నేడు కలెక్టరేట్ ముట్టడి
Published Tue, Aug 2 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
వీరన్నపేట: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం ఢిల్లీలో జరుగుతున్న దీక్షలకు మద్దతుగా మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఇన్‌చార్జి టైగర్ జంగయ్యమాదిగ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పరశురాంమాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement