
ఉద్యాన్ ఉత్సవ్ గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 12 రోజుల పాటు ఇది కొనసాగనుంది. ఇక్కడ మొత్తం 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉద్యాన ప్రియులు వందలాదిగా తరలివచ్చారు

ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జానపద, ఆదివాసీ కళాకారుల నృత్యాలు సందర్శకులను అమితంగా అలరించాయి. మహా భారతంలోని రాయబార ఘట్టం ఎంతగానో ఆకట్టుకుంది


































