Upload
-
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
గుడ్‌న్యూస్! ఆధార్ ఉచిత అప్డేట్ గుడువు పొడగింపు
ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్సైట్లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్డేట్, అప్లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది. ఈ అప్డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
సరుకు కలెక్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా మునిగిపోయిన ఓడ: వీడియో వైరల్
టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్ల లోడ్‌ని దింపుతోంది. ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. SEA EAGLE isimli konteyner gemisinden denize düşen 24 konteynerin tamamı denizden çıkarılmış olup, dalgıç marifetiyle batık bölgesinde gerekli kontroller yapılarak deniz yüzeyinin temizlenmesine müteakip batıkla ilgili çalışmalara devam edilecektir. pic.twitter.com/RV19PsH7PZ — DENİZCİLİK GENEL MÜDÜRLÜĞÜ (@denizcilikgm) September 18, 2022 Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl — focuSEA (@focuseatv) September 19, 2022 (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్) -
రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి
సాక్షి, బెంగళూరు: బీజేపీ నేత, మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల వీడియోల కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీడీని ఎవరు, ఎక్కడ రూపొందించారు, సూత్రధారు లెవరు అనేది సిట్ తేల్చనుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బెంగళూరు రూరల్‌లోని విజయపుర పట్టణంలో ఉన్న బసవేశ్వర లేఔట్లో నివాసం ఉంటున్న సురేష్ శ్రవణ్ అలియాస్ పెయింటర్ సూరి ఇంటికి మూడు వాహనాల్లో పోలీసులు చేరుకుని సోదాలు చేశారు. కొన్ని సీడీలను, ఒక కంప్యూటర్ను సీజ్ చేశారు. శ్రవణ్ గదిలో క్షుణ్ణంగా వెతికారు. వారం రోజుల నుంచి శ్రవణ్ ఇంటికి రాకపోవడంతో అతని సోదరున్ని పట్టుకెళ్లారు. రాసలీలల సీడీని శ్రవణ్ ఇక్కడే తన కంప్యూటర్లో ఎడిటింగ్ చేయడంతో పాటు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ వీడియో యూట్యూబ్‌లో రష్యా నుంచి పోస్ట్ అయినట్లు ఉండగా, శ్రవణ్ ఖాతాను ఎవరో రష్యాలో హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలిపారు. అతని కంప్యూటర్ పాస్వర్డ్ ఓపెన్ కాకపోవడంతో దానినితో పాటు పలు సీడీలను, పెన్ డ్రైవ్‌లను, ఇంటి కొనుగోలు కోసం తీసిపెట్టుకున్న రూ. 25 లక్షల డీడీని పోలీసులు తీసుకెళ్లారు. తుమకూరు జిల్లా శిరా తాలూకాలో ఉన్న భునవనహళ్లి గ్రామంలో సీడీ సూత్రధారిగా ఆరోపణలున్న నరేష్ గౌడ ఇంట్లో సోదాలు చేశారు. అతడు లేకపోవడంతో భార్యను ప్రశ్నించి వెళ్లిపోయారు. సీడీలో కనిపించిన యువతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. చదవండి: (సీడీ విషయం నాలుగు నెలల ముందే తెలుసు) ఉద్యోగం పేరుతో మోసగించాడు ►మాజీ మంత్రి రాసలీలల కేసులో యువతి ఆరోపణ సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతి ఎట్టకేలకు నోరువిప్పింది. అజ్ఞాతంలో ఉన్న ఆమె శనివారం రాత్రి తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. రమేశ్ జార్కిహొళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పాడని, పైగా ఆయనే సీడీని బయటకు విడుదల చేశారని ఆరోపించింది. వీడియోను ఎవరు, ఎలా చిత్రీకరించారో తనకు తెలియదని పేర్కొంది. ‘ఆ సీడీ విడుదలతో నా మాన, మర్యాదలకు భంగం కలిగింది. ఆ ఆవేదనతో మూడు, నాలుగుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. చదవండి: (కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు) నా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. నా వెనుక ఎవరూ లేరు. నాకు రాజకీయ మద్దతు కూడా లేదు. ఉద్యోగం ఇప్పిస్తా నని జార్కిహొళి మోసం చేశాడు’ అని ఆరోపిం చింది. తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని కోరింది. రాసలీలల సీడీ విడుదలైన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన బాధిత యువతి 11 రోజుల తర్వాత వీడియోను విడుదల చేసింది. కాగా, సీడీ కేసులో సిట్ పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నాపై రాజకీయ కుట్ర రాసలీలల సీడీపై రమేశ్ జార్కిహొళి శనివారం బెంగళూరు సదాశివనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ జీవితాన్ని భంగ పరచాలని సదాశివనగరలోనే కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. కుట్ర, మోసం ద్వారా ఒక నకిలీ సీడీని సృష్టించి మానసికంగా హింసించారని తెలిపారు. దీని వెనుక చాలా మంది హస్తం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: (మంత్రి రాసలీలల వీడియోలు వైరల్) -
టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న జియో, ఐడియా
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్ టాప్‌లో నిలిచింది. మరోవైపు సమీప ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ ఈ నెలలో కొంచెం మెరుగుపడింది. ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్ నమోదైంది. గత నెలలో ఇది 9.5గా ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ కూడా స్వల్పంగా మెరుగుపడింది. అక్టోబర్ 6.7 ఎంబీపీఎస్గాఉండగా.. ప్రస్తుత నెలలో 6.8స్థాయికి పెరిగింది. ఐడియా సెల్యులార్ 4జీ డౌన్లోడ్ స్పీడ్ 6.4 నుంచి 6.2 కి పడిపోయింది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్) తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా. సెకండ్ ప్లేస్‌లో వోడాఫోన్ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా ఎయిర్టెల్ స్వల్పంగా పుంజుకుంది. అయితే యూజర్ల విషయంలో డౌన్లోడ్ స్పీడే చాలా ముఖ్యం. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్లోడ్ స్పీడ్ చూస్తారు. మైస్పీడ్ అప్లికేషన్లో రియల్ టైమ్ ఆధారంగా సగటు స్పీడ్ తెలుసుకోవచ్చు. -
నేవీ కమాండర్ వికృత చేష్ట
న్యూఢిల్లీ : భార్య ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి ఆన్లైన్ ఫోటో యాప్‌లో అప్లోడ్ చేసిన ఓ నేవీ కమాండర్‌పై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న తన భర్త పోర్నోగ్రఫీకి బానిసయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఖండ్వా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహదేవ్ కుంభర్ తెలిపారు. భర్త అశ్లీల సైట్లకు అలవాటుపడి ఎంతకీ వాటిని వదిలేయకపోవడంతో తాను పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేశానని గతంలో సైనిక అధికారిగా పనిచేసిన బాధితురాలు వెల్లడించారు. తాను, కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా ఆయన మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిన మహిళ పూణేకు తిరిగివచ్చి ఇక్కడి ఫ్యామిలీ కోర్టులో గత నెలలో విడాకుల కేసును దాఖలు చేసినట్టు పోలీసు అధికారి మహదేవ్ వెల్లడించారు. ఆమె భర్త బాధితురాలి ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు, తన కొలీగ్ భార్య, మరికొందరు ఇతర మహిళల అభ్యంతరకర ఫోటోలను ఆ యాప్‌లో అప్లోడ్ చేశాడని తెలిపారు. ఈమెయిల్ ఖాతా ద్వారా నిందితుడు ఫోటో యాప్‌లో తన భార్య చిత్రాలను అప్లోడ్ చేశాడని వెల్లడించారు. నిందితుడికి తన కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసులో నిందితుడిని ప్రశ్నించేందుకు అనుమతి కోసం నేవీ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారు. -
వివరాలు ఆన్ లైన్ లో అప్డేట్ చేయండి
అనంతపురం టౌన్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ యోజనకు సంబంధించి ఇల్లు కావాల్సిన వారి వివరాలను ’ఆవాస్ సాఫ్ట్’లో అప్లోడ్ చేయాలని హౌసింగ్ పీడీ ప్రసాద్ సూచించారు. సోమవారం సాయంత్రం డ్వామా హాల్లో గృహ నిర్మాణ సంస్థ అధికారులకు శిక్షణ నిర్వహించారు. అనంతరం తన చాంబర్లో సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా 737 గ్రామ పంచాయతీల్లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉన్నా 357 పంచాయతీల్లో మాత్రమే చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్లకు సంబంధించి 50 శాతం అనుమతులు వచ్చాయన్నారు. -
రేషన్ కార్డుల్లో ఫొటో అప్లోడ్ చేసుకోండి: డీఎస్ డీఓ
అనంతపురం అర్బన్ : రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్ ఫొటోని అప్లోడ్ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో గ్రూప్ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలని తెలిపారు. అప్లోడ్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్ సరుకులు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. -
రేషన్ కార్డుల్లో ఫొటో అప్లోడ్ చేసుకోండి
అనంతపురం అర్బన్ : రేషన్ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్ ఫొటోని అప్లోడ్ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో గ్రూప్ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలని తెలిపారు. అప్లోడ్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్ సరుకులు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. -
ఫేస్బుక్లో బుక్కాయ్యారు
శాంతిపురం: ఫేస్బుక్లో మార్పింగ్ ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులు అడ్డంగా బుక్కయ్యారు. మండలంలోని మొరసనపల్లిలో బంధువుల ఇంటికి వచ్చిన ఓ అమ్మాయిని అదే గ్రామానికి చెందిన యువకుడు తన ఫోన్లో ఫొటో తీశాడు. మిత్రుడి ఫొటోతో ఆ అమ్మాయి ఫొటోను కలిపి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. కానీ తమ ఇంటికి వచ్చిన అమ్మాయి ఫొటో మార్పింగ్‌తో ఫేస్బుక్లో ఉండడం ఆ అమ్మాయి బంధువైన వురో యువకుడు గమనించి, పెద్దలకు తెలిపాడు. ఇలా ఎవరు చేశారనేది కనుక్కున్నారు. అంతటితో ఆగకుండా నిందితుడి చెల్లెలి ఫొటో తీసి మరో వ్యక్తి ఫొటోతో కలిపి మార్పింగ్ చేశాడు. తనకు పరిచయం ఉన్న మరొకరి ఫేస్బుక్ ఖాతా నుంచి దానిని అప్లోడ్ చేశాడు. అప్పటికే ఒక ఫొటోతో సాగుతున్న వివాదం రెండవ ఫొటోతో తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఇరు వర్గాల వారూ గొడవకు దిగారు. కలగజేసుకున్న స్థానికులు ఇరు వర్గాలనూ శాంతిపజేసి ఆదివారం గ్రామంలో పంచాయితీ జరపాలని తీర్మానించారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లలేదు. -
మత్స్యకన్యను చూడాలనుకుంటున్నారా?
నెట్‌ఇంట్లో సగం శరీరం చేపలా, సగం శరీరం మనిషిలా ఉండే జలకన్య మెర్మెయిడ్ అంటే పాశ్చాత్యులకు పిచ్చి. ఉందో లేదో కాని, ఆమె చుట్టూ కథలను అల్లుకున్నారు. కబుర్లు చెప్పుకున్నారు. సాహసవీరుడు, సాగరకన్య లాంటి కథలను పంచుకున్నారు. అలాంటి మెర్మెయిడ్ వాస్తవ వీడియో మా దగ్గర ఉందహో అని ఎవరయినా చెబితే ఇక హడావిడి ఆగుతుందా? సముద్రం ఒడ్డున జలకన్య సేద తీరుతున్న వీడియో చూడండహో అంటే చూడకుండా ఉంటారా? ఆ వీడియోను నవంబర్ 24న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసీ చేయగానే 3.12 కోట్ల మంది చూసేశారు. షేర్లు చేసేశారు. వీడియో పూర్తయ్యేసరికి వాళ్లంతా ఖంగుతిన్నారు. ఎందుకో ఊహించగలరా? వీడియో చివర సముద్రాల్ని మనం కాపాడుకోకపోతే జంతువులన్నీ ఇదిగో ఈ మెర్మెయిడ్లా కాల్పనిక లోకంలోనే ఉంటాయి అన్న పర్యావరణ సందేశం వస్తుంది. ఒక్క నిమిషం ఆశాభంగమై కోపం వచ్చినా, ఆ వెను వెంటనే వాతావరణ మార్పులపై అవగాహనా వస్తుంది. శివరామ్ లైక్స్ సైనా నెహ్వాల్!! ఆయనది ఆ దరి. ఈమెది ఈ దరి. ట్విట్టరమ్మ కలిపింది ఇద్దరిని. అయితే ఇది ఓ స్టార్ ప్లేయర్ పట్ల ఓ పరమ వీర ఫ్యాన్ ప్రేమ. అనగనగా ఓ శివరామ్ శర్మ. ఆయనకి సైనా నెహ్వాల్ అంటే వెర్రి అభిమానం. ఆమె ఏ భంగిమలో ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అదే భంగిమలో తన ఫొటోలను పోస్ట్ చేసేవాడు. కొన్నేళ్లుగా మనోడి గాలి ముద్దుల్ని ఆమె రాకెట్‌తో అవతలి కోర్టుకు పంపించేస్తోంది. బాడ్మింటన్ కాక్ తప్ప మరేదీ కనిపించని సైనాకి ఈ అభిమాని అస్సలు కనిపించలేదు. అలాంటిది ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ ఒక ట్విట్టర్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేసింది. విజేతలకు సైనాను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కల్పించింది. ఆ కాంటెస్ట్‌లో శివరామ్ శర్మ గెలిచాడు. అదిగో అలా ఛాన్స్ వచ్చింది శర్మకు. సైనాను దుబాయ్ వెళ్లి కలిసి, పూలగుత్తిని బహూకరించి, ఓ సెల్ఫీ దిగి మరీ వచ్చాడు. సైనా సెల్ఫీ దిగింది. శర్మకు మాత్రం మత్తు ఇంకా దిగలేదు. పరమచెత్త ఫ్యాషన్ ట్రెండ్స్!! 2015లో పరమచెత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమిటి? బజ్ ఫీడ్ అనే వెబ్సైట్ ఓ జాబితాను విడుదల చేసింది. బబుల్ నెయిల్స్, మెరిసిపోయే గడ్డాలు, చంకల్లో మెరుపులు అద్దుకోవడం, తలకాయపై చిన్న మొక్కల్ని లేదా రెండాకుల్ని ఫిక్స్ చేసుకోవడం, జుత్తును తివాచీలా పడుగూ పేకల్లా అల్లేయడం (హెయిర్ టాపెస్ట్రీ), టై అండ్ డై హెయిర్ స్టయిల్, రిజల్యూషన్ తక్కువగా ఉన్న ఫొటో పిక్సెలేట్ అయినట్టు పిక్సెల్ హెయిర్‌ని పెంచుకోవడం, జుత్తుపై టాటూలు వేయించుకోవడం, తలపై ఆకు రూపంలో పెయింట్ వేయించుకోవడం, పెదిమల్ని వాచిపోయేలా చేసుకోవడం.. దాని కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయడం - ఇవీ ఆ పరమచెత్త ఫ్యాషన్ ట్రెండ్స్. కనీసం వచ్చే ఏడాది ఇలా చేయకండి బాబూ అని మరీ ఆ వెబ్సైట్ కొత్తొక వింత అని వేలంవెర్రిగా ఫాలో అయ్యేవాళ్లని వేడుకుంటోంది. కూర్పు: కె. రాకా సుధాకరరావు www.sakshipost.com -
ఫేస్బుక్ ప్రొఫైల్‌గా వీడియో
న్యూయార్క్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తన వినియోగదారులకు మరో సౌకర్యాన్ని అందించింది. ఇకపై ఫేస్బుక్ వినియోగదారులు తమ ప్రొఫైల్ చిత్రం స్థానంలో తక్కువ నిడివి గల వీడియోను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు సృజనాత్మకంగా వీడియోలు రూపొందించటానికి ఈ సౌకర్యం దోహద పడుతుందని ఫేస్బుక్ ప్రొడక్ట్మేనేజర్ ఐజెరిమ్ షార్మెన్ తెలిపారు. -
ఐ యామ్ నెట్‌రావ్
బయోగ్రఫీ పదిమందికి ఉపయోగపడాలి. అదే జీవిత పరమార్థం. ఉపయోగపడుతున్నట్టు కనిపించకూడదు. అదే ఆ పరమార్థంలోని జీవన సౌందర్యం. నిస్వార్థంగా సర్వీస్ ప్రొవైడ్ చెయ్యాలి. సెర్చ్ చేస్తున్న వారి కోసం ఇంజిన్‌లా పనిచేసుకుంటూ పోవాలి. ఫలితం ఆశించకూడదు. ఆశించినవారికి మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి. ఇదీ నా ఫిలాసఫీ. నా పేరు ఇంటర్నెట్. ‘‘నా పేరు ఫలానా’’ అని చెప్పుకోవడం కన్నా, ‘‘నాకు మీరు పెట్టిన పేరు ఫలానా’’ అని చెప్పుకోవడంలో నాకు నిండుతనం ఉంటుంది. నన్ను మీరు ‘ఇంటర్నెట్’ అన్నారు. నిజానికి అదికాదు నా గుర్తింపు. నేను మీకెప్పుడూ ‘కనెక్ట్’ అయి ఉండడమే నా అసలైన గుర్తింపు. కనెక్ట్ కాని క్షణాన నేను లేన ట్టు. కనెక్ట్ అయ్యాక కూడా మీరు నన్ను యూజ్ చేసుకుంటేనే నేను బతికి ఉన్నట్టు. ఒక వేళ నేను సడెన్‌గా క్రాష్ అయ్యి చచ్చిపోతే?! కొన్ని క్షణాల అంధకారమే. వెంటనే వెలుగొచ్చేస్తుంది. ఆ లెవల్లో ఉంది మనిషి దగ్గర టెక్నాలజీ. నా గురించి నేను చెప్పుకోడం నాకిష్టం ఉండదు. ఎవరైనా చెబుతుంటే వినడమూ నాకు బాగోదు. ప్రపంచంలో ఏ విషయం కావాలన్నా మీరు నన్ను సెర్చ్ చేస్తారు. సర్ఫ్ చేస్తారు. నా గురించి తెలుసుకోవాలన్నా అదే పని చేస్తారు కాబట్టి పనిగట్టుకుని నేను చెప్పుకునే పన్లేదు. రెండిటికీ తేడా ఏంటి? నాకు తెలుసు వెంటనే ఇప్పుడు మీరు సెర్చ్‌కి, సర్ఫ్‌కి తేడా ఏమిటని నన్ను అడుగుతారు! మీకు ఎన్ని సందేహాలు వస్తే నాకు అంత వాల్యూ. చెప్తా రండి. ఏదో ఒకదాని కోసం వెదకడం సెర్చింగ్. ఒకే విషయం కోసం అనేక వెబ్సైట్లను గాలించడం సర్ఫింగ్. ఈ సర్ఫింగ్ అనే మాటను కనిపెట్టింది ఎవరో తెలుసా? న్యూయార్లో ఉండే ఒక లైబ్రేరియన్. ఆమె పేరు జీన్ ఆర్మోర్ పాలీ. 1992లో తొలిసారిగా ఆమె ఈ మాట వాడారు. అప్పట్నుంచీ ఆమె పేరు కూడా మారిపోయింది. ‘నెట్ మామ్’ అని పిలుస్తున్నారు పాలీని. నా గురించి చెప్పుకోడం నాకిష్టం లేదన్నాను కానీ, నా గురించి కొంతమంది అనుకునే మాటలు నన్నెంతగా బాధ పెడతాయో మీకు చెప్పుకోకుండా ఉండలేదు. నాలో వెయ్యి సముద్రాల సమాచారం ఉంటుంది. అడిగిన సమాచారం ఇవ్వడం నా ధర్మం. నా దగ్గర లేని సబ్జెక్టు లోకంలో లేదు. ఎవర్నీ ఏనాడూ నేను వట్టి చేతుల్తో పంపలేదు. వాళ్లడిగింది నా దగ్గర ఎంత ఉంటే అంతా ఇచ్చేస్తాను. భూగోళమంత ఉంటే భూగోళమంతా ఇచ్చేస్తాను. గోళీకాయంత ఉంటే గోళీకాయనే ఇచ్చేస్తాను. ‘లేదు’, ‘సారీ’ అనే పదాల్ని నా నోట్లోంచి రానివ్వను. ‘‘అలాగని పిల్లలడిగినా ఇచ్చేస్తావా?’’ అని పెద్దలు నా మీదకు కోపానికి వస్తారు. నన్ను చూసి చెడిపోతున్నారని అపవాదు వేస్తారు. తెలుసుకోవాలన్న తపన పెద్దలకు మాత్రమే ఉంటుందా? పిల్లలకు ఉండదా? ‘‘వయసుకు మించిన విషయాలు తెలుసుకోవాలని పిల్లలు ప్రయత్నిస్తే కట్టడి చెయ్యడం మీ చేతుల్లో పనేకదా. వద్దనుకున్న సైట్లకు లాక్ వెయ్యండి’’ అంటాన్నేను. తప్పా?! సద్వినియోగానికి, దుర్వినియోగానికి మధ్య లైన్ గీసుకునే పని మనుషులదే. యంత్రానికి ‘వినిమయం’ అవడం ఒక్కటే తెలుసు. అలాగే ఉంటారు మరి! నా మీద చాలా అరోపణలున్నాయి. నెట్ బుల్లీయింగ్‌కి ఉపయోగ పడుతున్నానట!! ప్రముఖుల్ని బజార్ల పడేస్తున్నానట. పర్సనల్ విషయాలు బయట పెడుతున్నానట. ఎంత అన్యాయం. ఎవరో కొందరి వెర్రి ఆలోచనలకు నేనెలా రెస్పాన్సిబుల్ అవుతాను. వాడకాన్ని బట్టే ఉపయోగం. మంచికి వాడితే మంచి. చెడుకు వాడితే చెడు. పిల్లలు గంటలు గంటలు స్మార్ట్ఫోన్లు పట్టుకుని సర్ఫింగ్ చేస్తున్నారని ఇంకో నిర్దయాపూరితమైన నింద. పిల్లలు అలాగే ఉంటారు. వాళ్లను తప్పు పట్టలేం. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనీ, కొత్త కొత్త లోకాలు వీక్షించాలని వారికి ఉంటుంది. అందుకోసమే నన్ను చూస్తుంటారు. అంతకన్నా ఆసక్తికరమైన సంగతుల గురించి మీరు చెప్పగలిగితే ఎప్పుడూ మీ వెంటే ఉంటారు కదా. ముందుజాగ్రత్తలోంచి నేను పుట్టాను! ఇప్పటికీ, టిమ్ బెర్నర్స్ లీని పిల్లలు అడుగుతుంటారు: ‘‘ఇంటర్నెట్ను మీరే కదా కనిపెట్టింది?’’ ‘‘నో నో నో, నేను కేవలం వరల్డ్ వైడ్ వెబ్‌ను సృష్టించానంతే!’’ అని జవాబిస్తుంటాడు టిమ్. డగ్లస్ ఆడమ్స్ జోక్ చేసినట్టుగా, అసలు పేరుకంటే సంక్షిప్తనామం పలకడానికి మూడింతలు ఎక్కువ సమయం పట్టే డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.! టిమ్ కంటే ముందే నేను (ఇంటర్నెట్) పుట్టాను. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న 1960ల ప్రాంతంలో అమెరికా సైన్యం ఒక వ్యూహం రచించింది. ఏదైనా పెనుదాడి జరిగినప్పుడు, భౌతికంగా సమీపంలోలేని సైనిక స్థావరానికి తక్షణం సమాచారాన్ని బదిలీ చేయగలిగే ఒక శక్తిమంతమైన ఆలోచన అది! ఈరోజు ఇంటర్నెట్ అని మీరు నన్ను పిలుస్తున్న దానికి బీజం అక్కడ పడింది. దానికోసం ఎందరో మేధావులు కృషిచేశారు. మరికొన్ని... ‘నేను’ అన్నప్పుడు నేనొక్కదాన్నే అని కాదు. నా చుట్టూ ఉన్నవాటిని కలుపుకుంటేనే మొత్తంగా నేను. ఆ దృష్టితో చూడండి. చివరిగా మీక్కొన్ని విశేషాలు చెబుతాను. గూగుల్‌కి వెళ్లి మీరొక ప్రశ్న అడిగారునుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను 0.2 సెకన్లలో వెయ్యి కంప్యూటర్ల సహాయం తీసుకుని మీక్కావసింది రాబడతాను. ఇలా రోజూ సెర్చ్ అవుతున్న సమాచారంలో 16 నుంచి 20 శాతం వరకు మునుపెన్నడూ ఎవరూ సెర్చ్ చేయనిదే. ఇంట్రెస్టింగ్ కదా. తొలి యూట్యూబ్ వీడియో 2005 ఏప్రిల్ 23న అప్లోడ్ అయింది. దాని పేరు ‘మీ ఎట్ ద జూ’. అందులో జావేద్ కరీమ్ (యూట్యూబ్ కనిపెట్టినవాళ్లలో ఒకరు) నటించారు. అది శాన్‌డియాగో జూ. ఇంటర్నెట్లో ఫస్ట్ ఇమేజ్‌ని అప్లోడ్ చేసింది కూడా టిమ్ బెర్నర్స్ లీ నే. అది ఒక ఉమెన్ జోక్ బ్యాండ్‌కు సంబంధించిన ఇమేజ్.ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యూస్ వచ్చిన యూట్యూబ్ వీడియో ‘గంగ్నమ్ స్టైల్’. 200 కోట్ల మందికి పైగా దీనిని వీక్షించారు. తొలి ఈ మెయిల్‌ని 1971లో రే టామ్లిన్సన్ తనకు పంపించుకున్నాడు. అయితే అందులో ఏమి పంపుకున్నాడో అతడికి గుర్తులేదట. జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవడంలో ఇప్పటి వరకు సాధించిన రికార్డు వేగం 1. 16 సెకన్లు.మ్యాచ్.కామ్ ద్వారా కలుసుకుని పెళ్లి చేసుకున్న దంపతులకు ఇప్పటి వరకు 10 లక్షలమంది పిల్లలు పుట్టారు. అమెజాన్ లోగో కింద కనిపించే యారో మార్క్ ఎ నుంచి జడ్ వరకు అంటుంది. అంటే ఏ-జడ్ అక్కడ దొరుకుతాయని. -
‘మాఫీ’ తొలిదశ అప్లోడ్ గడువు పెంపు
రుణ విముక్తిపై రేపు బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ సాక్షి, హైదరాబాద్: తొలిదశలో రుణమాఫీకి సంబంధించి రైతుల వివరాల అప్‌లోడ్‌కు గడువును ఈనెల 23 వరకు పొడిగించారు. ఈ గడువు శనివారం ముగిసినా, ఇంకా ఆరులక్షల ఖాతాల వివరాలు అప్లోడ్ కావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో 26.77 లక్షల మంది రైతులకు సంబంధించి 20 శాతం మేర రుణ విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ నాలుగో తేదీ ప్రకటించారు. వీరిలో ఆరులక్షల మంది రైతుల ఖాతాల వివరాలను ఇంకా బ్యాంకర్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ వివరాలను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌లో వేసిన తరువాత వడపోత చేపడతారు. ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, భూమి రికార్డులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఈ ఖాతాల కుటుంబాల సంఖ్యను తీస్తారు. అప్పుడు రుణ విముక్తికి అర్హులైన కుటుంబాలెన్ని, రుణం ఎంత అనేది తేలుతుంది. తొలి దశలో రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,664 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించగా ఇప్పటి వరకు రూ.4,300 కోట్లు వ్యయమయ్యాయి. మరోవైపు రెండో దశలో రుణ విముక్తి కోసం 25 లక్షల ఖాతాల వివరాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శనివారంతో ఈ గడువు ముగిసింది. 25 లక్షల ఖాతాలకుగాను శనివారం నాటికి 14 లక్షల ఖాతాల వివరాలు మాత్రమే వచ్చాయి. ఇక గడువు పొడిగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 14 లక్షల ఖాతాలనువడపోసి మాఫీకి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. సీఎం చంద్రబాబు సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించనున్నారు. -
వారంలో పది ఇంటర్నల్ మార్కుల అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో ఇచ్చే 20 శాతం ఇంటర్నల్ మార్కులను వచ్చే వారంలో ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారు(డీఈవో)లకు సోమవారం పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాలు, పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై డీఈవోలతో ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఇంటర్నల్ మార్కుల అప్లోడ్ అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఈవోలకు వివరించారు. దీనిపై ఎంఈవోలు, హెడ్మాస్టర్లతోనూ సమావేశాలు నిర్వహించాలని, వచ్చే వారంలో ఈ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని చిరంజీవులు సూచించారు. ఈసారి పదో తరగతి ఫలితాల శాతాన్ని పెంచాలని, టీచర్ల హాజ రుపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అలాగే ఏడాది కాలంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల నెలవారీ పదోన్నతులు, ప్రైవేట్ స్కూళ్ల లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించడం, మండలాల్లో మోడల్ స్కూళ్ల ఏర్పాటుపైనా చర్చించారు. పాఠశాల విద్యాశాఖ తోపాటు, సర్వశిక్షా అభియాన్‌లో వివిధ పథకాల కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై మంగళవారం పూర్తిస్థాయి ప్రతిపాదనలు అందజేయాలని విద్యా శాఖ విభాగాధిపతులను కూడా ఆయన ఆదేశించారు. -
దేవుడి వెయ్యినోటు!
దైవికం వరుణ్ పృధి నటుడు, మంచి డాన్సర్. కొన్ని యాడ్స్ చేశాడు. మ్యూజిక్ వీడియోలు తీశాడు. చిన్నపాటి నిర్మాత కూడా. ‘టెరోడాక్టల్ సర్ప్రైజ్’, ‘సుగర్ వీల్స్’, ‘రికీ ది హ్యాండీమ్యాన్’ (మొదటిది టీవీ సిరీస్, తర్వాతి రెండూ షార్ట్ ఫిల్ములు)లలో నటించాడు. ‘రికీ ది హ్యాండీమ్యాన్’ చిత్రానికి మాటలు అతడివే. ఖర్చూ అతడిదే. ఇన్ని రంగాలలో ప్రావీణ్యం ఉన్న ఈ ఢిల్లీ యువకుడి గురించి నిన్నమొన్నటి వరకు దాదాపుగా ఎవరికీ తెలియదు. ఇప్పటికైనా తెలియకపోయేవాడేనేమో కానీ, ఇటీవల తను అప్లోడ్ చే సిన వీడియో ఒకటి అతడిని వివాదాస్పద ప్రముఖుణ్ణి చేసింది! ‘డ బ్బు సంతోషాన్నిస్తుందా’ అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఆ వీడియో, ‘తప్పకుండా. కష్టాలు, కన్నీళ్లతో జీవితం సాగిస్తున్నవారికి అది సంతోషాన్నిస్తుంది’ అనే సమాధానంతో ముగుస్తుంది. ఆ వీడియో పేరు ‘గాడ్ సెంట్ మీ ఫర్ యు’ (మీకోసం దేవుడు నన్ను పంపించాడు). వీడియో ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ మొదట ఓ పార్కులో గ్లాసు నీళ్లను (కుండలోని నీళ్లు) రూపాయి చొప్పున అమ్ముకునే మహిళ దగ్గరకు వెళ్లి, మోకాళ్ల మీద వంగి నిలబడి, ‘‘ఏమ్మా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’’ అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. నిజమే. జీన్స్‌ప్యాంటు, టీషర్టులో సినిమా హీరోలా ఉన్నవాడికి వెళ్లెళ్లి ఆమె కుండలో నీళ్లు తాగే అవసరం ఏముంటుంది? ఆమె ఆశ్చర్యం పూర్తికాకుండానే, మళ్లీ అదే ప్రశ్న అడుగుతాడు వరుణ్. దానికి సమాధానంగా ఆమె ‘‘ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంటుంది. నాకు మాత్రం ఎందుకు ఉండదు?’’ అని ప్రశ్నిస్తుంది. వెంటనే వరుణ్ నిటారుగా నిలబడి ప్యాంటు జేబులోంచి పెళపెళలాడే వెయ్యినోటు తీసి ఆమెకు ఇస్తూ, ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటాడు. ఆమెకేమీ అర్థం కాదు! భయంగా చూస్తుంది. ‘‘తీస్కోమ్మా, నీకే’’ అంటాడు. ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కొద్దిసేపు వీడియోలో ఆ నోటు తీసుకున్నావిడ ఫీలింగ్ కనిపిస్తాయి. ఈలోపు వరుణ్ ఇంకో చోటుకు వెళ్లి ఉంటాడు. అక్కడా ఇలాగే ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అని చెప్పి వెయ్యినోటు ఇస్తుంటాడు. అలా... బ్రేస్లెట్స్ అమ్మే అమ్మాయి, పాపడ్లు అమ్ముకునే 55 ఏళ్ల ఆయన, పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే వ్యక్తి, ఐదురూపాయలకు టీ అమ్ముకునే అతను, పదిరూపాయలకు పీచుమిఠాయి అమ్ముతుండే పెద్దాయన, బబుల్ టాయ్స్ అమ్మే కుర్రాడు... ఇలాంటి వాళ్లందరి దగ్గరకు వెళ్లి ‘‘దేవుడి మీద నీకు నమ్మకం ఉందా?’’ అని మొదలు పెడతాడు. చివర్లో ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటూ వెయ్యి నోటు చేతిలో పెడతాడు. పెట్టి, వెంటనే వెళ్లిపోతాడు. ఆ డబ్బు తీసుకున్నవాళ్లు ఒక్కొక్కొళ్లు ఒక్కోలా స్పందిస్తుంటారు. బ్రేస్లెట్స్ అమ్మే అమ్మాయి ఎలాంటి సంకోచం లేకుండా డబ్బు తీసుకుని థ్యాంక్స్ చెబుతుంది. ఆ ఆనందంలో... రాబోతున్న డాన్స్‌ని ఆపుకుంటుంది. పాపడ్లు అమ్మే ఆయన ‘‘సార్ ఒక్క పాపడ్ అయినా తీసుకోండి’’ అని కృతజ్ఞతగా అంటాడు. వెయ్యినోటుని కళ్లకద్దుకుని, ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు. పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే ఒంటి కన్ను వ్యక్తి వెయ్యి నోటు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. వరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినా కూడా ఆ నోటును చూసుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. టీ అమ్మే అతను మాటలు రాని ఆనందంలో తటపటాయింపుగా నోటు తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. కాసేపు అలా స్తంభించినట్లు నిలబడిపోతాడు. పీచుమిఠాయి అమ్మే ఆయన ‘‘నా మీద జోకు చెయ్యొద్దుసార్’’ అని, తర్వాత నోటును అందుకుని నుదుటికి ఆన్చుకుంటాడు. బబుల్ టాయ్స్ కుర్రాడు చిరునవ్వుతో వెయ్యినోటు అందుకుని ప్యాంటు జేబులో పెట్టుకుంటాడు. వరుణ్ వీళ్లందరిలోనూ ఆనందాన్ని చూశాడు. ఎలా చూశాడంటే నేరుగా చూడలేదు. ఒకళ్లకు వెయ్యినోటు ఇచ్చివెళ్లాక వాళ్ల ముఖ భావాలను దూరం నుంచి వీడియోగ్రాఫర్ కొద్దిసేపు క్యాచ్ చేస్తే, అన్నిటినీ కలిపి ఒకేసారి వీడియోలో చూశాడు. లేమిలో సైతం భగవంతుడిపై నమ్మకం కోల్పోకుండా కుటుంబాల కోసం బతుకులు ఈడుస్తున్న ఈ స్ట్రీట్ హాకర్ల కళ్లలో వెయ్యినోటు తెచ్చిన ఆనందాన్ని, దేవుడే వెయ్యినోటుగా సాక్షాత్కరించినంత ఉద్వేగాన్ని చూశాడు. ‘‘జీవితం మీద ఆశలు కోల్పోకండి. దేవుడు ఏదో ఒకరూపంలో మీ బాధలు తీరుస్తాడు’ అని చెప్పడం వరుణ్ ఉద్దేశం. అయితే వరుణ్ ఇలా దేవుడు పంపిన దూతలా పేదవారికి డబ్బు పంచడం వివాదాస్పదం అయింది. ‘‘దేవుణ్ణి ఇందులోకి లాగడం ఏం బాలేదు. ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు వారికి పని కల్పించాలి తప్ప, వాళ్లను యాచకుల స్థాయికి దిగజార్చకూడదు. అలా చేయడం దాతృత్వం అనిపించుకోదు’’ అని ఇండియన్ కార్పొరేట్ గురు సుహెల్ సేథ్ లాంటి వాళ్లు అంటున్నారు. అయితే వరుణ్ పృధి ఆ మాటలేమీ పట్టించుకున్నట్టు లేదు. ‘గాడ్ సెంట్ మీ ఫర్ యూ’ పార్ట్ 2 కూడా తీసి నెట్లో పెట్టేశాడు. ‘‘వాళ్లను సంతోషపెట్టడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడి చిరునామా పేదవాళ్ల సంతోషమే కదా. అలా దేవుణ్ణి వెదికి పట్టుకుంటున్నాను తప్ప, దేవుణ్ణి ఎందులోకీ లాగడం లేదని చెబుతున్నాడు. వరుణ్ని కూడా మనం ఎందులోకీ లాగకుండా అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే... లేమిలో ఉన్నవారిని సంతోష పెట్టడం అంటే ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడమేనన్న భావనలో మనకెలాంటి తప్పూ కనిపించదు. - మాధవ్ శింగరాజు -
డేటింగ్‌కు రావడం లేదని..!
అమెరికాలో ఉన్మాది కాల్పులు వాహనంలో వెళ్తూ ఘాతుకం; ఆరుగురి మృతి అమ్మాయిలు ప్రేమించడం లేదన్న నిస్పృహతో దుశ్చర్య! లాస్ఏంజెలిస్: అమెరికాలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. దక్షిణ కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్ ఉన్న ఇస్లావిస్టా పట్టణంలో శుక్రవారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) నలుపు రంగు బీఎండబ్ల్యూ వాహనంలో ప్రయాణిస్తూ.. పాదచారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురి నిండుప్రాణాలు తీశాడు. దాదాపు తొమ్మిది ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారిపై కూడా కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. అలా రెండు సార్లు పోలీసుల నుంచి తప్పించుకుని చివరగా ఒక ఆగి ఉన్న కారును ఢీ కొని ఆగిపోయాడు. వాహనం దగ్గరికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు తలపై బులెట్ గాయంతో ఉన్న అతడి మృతదేహం కనిపించింది. వారికి ఆ వాహనంలో ఒక సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ లభించింది. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదని, ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని స్థానిక సాంటా బార్బరా కౌంటీ పోలీస్ అధికారి బిల్ బ్రౌన్ వెల్లడించారు. స్థానికంగా పరిస్థితి సామూహిక హత్యాకాండ జరిగినట్లుగా ఉందన్నారు. ఇస్లావిస్టా పట్టణ వాసులను ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సూచించారు. ఆ దుండగుడు ఒక బెదిరింపు వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు అందిన సమాచారంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుండగుడి పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ ఘాతుకానికి పాల్పడింది 22 ఏళ్ల ఇలియట్ రోడ్జర్ అని భావిస్తున్నారు. రోడ్జర్ అప్లోడ్ చేశాడంటున్న వీడియో దాన్ని ధ్రువీకరిస్తోంది. 22 ఏళ్లు వచ్చినా తనకు శృంగారానుభవం లేదని, ఏ అమ్మాయినీ ముద్దు కూడా పెట్టుకోలేదని, తనతో డేటింగ్‌కు ఒప్పుకోని అమ్మాయిలపై ప్రతీకారం తీర్చుకుంటానని ‘రోడ్జర్ ప్రతీకారం’ అనే పేరుతో ఉన్న ఆ వీడియోలో రోడ్జర్ హెచ్చరించాడు. ‘కాలేజ్ రోజుల్లోనే అంతా అద్భుతమైన శృంగార అనుభవాల్ని పొందుతారు. నాకు అవేమీ లభించలేదు. అమ్మాయిలు మంచివాడైన నన్ను కాదని దుర్మార్గులకు దగ్గరవుతున్నారు.. అందమైన అమ్మాయిలుండే ‘యూఎస్సీబీ’కి వెళ్లి కనిపించిన వారినందరినీ కాల్చి చంపేస్తాను.. అని ఆ వీడియోలో హెచ్చరించాడు. అతని ఇతర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలోనూ ఒంటరితనానికి, ప్రతీకారానికి సంబంధించిన వ్యాఖ్యలే ఉన్నాయి. రోడ్జర్ సాంటా బార్బరా సిటీ కాలేజ్ విద్యార్థి అని, హంగర్ గేమ్స్ అనే సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన పీటర్ రోడ్జర్ కుమారుడని సమాచారం.