Published
Thu, Sep 15 2016 10:38 PM
| Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
మహాసభలను విజయంతం చేయాలి
నల్లగొండ టౌన్ : నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధ మహాసభలకు మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో జరిగిన విద్యార్థి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీ జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కందుల మోహన్ మాదిగ, ఎం.వెంకటేశ్వర్లు, సునీల్, సంజయ్, శివశంకర్, గణేష్, కోటేష్, అశోక్, శ్రీను, వినోద్, రఘు తదితరులు పాల్గొన్నారు.