పాన్ కార్డు పొందాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని, అంతే ఈజీగా పొందవచ్చు. ఎలా అంటారా? కేవలం ఆధార్ కార్డు (Aadhaar Card) ఉంటే చాలు, కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందచ్చు.
ఫినో పేమెంట్స్.. కొత్త సేవలు
ఫినో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొన్ని గంటల్లో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా కొత్త పాన్ కార్డ్‌ల డిజిటల్ వెర్షన్‌లను పొందవచ్చు. ఇందుకోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్‌ఎస్‌డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించనున్నాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా పేపర్‌లెస్ పాన్ కార్డ్ జారీ చేసే సేవలను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది.
ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి పత్రాలను సమర్పించకుండా లేదా అప్‌లోడ్ చేయకుండా ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి పాన్ కార్డ్ పొందవచ్చు. ఇందుకోసం ఫినో బ్యాంక్ పాయింట్లలో పాన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు సేవను ఎంచుకున్న వారికి కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈ-పాన్ చట్టబద్ధమైన పాన్ కార్డ్‌గా అంగీకరించబడుతుంది.
చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!
Comments
Please login to add a commentAdd a comment