Grand Welcome to President Draupadi Murmu at Gannavaram Airport - Sakshi
Sakshi News home page

విశాఖలో నేవీ డే వేడుకలు: ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

Published Sun, Dec 4 2022 10:30 AM | Last Updated on Sun, Dec 4 2022 5:35 PM

President Draupadi Murmu AP Tour Live Updates - Sakshi

Time: 5:21PM
విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీడే వేడుకలు

ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


నేవీడే వేడుకలను తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Time: 03:53PM
ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

Time 02:53PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన ముగించుకుని విశాఖకు బయల్దేరారు.

Time 12:49 PM
అధికారిక విందులో పాల్గొన్న రాష్ట్రపతి
విజయవాడ రాజ్‌భవన్‌కు ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌  ఏర్పాటు చేసిన అధికారిక విందులో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

Time 12:15 PM
మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉంది. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి అన్నారు.

Time 12:06 PM
ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం: గవర్నర్‌
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ తరఫున స్వాగతం పలుకుతున్నామని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ అన్నారు. ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం. తెలుగు భాషకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోనే తెలుగు అత్యంత మధురమైన భాషగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కీర్తించారు. కృష్ణా, గోదావరి లాంటి ఎన్నో జీవ నదులు ఉన్న రాష్ట్రం ఏపీ అని గవర్నర్‌ అన్నారు.

Time 11:55 AM
ముర్ము జీవితం అందరికీ ఆదర్శం: సీఎం జగన్‌
గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని సీఎం అన్నారు.

Time 11:47 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం
పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి సీఎస్‌ జవహర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Time 10:54 AM
రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌
రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ద్రౌపది ముర్ము తొలిసారిగా ఏపీలో పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారు.

అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఆమె రాష్ట్ర పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు.

అలాగే రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అధికారిక విందు ఏర్పాటు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. 

రాష్ట్రపతి పర్యటన ఇలా..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని ఘనంగా సన్మానిస్తారు.

అనంతరం అక్కడి నుంచి ద్రౌపది ముర్ము రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ ఇచ్చే అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంలోని నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నూతన రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి నేరుగా తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని గోశాలను సందర్శిస్తారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులతో ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా భేటీ అవుతారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement