Navy Day celebrations
-
బాంబుల మోతతో దద్దరిల్లిన విశాఖ సాగరతీరం (ఫొటోలు)
-
సాగర వీరుల విన్యాసాలు.. నేవీ డే స్పెషల్ (ఫొటోలు)
-
సాగరతీరంలో సాహస విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా కనిపించే విశాఖ సాగరతీరం ఆదివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బాంబుల వర్షం.. యుద్ధ విమానాల చక్కర్లు, శత్రుమూకల దాడులు.. యుద్ధ ట్యాంకర్ల వీర విహారంతో.. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. శత్రుదేశం పాక్‌పై విజయానికి ప్రతీకగా ఏటా విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఆదివారం నేవీడే విన్యాసాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ముందుగా నేవీ బ్యాండ్, నేవల్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలతో ప్రారంభమైన విన్యాసాలు.. మార్కోస్ రాకతో వేడెక్కాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, వైమానిక దళాల అద్భుత ప్రదర్శనలు, యుద్ధ, నిఘా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నిర్వహించబడే వ్యూహాత్మక విన్యాసాలతో కూడిన ఫ్లాగ్షిప్ ఈవెంట్ అద్భుతంగా సాగింది. చివరిగా.. యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణతో నేవీడే విన్యాసాల్ని ముగించాయి. విన్యాసాలకు విశిష్ట అతిథులుగా మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఎంపీ డా.సత్యవతి, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ రవిశంకర్, జేసీ విశ్వనాథన్ హాజరయ్యారు. అనంతరం.. నేవీ హౌస్‌లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ‘ఎట్ హోమ్’ ఫంక్షన్ పేరుతో నిర్వహించిన తేనీటి విందులో గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ పటిమని చాటిచెప్పే వీడియోను గవర్నర్ ఆవిష్కరించి తిలకించారు. -
కిక్కిరిసిన సాగర తీరం.. ఆర్కే బీచ్‌లో ఘనంగా నేవీ డే విన్యాసాలు (ఫొటోలు)
-
బాంబుల మోతతో దద్దరిల్లిన విశాఖ సాగరతీరం (ఫొటోలు)
-
విశ్వగురు భారత్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధీమా వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి నరనరాల్లో సంస్కృతి, సంప్రదాయాలు ఇమిడి ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామని, 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెలుపల రాష్ట్రపతి ఆధ్వర్యంలో మొదటిసారిగా విశాఖపట్నంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో నిర్వహించిన నేవీ డే వేడుకలకు ఆమె ఆదివారం సాయంత్రం హాజరయ్యారు. అంతకు ముందు విజయవాడ నుంచి నేరుగా విశాఖ చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. నావికా దళపతి, అధికారులు, రాష్ట్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ విన్యాసాల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలకించారు. రాష్టంలో వివిధ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 6.25కి తూర్పు నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకొని నేవీ డే రిసెప్షన్‌కు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. నేవీ డే వేడుకల సందర్భంగా రాష్ట్ర పతి ఏమన్నారంటే.. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర భారత రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణలో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4వ తేదీన నేవీ డే వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ యుద్ధంలో అసువులు బాసిన యుద్ధ వీరులను మరోసారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలను కీర్తిస్తూ.. ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత. మూడు వైపులా సముద్రం, ఒకవైపు పర్వతాలు కలిగిన మన దేశం.. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజ సిద్ధంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం. తీర రక్షణలో భారత నేవీ ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనదని త్రివిధ దళాధిపతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రంలో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కర్నూలు జిల్లాలో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్రేంజ్ (ఎన్‌వోఏఆర్)తో దేశ రక్షణలో మనం సిద్ధంగా ఉండేందుకు దోహదం చేయనుంది. ఇది దేశానికి మంచి ఆస్తిగా మారనుంది. గిరిజన విద్యకు దోహదం దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏకలవ్య పాఠశాలలు గిరిజనుల్లో విద్యావకాశాలు పెంపొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. రాష్ట్రంలో బుట్టాయగూడెం, చింతూరు, రాజవొమ్మంగి, గుమ్మలక్ష్మీపురంలో ప్రారంభిస్తున్న ఏకలవ్య పాఠశాలల వల్ల గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు గిరిజన ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నా. దేశంలో ఎవరైనా, వారి ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా విద్య అందించేందుకు మనం కృషి చేయాలి. విద్యను అందరికీ అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ రహదారి అభివృద్ధి పనులతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్దికి కూడా దోహదం చేస్తుంది. రాష్ట్రపతి ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు రోడ్డు రవాణా, గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం 7 ప్రాజెక్టులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలులో రక్షణ పరిశోధన, లేబరేటరీ డెవలప్మెంట్ (డీఆర్డీఎల్) నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్(ఎన్ఓఏఆర్)ను ప్రారంభించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.932 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారు. అవి.. ఎన్‌హెచ్–340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన జాతీయ రహదారి, ఎన్‌హెచ్–205లో నిర్మించిన నాలుగు లేన్ల ఆర్వోబీతో పాటు ఎన్‌హెచ్–44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్లో ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటెడ్ స్ట్రక్చర్, స్లిప్ రోడ్స్, డోన్ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్స్, రహదారులు, ఎన్‌హెచ్–342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నిర్మించనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మించిన 4 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను (బుట్టాయగూడెం, చింతూరు, గుమ్మలక్ష్మీపురం, రాజవొమ్మంగి) రాష్ట్రపతి ప్రారంభించారు. -
ఘనంగా ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలు
-
విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు
విశాఖ: నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్న నేవీ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కూడా నేవీ వేడుకల్ని తిలకించారు. నేవీ డేలో యుద్ధ నౌకలు, విమానాలు అలరించాయి.. ప్రధానంగా మిగ్-19 యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివారం సాయంత్రం వేళ విశాఖ సాగర తీరంలో భారత్ నేవీ ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఔరా అనిపించాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖలో నేవీ డే వేడుకలు: ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
Time: 5:21PM విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీడే వేడుకలు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేవీడే వేడుకలను తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Time: 03:53PM ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము Time 02:53PM రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన ముగించుకుని విశాఖకు బయల్దేరారు. Time 12:49 PM అధికారిక విందులో పాల్గొన్న రాష్ట్రపతి విజయవాడ రాజ్‌భవన్‌కు ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. Time 12:15 PM మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉంది. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి అన్నారు. Time 12:06 PM ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం: గవర్నర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ తరఫున స్వాగతం పలుకుతున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం. తెలుగు భాషకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోనే తెలుగు అత్యంత మధురమైన భాషగా రవీంద్రనాథ్ ఠాగూర్ కీర్తించారు. కృష్ణా, గోదావరి లాంటి ఎన్నో జీవ నదులు ఉన్న రాష్ట్రం ఏపీ అని గవర్నర్ అన్నారు. Time 11:55 AM ముర్ము జీవితం అందరికీ ఆదర్శం: సీఎం జగన్ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని సీఎం అన్నారు. Time 11:47 AM రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి సీఎస్ జవహర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. Time 10:54 AM రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ►రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ద్రౌపది ముర్ము తొలిసారిగా ఏపీలో పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారు. అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఆమె రాష్ట్ర పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు. అలాగే రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన ఇలా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని ఘనంగా సన్మానిస్తారు. అనంతరం అక్కడి నుంచి ద్రౌపది ముర్ము రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ ఇచ్చే అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంలోని నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నూతన రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి నేరుగా తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని గోశాలను సందర్శిస్తారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులతో ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా భేటీ అవుతారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. -
4న విశాఖకు రాష్ట్రపతి రాక
సాక్షి, విశాఖపట్నం: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. భారత నౌకాదళ దినోత్సవాల్లో నేవీ డే విన్యాసాల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో ఏడు కీలక ప్రాజెక్టుల్ని కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతిభవన్ సెక్రటేరియట్ విడుదల చేసింది. రాష్ట్రపతి డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.25 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి 3.25 గంటలకు నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. 3.35 గంటలకు డేగా నుంచి బయలుదేరి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళ సూట్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.05 గంటలకు చోళా సూట్ నుంచి బయలుదేరి ఆర్కేబీచ్కి చేరుకుంటారు. నేవీ డే సందర్భంగా భారత నౌకాదళం నిర్వహించే యుద్ధ విన్యాసాల్ని ఆమె ప్రారంభించి తిలకిస్తారు. విన్యాసాలు ముగిసిన అనంతరం అదే వేదిక నుంచి కేంద్రప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.10కి తూర్పు నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకుని నేవీ డే రిసెప్షన్‌కు హాజరవుతారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరతారు. రాత్రి 8.40 గంటలకు రాష్ట్రపతి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖలో రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే.. ► రక్షణ శాఖకు సంబంధించి కర్నూలులో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (ఎన్‌వోఏఆర్), నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్డ్ నైట్‌విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ► కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎన్‌హెచ్–340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన హైవే, ఎన్‌హెచ్–205లో నిర్మించిన నాలుగు లైన్ల ఆర్వోబీ ► ఎన్‌హెచ్–44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్లో ఆరులైన్ల గ్రేడ్ సెపరేటెడ్ స్ట్రక్చర్, స్లిప్‌రోడ్స్, డోన్ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్లు, రహదారులు ► గిరిజన శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, సైన్స్ సెంటర్. శంకుస్థాపన చేసే ప్రాజెక్టు.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్–342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులు -
సాగరతీరంలో ‘యుద్ధం’!
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రశాంతమైన విశాఖ సాగరతీరంలో మంగళవారం ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో యుద్ధనౌకలు, సబ్‌మెరైన్, స్పీడ్బోట్లు, చాతక్లు మోహరించాయి. తీరం వైపు దూసుకొస్తున్న స్పీడ్బోట్లపై యుద్ధనౌకలు బాంబుల వర్షం కురిపించాయి. ఒక్కసారిగా మారిన పరిస్థితులతో సందర్శకులకు ఏం జరుగుతుందో అర్థంగాలేదు. తీరంవైపునకు దూసుకువస్తున్న స్పీడ్ బోట్లు తరువాత ఇవి.. డిసెంబర్ 4వ తేదీన జరగనున్న నేవీ డే కోసం రిహార్సల్స్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నేవీ డే సందర్భంగా తూర్పునౌకదళం విశాఖ ఆర్కే బీచ్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రారంభించింది. మంగళవారం విన్యాసాల రిహార్సల్స్ చేశారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. -
నిరాడంబరంగా నేవి డే
విశాఖ : పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా ఏటా నిర్వహించే నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరుగుతున్నాయి. తూర్పు తీరం నుంచి బయలుదేరిన యుద్ధనౌకలు కరాచీ పోర్టును స్వాధీనం చేసుకోవడంతో 1971 డిసెంబర్ 4న భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఏటా విశాఖ తెరువు తూర్పు నౌకాదళం ఇండియన్ నేవీ డే విన్యాసాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎలాంటి విన్యాసాలు నిర్వహించలేదు. కేవలం ఇవాళ సాయంత్రం శుక్రవారం) విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విద్యుద్దీపాలు అలంకరించి నేవీ డే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ దశలో విశాఖ బీచ్‌లో ఉండే విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ జైన్ పూలమాలవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. శత్రుదేశాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావే ఎప్పుడు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. (ఇది మనసున్న ప్రభుత్వం) -
నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : భారత నావికా దళ దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నౌకదళ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ విన్యాసాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిలకించారు. 1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్‌పై గెలుపుకు ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే ను నిర్వహిస్తారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నేవీ విన్యాసాలను తిలకించి నేవీ సిబ్బందిని అభినందించారు. సీఎం జగన్.. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు నేవీ విన్యాసాలను తిలకించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్ హౌస్‌కు చేరుకొని.. నేవీ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. నేవిహౌస్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, చెట్టి ఫాల్గుణ, బాబురావు, వైజాగ్ సిటీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 8.40గంటలకు తాడేపల్లిలోని తన నివాసం సీఎం చేరుకోనున్నారు. కాగా, నేవీ సర్క్యూట్ హౌస్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీయుడబ్ల్యూజే చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు కలిశారు. జీవో 144 సవరించి ఉగాది నాటికి జర్నలిస్ లకు ఇల్లు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌ను కోరారు. -
మిలన్-2020కు ఆతిథ్యమివ్వనున్న తూర్పు నావికా దళం
సాక్షి, విశాఖపట్నం : భారత నావికా దళంలో డిసెంబర్ నాలుగవ తేదికి అత్యంత ప్రాధాన్యత ఉందని తూర్పు నావికా దళం అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పీసీ తెలిపారు. 1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నేవీ డే ను నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయ్యిందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. బుధవారం విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సముద్ర మార్గం నుంచి శత్రు దేశాలు, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఆన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కోస్టల్ భద్రతను, పెట్రోలింగ్‌ను పటిష్టపరిచినట్లు తెలిపారు. విశాఖ తూర్పు నావికా దళంలో వచ్చే ఏడాది నుంచి మిగ్ 29 యుద్ద విమానాలు భాగస్వామ్యం కాబోతున్నాయని వెల్లడించారు. మిగ్ 29 యుద్ద విమానాల శిక్షణా కేంద్రం విశాఖలో ప్రారంభించబోతున్నామని, వచ్చే ఏడాది 30కి పైగా దేశాలు విశాఖలో జరిగే మిలన్-2020కి తూర్పు నావికా దళం ఆతిధ్యమివ్వబోతుండటం గర్వకారణమన్నారు. గత కొన్నేళ్లుగా అత్యాధునిక యుద్ద షిప్‌లు, విమానాలు, హెలీకాప్టర్లు, ఆయుధాలను ఇండియన్ నేవీ సమకూర్చుకోగలిగిందని అతుల్ కుమార్ జైన్ తెలిపారు. -
నేవీలోకి త్వరలో 56 యుద్ధనౌకలు
న్యూఢిల్లీ: భారత నావికాదళంలోకి త్వరలోనే 56 కొత్త యుద్ధనౌకలు, ఆరు జలాంతర్గాములు చేరనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. సోమవారం నావికాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాంబా మాట్లాడుతూ.. ‘2050 నాటికి 200 యుద్ధనౌకలు, 500 సొంత యుద్ధ విమానాలతో భారత నేవీ ప్రపంచస్థాయి నౌకాదళంగా తయారవుతుంది’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు షిప్‌యార్డుల్లో 32 నౌకలు, జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిని అదనంగా తాజాగా మరో 56 యుద్ధనౌకలు, 6 జలాంతర్గాముల చేరికకు కేంద్రం పచ్చజెండా ఊపిందని వెల్లడించారు. చైనా, పాక్‌తో ద్విముఖ పోరు సంభవిస్తే నేవీ ఎలా ఎదుర్కొంటుందన్న మీడియా ప్రశ్నకు..‘పాక్ నేవీ కంటే మనం చాలాముందున్నాం. ఇక హిందూ మహాసముద్రం పరిధిలో చైనాపై మనదే పైచేయిగా ఉంది’ అని పేర్కొన్నారు. భారత త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్–సీడీఎస్)ని నియమించాలన్న ప్రతిపాదనకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అంగీకారం కుదిరిందనీ, త్వరలోనే ఈ విషయాన్ని రక్షణ శాఖకు నివేదిస్తామని లాంబా అన్నారు. రిలయన్స్‌కు షాకిచ్చిన నేవీ.. ఐదు ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌకలను నిర్ణీత సమయంలోగా అందించలేకపోయిన రిలయన్స్ నేవల్ ఇంజనీరింగ్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎల్)పై భారత నేవీ కొరడా ఝుళిపించింది. కాంట్రాక్టు సందర్భంగా రిలయన్స్ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీని నేవీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్పందిస్తూ..‘రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టును రద్దుచేయాలా? వద్దా? అనే విషయమై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. నౌకల నిర్మాణానికి రూ.3,200కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న పిపవావ్ డిఫెన్స్, ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ సంస్థను 2016లో ఆర్ఎన్ఈఎల్ కొనుగోలు చేయడం తెల్సిందే. -
సాహస హేల
సముద్ర తీరంలో నేవీ డే వేడుకలు జనాన్ని కదలివ్వకుండా కట్టిపడేసిన విన్యాసాలు ఆకాశంలో, ఉపరితంలో కళ్లకు కట్టిన యుద్ధ సన్నివేశాలు ప్రదర్శనలిచ్చిన యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు గగుర్పాటుకు గురిచేసిన మార్కోస్ శక్తి సామర్థ్యాలు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అమర వీరులకు నివాళులర్పించిన ఈఎన్సీ చీఫ్ హెచ్‌సీఎస్ బిస్త్ ప్రశాంత తీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. భీకర శబ్దంతో సముద్రంలో బాంబ్ పేలింది. దాని ధాటికి బంగాళాఖాతం అదిరిపడింది. అల వంద అడుగులకుపైగా ఎగసిపడింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆకాశంలో రంగురంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు స్కై డైవింగ్ చేస్తూ నేలకు దిగారు..యుద్ధ నౌకలు, యుద్ధ హెలికాఫ్టర్లు, చేతక్ హెలికాఫ్టర్లు, క్లోజ్ రేంజ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో దూసుకుపోయారుు. ఇలాంటి ఎన్నో..ఎన్నెన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికై ంది. ఆర్కే బీచ్‌లో ఆదివారం జరిగిన నేవీ డే వేడుకల్లో ప్రతి ప్రదర్శన ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రతి విన్యాసం గురించి వ్యాఖ్యాతలు జ్యోతి, షైలీపంథ్, దేష్ముఖ్లు సవివరంగా ప్రజలకు తెలియజేశారు. సాక్షి, విశాఖపట్నం : సముద్ర రారాజు భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నగర వాసులకు దక్కింది. ఏడాది పొడవునా ఈ రోజు కోసం ఎదురుచూసిన ప్రజల జన్మ ధన్యమైందనట్లుగా నేవీ డే వేడుక సాగింది. బంగాళాఖాతంలో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు, తీరంలో మాటువేసిన శత్రు సేనలపై విరుచుకుపడుతున్నట్టు, గగన తలంలో, భూ ఉపరితలంలో, సాగరంలో నేవీ చేసిన విన్యాసాల ప్రదర్శన నభూతో నభవిష్యత్ అనిపించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు సతీసమేతంగా ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తూర్పునావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ హెసీఎస్ బిస్త్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆర్కె బీచ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై అశోక్‌గజపతిరాజు, బిస్త్‌లు సతీసమేతంగా ఆశీనులై విన్యాసాలు వీక్షించారు. తీరం వెంబడి వేలాదిగా తరలివచ్చిన జనం నేవీ విన్యాసాలు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీద సామే అయింది. ఒకానొక సమయంలో వారిపై లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. సముద్రంలోని రాళ్లపై, తీరం వెంబడి భవంతులపై ఎక్కి మరీ ప్రజలు ఈ విన్యాసాలు తిలకించారు. దూరంగా ఉన్న వారికి కనిపించేలా బీచ్‌లో ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి విన్యాసాలు లైవ్ టెలికాస్ట్ చేశారు. తీరంలోని కురుసుర సబ్‌మెరైన్‌తో పాటు సముద్రంలోని నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాణసంచా భారీగా కాల్చి విన్యాసాలకు ముగింపు పలికారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారులు మళ్లించి సిటీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. అయితే ట్రాఫిక్ నియంత్రణలోనూ నేవీ సిబ్బంది పాలు పంచుకోవడం విశేషం. బీచ్‌కు వెళ్లే దారుల్లో, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి నేవీ ఉద్యోగులు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. -
నేవీ డే విన్యాసాలు.. అలరించాయిలా..!
-
వండర్ ఎట్ సీ
అబ్బురపరచిననౌకాదళ విన్యాసాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భారత తూర్పునౌకదళం తన యుద్ధపాటవాన్ని ఘనంగా ప్రదర్శించింది. నేవీ డే ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం సముద్ర జలాల్లో మంగళవారం ‘డే ఎట్ సీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,400మంది ప్రజలు, విద్యార్థులను యుద్ధ నౌక ఐఎన్ఎస్ జలాశ్వపై సముద్రంలోకి తీసుకువెళ్లి యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. యుద్ధాలు, తీవ్రవాదుల దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాల సమయంలో సముద్రం చిక్కుకున్నవారిని చేతక్ హెలికాప్టర్ల నుంచి నౌకాదళ సిబ్బంది ఎలా కాపాడేది ప్రదర్శించి చూపారు. నాలుగు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై నుంచి నౌకాదళ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ జలాశ్వతోపాటు యుద్ధనౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సైహ్యాద్రి, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ విభూతి, చేతక్, కమోవ్, హాక్ హెలికాప్టర్లు, మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. శత్రుదేశాల జలాంతర్గాముల ఉనికిని ప్రత్యేక పరికరంతో గుర్తించి విధ్వంసం చేసే యుద్ధ విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. భారత జలాల్లోకి ప్రవేశించే శత్రుదేశ నౌకలపై యుద్ధ విమానాల నుంచి ఎలా దాడి చేసేది ప్రదర్శించారు. వారి యుద్ధ విమానాలను క్షిపణుల ద్వారా నేలకూల్చడం, యుద్ధ నౌకలకు సముద్ర జలాల్లోనే ఇంధనం నింపడం, హాక్ యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో అత్యంత వేగంతో చేసిన విన్యాసాలు ఆశ్చర్యచకితులను చేశాయి. నాలుగు యుద్ధ నౌకల నుంచి క్షిపణులతో ఒకేసారి లక్ష్యాలను ఛేదించడం అబ్బురపరచింది. ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ ఏబీ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ జలాశ్వకు కెప్టెన్ టీవీఎన్ ప్రసన్న, ఐఎన్ఎస్ శివాలిక్‌కు కెప్టెన్ పురువీర్దాస్, ఐఎన్ఎస్ సహ్యాద్రికి కెప్టెన్ జ్యోతిన్ రానా, ఐఎన్ఎస్ శక్తికి కెప్టెన్ విక్రమ్ మీనన్, ఐఎన్ఎస్ విభూతికి లెఫ్ట్‌నెంట్ కమాండర్ వి.కాశిరామన్ సారథ్యం వహించారు. యుద్ధనౌకల సందర్శనకు అవకాశం విద్యార్థులు, ప్రజలకు యుద్ధ నౌకలను సందర్శించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఈస్ట్రన్ ఫ్లీట్ కమాండర్ ఏబీ సింగ్ తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో విద్యార్థులు ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాలను సందర్శించేందుకు అనుమతిస్తామన్నారు. సాధారణ ప్రజలను 22, 23 తేదీల్లో అనుమతిస్తామన్నారు. డిసెంబర్ 4న విశాఖపట్నం బీచ్‌లో నేవీ డే ప్రధాన వేడుకలు నిర్వహిస్తామని ఏబీ సింగ్ తెలిపారు. అందుకు ముందుగా డిసెంబర్ 2న రిహార్సల్స్ ఉంటాయన్నారు.