అరియానా మియోమోటో
నిన్నమొన్నటి వార్తాపత్రికల్లో మీరెలాగూ ప్రియాంక యషికోవాను చూస్తారు. అయితే ఆమె శిరస్సుపై దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ అందాల కిరీటంలోని తళుకుబెళుకుల్లో పూర్వపు ‘మిస్ జపాన్’ అరియానా మియామోటో కన్నీటి ఛాయల్ని మీరు కనిపెట్టలేకపోవచ్చు. ఆఫ్రికా తండ్రికి, జపాన్ తల్లికి జన్మించిన అరియానా నిరుటి అందాల రాణి. తొలి ‘విదేశీ మిస్ జపాన్’. జపాన్‌కు ఒక ఆఫ్రికా అమ్మాయి అందాల రాణి కావడం ఏంటని అప్పుడంతా అరియానాను నొప్పించారు.
వారి విమర్శలకు చాటుగా కంటతడి పెట్టిన అరియానా, భారత సంతతికి చెందిన ప్రియాంక ఈ ఏడాది అందాల రాణిగా విజేత అయ్యే క్రమంలో ఆమెకు ఎంతో ఆత్మస్థయిర్యాన్ని నూరిపోశారు. ఆ స్థయిర్యం పోటీ లో గెలవడానికి మాత్రమే కాదు, గెలిచాక విమర్శల్ని తట్టుకోడానికి కూడా! ప్రియాంక కూడా అరియానాలా ప్యూర్ జపానీ కాదు కదా. అందుకు!