Ship Sank While Unloading Containers At Iskenderun Port, Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: కంటైనర్లను తీస్తుండగా..అందరూ చూస్తుండగానే మునిగిపోయిన ఓడ:

Published Tue, Sep 20 2022 2:28 PM | Last Updated on Tue, Sep 20 2022 3:11 PM

Vira Video: Sea Eagle Ship Sinks While Unloading Cargo At Turkey Port - Sakshi

టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్‌లోడ్‌ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్‌ అనే  కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్‌ పోర్ట్‌లో  చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్‌ల లోడ్‌ని దింపుతోంది.

ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్‌ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్‌ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.

ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్‌) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్‌ 17న టర్కీలోని ఇస్కెండరమ్‌ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్‌ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్‌ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement