రాష్ట్రపతి నిలయంలో సందడి | At Home program in Rashtrapati Nilayam | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి నిలయంలో సందడి

Published Mon, Dec 24 2018 2:00 AM | Last Updated on Mon, Dec 24 2018 2:00 AM

At Home program in Rashtrapati Nilayam - Sakshi

ఆదివారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్‌హోంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, హోంమంత్రి మహమూద్‌ అలీ దంపతులు, ఆయన మనవడు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. శీతాకాల విడిది కోసం ఈ నెల 21న నగరానికి వచ్చిన రాష్ట్రపతి సోమవారం ఢిల్లీకి తిరిగి పయనం కానున్నారు. పర్యటన ముగింపు సందర్భంగా ఆయన నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు, హోంమంత్రి మహమూద్‌ అలీ, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు. అతిథుల రాకతో రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది.
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో కరచాలనం చేస్తున్న తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌. చిత్రంలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement