మిస్‌ జపాన్‌గా ‘ఉక్రెయిన్‌’ యువతి! | Ukrainian-born Miss Japan rekindles an old question | Sakshi
Sakshi News home page

మిస్‌ జపాన్‌గా ‘ఉక్రెయిన్‌’ యువతి!

Published Sun, Jan 28 2024 5:42 AM | Last Updated on Sun, Jan 28 2024 5:42 AM

Ukrainian-born Miss Japan rekindles an old question - Sakshi

టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్‌. తాజాగా జరిగిన మిస్‌ నిప్పన్‌ (జపాన్‌ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్‌ జపాన్‌ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్‌ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్‌ వీడి జపాన్‌ వచ్చేసింది.

గతేడాదే షినోకు జపాన్‌ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్‌ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్‌ జపాన్‌ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్‌ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్‌ జపాన్‌ కిరీటం నెగ్గారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement