
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రశాంతమైన విశాఖ సాగరతీరంలో మంగళవారం ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో యుద్ధనౌకలు, సబ్‌మెరైన్, స్పీడ్‌బోట్లు, చాతక్‌లు మోహరించాయి. తీరం వైపు దూసుకొస్తున్న స్పీడ్‌బోట్లపై యుద్ధనౌకలు బాంబుల వర్షం కురిపించాయి. ఒక్కసారిగా మారిన పరిస్థితులతో సందర్శకులకు ఏం జరుగుతుందో అర్థంగాలేదు.
తీరంవైపునకు దూసుకువస్తున్న స్పీడ్ బోట్లు
తరువాత ఇవి.. డిసెంబర్ 4వ తేదీన జరగనున్న నేవీ డే కోసం రిహార్సల్స్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నేవీ డే సందర్భంగా తూర్పునౌకదళం విశాఖ ఆర్కే బీచ్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రారంభించింది. మంగళవారం విన్యాసాల రిహార్సల్స్ చేశారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment