
విశాఖ : పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా ఏటా నిర్వహించే నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరుగుతున్నాయి. తూర్పు తీరం నుంచి బయలుదేరిన యుద్ధనౌకలు కరాచీ పోర్టును స్వాధీనం చేసుకోవడంతో 1971 డిసెంబర్ 4న భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఏటా విశాఖ తెరువు తూర్పు నౌకాదళం ఇండియన్ నేవీ డే విన్యాసాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎలాంటి విన్యాసాలు నిర్వహించలేదు. కేవలం ఇవాళ సాయంత్రం శుక్రవారం) విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విద్యుద్దీపాలు అలంకరించి నేవీ డే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ దశలో విశాఖ బీచ్లో ఉండే విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ జైన్ పూలమాలవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. శత్రుదేశాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావే ఎప్పుడు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. (ఇది మనసున్న ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment