Ukrainian
-
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
Russia-Ukraine war: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది. ఏమిటీ డ్రాగన్ డ్రోన్? చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి? థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది. ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.అంకుర సంస్థ చేతిలో.. ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాలోకి ఉక్రెయిన్ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రేనియన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో కలకలం చెలరేగింది. గత 36 గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.దేశంలోని నైరుతి కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు, నివాస భవనాలు, అంబులెన్స్‌లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు.ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు. కుర్స్క్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది.రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో పుతిన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధంలో సుమారు 100 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని,200 మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. దీనికిముందు కుర్స్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడినవారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తమ భూభాగంలోకి చొరబడి గత 36 గంటలుగా దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతున్నదన్నారు. Ukraine has launched a major attack with Ukrainian troops into Russia in what appears to be its biggest and most serious incursion into the country since Moscow's full-scale invasion began in February 2022. https://t.co/2o5E3RAcIM— ABC News (@ABC) August 7, 2024 -
మిస్ జపాన్‌గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ
-
విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం
ఉక్రెయిన్‌లోని ఆయా కీలక ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్న డిక్రీపై పుతన్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పుతిన్ గ్రాండ్‌గా సెలబ్రెషన్ చేసుకున్నారు కూడా. ఇప్పుడూ ఆ విలీన చట్టానికి అనూకూలంగా రష్యా చట్టసభ సభ్యులు ఓటు వేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పార్టమెంట్ని ఉద్దేశించి మాట్లాడుతూ...రష్యాన్ భాష, సంస్కృతి, సరిహాద్దులను రక్షించడానికి బిల్లుకు మద్దుతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తాము ఊహజనిత బెదిరింపులకు లొంగి ఇలా చేయడం లేదు, కేవలం తమ దేశ సరిహద్దులను, మాతృభూమిని, ప్రజలను రక్షించుకునే నిమిత్తం ఇలా చేశామని తెలిపింది. అదీగాక ఉక్రెయిన్ సాధనంగా చేసుకుని అమెరికా యావత్తు పశ్చిమ దేశాలను సమీకరించిందని ఆరోపణలు చేశారు. అలాగే ఈనాలుగు భూభాగాలు మాస్కోకి మధ్య ల్యాండ్ కారిడర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ విలీనంతో మొత్తంగా ఐదు ప్రాంతాలు అంటే ఉక్రెయిన్‌లో దాదాపు 20 శాతం స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. వాస్తవానికి రష్యా బలగాలు ఖైర్సన్, జపోరిజ్జియాపై పూర్తి నియంత్రణ కలిగి లేవు. మరీ మాస్కో ఆయా ప్రాంతాల్లోని ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకుందో స్పష్టం చేయాల్సి ఉంది. (చదవండి: భగవద్గీతా పార్క్‌పై భారత్ వ్యాఖ్యలు...వివరణ ఇచ్చిన కెనడా) -
రష్యా ఆక్రమిస్తోంది.. ‘నాటో’లో త్వరగా చేర్చుకోండి మహా ప్రభో!
కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ క్రమంలో మిలిటరీ కూటమి నాటోవైపు చూస్తోంది ఉక్రెయిన్. రష్యా ఆక్రమణల వేళ నాటో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ దేశాలను కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అధ్యక్ష కార్యాలయం. ‘ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం.’ అని వీడియోలో మాట్లాడారు జెలెన్స్కీ. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా రష్యాలో చేరేందుకే ప్రజలు మొగ్గు చూపినట్లు అక్కడి నేతలు తెలిపారు. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలను అధికారికంగా తమలో విలీనం చేసుకుంది రష్యా. Ukrainian President Volodymyr Zelenskyy signs application for fast-track NATO membership after Russia's annexation of Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia.#NATORussia #RussiaUkraineWar #UkraineRussianWar pic.twitter.com/i1YXuJ0B4I — Annu Kaushik (@AnnuKaushik253) September 30, 2022 ఇదీ చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ -
ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్
మాస్కో: ఫిబ్రవరి 18 నుంచి ఉక్రెయిన్ విడిచి రష్యాకు వచ్చిన పౌరులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంచి ఆఫర్ ఇచ్చారు. ఈమేరకు పుతిన్ ఉక్రెనియన్ భూభాగాన్ని విడిచి పెట్టి రష్యాకు వచ్చిన వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే డిక్రీ పై సంతకం చేశారు. ఉక్రెయిన్ పౌరులకు, పెన్షనర్లకు, మహిళలకు, వికలాంగులకు నెలవారి భృతి సుమారు రూ 13 వేలు అందించేలా రష్యా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రష్యాకు తరలి వచ్చిన ప్రతి ఒక్క ఉక్రెయిన్ పౌరుడికి ఈ భృతిని చెల్లించాలని పుతిన్ ఆదేశించారు. ఒక పక్క రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగుతూనే ఉక్రెయిన్ రష్యన్లకు పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తోంది. మరోవైపు యూఎస్, ఉక్రెయిన్, పశ్చిమదేశాలు, చట్ట విరుద్ధమైన చర్య అంటూ గొంతు చించుకుంటున్నా రష్యా మాత్రం ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. (చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ప్రాణ నష్టం.. ఎన్ని వేల మంది సైనికులు చనిపోయారంటే..?) -
ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్ బహుమతిని విక్రయించారు. ఆయన 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. ఈ మేరకు డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్ బహుమతి మరే ఏ ఇతర నోబెల్ బహుమతులు సాధించిన విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది. హెరిటేజ్ వేలం కంపెనీ ఈ నోబెల్ ప్రైజ్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ అందజేస్తామని స్పష్టం చేసింది. ఐతే మురాటోవ్ 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడి పుతిన్ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది. అంతే పుతిన్ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది. అంతేకాదు మురాటోవా పై ఎరుపురంగుతో దాడి చేశారు. కానీ మాస్కో మాత్రం ఈ యుద్ధాన్ని భద్రతా దృష్ట్యా సాగిస్తున్న ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ రష్యా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఐతే పాశ్చాత్య దేశాలు దీన్ని దురాక్రమణ యుద్ధంగా గొంతెత్తి చెప్పాయి. ఈ మేరకు మురాటోవో మాట్లాడుతూ...తన సిబ్బంది మద్దతుతో ఈ వేలం నిర్వహించినట్ల తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఉక్రెయిన్ శరణార్థుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. (చదవండి: ఎలన్ మస్క్‌పై కోర్టుకెక్కిన కన్నకొడుకు.. సారీ ‘కూతురు’!!) -
రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలుగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ భీకరమైన యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాది మంది వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక ఉక్రెయిన్ రష్యా దాడుల్లో తాను ఎదర్కొన్న భయంకరమైన చేదు అనుభవం గురించి వివరించాడు. ఈ మేరకు 33 ఏళ్ల మైకోలా కులిచెంకో తన భయానక అనుభవాన్ని వివరించాడు... "రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడతూ దాడులు చేసి సరిగ్గా మూడువారాలైంది. మార్చి 18న అనుహ్యంగా ఒక రోజు రష్యా బలగాలు తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తమ ఇంటిని చుట్టుముట్టి రష్యన్ దళాలపై బాంబు దాడి చేస్తున్నవారి కోసం గాలించారు. తమ దళాలలపై దాడిచేసే వాళ్లతో సంబంధం ఉందనే అనుమానంతో మా ఇంటిని సోదా చేయడం మొదలు పెట్టారు. ఐతే మా తాతా పారామిలటరీకి సంబంధించినవాడు కావడంతో ఇంట్లో ఉండే మిలటరీ బ్యాగ్, పతకాలను చూసి ఆర్మీకి చెందిన వారిగా భావించి తమ పై కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నన్ను మా అన్నలిద్దరిని కళ్లకు గంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి మూడు రోజులపాలు హింసించారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేస్తారు అనుకున్నాం కానీ వారు కర్కసంగా మా తలల పై గన్‌పెట్టి కాల్పుల జరిపారు. మొదటగా మా పెద్ద అన్న, ఆ తర్వాత రెండో అన్న తదనంతరం నాపై కాల్పుల జరిపారు. ఆ తర్వాత మా ముగ్గుర్ని ఒక గొయ్యిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఐతే తానుఎంతసేపు ఆ గోతిలో ఉండిపోయానో గుర్తులేదు కానీ ఆ తర్వాత స్ప్రుహ వచ్చాక ఊపిరాడక పోవడంతో తన అన్నలను తనపైనే ఉండటం వల్ల బరువుగా ఉందని గమనించి నా చేతులు కాళ్ల సాయంతో వారిని పక్కకు తోసి ఏదో విధంగా ఆ గోయ్యి నుంచి బయటప్డడానని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి బుల్లెట్ తన చెంప మీద నుంచి కుడి చెవి వైపుకు రాసుకుంటూ వెళ్లిపోవడం వల్ల తాను లక్కీగా బతకగలిగానని చెప్పాడు. ఆ తర్వాత తాను పొలానికి సమీపంలోని ఇంటికి వెళ్లి ఆశ్రయం పోందినట్లు వివరించాడు. తాను ఆ విషాద ఘటన నుంచి బతికి బట్టగట్టగలుగుతానని కూడా అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి విషాద ఘటనలు ఉక్రెయిన్ అంతటా కోకొల్లలు అంటూ ఆవేదనగా చెబుతున్నాడు. (చదవండి: టిట్ ఫర్ టాట్: పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా) -
ఉక్రెయిన్ దళంలో చేరిన ఒలింపిక్ షూటర్
Olympic Star Shooter Joins Ukraine Forces: ఉక్రెనియన్ చాంపియన్ షూటర్ క్రిస్టినా డిమిత్రెంకో తన మాతృభూమి రక్షణ కోసం ఉక్రెయిన్ బలగంలో చేరింది. ఆమె 2016 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో బయాథ్లాన్‌లో స్వర్ణం గెలుచుకుందిలో స్వర్ణ పతకం గెలుచుకుంది. బయాథ్లాన్ అనేది స్కీయింగ్, రైఫిల్ షూటింగ్‌లను మిళితం చేసే క్రీడ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న కార్పాతియన్ పర్వతాలలో అంతర్జాతీయ పోటీ కోసం ప్రాక్టీసు చేస్తోంది. అంతేగాదు క్రిస్టినా ఫిబ్రవరి 27న స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఇటలీతో పోటీపడాల్సి ఉంది. ఆమె కీవ్, చెర్నిహివ్‌లలో రష్యా బలగాల విధ్వంసాన్ని తెలుసుకుని ఉక్రెనియన్ యుద్ధంలో చేరాలని నిర్ణయించుకుంది. అంతేగాదు యుద్ధంలో పాల్గొని ఆయుధాలను చేతపట్టడానికి కూడా అర్హత సాధించింది. క్రీస్టినా ఇలాంటి పరిస్థితి ఒకటి తన జీవితంలో ఎదరవుతుందని తాను ఊహించలేదని చెప్పింది. పైగా తనకు శత్రువంటే భయం లేదని, వాళ్లకసలు అవకాశం ఇవ్వకుండా దాడి చేస్తానని చెబుతోంది. అంతేగాదు ఆటలో ఉన్న యుద్ధంలో ఉన్నా చివరి వరకు ఉంటానిని విజయం మనదేనని విశ్వాసం వ్యక్తం చేసింది. అదీగాక ఉక్రేనియన్ దళాలు రష్యా దళాలను ఖార్కివ్ నుంచి వెనక్కి మళ్లేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా డాన్బాస్ ప్రాంతంలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని, రష్యా దళాలు ఏదోరకంగా దురాక్రమణ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలు రష్యాకు తరలింపు
2 lakh children among 11 lakh Ukrainians: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం ఎప్పటికి తెరపడుతుందో అన్నది అర్థం కానీ ప్రశ్నగా మారింది. మరోవైపు ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కీవ్ దాదాపు రెండు లక్షల మంది పిల్లలతో సహా సుమారు 1.1 మిలియన్లమంది ఉక్రెనియన్లు రష్యాకు బలవంతంగా తరలింపబడ్డారని ఆరోపించింది. ఐతే ఫిబ్రవరి 24 నుంచి పది లక్షల మంది ఉక్రెనియన్లు బలవంతంగా రష్యాకు బహిష్కరింపబడ్డారని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైగా కీవ్ అధికారుల భాగస్వామ్యం లేకుండా ఒక వెయ్యి మంది పిల్లలతో సహా సుమారు 11 వేల మంది సోమవారం ఉక్రెయిన్ నుంచి రష్యాలోకి రవాణా చేయబడ్బారని, వారంతా రష్యా మద్దతుతో విడిపోయిన ప్రాంతాలకు చెందిన వారని వెల్లడించింది. ప్రజలు తమ స్వంత ఇష్టంతోనే రష్యాకు తరలింపబడ్డారని మాస్కో చెబుతోంది. ఐతే యుద్ధ ప్రారంభమైనపపటి నుంచి మాస్కో వేలాది మందిని బలవంతంగా రష్యాకు బహిష్కరించిందని ఉక్రెయిన్ పేర్కొనడం గమనార్హం. అదీగాక మాస్కో ఉక్రెయిన్‌లోని తన చర్యలను స్పెషల్ ఆపరేషన్‌గా సమర్ధించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఐక్యరాజ్యసమితి రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ ఆపరేషన్‌లో భాగంగా, ముట్టడి చేయబడిన మారిపోల్ ఓడరేవులోని ఒక పెద్ద ఉక్కు కర్మాగారం నుంచి ఖాళీ చేయబడిన పౌరులు ఉక్రేనియన్ ఆధీనంలో ఉన్న జపోరిజ్జియా నగరానికి చేరుకున్నారు. (చదవండి: హిట్లర్‌లోనూ యూదుల రక్తం అంటూ.. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యల దుమారం) -
చంపేముందు అత్యాచారం.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా యుద్ధానికి తెరపడే సూచనలు మాత్రం కనిపించట్లేదు. ఉక్రెయిన్‌పై రష్యా తగ్గేదేలే అంటూ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలకు ప్రతిదాడులతో గట్టిగా సమాధానం చెబుతోంది. అయితే సైనిక చర్య పేరుతో రష్యా జరుపుతున్న పైశాచిక దాడిలో వేలాది మంది సైనికులు, పౌరులు, బలవుతున్నారు. వీరిలో అమాయక మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీవ్ నగరంలో రష్యా బలగాలు కాల్చి చంపిన మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యా బలగాలు ఉక్రెయిన్ మహిళలను చంపడానికి ముందు వారిలో కొంతమందిపై అత్యాచారానికి పాల్పడినట్టు వైద్యులు వెల్లడించారు. చదవండి: ఇక అసలు యుద్ధం.. రష్యా తీవ్ర హెచ్చరికలు స్త్రీలను కాల్చి చంపే ముందు కొంతమందిపై అత్యాచారం చేశారనే కేసులు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని ఉక్రెయిన్ ఫోరెన్సిక్ వైద్యుడు వ్లాడిస్లావ్ పెరోవ్స్కీ తెలిపారు. తమ బృందంతో కలిసి 12 మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.అత్యాచార కేసులు చాలా సున్నితమైనవని, దీనిపై మరింత డేటాను సేకరిస్తున్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. తమ వద్ద పరీక్షించేందుకు ఇంకా వందలాది మృతదేహాలు ఉన్నాయన్నారు. -
యుద్దం ముగిసిపోలేదు: జెలెన్స్కీ
Zelenskyy said sought concrete results: రష్యా ఉక్రెయిన్‌పై నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అదీగాక ఇంతవరకు రష్యా శాంతి చర్చలు పాల్గొంటునే మరోవైపు నుంచి దాడులు కొనసాగిస్తూనే ఉంది. కానీ మంగళవారం టర్కీలో జరిగిన శాంతిచర్చల్లో కాస్త పురోగతి కనిపించింది. రష్యా కూడా కాస్త సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా కైవ్, చెర్నిహివ్ చుట్టూ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటానని వాగ్దానం చేసింది. అయితే తాము వాటిని పూర్తిగా విశ్వసించలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఎందుకంటే గత 34 రోజులుగా సాగుతున్న ఈ యుధంలో తాము భయంకరమైన విధ్వంసాన్ని చవిచూశాం. డాన్‌బాస్‌లో గత ఎనిమిదేళ్లగా సాగుతున్న యుద్ధంలో తాము చాలా విషయాలు తెలుసుకున్నాం అని అన్నారు. అయినా ఉక్రెనియన్లు ఏమి అమాయకులు కారని ఇక్కడతో యుద్ధం ముగిసిపోయిందని తాము భావించట్లేదని చెప్పారు. అయితే ఈ ముఖామఖి చర్చలో సానూకూల సంకేతాలే వచ్చినట్లు తెలిపారు. మరోవైపు యూఎస్ ఉక్రెయిన్‌ని తటస్థ వైఖరిని అవలంభిస్తాం అన్న ప్రతిపాదనతో ముప్పు ముగిసిపోయినట్లు కాదు అని హెచ్చరిస్తోంది. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై భారీ దాడి జరగకుండా చూడటానికి మనమందరం సిద్ధంగా ఉండాలి ఉక్రెయిన్ అధికారి జాన్ కిర్బీ పిలుపునిచ్చారు. రష్యా ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాలైన డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల దిశగా తమ బలగాలను మళ్లీంచి దాడి చేసే అవకాశం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: రష్యన్ బలగాలు వెనక్కి.. దానర్థం కాల్పుల విరమణ కాదు: రష్యా ట్విస్ట్) -
రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం
Ukrainian woman recalls horror: రష్యా ఉక్రెయిన్‌పై వైమానిక దాడులతో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క యథావిధిగా దాడులకు తెగబడుతోంది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లేదంటూనే నివాసితుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఉక్రెయిన్ మహిళ రష్యా సైనికులు తన ఇంటిపై దాడి చేశారని తెలిపింది. తొలుత తమ పెంపుడు కుక్కను చంపారని, ఆ తర్వాత తన భర్తను చంపినట్లు వెల్లడించింది. తదనంతరం రష్యా సైనికులు తన తలపై గన్‌పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించి ఆత్యాచారం చేశారని తెలిపింది. ఆ సమయంలో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూమ్‌లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడంటూ ఆనాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని, తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. ప్రస్తుతం అధికారులు ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
Russia-Ukraine war: ట్యాంకుతో సహా లొంగిపోయాడు
ఉక్రెయిన్‌లో రష్యా సైనికుడొకరు ఆ దేశానికి లొంగిపోయాడు. తన అధీనంలోని అత్యాధునిక టి–72బి3 యుద్ధ ట్యాంకును కూడా ఉక్రెయిన్పరం చేశాడు. బదులుగా 7,500 పౌండ్ల రివార్డుతో పాటు ఉక్రెయిన్ పౌరసత్వం పొందనున్నాడు. తాము చేస్తున్నది అర్థం లేని యుద్ధమని మిషా అనే ఆ సైనికుడు అన్నట్టు ఉక్రెయిన్ మంత్రి విక్టర్ ఆండ్రుసివ్ చెప్పారు. రష్యా సైనికులు వాడుతున్న ఫోన్లను గుర్తించిన ఉక్రెయిన్, ఎలా లొంగిపోవాలో వివరిస్తూ కొంతకాలంగా వాటికి ఎస్ఎంఎస్లు పంపుతూ వస్తోంది. అది ఈ విధంగా వర్కౌటవుతోంది. ‘‘మిషా కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పోలీసులను ఫోన్లో సంప్రదించి లొంగిపోయాడు. రష్యా సైనికులకు తినడానికి తిండి కూడా లేదని అతను చెప్పుకొచ్చాడు. సేనలు నైతికంగా చాలా దెబ్బ తిని ఉన్నాయన్నాడు. ప్రస్తుతానికి మిషాను యుద్ధ ఖైదీగానే చూసినా సకల సౌకర్యాలూ కల్పిస్తాం’’ అని విక్టర్ చెప్పుకొచ్చారు. రష్యా యుద్ధ విమానాన్ని స్వాధీనం చేసుకునే వారికి 10 లక్షల డాలర్లు, హెలికాప్టర్‌కు 5 లక్షల డాలర్లు ఇస్తామని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది! ఈ ఆఫర్ రష్యా పైలట్లకు కూడా వర్తిస్తుందని చెప్పింది!! -
ట్రెండింగ్.. వార్ వేళ ఉక్రెయిన్ అమ్మాయికి భారతీయుడి ప్రపోజ్.. ఎక్కడో తెలుసా.?
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దండయాత్ర చేస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు తమ జన్మభూమిని వీడుతుండగా.. విదేశాలకు చెందిన వారు తమ స్వదేశాలకు తిరుగు పయణం అవుతున్నారు. ఎన్నో కష్టాలను ఓడ్చి యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ నుంచి బయటపడుతున్నారు. కాగా, ఇప్పటికే యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఎన్నో జంటలు ఒకటయ్యాయి. బాంబుల దాడులు, కాల్పుల మోతల మధ్యే కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. ప్రేమ ముందు యుద్ధం కూడా చినబోగా.. భారత్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఉక్రెయిన్ అమ్మాయి, భారత్‌కు చెందిన అబ్బాయి ఒకటయ్యారు. తన ప్రేయసి భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టులో ప్రపోజ్ చేశాడు ఢిల్లీకి చెందిన హైకోర్టు న్యాయవాది అనుభవ్ భాసిన్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కపుల్స్ లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌కు చెందిన అనుభవ్ భాసిన్, ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా ప్రేమించుకున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని.. కొత్త జీవనం కొనసాగించాలనుకున్నారు. ఇంతతో ఊహించని యుద్దం కారణంగా మళ్లీ కలుస్తామో లేదో అన్న ఆందోళనలో ఆమె తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షితంగా భారత్‌లో అడుగుపెట్టింది. వీరి ప్రేమ గురించి అనుభవ్ భాసిన్ చెబుతూ.. ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా రెండున్నరేళ్ల క్రితం పరిచయమైంది. ఆమె ఓ ఐటీ కంపెనీ పనిచేస్తోంది. అయితే, అన్నా.. భారత్‌కు రాగా కరోనా కారణంగా 2020లో మొదటిసారి లాక్డౌన్ కారణంగా విమానాల రద్దుతో ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె.. లాక్డౌన్ ముగిసే వరకు తన ఇంట్లోనే ఉందన్నాడు.తర్వాత వారు మళ్ళీ దుబాయ్‌లో కలుసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించిదన్నాడు. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చిందని.. తాను కూడా కీవ్‌కు వెళ్లినట్టు తెలిపాడు. అయితే, గతేడాది డిసెంబర్లో ఆమె ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నాడు. అనంతరం ఆమె తిరిగి ఉక్రెయిన్ వెళ్లిపోయింది. ఇంతలో యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్ను విడిచే క్రమంలో మూడు రోజులపాటు బాంబ్ షెల్టర్‌లో ఉన్నట్టు వివరించాడు. అనంతరం రైలు మార్గం ద్వారా, కాలినడకతో సరిహద్దును దాటింది. ఎన్నో కష్టాలతో పోలాండ్లోని క్రాకోవ్‌కు చేరుకున్నట్టు పేర్కొన్నాడు. అక్కడ తన స్నేహితులు ఆమెకు సాయం చేసిన్టటు చెప్పాడు. చివరగా ఆమె పోలాండ్లోని భారత రాయబారం కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక.. వీసా రావడంతో ఆమె భారత్ చేరుకున్నట్టు తెలిపాడు. ఆమె భారత్‌కు వచ్చిన ఆనందంలో ఎయిర్‌పోర్టులోనే ప్రపోజ్ చేసినట్టు తెలిపాడు. కాగా, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం అన్నాకు ఏడాది గడువుతో వీసా ఉండగా.. ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు స్సష్టం చేశాడు. -
రష్యా బలగాలను తరిమికొడుతున్న ఉక్రెనియన్లు! గోబ్యాక్ అంటూ నినాదాలు
Unarmed Ukranian People Are Ready To Do Anything: ఉక్రెయిన్‌పై గత మూడువారాలకు పైగా రష్యాయుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా సైన్యం ముందు ఏ మాత్రం సరితూగని చిన్న దేశం అయినప్పటికీ తమ గడ్డను దురాక్రమణకు గురవ్వనివ్వమంటూ ఉక్రెనియన్లు సాగిస్తున్న పోరు ప్రపంచదేశాల మన్ననలను పొందుతోంది. మహిళలు, వృద్ధుల, చిన్నపిల్లలు అని తేడా లేకుండా ఇది తమ భూమి.. దీన్ని రక్షించుకుంటామంటూ రైఫిల్స్ చేతబట్టారు. పైగా రష్యా బలగాలను చూసి ఏ మాత్రం జంకకుండా ఉత్త చేతులతో యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ల దేశభక్తిని చూసి.. రష్యా బలగాలు చలించడమే కాక వారు సైతం యుద్ధం చేసేందుకు వెనకడువేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!. అయితే ఇప్పుడూ మరోసారి అలాంటి తాజా ఘటన ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్‌లోని ఎనర్‌గోదర్ అనే నగరంలోకి రష్యా ఆర్మీ వాహనం ఒకటి వచ్చింది. అందులోంచి సైనికులు దిగుతున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. ఇది తమ దేశమని.. ఈ దేశాన్ని వదిపోవాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సైనికులను చుట్టుముట్టారు. ముందుకు వెళ్లడానికి వీలు లేదు.. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ రష్యా ఆర్మీ వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో రష్యన్ సైనికులు స్థానికులను భయపెట్టేందుకు గాల్లో గట్టిగా కాల్పుల కూడా జరిపారు. కానీ ఉక్రెనియన్ వాసులు ఏ మాత్రం భయపడకుండా కాల్పుల జరుపుతున్న సైనికుడిని తిడుతూ.. అతని మీదకి గుంపుగా నినాదాలు చేస్తూ వెళ్లారు. దీంతో రష్యాన్ సైనికులు చేసేదేమీ లేక వెంటనే అక్కడున్న వాహనం ఎక్కితిరిగి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In #Energodar, unarmed people are ready to do anything to defend their land They are not even frightened by gunfire. pic.twitter.com/ZOlIoSvg77 — NEXTA (@nexta_tv) March 20, 2022 (చదవండి: ఉక్రెయిన్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు మాతృభూమి కోసం సై అంటోంది మరి!) -
రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి
-
పోయి పోయి వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా..
రష్యా సైన్యానికి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా చురకలంటించారు. పోయి పోయి మీరు వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా. కావాలంటే బ్రిటీషర్లను అడగండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సమకాలిన అంశాలపై సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై తన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తన బాల్యం యుద్ధానికి ఎలా ముడిపడింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్ధుల్ని కేంద్రం ఎంతమంది స్వదేశానికి తరలిచ్చిందనే విషయాలపై ఎప్పటికప్పుడూ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఉక్రెయిన్ దేశ భూభాగాల్ని స్వాధీనం చేసుకుంటున్న రష్యా మిలటరీని నినదిస్తూ స్థానికులు ప్లకార్డ్‌లతో ఆందోళన చేస్తున్న విడియోల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఉక్రెయిన్ నగరానికి చెందిన ఖేర్సన్ Kherson అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. అయితే ఆ బలగాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. When an army has to face unarmed civilians, they’re facing a weapon more powerful than tanks. Satyagraha will always prove an unconquerable force… Ask the British… https://t.co/2Xpk22b67w — anand mahindra (@anandmahindra) March 5, 2022 ఆ వీడియోలను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్రా..రష్యా సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఒక సైన్యం నిరాయుధ పౌరులను ఎదుర్కోవలసి వస్తే..వాళ్లు యుద్ధ ట్యాంకుల కంటే శక్తివంతమైన ఆయుధాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్యాగ్రహాం జయించలేని శక్తి. కావాలంటే ఒక్కసారి బ్రిటిష్ వాళ్లని అడగండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: యుద్ధం.. ఆ శబ్ధం వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది- ఆనంద్ మహీంద్రా -
ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్ వీడియా
Ukrainian Man Single-Handedly Stops: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై మూడువైపుల నుంచి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లోని బఖ్మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేశాడు. తాను ఎంతవరకు బలంగా నెట్టగలడో అంతమేర నెట్టి ఆ తదుపరి నేలమీద మోకాళ్ల పై నిలబడి కూర్చున్నాడు. వెంటేనే అక్కడ ఉండే నివాసితులు అతని వద్దకు పరిగెత్తుకుని వస్తారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ అధికారులు ఇన్‌స్టాగ్రాంలో .."ఉక్రెయిన్ ప్రజలను బందిఖానాలో ఉంచుతానని రష్యా సంవత్సరాలుగా అబద్ధం చెబుతోంది. వాస్తవమేమిటంటే ఉక్రేనియన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించడమే కాదు అవసరమైతే తమ ఒట్టి చేతులతో రష్యన్ ట్యాంకులను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ భావోద్వేగంగా పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Ukraine UA (@ukraine.ua) (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి
Military Vehicle Crushing Car: గత నాలుగు రోజులుగా రష్యా బలగాల వైమానిక క్షిపణి దాడులతో ఉక్రెయిన్ అతలాకుతులం అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ వాహనం వేగంగా వస్తున్న కారు పైకి దూసుకువచ్చింది. ఆ సాయుధ వాహనం కింద కారు నుజ్జునుజ్జు అయిపోయింది. నిజానికి మనుషులు బతికి ఉండే అవకాశమే లేదు అన్నంతగా ఆ కారు ధ్వంసమైంది. విచిత్రమేమిటంటే ఆ కారులోని మనిషి బతికే ఉన్నాడు. ఈ ఘటన రైల్వే ట్రాక్‌కి సమీపంలో చోటు చేసుకుంది. అయితే ఆ సాయుధ వాహనం వెనుక కూడా రెండు కార్లు వస్తున్నాయి. కానీ ఆ సాయుధ వాహనం స్కిడ్ అయ్యిందో లేక వేగంగా వాహనాన్ని అడ్డుకునే క్రమంలో అలా వచ్చిందా అనేది తెలియలేదు. పైగా ఆ సాయుధ వాహనానం రష్యాకి సంబంధించినదేనా అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ ఆ కారులోని వృద్ధుడు క్షేమంగా బయటపడటం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే సీసీటీవలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుగా ఉందని అదే మనిషి ప్రాణాలను కాపాడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. Za sve one koji ne žele da vide šta Putin radi u Ukrajini. Ruski narod ne stoji iza ovoga. Ovo je Putinov lični rat. Na obraz medjunarodnoj zajednici koja ovo nemo posmatra.#Ukraine pic.twitter.com/aqfhpMuX9A — Balša Božović (@Balshone) February 25, 2022 Lucky driver. He is alive! pic.twitter.com/Ry99BX375D — Ragıp Soylu (@ragipsoylu) February 25, 2022 (చదవండి: నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్ విడిచి రాను!: భారతీయ విద్యార్థి) -
రెచ్చిపోయిన రష్యా ఆర్మీ.. ‘మగధీర’ రేంజ్లో ఉక్రెయిన్ సైన్యం రెస్పాన్స్.. వీడియో వైరల్
కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక బలగాలు విరుచుకుపడుతున్నాయి. కనికరం అనేదే లేకుండా రష్యా బలగాలు దాడులు జరుపుతున్నాయి. సైనికులు, పౌరుల ఆర్తనాదాలతో ఉక్రెయిన్ తమ శక్తి మేరకు రష్యాతో పోరాడుతోంది. తమ ప్రాణాలను కూడా సైతం లెక్కచేయకుండా ఉక్రెయిన్ సైనికులు సాహసం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ద్వీపం ఉంది. ఈ ఉద్రికత్తల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ద్వీపానికి రక్షణగా 13 మంది సైనికులను నియమించింది. వారు విధులు నిర్వహిస్తున్న క్రమంలో రష్యా మిలటరీ ఆ ద్వీపంపై ఫోకస్ పెంచింది. స్నేక్ ఐలాండ్ లక్ష్యంగా రష్యా సైనికులు ముందుకు సాగారు. The 13 heroes of #UKRAINE 🇺🇦 army soldiers who were stationed on snake island in the audio, one says ‘This is it ‘ they are heard telling #Russian warship to go ‘fuck yourself’ all died defending just 25 miles away from #NATO Territory #Ukrainian #UkraineInvasion #RussianArmy pic.twitter.com/fDdCVuc0Cz — Bahaka (@Petebahaka) February 25, 2022 ఈ క్రమంలో సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న రష్యాకు చెందిన నేవీ వార్‌షిప్ ఆ ఐలాండ్ వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికులను గుర్తించిన రష్యా నేవీ.. వారిని లొంగిపోవాలని సూచించారు. లేకపోతే వారిని కాల్చివేస్తామని వార్నింగ్ అనౌన్స్ చేశారు. రష్యా నేవీ వార్నింగ్‌కు ఉక్రెయిన్ సైనికులు స్పందిస్తూ.. చావనైనా చస్తాం కానీ.. లొంగిపోయే ప్రసక్తే లేదంటూ(బూతు పదజాలంతో) వ్యాఖ్యలు చేశారు. వారి మాటలతో మరింత రెచ్చిపోయిన రష్యా నేవీ.. ఉక్రెయిన్ సైనికులపై వార్‌షిప్ నుంచి బాంబుల వర్షం కురిపించింది. దీంతో 13 మంది ఉక్రెయిన్ సైనికులు వీర మరణం పొందారు. Ukrainian soldier deployed on Snake Island live streamed the moment a Russian warship opened fire on the Island. 13 soldiers died in the attack. pic.twitter.com/FDe92rYYVR — C O U P S U R E (@COUPSURE) February 24, 2022 -
Russia Ukraine War: ప్రాణ భయంతో జనం పరుగులు..
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వైమానిక దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. అయితే ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడులు చేయడం లేదని రష్యా పేర్కొంది. జనావాసాలు తమ లక్ష్యం కాదని, కేవలం సైనిక స్థావరాలు, వసతులు, ఎయిర్ డిఫెన్స్, వాయుసేనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలిపింది. కానీ రష్యా దాడిలో సైనికులతోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. చాల చోట్ల రష్యా క్షిపణులు జనావాసాలపై పడటంతో పౌరులు మృతి చెందుతున్నారు. చదవండి: రష్యా ముందు పసికూన ఉక్రెయిన్ నిలుస్తుందా?.. బలబలాలు ఇవే..! దీంతో ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఎయిర్‌పోర్టులు జనంతో నిండిపోయాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం ఎయిర్ స్పేస్ మూసివేయడంతో అన్ని విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విమానాలకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఏటీఎం, బ్యాంక్‌ల వద్ద భారీగా క్యూలైన్ ఏర్పడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సబ్వే అండర్‌పాస్‌లో, అండర్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్లలో తలదాచుకునేందకు జనాలు పరుగులు పెడుతున్నారు. LIVE: Ukrainians leave Kyiv after Russian forces begin a military operation in Ukraine https://t.co/IuUcMs1c2o — Reuters (@Reuters) February 24, 2022 ఉక్రెయిన్‌లో నిత్యావసరల కోసం జనాలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు క్యూ పెరిగింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రష్యా దాడి నేపథ్యంలో కీవ్ నగరాన్ని ప్రజలు వీడేందుకు సిద్ధపడుతున్నారు తమ నగరంపై బాంబుల మోత మోగుతుండటంతో వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కీవ్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఎవరూ రావద్దని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలం లేదని తెలిపింది. అండర్ గ్రౌండ్స్, బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. బుద్ధి బయటపెట్టిన ఇమ్రాన్ ఖాన్ -
ఏ నిమిషం ఏం జరుగుతుందొ అర్దం కావట్లేదు