నేను ఇండియన్ని కాదు, కానీ థాంక్స్! | i Am Not Indian, says Priyanka | Sakshi
Sakshi News home page

నేను ఇండియన్ని కాదు, కానీ థాంక్స్!

Published Wed, Sep 7 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

నేను ఇండియన్ని కాదు, కానీ థాంక్స్!

నేను ఇండియన్ని కాదు, కానీ థాంక్స్!

టోక్యో: 'భారత్ నుంచి నాకు పెద్ద సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి. అందరూ నాకు గుడ్ లక్ చెప్తున్నారు. నేను భారతీయురాలిని కాదని చెప్పినా వారు నాకు సందేశాలు పంపుతూనే ఉన్నారు' అని 'మిస్ జపాన్'గా విజయం సాధించిన అందాల సుందరి ప్రియాంక యోషికవా తెలిపారు.

భారత సంతతికి చెందిన ప్రియాంక యోషికవా సోమవారం 'మిస్‌ జపాన్‌' కిరీటాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వాషింగ్టన్ లో జరిగి మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె జపాన్ తరఫున పాల్గొననుంది.

టోక్యోలో ఉన్న ఆమె తాజాగా 'ఎన్డీటీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను తరచూ ఇండియా వస్తానని, భవిష్యత్తులో కోల్ కతాలోని అనాథలు, నిరాశ్రయులైన చిన్నారులకు సాయం చేసేందుకు ఏదైనా చేయాలని భావిస్తున్నాని తెలిపింది. తాను భారతీయురాలు కాకపోయినా.. తనపై ప్రేమ చూపుతున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.  

ప్రియాంక యోషికవా టోక్యోలో పుట్టారు. ఆమె తండ్రి భారతీయుడు కాగా, తల్లి జపనీయురాలు. తమ తండ్రి స్వస్థలం కోల్‌కతా అని, తన తాత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడని ఆమె చెప్పారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో తన తాత మహాత్మాగాంధీని కోల్‌కతాలోని తన ఇంటికి ఆహ్వానించి.. రెండు రోజుల బస ఏర్పాటు చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు.

అయితే,  ప్రియాంక పూర్తిగా జపనీయురాలు కాదని, ఆమెకు ఎలా ఈ అందాల కిరీటాన్ని ప్రకటిస్తారని పలువురు జపనీయులు జాత్యాంహకారపూరిత వ్యాఖ్యలతో నిరసన తెలుపుతున్నారు. 'హాఫ్‌' జపనీయురాలంటూ, ఆమెకు 'మిస్‌ జపాన్‌' అయ్యే అర్హత లేదంటూ వస్తున్న విమర్శలను ప్రియాంక ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement