MP Komatireddy Fired on KCR For Giving Dalit Bandhu Only to BRS Activists - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే దళిత బంధు.. కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌

Published Thu, Aug 17 2023 4:42 PM | Last Updated on Thu, Aug 17 2023 5:00 PM

Mp Komatireddy Venkat Reddy Comments On Cm Kcr - Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: ఓట్ల కోసమే కేసీఆర్‌ దళిత బంధు తెచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని, బీసీ బంధు కూడా ఎన్నికల తర్వాత మాయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపై ఉన్నారన్న ఆయన కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడని దుయ్యబట్టారు.

‘‘బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పనులు చేయడం లేదు. సిద్దిపేటలో లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి నన్ను 10 సంవత్సరాలుగా ఏడిపిస్తవా. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాలకు సాగు నీళ్లు ఇస్తా. కుటుంబ పాలన పోతేనే పేదలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. కేసీఆర్ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారు. దళిత బంధు పేరుతో రూ.10 లక్షల ఇస్తే అందులో 3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారు’’ అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: కేసీఆర్‌ పక్కా ప్లాన్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ రెడీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement