నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి  | Ramnath Kovind vesit to Karimnagar today | Sakshi
Sakshi News home page

నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి 

Published Sat, Dec 22 2018 1:41 AM | Last Updated on Sat, Dec 22 2018 1:41 AM

Ramnath Kovind vesit to Karimnagar today - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, హోంమంత్రి మహమూద్‌అలీ, సీఎస్‌ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఇందులో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, షేరి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. 


సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌లు కరీంనగర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరులోని ప్రతిమా వైద్య కళాశాలలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతున్నారు. కళాశాల ఆవరణలో నిర్మించిన ఆడిటోరియం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. వైద్య కళాశాలలో విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేసి.. ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

చీఫ్‌ జస్టిస్‌తో సీఎం భేటీ 
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ అధికారిక నివాసానికి కేసీఆర్‌ వెళ్లారు.  
 రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement