going
-
‘కారు’ స్టీరింగ్‌పై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ఎట్‌హోమ్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు తరలివెళ్లే క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ భవన్‌కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన ‘డిఫెండర్’వాహనాన్ని నడిపేందుకు కేటీఆర్ ఆసక్తి చూపారు. కేటీఆర్ కారు స్టీరింగ్ పట్టి సొంతంగా డ్రైవ్ చేస్తూ వెళ్లారు. అదే వాహనంలో పక్క సీట్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కూర్చున్నారు. తాము ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న ఫొటోలను హరీశ్‌రావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగాయి. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్‌తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. -
గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ
‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేమిటి!’ అని ఆశ్చర్యపోయే కుటుంబాల్లో పుట్టారు గరీమ శంకర్, రేణు సింఘీలు చిన్నప్పుడు సైకిల్‌ను చూడడం తప్ప నడిపింది లేదు. సైకిల్‌పై జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేవాళ్లను చూసి ఆశ్చర్యపడేవారు. అలాంటి వారు సైకిలింగ్‌లో అద్భుతాల సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గోయింగ్ సోలో’ డాక్యుమెంటరీలో వారి అంతర్. బహిర్ ప్రయాణం ఉంటుంది. నాలుగు గోడల మధ్య ఇంటికి పరిమితమైన రోజుల నుంచి లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్)లాంటి ప్రతిష్ఠాత్మకమైన సైకిలింగ్ ఈవెంట్స్ వరకు చేసిన ప్రయాణం కళ్లకు కడుతుంది. ‘వారి జీవితాల్లో సైకిలింగ్‌కు మించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. వారి జీవితాల్లోని అద్భుతాలను ఆవిష్కరించడానికి సైకిల్ అనేది ఒక సాధనం మాత్రమే’ అంటాడు ‘గోయింగ్ సోలో’ డైరెక్టర్ అమీ గోర్. ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన గరీమకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తప్ప ఏ లోటూ లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అందరిలాగా తాను కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కాలనుకునేది. సైకిల్ తొక్కడం మాట ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి రావడమే గగనంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెను పొరపాటున కూడా బయటికి పంపేవారు కాదు. గరీమకు పెళ్లి అయింది. ఆ తరువాత ఒక బిడ్డకు తల్లి అయింది. బాగా బరువు పెరిగింది. అది తనకు చాలా ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి మార్గాల గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన సైకిలింగ్ గుర్తుకు వచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తమ్ముడి ద్వారా సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే ఆమె సైకిల్ యాత్ర ఇంటిపరిసరాలకే పరిమితం. బరువు తగ్గడం మాట ఎలా ఉన్నా సైకిలింగ్ ద్వారా తాను ఒంటరిగా రోడ్డు మీదికి వచ్చింది. నగరంలో ప్రతి వీధిని చూసే అవకాశం వచ్చింది. అంతా కొత్తగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది! ఇక అప్పటి నుంచి రెగ్యులర్ రైడర్‌గా మారింది. సైకిల్ లేకుండా ఆమెను చూడడం అరుదైపోయింది. సైకిలింగ్‌పై గరీమ ఆసక్తిని గమనించిన సన్నిహితులు ‘లక్ష్యం ఏర్పాటు చేసుకో. విజయం సాధించు’ అని చెప్పేవారు. దీంతో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త అడుగులు వేసింది. సైకిల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆ రేసులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చేది. తెలిసినవాళ్లు లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్) సైకిల్ ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో షెడ్యూల్‌కు మూడు నెలల ముందు తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ‘నిజానికి అదొక అసాధ్యమైన లక్ష్యం. కాని ఏదో ధైర్యం నన్ను ముందుకు నడిపించింది’ అంటున్న గరీమ ఎల్ఈఎల్లో 125 గంటలలో 1,540 కిలోమీటర్లు దూరం సైకిలింగ్ చేసింది. గరీమ ఉత్సాహం, సాహసానికి ముచ్చటపడిన ఎల్‌ఈఎల్ కమ్యూనిటీ ఆమెను మెడల్‌తో సత్కరించింది. ఇక రాజస్థాన్‌కు చెందిన రేణు సింఘీ విషయానికి వస్తే పెళ్లికి ముందు అంతంత మాత్రంగా ఉన్న స్వేచ్ఛ ఆ తరువాత పూర్తిగా పోయింది. వంట నుంచి పిల్లల పెంపకం వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తన కుమారుడికి సైకిల్ కొనడానికి ఒకరోజు బైక్షాప్కు వెళ్లింది. తన కోసం కూడా ఒక సైకిల్ కొన్నది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. ‘ఈ వయసులో సైకిల్ తొక్కడమేమిటి’ అనేవారు కుటుంబసభ్యులు. అయితే అవేమీ పట్టించుకోకుండా లాంగ్–డిస్టెన్స్ సైకిలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ తరువాత ఇంటర్నేషనఃల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ‘మనకు నచ్చింది చేయాలి. వయసు అనేది అడ్డు కాదు’ అంటున్న సింఘీ ఎల్‌ఈఎల్–ఈవెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమ్మీ మీడియా (న్యూయార్క్), ఖాన్ అండ్ కుమార్ మీడియా (ఇండియా) నిర్మించిన ‘గోయింగ్ సోలో’ను దిల్లీ, ఊటీ, జైపుర్, జోద్పూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో చిత్రీకరించారు. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి అమీ గోర్ దర్శకుడు. టీవి, షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీలలో పదిసంవత్సరాల అనుభవం ఉంది. ‘వారి అనుభవాలు, ప్రయాణం నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. రకరకాల పరిస్థితులు లేదా వయసును కారణంగా చూపి తమకు తాము రకరకాల పరిమితులు విధించుకునే ఎంతోమందికి ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు డైరెక్టర్ అమీ గోర్. (చదవండి: చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!) -
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
కామారెడ్డి కి బండి సంజయ్
-
వెళ్తున్నా..వెళ్తున్నా..
⇔ విశాఖకు తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ, అదే బాటలో ఐఐఎఫ్‌టీ ⇔ రావల్సిన మరో మూడు పరిశ్రమలపైనా నీలినీడలు ⇔ నేతల నిర్లక్ష్యంతో ఇతర జిల్లాలకు తరలింపు ⇔ విశాఖకు ఎగరేసుకుపోయే ప్రయత్నాలు ⇔ ఆపేందుకు ప్రయత్నాలు శూన్యం జిల్లాకు రావల్సినవి కొత్త రెక్కలు కట్టుకొని ఇతర జిల్లాకు తరలిపోతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కొరవడిన చిత్తశుద్ధి ఫలితంగా ఈ పరిస్థితి నెలకుంది. పర్సెంటేజీలు వస్తాయంటే చాలు ఆహ్వానించే నేతలున్న ఈ జిల్లా నేతలు విద్యార్థిలోకానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే సంస్థలు తరలిపోతున్నా కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రగతిలో ముందుంటామని గొప్పలకుపోయే పాలకులు అరుదైన అవకాశాలను చేజార్చేస్తున్నారు. ఆర్థికంగా కలిసి వస్తుందంటే చాలు గద్దల్లా వాలిపోయే నేతలు ... తనకు కలిసి రాదంటే కన్నెత్తి కూడా చూడని దుస్థితి. విద్యార్థి లోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే అరుదైన ఇనిస్టిట్యూట్లు సరిహద్దులు దాటిపోతున్నా చీమకుట్టినట్టయినా లేదు. వీరి నిర్వాకంతో జిల్లాకు వచ్చిన మరో అరుదైన అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం జిల్లాకు పలు ఇనిస్టిట్యూట్లను మంజూరు చేసింది. ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఒకటి. ఆ ఇనిస్టిట్యూట్‌ను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లాకు వచ్చేట్టు చేయాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. చంద్రబాబు కేబినెట్లో నంబర్-2గా చెప్పుకునే మంత్రి యనమలతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కనీసం ఈ సంస్థ ఏర్పాటుపై చేసిన ప్రయత్నం ఏమీ లేదు. విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావించిన పెట్రో యూనివర్సిటీ జిల్లాకు మంజూరైంది. కృష్ణా గోదావరి బేసిన్లో కీలకమైన కోనసీమలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు వెలికి తీస్తున్న క్రమంలో పెట్రో యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటైతే జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయనుకున్నారు. పెట్రోలియం రంగంలో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలకు ఒక మార్గదర్శకంగా òపెట్రో యూనివర్సిటీ నిలుస్తుందని విద్యార్థి లోకం ఆశలు పెంచుకుంది. ఎంతో ఉపయోగకరం పెట్రో యూనివర్శిటీ... కొన్ని పరిశ్రమ కోసం ప్రజలు వద్దన్నా ప్రభుత్వమే బలవంతంగా వందల ఎకరాలను సేకరిస్తోంది. తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాయంటే పోలీసులను ఉసిగొల్పి కాలుష్య పరిశ్రమలైనా రప్పించుకుంటున్నాయి. అటువంటిది కేవలం 87 ఎకరాలు భూ సేకరణ చేస్తే సరిపోయే పెట్రో యూనివర్సిటీని గాలికొదిలేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రాజానగరం, మండపేట తదితర ప్రాంతాల్లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు కమిటీ పరిశీలన జరిపింది. అప్పుడు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతోనే ఆ యూనివర్సిటీ విశాఖ జిల్లాకు అక్కడి ప్రజాప్రతినిధులు ఎగరేసుకుపోయారు. అలా ప్రతిష్టాత్మక పెట్రో యూనివర్సిటీని జిల్లా నుంచి చేజారిపోగా, ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదే బాటలో పయనిస్తోంది. ఈ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర పరిశీలన కమిటీ గత ఏడాది రాజమహేంద్రవరం, మండపేట, రాజానగరం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ అసైన్ఢ్ భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐఐఎఫ్టీతోపాటు లాజిస్టిక్ వర్సిటీ, ఇండస్ట్రియల్ పార్కు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటిలో ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలంగా ఉంటుందని సెర్చ్ కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఆ కమిటీని కలిసి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై కనీసం జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా చర్చించకపోవడం వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. గతంలో పెట్రో యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం వహించిన రీతిలోనే ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విషయాన్ని కూడా పాలకులు గాలికొదిలేశారు. ఆ మంత్రులకున్న చిత్తశుద్ధి వీరికేదీ...? విభజన అనంతరం రాజధానిగా మంగళగిరి ఏర్పాటయ్యాక పారిశ్రామికంగా విశాఖపట్నంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి ఈ ఇనిస్టిట్యూట్‌ను విశాఖకు తరలించేందుకు విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ముగ్గురు ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, పండుల రవీంద్ర అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా విద్యా సంస్థలు, పరిశ్రమలు తరలిపోకుండా అడ్డుకుంటారనే నమ్మకం జిల్లా ప్రజలకు కలగడం లేదు. వీటి ఏర్పాటుపై నియమితమైన సెర్చ్ కమిటీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అనువుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. సహజంగా రాజమహేంద్రవరం అనే సరికి అక్కడి ఎంపీ మురళీమోహన్ కీలకమైన పాత్ర పోషించాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మురళీమోహన్ గట్టి ప్రయత్నం చేస్తే ఐఐఎఫ్టి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే ఈ సరికే ఏర్పాటయ్యేది. కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పలు స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యాధికుడిగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఆ స్థాయిలో వీటి కోసం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి. ఐఐఎఫ్‌టీ ప్రయోజనాలెన్నో... ఈ ఇనిస్టిట్యూట్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో 1963లో ఏర్పాటైంది. మానవ వనరుల అభివృద్ధిని విశ్లేషించడం, నిరంతరం పరిశోధనలు నిర్వహించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యం. విదేశీ వాణిజ్యం నిర్వహణ, పెరుగుదల, ఎగుమతులను పెంపొందించాలనే లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయీకరణకు దోహదపడేలా సరికొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ది, కార్పొరేట్, ప్రభుత్వ రంగంలో పరిశోధన ఆధారిత కన్సల్టెన్సీని అందించే సామర్థ్యం కలిగిన ఇనిస్టిట్యూట్ ఇది. నిరంతర పరిశోధన, కన్సల్టెన్సీల ద్వారా ప్రభుత్వం వాణిజ్య, పరిశ్రమ అవసరాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞానం ఆ«ధారంగా సేవలందిస్తుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, కెరీర్ నిపుణుల ఆకాంక్షలకు అనుగుణంగా కోర్సులు అందిస్తుండటంతో విదేశీ విద్యార్థులు కూడా ఆకర్షితులవుతారు. ‘ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటుకు అన్ని విధాలా రాజమహేంద్రవరం అనుకూలమైనది. విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ఐఐఎఫ్టీతో మరింత ప్రగతిని సాధించడంతోపాటు ఏటా సుమారు రూ. వంద కోట్ల మేరకు వ్యాపార లావేదేవీలు జరగడానికి, సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు కూడా ఇక్కడనే ఉన్నందున ఐఐఎఫ్‌టీని కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పాటుచేయడం సముచితం. - ఆచార్య ఎస్. టేకి, డీన్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరం. ఉపాధి అవకాశాలు కోల్పోనున్న స్థానికులు నవ్యాంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ పరిశ్రమ రావడంపై హర్షం వ్యక్తం చేశాం. ఇప్పటికీ దాని కార్యాచరణ తెలపకపోగా ప్రస్తుతం అది కూడా ఇతర జిల్లాకు తరలిపోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మన జిల్లా నేతలు ఉన్న కారణంగా పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. జిల్లాలో సాంకేతిక విద్యతోపాటు మేనేజ్మెంట్ కోర్సు చేసిన అభ్యర్థులు వేలాది మంది ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. - బి.ప్రభాకరరావు, జేఎన్‌టీయుకే రెక్టార్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేయాలి జిల్లాలో సాంకేతిక యూనివర్సిటీ జేఎన్టీయుకేతోపాటు నన్నయ్యవంటి వర్సిటీలు ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా ఏర్పడితే జిల్లా అభివృద్ధితోపాటు పరిశ్రమలకు తగ్గ మ్యాన్ పవర్‌ను వర్సిటీల నుంచి తీసుకోవచ్చు. గతంలో జిల్లాకు పెట్రోలియం వర్సిటీ మంజూరు కాగా తరగతులను జేఎన్టీయుకేలో నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించగా, పెట్రో యూనివర్సిటీ ఇతర జిల్లాకు తరలించారు. ఈ పరిశ్రమ కూడా అ విధంగా చేజారకుండా చూడాలి. -ఎ.గోపాలకృష్ణ, డిజైన్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, జేఎన్‌టీయుకే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి... పెట్రోలియం యూనివర్శిటీ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు స్థానికంగా ఏర్పాటైతే మన జిల్లాకు చెందిన యువతకు కొంత వరకు ఉపాధి అవకాశాల ప్రయోజనం ఉంటుంది. స్థానికంగా చమురు సంస్థలు ఉన్నందున ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం యువతకు వస్తే వారి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అటువంటి యూవర్శిటీని జిల్లాకు వచ్చినట్టే వచ్చి పోవడం దురదృష్టకరం. – మట్టపర్తి రవిశంకర్, బీటెక్ , గంగలకుర్రు అగ్రహారం, అంబాజీపేట నేతలకు చిత్తశుద్ధి లేక పోవడం వల్లే... మన జిల్లా నేతలకు అభివృద్ధిపైనా..యువతకు మేలు చేసే యూనివర్శిటీల సాధన, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చిత్తశుద్ధి లేదు. ఈ కారణంగానే జిల్లాకు మంజూరైనా పెట్రోలియం యూనివర్శిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫారన్ ట్రేడింగ్ వంటివి పక్క జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. నేతలు ఇప్పటికైనా స్పందించి ఇటువంటివి సాధించడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, ఓయూ పూర్వవిద్యార్థుల సంఘం, అమలాపురం. -
మాన్వాడ వెళ్లడానికి ఆధార్‌కార్డు
స్వగ్రామం వెళ్లడానికి పోలీసుల ఆంక్షలు బోయినపల్లి: మధ్యమానేరు జలాశయం గండిపడడంతో ముందు జాగ్రత్తగా ఆదివారం మండలంలోని మాన్వాడవాసులను అధికారులు ఇళ్లు ఖాళీచేయించారు. సోమవారం నిర్వాసితులు తమ స్వగ్రామం వెళ్లడానికి చాలా తంటాలు పడాల్సివచ్చింది. సీఎం కేసీఆర్ వస్తున్నారనే నెపంతో పోలీసులు కొత్తపేటలో చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు. అడుగడుగునా పహారా ఉంచారు. కొత్తపేట నుంచి మాన్వాడకు ఎవరినీ అనుమతించలేదు. చివరకు ఆధార్‌కార్డు చూపిన వారిని పోలీసులు తమ వాహనంలోనే గ్రామంలోకి తీసుకెళ్లారు. సొంత వాహనాలపై వెళ్లనీయలేదు. భద్రత పేరిట తమ స్వగ్రామం వెళ్లడానికి ఆధార్ కార్డు చూపాలనడం.. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై మాన్వాడవాసులు అభ్యంతరం తెలిపారు. -
స్కూలుకు వెళ్ళేందుకు భయపడిపోతున్నారు!
హర్యానాః రెవారీలో బాలికలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. గత నెల్లో జరిగిన అత్యాచార ఘటనతో బిడ్డల రక్షణే ప్రధానంగా భావిస్తున్న తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో చదువులకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనతో ఆందోళన చెందిన స్థానికులు ఏకంగా బాలికలను చదువకే దూరం చేస్తున్నారు. గతనెల్లో ఓ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం జరగడంతో హర్యానా రెవారీ గ్రామంలోని విద్యార్థినులను పాఠశాలల కు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఏ సమయంలో ఎటువంటి ఆపద ముంచుకొస్తుందోనని భయపడిపోతున్నారు. పక్కనే ఉన్న సుమాఖేరా గ్రామ పంచాయితీలో ఉన్న ఒకే ఒక్క పాఠశాలకు పిల్లలను బలవంతంగా పంపించాల్సి వస్తోందని, మార్గ మధ్యంలో పిల్లలకు రక్షణ కరువుగా ఉందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలకు వెళ్ళే 38 మంది విద్యార్థినులు చదువు మానుకున్నారు. రెవారీ సమీప గ్రామం లాలా లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తల్లిదండ్రులు పిల్లలను పంపించడంలేదని, కనీసం 38 మంది బాలికలు అక్కడి స్కూలుకు రావడం మానుకున్నారని రెవారీ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ తెలిపారు. ఏప్రిల్ 18న జరిగిన అత్యాచార ఘటనతో పొరుగు గ్రామంలోని ప్రభుత్వపాఠశాలకు పంపేందుకు భయపడిపోతున్నారని గార్గ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల జాబితాలోని 4 నుంచి 7 తరగతుల అమ్మాయిల పేర్లను తొలగించిన పంచాయితీ.. సుమాఖేరాలో పాఠశాలను సీనియర్ సెకండరీ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రైమరీ స్కూళ్ళను అప్ గ్రేడ్ చేసి, సుమాఖేరాలో పాఠశాలను 8వ తరగతి వరకూ పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇదే నేపథ్యంలో స్థానికులు శుక్రవారం ధర్నాకు కూడ దిగి, డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ కు వినతి పత్రాలను కూడ అందజేశారు. దీంతో ప్రస్తుతం సుమాఖేరాలోని ప్రైమరీ స్కూల్ ను అప్ గ్రేడ్ చేయడంలో ఆలస్యమైనా.. జిల్లా అధికారులు లాలా గ్రామంలో పాఠశాల భద్రతపై స్థానికులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని గార్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖటార్ ఇరు గ్రామాల ప్రజలు ఓ అవగాహనకు వచ్చి సుమాఖేరాలో ప్రైమరీ స్కూల్ ను 8వ తరగతి వరకూ అప్ గ్రేడ్ చేసేందుకు సహకరించాలని తెలిపారు. ఇరు గ్రామాల్లోని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు కూడ చేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే బాలికలకోసం ప్రవేశ పెట్టిన బేటీ బచావ్, బేటీ పఢావ్ ప్రచారం బాలికల్లో ఏమాత్రం విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపడం లేదని, వారికి రక్షణ కరువవ్వడంతో తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్నించేస్తున్నారంటూ ప్రతిపక్ష ఐఎన్ఎల్డీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడాన్ని కూడ ఐఎన్ ఎల్డీ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా తప్పుబట్టారు. -
నేను మంత్రగత్తెగా మారబోతున్నా...
లండన్ బ్రిటిష్ గాయకురాలు, గీత రచయిత అదెలే లౌరీ బ్లూ ఎడ్కిన్స్ (27) సంచలన ప్రకటన చేసింది . అద్భుతమైన గాత్రంతో వందకు పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు, రెండువందల నామినేషన్లు సాధించిన ఈ అమ్మడు తాను భవిష్యత్తులో మంత్రగత్తెగా మారబోతున్నట్టు ప్రకటించింది. ఒకానొక సందర్భంలో తన చేతికొచ్చిన క్రిస్టల్స్ పై బాగా నమ్మకం పెరిగిన తరువాత తనకు ఈ అనుభూతి కలిగిందని చెప్పుకొచ్చింది. ఒక ప్రదర్శన సందర్భంగా అభిమానులతో అదెలె తన అనుభవాన్ని పంచుకున్నారు. న్యూయార్క్ లో తన ఆల్బమ్ మొదటి షో సందర్బంగా ఒక హిప్పీ తనకు కొన్ని స్ఫటికాలు ఇచ్చిందని అప్పటినుంచి కరియర్ లో తనకు ఎదురు లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. ఆ స్పటికాలు తన వెంట ఉండడం వల్లే గొప్పగొప్ప షోలు చేయగలుగుతున్నానని అభి ప్రాయపడింది. ఆ క్రిస్టల్స్ మీద నమ్మకంతో ఎపుడూ తనతోనే ఉంచుకుంటూ వస్తున్నానని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇంద్రజాలం , క్రిస్టల్స్ పవర్ మీద ఆసక్తి పెరిగిందని తెలిపింది. ఒక సందర్బంలో పాద మర్దన (రెఫ్లెక్సాలజీ) చేయించుకుంటున్న సందర్భంలో ఎవరో తన పాదాలమీద మెరుస్తున్న లైట్లు వేశారని,ఇది చాలా ఇబ్బందికరమైన అనుభూతికి దారితీసిందంది. ఇక ఆ తర్వాత బయటికొచ్చాక గాల్లో నడుస్తున్నట్టుగా, వీధుల్లో దుముకుతూ నడుస్తున్నట్టుగా, ఏదో మాయ ఆవహించినట్టుగా అనిపించిందని తెలిపింది... అందుకే తాను హిప్పీలాగా ... మాంత్రికురాలిగా మారనున్నట్టు తనకు అర్థమైందని పేర్కొంది. దీంతోపాటుఇటీవలి గ్రామీ అవార్డుల సందర్భంగా ఆ స్ఫటికాలను తీసుకెళ్లలేదని అందుకే అప్పటి తన ప్రదర్శన చాలా ఘోరంగా ఉందంటూ తన నమ్మకాన్ని సమర్ధించుకుంది. ఆ ఒక్కసారే వాటితో తీసుకెళ్ల లేకపోవడం వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తిన భయంకరమైన అనుభవాలను చవిచూశానని తెలిపింది. మరోవైపు ఈమెపై బ్రిటన్ లో ఓ బయోపిక్ కూడా రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాలో తన పాత్రను కామెడీ యాక్టర్ పోషించనున్నారనే వార్తలు ఆమె ఖండించింది. తను కొంచెం లావుగా వుండడం వల్ల, బొద్దుగా ఉన్ననటి రెబెల్ విల్సన్ పెట్టారని దీనికి తన అనుమతి తీసుకోవాలని మండి పడి వార్తల్లో నిలిచింది.