Miss Japan
-
మిస్ జపాన్‌గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
అరియానా మియోమోటో
నిన్నమొన్నటి వార్తాపత్రికల్లో మీరెలాగూ ప్రియాంక యషికోవాను చూస్తారు. అయితే ఆమె శిరస్సుపై దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ అందాల కిరీటంలోని తళుకుబెళుకుల్లో పూర్వపు ‘మిస్ జపాన్’ అరియానా మియామోటో కన్నీటి ఛాయల్ని మీరు కనిపెట్టలేకపోవచ్చు. ఆఫ్రికా తండ్రికి, జపాన్ తల్లికి జన్మించిన అరియానా నిరుటి అందాల రాణి. తొలి ‘విదేశీ మిస్ జపాన్’. జపాన్‌కు ఒక ఆఫ్రికా అమ్మాయి అందాల రాణి కావడం ఏంటని అప్పుడంతా అరియానాను నొప్పించారు. వారి విమర్శలకు చాటుగా కంటతడి పెట్టిన అరియానా, భారత సంతతికి చెందిన ప్రియాంక ఈ ఏడాది అందాల రాణిగా విజేత అయ్యే క్రమంలో ఆమెకు ఎంతో ఆత్మస్థయిర్యాన్ని నూరిపోశారు. ఆ స్థయిర్యం పోటీ లో గెలవడానికి మాత్రమే కాదు, గెలిచాక విమర్శల్ని తట్టుకోడానికి కూడా! ప్రియాంక కూడా అరియానాలా ప్యూర్ జపానీ కాదు కదా. అందుకు! -
నేను ఇండియన్ని కాదు, కానీ థాంక్స్!
టోక్యో: 'భారత్ నుంచి నాకు పెద్ద సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి. అందరూ నాకు గుడ్ లక్ చెప్తున్నారు. నేను భారతీయురాలిని కాదని చెప్పినా వారు నాకు సందేశాలు పంపుతూనే ఉన్నారు' అని 'మిస్ జపాన్'గా విజయం సాధించిన అందాల సుందరి ప్రియాంక యోషికవా తెలిపారు. భారత సంతతికి చెందిన ప్రియాంక యోషికవా సోమవారం 'మిస్ జపాన్' కిరీటాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వాషింగ్టన్ లో జరిగి మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె జపాన్ తరఫున పాల్గొననుంది. టోక్యోలో ఉన్న ఆమె తాజాగా 'ఎన్డీటీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను తరచూ ఇండియా వస్తానని, భవిష్యత్తులో కోల్ కతాలోని అనాథలు, నిరాశ్రయులైన చిన్నారులకు సాయం చేసేందుకు ఏదైనా చేయాలని భావిస్తున్నాని తెలిపింది. తాను భారతీయురాలు కాకపోయినా.. తనపై ప్రేమ చూపుతున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రియాంక యోషికవా టోక్యోలో పుట్టారు. ఆమె తండ్రి భారతీయుడు కాగా, తల్లి జపనీయురాలు. తమ తండ్రి స్వస్థలం కోల్‌కతా అని, తన తాత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడని ఆమె చెప్పారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో తన తాత మహాత్మాగాంధీని కోల్‌కతాలోని తన ఇంటికి ఆహ్వానించి.. రెండు రోజుల బస ఏర్పాటు చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, ప్రియాంక పూర్తిగా జపనీయురాలు కాదని, ఆమెకు ఎలా ఈ అందాల కిరీటాన్ని ప్రకటిస్తారని పలువురు జపనీయులు జాత్యాంహకారపూరిత వ్యాఖ్యలతో నిరసన తెలుపుతున్నారు. 'హాఫ్' జపనీయురాలంటూ, ఆమెకు 'మిస్ జపాన్' అయ్యే అర్హత లేదంటూ వస్తున్న విమర్శలను ప్రియాంక ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. -
మిస్ జపాన్‌గా ప్రియాంక.. అసంతృప్తి!
భారత సంతతికి చెందిన అందాల సుందరి ప్రియాంక యోషికవా 'మిస్ జపాన్' కిరీటాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన జాతీయ అందాల పోటీలో ఆమెను ఈ కిరీటం వరించింది. అయితే, ప్రియాంక పూర్తిగా జపనీయురాలు కాదని, ఆమెకు ఎలా ఈ అందాల కిరీటాన్ని ప్రకటిస్తారని పలువురు జపనీయులు జాత్యాంహకారపూరిత వ్యాఖ్యలతో నిరసన తెలుపుతున్నారు. గత ఏడాది కూడా ఇదేవిధంగా నల్లజాతీయురాలైన ఆరియనా మియామోటో 'మిస్ జపాన్'గా ఎంపికైంది. దీనిపై స్థానికంగా పెద్ద నిరసన వ్యక్తమైంది. జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ పలువురు అందాల పోటీలను తీరును ఖండించారు. ఆమె 'హాఫ్' జపనీయురాలంటూ, ఆమెకు 'మిస్ జపాన్' అయ్యే అర్హత లేదంటూ చెలరేగిపోయారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా విమర్శలు వస్తున్నా ప్రియాంక వాటిని లక్ష్యపెట్టడం లేదు. తనకు ముందు 'మిస్ జపాన్'గా నిలిచిన ఆరియనా తనకు ఆదర్శమని, ఆమె బాటలో సాగుతూ తాను ఈ కిరీటాన్ని దక్కించుకున్నానని ప్రియాంక స్పష్టం చేశారు. ప్రియాంక యోషికవా టోక్యోలో పుట్టారు. ఆమె తండ్రి భారతీయుడు కాగా, తల్లి జపనీయురాలు. బహుళ జాతుల వారసత్వం కలిగిన అమ్మాయిలు జపాన్‌లో వివక్షకు గురవుతున్నారని, ఆ సాంస్కృతిక వివక్షపై పోరాడి అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు తాను పోరాడుతానని వృత్తిరీత్య కిక్ బాక్సర్ కూడా అయిన యోషికవా తెలిపారు. తమ తండ్రి స్వస్థలం కోల్‌కతా అని, తన తాత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడని ఆమె చెప్పారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో తన తాత మహాత్మాగాంధీని కోల్‌కతాలోని తన ఇంటికి ఆహ్వానించి.. రెండు రోజుల బస ఏర్పాటు చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు.