Rashtrapati Nilayam
-
రాష్ట్రపతి నిలయం చూసొద్దాం రండి
దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలి దక్షిణాది అధికారిక నివాసం.. నగరంలో బ్రిటిష్ పాలనకు కేంద్రంగా కొనసాగిన రెసిడెన్సీ భవనం.. వీఐపీలు మినహా సామాన్యులకు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. ప్రతి సంవత్సరం కేవలం వారం రోజులు మాత్రమే సామాన్యులకు సందర్శనకు అవకాశం ఉండేది.. కానీ ప్రస్తుత రాష్ట్రపతి ఆదేశాలతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులోకి వచి్చంది. రాష్ట్రపతికి దక్కే రాజ¿ోగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతోటలు, వందల ఏళ్ల నాటి మర్రి చెట్లు, ఎండ ఆనవాళ్లు కూడా కానరాని పండ్ల తోటలు, మయూరాల కిలకిలారావాలు.. అలనాటి వ్యవసాయానికి కేంద్ర బిందువులైన మోట, మెట్ల బావులు.. గత రాష్ట్రపతులు వాడిన గుర్రపు బగ్గీ, వింటేజ్ బెంజీ కారు.. ఇలా చెప్పకుంటూ పోతే రాష్ట్రపతి నిలయం విశేషాలు ఎన్నెన్నో.. రాష్ట్రపతి విడిది చేసే ప్రత్యేక గదులు, మీటింగ్ హాల్స్, ప్రత్యేకంగా వంటచేసే కిచెన్, కిచెన్ నుంచి రాష్ట్రపతి ప్రధాన విడిది భవనానికి ఆహారాన్ని తీసుకెళ్లే సొరంగ మార్గం.. వాటితో పాటు ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళలో సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విహార అనుభూతి కల్గుతుంది. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం సామాన్యుల సందర్శనకు తాత్కాలిక బ్రేక్ పడగా, మళ్లీ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంపై ప్రత్యేక కథనం.. మూడో అధికారిక నివాసం.. భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు మరో రెండు అధికారిక నివాసాల్లో ఒకటి షిమ్లాలోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’ కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ‘రాష్ట్రపతి నిలయం’ మూడోది. ఈ భవనం నిజాం నజీర్ ఉద్–దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. బొల్లారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలోని చీఫ్ మిలటరీ ఆఫీసర్ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌజ్‌గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది. ఏడాది పొడవునా అనుమతి గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం రెండు లేదా మూడు వారాల పాటు మాత్రమే సాధారణ పౌరులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఉండేది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హయాంలో నిత్యం ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విద్యార్థుల సందర్శనకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరిట పక్షం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 20 గదులు, సొరంగ మార్గం.. రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం ప్రెసిడెంట్స్ వింగ్, ఫ్యామిలీ వింగ్‌తో పాటు ఏడీసీ వింగ్ పేరిట మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో డైనింగ్ హాలు, దర్బార్ హాలు, మార్నింగ్ రూమ్, సినిమాల్ సహా మొత్తం 11 గదులుంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాలుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం ఉంది. రకరకాల పూలమొక్కలతో పాటు పండ్ల తోటలు ఉన్నాయి. 116 రకాల సుగంధ, ఔషధ మొక్కలతో కూడిన ప్రత్యేక హెర్బల్ గార్డెన్ ఈ ఆవరణలో ఉంది. మూడు మంచినీటి బావులు కూడా ఉన్నాయి. -
రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది.. అబ్బురపరుస్తున్న బొల్లారం రాష్ట్రపతి భవన్ (ఫొటోలు)
-
విశేషాల సమాహారం.. రాష్ట్రపతి నిలయం
రసూల్‌పురా: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పలు విశేషాలున్నాయి. చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతలూ ఉన్నాయి. ఇవన్నీ సందర్శకులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ కరపత్రాన్ని రూపొందించారు. మంగళవారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమంలో పరిపాలనాధికారిణి రజని ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 97 ఎకరాల్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రజల కోసం 20 రకాల ప్రత్యేక విశేషాలను తీర్చిదిద్దామని, ఇవి ఆద్యంతం సందర్శకులను ఆకట్టుకుంటాయని రజని పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరచి ఉంటుందని, విద్యార్థులకు ఉచిత ప్రవేశమని, 20 మంది గైడ్స్ అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో అడ్మిన్ అధికారి దులార్ మింగ్, అసిస్టెంట్ అడ్మిన్ అ«ధికారి రాజేష్ యాదవ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
‘కారు’ స్టీరింగ్‌పై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ఎట్‌హోమ్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు తరలివెళ్లే క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ భవన్‌కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన ‘డిఫెండర్’వాహనాన్ని నడిపేందుకు కేటీఆర్ ఆసక్తి చూపారు. కేటీఆర్ కారు స్టీరింగ్ పట్టి సొంతంగా డ్రైవ్ చేస్తూ వెళ్లారు. అదే వాహనంలో పక్క సీట్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కూర్చున్నారు. తాము ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న ఫొటోలను హరీశ్‌రావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగాయి. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్‌హోం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్ హోం నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు, విపక్ష నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆహూతులను పరిచయం చేసుకున్న ద్రౌపదీ ముర్ము కాసేపు వారి తో ముచ్చటించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై శివుని కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్రావు, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుదీర్‌రెడ్డి, పర్ణికారెడ్డి, యశస్విని, రాగమయి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, మండలి, అసెంబ్లీ సభ్యులు పలువురు అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
సర్కారు స్కూలు పిల్లలకు ఫ్రీ
సాక్షి, హైదరాబాద్ః రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి భవన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కుమార్ సమ్రేశ్ వెల్లడించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సందర్శనకు అనుమతిస్తూ, ఆ మేరకు మార్చి 22 నుంచి సందర్శనకు అవకాశం కలి్పస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈనెల 14 వరకు రాష్ట్రపతి నిలయాన్ని దాదాపు 10 వేల మంది సందర్శకులు దర్శించారని పీఆర్ఓ సమ్రేశ్ తెలిపారు. రాష్ట్రపతి నిలయ సందర్శన సమాచారాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో గురువారం రాష్ట్రపతి నిలయంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో తీసుకువచ్చిన మార్పులు, బుకింగ్ తదితర వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా.కె రజనీప్రియతో కలిసి ఆయన వెల్లడించారు. డిసెంబర్ మినహా ఏడాది పొడవునా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన జరిగే డిసెంబర్ నెల మినహా ఏడాది పొడవునా సాధారణ పౌరుల సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఏ రోజైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కోసం http:// visit.rashtrapatibhavan.gov.in వెబ్సైట్లో లేదంటే నేరుగా రాష్ట్రపతి నిలయానికి వచ్చి అక్కడి రిసెప్షన్ సెంటర్లోనూ టికెట్ తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని, మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.50 ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సందర్శకుల బృందం 30 మందికి పైగా ఉంటే వారికి టికెట్ రుసుంలో 20 శాతం రాయితీ ఇస్తామన్నారు. సందర్శకులకు రాష్ట్రపతి నిలయంలోని విశేషాలను వివరించేందుకు 20 మంది గైడ్లను ప్రత్యేకంగా నియమించినట్టు వారు తెలిపారు. -
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న రాష్ట్రపతి నిలయం
-
హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
సికింద్రాబాద్: బొల్లారం రాష్ట్రపతి నిలయానికి స్వాగతం (ఫొటోలు)
-
శీతకాల విడిది.. హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఈ పర్యటన ఉండబోతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈ సారి రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతిభవన్ వర్గాలు సమాచారం అందించారు. ఈ విడిదిలో భాగంగా నాలుగైదు రోజులపాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. -
ఎట్ హోమ్
-
రాష్ట్రపతి నిలయంలో సందడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. శీతాకాల విడిది కోసం ఈ నెల 21న నగరానికి వచ్చిన రాష్ట్రపతి సోమవారం ఢిల్లీకి తిరిగి పయనం కానున్నారు. పర్యటన ముగింపు సందర్భంగా ఆయన నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు. అతిథుల రాకతో రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కరచాలనం చేస్తున్న తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్. చిత్రంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ -
దక్షిణాది విడిది... ప్రకృతినిధి
సాక్షి , హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం ప్రకృతికి ఆలవాలం. పచ్చని పరిసరాలు, ఔషధ, పూల మొక్కలతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారు తోంది ఈ నిలయం. 158 వసంతాలు పూర్తి చేసు కున్న ఈ భవన నిర్మాణం, దాని చుట్టూ అల్లుకున్న చరిత్ర అపురూపం. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న దృష్ట్యా ఈ నిలయం విశేషాలపై ‘సాక్షి’ కథనం... తండ్రి శంకుస్థాపన.. కొడుకు చేతులు మీదుగా ప్రారంభం ఆసిఫ్‌జాహీ వంశీయుల నాలుగో పాలకుడు నిజాం నజీర్–ఉద్–దౌలా ఈ భవన నిర్మాణానికి 1856లో శంకుస్థాపన చేశారు. అయితే ఇతను 1857లో మరణించారు. ఇతడి కుమారుడు ఐదవ నిజాం అఫ్జల్–ఉద్–దౌలా తండ్రి ప్రారంభించిన భవనాన్ని 1860లో పూర్తి చేయించాడు. ఇలా 158 ఏళ్లకు పూర్వం నిజాం పాలకులు కట్టించిన భవనం ఇది. దీన్ని ఐదవ నిజాం నవాబులు తమ విశ్రాంతి భవనంగా వాడుకున్నారు. ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ప్రహరీ నిర్మించారు. వీటితోపాటు కంద కాలు తవ్వించారు. ఎంతదూరంలో ఉన్న శత్రువు నైనా గుర్తించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. దేశంలో మొత్తం 3 చోట్ల: రాష్ట్రపతికి దేశం మొత్తం మీద 3 భవనాలు ఉన్నాయి. ఒకటి దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్. ఆయన ఉత్తరాదికే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడున్న ప్రజల సాధదక బాధకాలు తెలుసుకునేం దుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విడిది భవనాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఒకటి, దక్షిణాది వారికోసం బొల్లారం విడిది గృహం ఏర్పడింది. ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి ఇక్కడికి వస్తారు. వారం నుంచి 2 వారాలు ఉంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేసవిలో సిమ్లాలో ఉంటారు. 25 వేల చదరపు గజాల్లోనే భవనం 98 ఎకరాల విస్తీర్ణంతో ఉండే రాష్ట్రపతి నిలయంలో మధ్యలో రాష్ట్రపతి భవనం, చుట్టూ పచ్చని తోట లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం వైశాల్యం లో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలోనేభవనం ఉంది. మిగతా స్థలంలో రకరకాల ఔషధ మొక్కలు, పూల తోటలు ఉన్నాయి. ఇవి సుమారుగా 7,000 చ.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. వాటిలో సర్పగంధ, కాల బంధ, సిట్రొన్నా, నిమ్మ గడ్డి, ఖుస్, జెరానియం, కొత్తిమీర, గంధపు చెట్టు, గడ్డ దినుసు, జాస్మిన్, కల్మేఘ్, తులసి మొదలైనవి. ఈ తోటను తెలంగాణ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ నిర్మించింది. ఈ భవనం మూడు భాగాల్లో ఉంది ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్ లేదా సెంట్రల్ వింగ్ , ఏడీసీ వింగ్. ఈ 3 విభాగాల్లో కలిసి మొత్తం 20 గదులున్నాయి. వేర్వేరుగా ఉన్నా వీటిని కలుపు తూ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది. ఈ 3 వింగ్‌లకు వేరుగా వంటశాలలు ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఒక వంటశాల దగ్గర మొదలై ఇంకో వింగ్‌లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గర ఆగుతుంది. ఈ సొరంగంలోకి బాగా వెలుతురు వచ్చే విధంగా భూమి వైపు కిటికీలు అమర్చారు. బయటి నుంచి చూస్తే అండర్‌గ్రౌండ్ కనబడుతుంది.బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చాక ఈ మార్గాన్ని నిర్మించారు. అతిథులకు అన్ని సౌకర్యాలు: రాష్ట్రపతితో పాటు, ఆయన కుటుంబీకులు ఉండేందుకు. భద్రతా సిబ్బంది. ప్రెసిడెంట్ వింగ్‌లో సినిమా హాల్ దర్బార్ హాల్, 25 మంది ఒకేసారి భోజనం చేసేలా భోజనశాల, అతిథి గదులు ఇలా అన్ని వసతులు ఉన్నాయి. భవన నిర్మాణమంతా యూరోపియన్ శైలిలో ఉంటుంది. బ్రిటిష్ సైన్యం నుంచి... మన రాష్ట్రపతి నిలయంగా.. 1803లో ఆసిఫ్ జాహీ వంశీయుల మూడో పాలకుడి పట్టాభిషేకం చేశారు. అనంతరం 1806లో ప్రస్తుతం ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో బ్రిటిష్ వారు తమ సైన్యం బస చేయడానికి అనుమతులు పొందారు. బొల్లారంలో బ్రిటిష్ సైనికులకు క్వార్టర్లు కట్టించారు. దానికి దగ్గరలో ఉన్న ఈ భవనంపై బ్రిటిష్ వాళ్ల కన్ను పడింది. అలా బ్రిటిష్ సైన్యాధికారి కార్యాలయంగా మారింది. దీంతో ఇది బ్రిటిష్ రెసిడెన్సీగా మారింది. ఈ భవన స్థలంలో సైనికులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950లో ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 60 లక్షలకు ఖరీదు చేసింది. మరమ్మతులు చేయించి రాష్ట్రపతికి శీతాకాల విడిదిగా మార్చారు. తొలిసారిగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 1953 జనవరి నెలలో ఈ భవనంలో బస చేశారు. ఈ నిలయంలో ఒక దేవాలయం కూడా ఉంది. -
రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం సందడిగా జరిగింది. శీతాకాల విడిదికి విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 3 రోజులుగా హైదరాబాద్‌లో బస చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంతో రాష్ట్రపతి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్ర మానికి వచ్చిన వారందరినీ రాష్ట్రపతి హృదయపూర్వకంగా పలకరించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ దత్తాత్రేయ, సీఎల్పీ నేత జానారెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజకీయ నేతలతోపాటు సామాజిక, క్రీడా తదితర రంగాల ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను రాష్ట్రపతి పలకరించారు. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఇవాళ నగరానికి విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రథమ పౌరుడికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పాదాభివందనం చేశారు. రాష్ట్రపతి నేటి నుంచి ఈ నెల 31 వరకు బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ సమయంలో రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. 23న ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాత కోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం హెచ్ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 24న మహిళా దక్షత సమితి కార్యక్రమంలో పాల్గొంటారు. 25న బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరవుతారు. 26న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 29న ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు. అదే రోజున మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు ఏర్పాటు చేస్తారు. 31వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. -
హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈనెల 22 నుంచి 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్ 23న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో ఎండీఎస్, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. అదేరోజు ఎఫ్టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొంటారు. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మలాని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లను రాష్ట్రపతి ప్రారంభించన్నారు. 25న బెంగళూరులో పర్యటించనున్న ఆయన.. తరువాతి రోజు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 29న తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు. -
ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ప్రముఖలకు తేనీటి విందు ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందుకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎంలు మహమూద్ ఆలీ, కడియం శ్రీహరి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి గౌరవార్థం నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
18న బొల్లారానికి రాష్ట్రపతి రాక
ఈనెల 18న రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ బొల్లారంలోని తన శీతాకాల విడిదికి వస్తుండటంతో.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలీసు అధికారులతో పాటు రక్షణ శాఖ సీనియర్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 18 నుండి 31 వరకు రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని.. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. షెడ్యూల్ ఇదే.. ఈనెల 18న డిల్లీ నుండి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నర్సింహన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్ర పతికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 19న మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగులో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి హజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలపెట్టిన చండీ యాగానికి కూడా రాష్ట్ర పతి హాజరు కానున్నారు. రాషప్రతి నిలయానికి అవసరమైన అన్ని సౌకర్యలు రక్షణ శాఖకు చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కల్పిస్తున్నారు. కాన్వాయ్ రిహార్సిల్.. రాషప్రతి రాక సందర్భంగా బుదవారం పోలీసులు హకీంపేట నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సిల్ నిర్వహించారు. -
రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తు
బొల్లారం, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిసారిగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆయన ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలి రానున్నారు. గురువారం సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్రపతి విమానం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దిగనుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయనను తీసుకువచ్చే వాహనాలతో బుధవారం మధ్యాహ్నం రూటు రిహార్సల్‌ను అధికారులు నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం నుంచి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హైదరబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, అడిషనల్ కమిషనర్ అంజనికుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అమిత్‌గార్గ్, సంయుక్త కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) బి.మల్లారెడ్డి డీసీపీ జయలక్ష్మి, ఇతర పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ప్రణాళికలు రూపొందించారు. ఉన్నతాధికారుల కాకుండా 750 మంది సిబ్బందిని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నేడు ట్రాఫిక్ ఆంక్షలు రాష్ట్రపతి గురువారం హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆయన ప్రత్యేక విమానం దిగనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కింద తెలిపిన ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్‌గార్గ్ కోరారు. ఆంక్షలున్న ప్రాంతాలివే: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ‘వై’ జంక్షన్-ఎయిర్‌ఫోర్స్ బెటాలియన్ 2,3 గేట్లు-బొల్లారం చెక్‌పోస్ట్-సహేజ్ ద్వార్-ఈఎంఈ సెంటర్ వద్ద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్-పంప్ హౌస్-బిసిన్ ఎన్వైర్మెంట్ పార్క్-బిసిన్ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్- యాప్రాల్-బిసిన్ బేకరీ ఎక్స్టెన్షన్- నేవీహౌస్ జంక్షన్- ఆంధ్రా సబ్-ఏరియా ఆఫీసర్స్ మెస్- ఆర్ఎస్సై జంక్షన్- ఈఎంఈ సెంటర్ హౌస్-గేట్ నెం.3, 2, 1- రాష్ట్రపతి నిలయం మెయిన్‌గేట్.