల వద్ద ముగిసింది. తొలిదశలో పలు బ్యాంకింగ్ షేర్లు 5-7 శాతం అప్‌తో ట్రేడయ్యూరుు. దేశీయు సంస్థలు లాభాల స్వీకరణకు దిగడంతో చాలావర కూ షేర్లు తొలి లాభాల్ని కోల్పోయూరు. ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం లాభంతో ముగియుగా, ఎస్బీఐ స్వల్పనష్టంతో క్లోజయ్యింది. గత రెండు రోజులుగా ర్యాలీ జరిపిన ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో టీసీఎస్, హిందాల్కో, టాటాస్టీల్‌లు నష్టాలతో ముగిసాయి. టెలికాం, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ షేర్లు ర్యాలీ జరిపారు. భారతి ఎయిర్టెల్, లార్సన్ అండ్ టూబ్రో, ఐటీసీలు 2-3 శాతం మధ్య పెరిగారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 226 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసారు. దేశీయు సంస్థలు రూ. 454 కోట్ల మేర నికర విక్రయూలు జరిపారు. టెలికాం షేర్లలో లాంగ్ బిల్డప్ కార్పొరేట్ ఫలితాల సీజన్ సమీపిస్తున్న తరుణంలో టెలికాం షేర్లలో లాంగ్ బిల్డప్ జరిగింది. క్యాష్ మార్కెట్లో 5 శాతంపైగా ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ గరిష్టస్థారు రూ. 182 వద్ద ముగిసిన ఐడియూ సెల్యులర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ కౌంటర్లో తాజాగా 12.88 లక్షల షేర్లు (16 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 92.24 లక్షల షేర్లకు చేరింది. అడాగ్ గ్రూప్ కంపెనీ రిలయున్స్ కమ్యూనికేషన్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 6.96 లక్షల షేర్లు (2.3 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.09 కోట్ల షేర్లకు పెరిగింది. అయితే ఈ షేరు ఆప్షన్ కాంట్రాక్టుల్లో రూ. 150 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్లో ఓఐ 25.64 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 150పైన స్థిరపడితేనే పెరిగే అవకాశాలున్నాయుని ఈ రైటింగ్ వెల్లడిస్తున్నది. భారతి ఎయిర్టెల్ ఫ్యూచర్లో ఒక లక్ష షేర్లు (1 శాతం) యూడ్ అయ్యూరు. మొత్తం ఓఐ 1.02 కోట్ల షేర్లకు చేరింది. రానున్న రోజుల్లో షేరు వురింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్ అంటారు. ఫలానాస్థారు నుంచి షేరు పెరగకపోవచ్చన్న అంచనాలతో కాల్ ఆప్షన్లను విక్రయించే ప్రక్రియును కాల్ రైటింగ్‌గా పరిగణిస్తారు. ఎస్బీఐ కౌంటర్లో షార్ట్ బిల్డప్.... మంగళవారంనాటి బ్యాంకింగ్ షేర్ల ర్యాలీలో పలు బ్యాంకు కౌంటర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఎస్బీఐ ఫ్యూచర్ కాంట్రాక్టులో మాత్రం షార్ట్ బిల్డప్ జరిగినట్లు డేటా వెల్లడిస్తున్నది. ఈ ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా 2.73 లక్షల షేర్లు (5 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 58.21 లక్షల షేర్లకు చేరింది. రూ. 1,600 స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్, రూ. 1,650 వద్ద కాల్ కవరింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,650 స్థాయిని అధిగమించడం కష్టసాధ్యమని, రూ. 1,600లోపున వురింత క్షీణించవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. రానున్న రోజుల్లో షేరు తగ్గవచ్చన్న అంచనాలతో విక్రయించిన ఫ్యూచర్ కాంట్రాక్టును షార్ట్ పొజిషన్ అంటారు. -
ఆర్బీఐ పాలసీ రేట్ల తీరు ఇదీ..
ఆర్బీఐ అస్త్రాలు ఇవీ... బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) నియంత్రించడానికి ఆర్బీఐ అనుసరించే విధానాల్లో కీలకమైన నాలుగు అంశాలను పరిశీలిస్తే... రెపో రేటు: ఆర్బీఐ నుంచి తాము తీసుకున్న రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు. మనీ నిర్వహణలో భాగంగా నగదు అత్యవసరమైనప్పుడు బ్యాంకులు స్వల్పకాలికంగా రెపో విండో ద్వారా ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంటాయి. దీనికి చెల్లించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. రివర్స్ రెపో రేటు : పైన చెప్పుకున్న దానికి ఇది భిన్నం. బ్యాంకులు తన దగ్గర ఉంచే నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు ఇది. సాధారణంగా బ్యాంకులు వాటి దగ్గర అధిక నగదు ఉన్నప్పుడు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేస్తాయి. దానిపై ఆర్బీఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. దీనినే రివర్స్ రెపో రేటు అంటారు. ఎంఎస్ఎఫ్: స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఆర్బీఐ 2011 మే 3 పాలసీ సమీక్ష సందర్భంగా ఈ ఎంఎస్ఎఫ్ను ప్రవేశపెట్టింది. సీఆర్ఆర్: బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తి. -
బ్యాంకులు అటూ.. ఇటూ..
ముంబై: ఆర్బీఐ పాలసీ విధానంపై బ్యాంకుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు మినహా మిగతావి స్వాగతించాయి. బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలను తగ్గించే దిశగా సమతుల్యమైన, ఆచరణాత్మకమైన చర్యగా అభివర్ణించాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని (ఎంఎస్ఎఫ్) తగ్గించడం వల్ల తమ బ్యాంకు నిధుల సమీకర ణ వ్యయాలు తగ్గుతాయని, అయితే రెపో రేటు పెంపు వల్ల ఆ ప్రయోజనాలు దక్కకుండా పోతాయని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆర్బీఐ తాజాగా రెపో రేటు పెంచిన ప్రభావం.. వడ్డీ రేట్లపై తక్షణమే పెద్దగా ఉండకపోవచ్చని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏకే గుప్తా తెలిపారు. ఆర్బీఐ ఒక విధంగా సమతుల్యం పాటించే ప్రయత్నం చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడిపైనే ప్రధానంగా దృష్టి నిలపడం మంచిదేనని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కంట్రీ సీఈవో సునీల్ కౌశల్ చెప్పారు. మార్కెట్ ప్రారంభంలో తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ, తాము ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. దీన్ని వృద్ధి విఘాత చర్యగా భావించరాదని తెలిపింది. స్వల్పకాలికంగా మనీమార్కెట్ రేట్లు, డిపాజిట్ రేట్లూ తక్షణమే దిగి రాగలవని, బ్యాంకులకు కొంత ఊరట లభించగలదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం నరేంద్ర తెలిపారు. వడ్డీ రేట్లు పెరుగుతాయ్.. పండున సీజన్ సమయంలో రుణాలకు భారీ డిమాండ్ ఉం టుంది. దానికి అనుగుణంగా బ్యాంకు లూ డిపాజిట్ల సమీకరణలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్ రేట్లు పెరగొచ్చు.. అలాగే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరగొచ్చు. బేస్ రేటు అనేది పాలసీ రేటుపై కాకుం డా బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత, డిపాజిట్లు..రుణాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. - ప్రతీప్ చౌదరి, చైర్మన్, ఎస్బీఐ సమతౌల్యమైన విధానం.. సమీప భవిష్యత్‌లో సమస్యలను పరిష్కరించే దిశగా ఇది సమతౌల్యమైన విధా నం. స్వల్పకాలంలో మార్కెట్లలో స్థిరత్వం, దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేదిగా దీన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. - చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్