
కడలిపై కదన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా సాగరతీరంలో గురువారం జరిగిన నావికాదళ పూర్తిస్థాయి విన్యాసాలతో నగరవాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు

దాదాపు గంటన్నరపాటు కనులార్పకుండా ప్రజలు వీటిని వీక్షించారు

భారత నావికాదళం తమ సాయుధ సంపత్తిని ప్రజలకు తెలిపే విధంగా ఈ విన్యాసాలు సాగాయి. 15 యుద్ధ విమానాలు, జలాంతర్గామి, పలు నౌకలు పాల్గొన్నాయి

తొలుత మూడు హెలికాప్టర్లు భారత జాతీయ పతాకాన్ని, నావికాదళ పతాకాన్ని గగనతలంలో ఎగురవేస్తూ.. ప్రయాణించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది

ఆయిల్ రిగ్‌ను విజయవంతంగా పేల్చి సముద్రంలో జరిగే యుద్ధాలను కళ్లకు కట్టినట్లు చూపించారు
























