జూన్ 2న వెయ్యి దిష్టిబొమ్మల దహనం | June 2 Thousand Scarecrows Combustion | Sakshi
Sakshi News home page

జూన్ 2న వెయ్యి దిష్టిబొమ్మల దహనం

Published Thu, May 29 2014 1:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

జూన్ 2న వెయ్యి దిష్టిబొమ్మల దహనం - Sakshi

జూన్ 2న వెయ్యి దిష్టిబొమ్మల దహనం

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడుని చేస్తామని వెయ్యిసార్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇచ్చిన హామీ విస్మరించి తానే అందలమెక్కేందుకు సిద్ధం అవుతున్నారని మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్‌ఎఫ్) జిల్లా అధికార ప్రతినిధి కాశీమల్ల సురేష్, ఆ సంఘం రాష్ట్ర నాయకుడు చెరుకుపల్లి శాంతికుమార్‌లు విమర్శించారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాట తప్పడాన్ని నిరసిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం రోజున వెయ్యి దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దొరలపాలన తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జూన్ 2న అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేసి అనంతరం కేసీఆర్ తీరును నిరసిస్తూ నల్లజెండాలు ఎగురవేస్తామన్నారు.  ముందుగా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి 30వ తేదీన అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు.  ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం పదవిని దళితులకిచ్చి తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కె.దుర్గయ్య, వెంకన్న, స్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement