హైకోర్టు తీర్పుతో తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం
రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కార్ రేస్ అంశంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో హైకోర్టు ఇచి్చన తీర్పుతో తొలి అడుగులోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విజయం సాధించారని ఆ పార్టీ నేత హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు.
రేస్ నిర్వహణ సంస్థకు ప్రభుత్వం రూ.47 కోట్లు చెల్లిస్తే.. రూ.600 కోట్లు నష్టం అంటూ సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అబద్ధాలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. ఫార్ములా – ఈ రేస్ అంశంలో ప్రొసీజర్ ల్యాప్స్ జరిగి ఉండవచ్చు కానీ అక్రమాలు జరగలేదని స్పష్టంచేశారు.
ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు
కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చి ఏడాదైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. ‘సీఎం రేవంత్, ఆయన సోదరులు, అల్లుడు, బావమరిది అవినీతి బండారాన్ని కేటీఆర్ క్రమ పద్ధతిలో బయట పెడుతున్నారు. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ అంశాల్లో అవి నీతిని ప్రశ్నించడంతో కేటీఆర్‌ను జైలులో పెట్టే కుట్రకు తెరలేపారు.
అరెస్టుల పేరిట నాయకులను భయభ్రాంతులకు గురిచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది’అని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు అనే రీతిలో రేవంత్ పాలన ఉందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై కేసు నమోదైన వెంటనే ఈడీ జోక్యం చేసుకోవడం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment