మంత్రికి ఆశీర్వచనం చేస్తున్న ఆచార్యులు
సాక్షి, యాదగిరిగుట్ట (నల్గొండ): సీఎం కేసీఆర్ ఓ ఇంజనీర్‌గా, ఆర్కిటెక్టుగా యాదాద్రి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కలలో కూడా ఊహించని విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోందని.. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆలయం లక్షలాది భక్తులతో విరాజిల్లుతోందన్నారు. మరో రెండు నెలల్లో భక్తులకు స్వయంభూ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బాలాలయంలో ఆచార్యులు మంత్రి సత్యవతి రాథోడ్, కుటుంబసభ్యులకు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment