
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాద స్థలిని సందర్శించడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటివరకూ తాము అక్కడకు వెళ్లకపోవడానికి సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో మాత్రమేనన్నారు. ఎల్లుండి(గురువారం) ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ ను సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము అక్కడకు వెళ్లే క్రమంలో పోలీసులు ఎటువంటి ఆటంకం కల్గించకూడదని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.
8 మందిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం..
టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 18, 19 మీటర్ల ఎత్తులో బురద పేరుకుపోయిందని, దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు జరిగాయని, కాకపోతే అత్యంత క్లిష్టమైన టన్నెల్ ప్రమాదం ఇదేనన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment