one card
-
‘కారు’ స్టీరింగ్‌పై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ఎట్‌హోమ్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు తరలివెళ్లే క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ భవన్‌కు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన ‘డిఫెండర్’వాహనాన్ని నడిపేందుకు కేటీఆర్ ఆసక్తి చూపారు. కేటీఆర్ కారు స్టీరింగ్ పట్టి సొంతంగా డ్రైవ్ చేస్తూ వెళ్లారు. అదే వాహనంలో పక్క సీట్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కూర్చున్నారు. తాము ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న ఫొటోలను హరీశ్‌రావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగాయి. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు..! కేంద్రం కీలక నిర్ణయం..!
కేంద్ర ప్రభుత్వం తెర పైకి కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్నీంటికీ ఒకే కార్డు..! ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక మేరకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి ఇతర డిజిటల్ ఐడీ కార్డులను లింక్ చేస్తూ కొత్తగా “ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్” కొత్త మోడల్ రూపొందించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు , పాన్ కార్డుతో పాటుగా పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీల కోసం ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్డుపై గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వన్ కార్డు మరోసారి తెరపైకి వచ్చింది. లక్ష్యం అదే..! ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుతో వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో మరింత సులభమయ్యే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ వన్‌స్టాప్ డెస్టినేషన్‌గా ఉంటుందని తెలిపింది. చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..! -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..!
Paytm Payments Bank Launches Paytm Transit Card: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్ధ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ అందించింది. ‘వన్‌నేషన్-వన్ కార్డ్’ అనే నినాదంతో పేటీఎం ట్రాన్సిట్కార్డును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించింది. ఈ ట్రాన్సిట్ కార్డుతో మెట్రో, రైల్వేలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసుల్లో, మర్చంట్ స్టోర్లలో, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్లైన్ షాపింగ్ కోసం ఉపయోగించవచ్చునని పేర్కొంది. దాంతో పాటుగా ట్రాన్సిట్ కార్డు సహాయంతో ఏటీఎం నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించనుంది. ట్రాన్సిట్ కార్డు పేటీఎం వ్యాలెట్‌తో నేరుగా లింక్ చేయబడి ఉండనుంది. బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకుగాను పేటీఎం ట్రాన్సిట్ కార్డును లాంచ్ చేసినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్డును పేటీఎం యాప్‌లో అప్లై చేసుకున్న యూజర్లకు ఇంటికే డెలివరీ చేయనుంది. పేటీఎం ప్రకటన ప్రకారం..పేటీఎం ట్రాన్సిట్ కార్డ్‌ను దేశవ్యాప్తంగా మెట్రోలతో పాటు ఇతర మెట్రో స్టేషన్లలో ఉపయోగించవచ్చునని పేర్కొంది. ఈ కార్డ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ , అహ్మదాబాద్ మెట్రో లైన్లలో పనిచేస్తోంది. హైదరాబాద్ మెట్రోరైల్లో కూడా పేటీఎం ట్రాన్సిట్ కార్డును ఉపయోగించే అవకాశం కల్పించనుంది.పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ సహయంతో ఒకే కార్డుతో అన్ని పనులు చేసుకోగలుగుతారని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో సతీష్ గుప్తా తెలిపారు. చదవండి: రూపేకార్డులపై అమెరికన్ కంపెనీ కుతంత్రం..! -
20 దేశాల కరెన్సీకి ఒకే ఒక్కకార్డు
♦ మల్టీ కరెన్సీ కార్డును ♦ విడుదల చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ♦ హజ్ యాత్రికుల కోసం ♦ హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్ కూడా.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ దేశానికి వెళుతున్నా, ఆ దేశపు కరెన్సీని వెంట తీసుకెళ్లటం మనకు తెలిసిందే. కానీ, ఇప్పుడా అవసరాలేమీ లేదంటోంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. 20 దేశాలకు చెందిన కరెన్సీ కోసం ఒకే ఒక్క కార్డు వెంట ఉంటే సరిపోతుందని చెబుతోంది. వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా మల్టీకరెన్సీ కార్డును విడుదల చేసింది. ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే మాట్లాడుతూ.. ఈ కార్డుతో విదేశాల్లో ప్రయాణించే వారికి స్థానిక కరెన్సీని వెంట తీసుకెళ్లాల్సిన అవసరముండదని, స్థానిక కరెన్సీ కోసం ఫారెక్స్ ఎక్స్చేంజ్లకు, బ్యాంకుల వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఒకే కార్డుతో ఏ దేశంలో అయినా డిజిటల్ లావాదేవీలు, నగదు ఉపసంహరణ సేవలనూ వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పాటూ ఆన్లైన్ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం రెమిట్ నౌ, ట్రేడ్ ఆన్ నెట్ సేవలను కొత్తగా జత చేశామన్నారు. ‘రెమిట్ నౌ ద్వారా విదేశాల్లో చదువు కోసం విద్యార్థులకు నగదు లేదా రుణాలు, లేదా వైద్య ఖర్చులను నేరుగా జమ చేయవచ్చు’ ట్రేడ్ ఆన్ నెట్‌తో వర్తకులు ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన నగదు లావాదేవీలను జరుపుకోవచ్చని తెలిపారు. హజ్ యాత్రికులకు హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకంగా హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్ కార్డును కూడా విడుదల చేసింది. దీంతో యాత్రికులు నగదు రూపంలో సౌదీ రియాల్స్‌ను తీసుకెళ్లాల్సిన అవసరముండదు. ఈ కార్డుతో నగదును ఉపసంహరణ కూడా చేసుకునే వీలుంటుంది. తెలంగాణలో 201, ఆంధ్రప్రదేశ్‌లో 142 హెచ్డీఎఫ్సీ శాఖల్లో ఈ కార్డులను కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారానూ కొనుగోలు చేయవచ్చు. కార్డుతో పాటూ ఐదేళ్ల ఉచిత బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఈ కార్డు కాలపరిమితి ఐదేళ్లు. కార్డు కొనుగోలుకు రూ.250, కార్డులో నగదు జమ చేసేందుకు రూ.75 చార్జీలుంటాయి. కార్డు ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలన్నీ ఉచితమే. కానీ, నగదు ఉపసంహరణ చేస్తే మాత్రం ఒక దానికి 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
వన్‌కార్డుతో నేరగాళ్లకు చెక్
* ఆధార్‌కార్డుల ఫోర్జరీ నేపథ్యంలో పోలీసుల కొత్త ఆలోచన * ఓటర్ఐడీ, ఆధార్, రేషన్‌కార్డు వివరాలను నిక్షిప్తం చేసేలా ప్రణాళిక * చిన్నపాటి చిప్ ఉండేలా కార్డుల రూపకల్పన సాక్షి, హైదరాబాద్: నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. నేరగాళ్ల సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. గుర్తింపుకార్డులను ఫోర్జరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నవారికి చెక్ పెట్టేందుకు వన్కార్డును రూపొందించాలని యోచిస్తోంది. ఓటర్ఐడీ, ఆధార్, రేషన్‌కార్డును నిక్షిప్తం చేసి వన్‌కార్డు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుకు చిప్‌ను అమర్చి అన్ని అవసరాలకు వినియోగించేలా చూస్తారు. పోలీస్‌శాఖతోపాటు అవసరమైన అన్ని విభాగాల్లో చిన్నపాటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తే, దాని సహాయంతో క్షణాల్లో ఎదుటి వ్యక్తి గురించి అక్కడికక్కడే పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా ఉంటుంది. అయితే, వన్‌కార్డు పేరుతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడి బిచాన ఎత్తేసింది. ఇప్పుడు అలాంటి వాటికి తావ్వికుండా హోంశాఖ పర్యవేక్షణలోనే ఏకరూప కార్డులను అతితక్కువ ఖర్చుతో రూపొందించాలని భావిస్తోంది. రేషన్, గ్యాస్, బ్యాంకు, వాహనాల కొనుగోలు, అమ్మకం... ఇలా అన్నిచోట్లా ఆధార్ గుర్తింపుకార్డు తప్పనిసరి. పోలీసులు కూడా నింది తుల్ని గుర్తించేందుకు దీన్నే ఆధారంగా ఎంచుకుంటున్నారు. ఏదైనా కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతను చూపించే ఆధార్‌కార్డు అసలైనదా.. కాదా.. అని తెలుసుకునేందుకు ఎలాంటి సదుపాయం లేదు. ఆధార్‌కార్డుపై బార్‌కోడింగ్ ఉన్నా దాన్ని సరిచూసుకునే యంత్ర పరికరాలు లేవు. దీంతో లొసుగులను ఆసరా చేసుకొని కొందరు కేటుగాళ్లు ఫోర్జరీకి పాల్పడుతున్నారు. సాధారణ వ్యక్తుల ఆధార్‌కార్డులో తమ ఫొటో, పేరు ఫొటోషాప్ సహాయంతో మార్చేసి నకిలీకార్డును సృష్టిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓటరు గుర్తింపు, రేషన్‌కార్డులు కూడా ఫోర్జరీకి గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో పట్టుబడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సిమీ సానుభూతిపరుల వద్ద కూడా వందల సంఖ్యలో ఓటరు ఐడీ, ఆధార్‌కార్డు లభించాయి. వీటి ద్వారా ఏకంగా భారతదేశపు పాస్‌పోర్టును సైతం పొందారు. ఈ నేపథ్యంలో అన్ని కార్డులకు సంబంధించి ‘వన్‌కార్డు’ రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు. ఫోర్జరీకి పాల్పడేవారు సైతం అన్ని కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తారుమారు చేసే అవకాశం ఉండదు. వీటివల్ల నేరాలను, నేరగాళ్లను నియంత్రిచవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
అన్ని సంక్షేమ పథకాలకూ ఒకేకార్డు
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు, ఇళ్లు, పెన్షన్, స్కాలర్షిప్ ఇలా ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందాలన్నా మీ దగ్గర ఓ కార్డు ఉండాలి. ఒకరకంగా సామాజికభద్రత కార్డులుగా పరిగణించే వీటి జారీ విధివిధానాలపై అధికారయంత్రాంగం స్పష్టతనిస్తోంది. ఈ కార్డులకు అర్హులెవరో తేల్చడానికి ఆగస్టు రెండోవారంలో ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా పేదల స్థితిగతులపై సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించనున్నారు. దీనికి మొత్తం ప్రభుత్వవ్యవస్థనంతా రంగంలోకి దింపనున్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, నకిలీలు లేకుండా చేసేందుకు ఆధార్‌తో అనుసంధా నం చేస్తూ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించాలని చెప్పారు. పౌరసత్వకార్డులు (పాసుపోర్టుల తరహాలో సిటిజెన్ కార్డులు) జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సీఎంవో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక రాష్ట్రం పౌరసత్వకార్డులు ఇవ్వడమేమిటనే విమర్శలు రావడంతో... వాటిపై వివరణ ఇస్తూ, అవి సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్డులని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భవిష్యత్తులో ఏ సంక్షేమపథకానికైనా ఈ కార్డులనే ఆధారంగా చేసుకుంటారు. ‘ఆగస్టు రెండోవారంలో ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపుతాం. ప్రతిఇల్లూ సర్వే చేస్తాం. పేదల స్థితిగతులను రికార్డు చేస్తాం. వాటి ఆధారంగానే కార్డులను జారీ చేస్తాం. ఈ ప్రక్రియపై ఎమ్మార్వోలతో, కలెక్టర్లతో ఆగస్టు ఒకటిన సమావేశం నిర్వహిస్తాం’ అని వివరిం చారు. గతంలో నిర్వహించిన మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే మాదిరిగానే ఇది ఉంటుందని ఆయన చెప్పారు. ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై అధికారులు ఓ నిర్ణీత ఫార్మాట్ రూపొందించే పనిలో పడ్డారు. 2011 జనాభా లెక్కల సమయంలో కొన్ని అంశాలు వెల్లడైనప్పటికీ.. ప్రభుత్వం తాజాగా సర్వే చేయాలని నిర్ణయించింది.