ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది.
ఆధార్‌కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్‌డేట్, అప్‌లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్‌డేట్, అప్‌లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది.
ఈ అప్‌డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్‌డేట్, అప్‌లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్‌డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment