
లండన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Ukrainian President Zelensky) లండన్‌లోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో బ్రిటన్ రాజు చార్లెస్- IIIను కలుసుకున్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి రాజకుటుంబం సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ‘ఈ రోజు సాయంత్రం బ్రిటన్ రాజు చార్లెస్- III ఉక్రెయిన్ అధ్యక్షుడు @ZelenskyyUa ను సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు స్వాగతించారు’ అని పేర్కొన్నారు.
సాండ్రింగ్‌హామ్ హౌస్ అనేది ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్‌లో ఉన్న ఒక ప్రైవేట్ నివాసం. ఇది సాంప్రదాయకంగా బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలో ఉంటుంది. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని 10 డౌనింగ్ స్ట్రీట్‌కు స్వాగతించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఉంటుందని జెలెన్స్కీకి బ్రిటన్ రాజు చార్లెస్- III (UKs King Charles iii)హామీ ఇచ్చారని అల్ జజీరా నివేదించింది.
This evening, His Majesty The King received the President of Ukraine, @ZelenskyyUa, at Sandringham House. 🇺🇦 pic.twitter.com/mhGr7C0BN4
— The Royal Family (@RoyalFamily) March 2, 2025
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జెలెన్స్కీ జరిపిన చర్చలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అనంతరం జెలెన్స్కీ.. బ్రిటన్ రాజు చార్లెస్- IIIని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జెలెన్స్కీ తన వాషింగ్టన్ పర్యటన ముగిసిన ఒక రోజు తర్వాత బ్రిటన్ రాజు చార్లెస్- IIIని కలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు
Comments
Please login to add a commentAdd a comment