సాక్షి, యాదాద్రి భువనగిరి(నల్లగొండ): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఆలయ పున: నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పెద్ద గుట్ట టెంపుల్ సిటీ హెలిప్యాడ్‌పై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది.
సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు.
ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment