
నేవీ విన్యాసాలు అబ్బురపరిచాయి. వీకెండ్ కావడంతో ఆదివారం పర్యాటకులు భారీగా తరలిరాగా..విన్యాసాలు వీక్షించి మధురానుభూతి పొందారు.

సాగ రతీరం యుద్ధవాతావరణాన్ని తలపించింది. నేవీ విన్యాసాల రిహార్సల్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నౌకాదళ విన్యాసాలలో సాగర తీరం సంభ్రమాశ్చర్యాలకు కేంద్రంగా మారింది

నేవీ సాహసికులు ప్రదర్శించిన పలు విన్యాసాలు సందర్శకులకు కనువిందు చేశాయి. ప్రతి విన్యాసం అబ్బురపరిచింది

నింగి, నేలా తేడాలేదనేలా సాగిన ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించిన ప్రజలు సరికొత్త అనుభూతిని పొందారు. యుద్ధ ట్యాంకర్లతో శత్రుసేనపై విరుచుకుపడిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి
























