రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో పరిణామం చోటుచేసుకోబోతోంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలోకి రానున్నారననే చర్చ మరోసారి ఊపందుకుంది. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అలాగే బీజేపీ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె తిరిగి జేఎంఎంలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 2న దుమ్కాలో జేఎంఎం వ్యవస్థాపక దినోత్సవం(JMM Foundation Day) జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీతాసోరెన్ జేఎంఎంలో చేరనున్నారనే వార్తల నడుమ విలేకరులు ఆమెను ఇదే విషయమై అడుగగా, తాను ఫిబ్రవరి ఒకటిన దుమ్కా చేరుకుంటానని, కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందని, చర్చించే వాళ్లను చర్చించనివ్వండంటూ, తాను సరస్వతి పూజ కోసం దుమ్మా వెళుతున్నట్లు తెలిపారు.
సీతా సోరెన్(Sita Soren) బీజేపీలోకి తిరిగి రావడంపై జెఎంఎం ఎమ్మెల్యే, సీతా సోరెన్ బావమరిది బసంత్ సోరెన్ మాట్లాడుతూ దీనిపై చర్చ జరుగుతున్నట్లు తనకు తెలియదన్నారు. వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఈ వేడుకల నిర్వహణపై కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం ఉందని అన్నారు. గత సంవత్సరం కార్యనిర్వాహక అధ్యక్షుడు లేరని, ఈ కారణంగానే తాము గత సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవాన్ని సరిగా జరుపుకోలేకపోయామన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. దుమ్కా అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె జెఎంఎం అభ్యర్థి నళిన్ సోరెన్ చేతిలో ఓడిపోయారు. దీని తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు జంతారా టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లోనూ సీతకు నిరాశ ఎదురయ్యింది.
ఇది కూడా చదవండి: Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment