‘కారు’ స్టీరింగ్‌పై కేటీఆర్‌ | KTR And Harish Rao Travelled In One Car To Going To Rashtrapati Bhavan, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

KTR, Harish Rao Viral Photo: ‘కారు’ స్టీరింగ్‌పై కేటీఆర్‌

Published Sat, Dec 23 2023 4:18 AM | Last Updated on Sat, Dec 23 2023 1:02 PM

KTR and Harish Rao Travelled in One Car To Going to Rashtrapati Bhavan - Sakshi

ఒకే కారులో వెళ్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ నుంచి ఎట్‌హోమ్‌ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేతలు తరలివెళ్లే క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ భవన్‌కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డికి చెందిన ‘డిఫెండర్‌’వాహనాన్ని నడిపేందుకు కేటీఆర్‌ ఆసక్తి చూపారు.

కేటీఆర్‌ కారు స్టీరింగ్‌ పట్టి సొంతంగా డ్రైవ్‌ చేస్తూ వెళ్లారు. అదే వాహనంలో పక్క సీట్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కూర్చున్నారు. తాము ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న ఫొటోలను హరీశ్‌రావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. కాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగాయి. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement