కేంద్ర ప్రభుత్వం తెర పైకి కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది.
అన్నీంటికీ ఒకే కార్డు..!
ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక మేరకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి ఇతర డిజిటల్ ఐడీ కార్డులను లింక్ చేస్తూ కొత్తగా “ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్” కొత్త మోడల్ రూపొందించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు , పాన్ కార్డుతో పాటుగా పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీల కోసం ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్డుపై గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వన్ కార్డు మరోసారి తెరపైకి వచ్చింది.
లక్ష్యం అదే..!
ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుతో వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో మరింత సులభమయ్యే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ వన్‌స్టాప్ డెస్టినేషన్‌గా ఉంటుందని తెలిపింది.
చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..!
Comments
Please login to add a commentAdd a comment