Sinks
-
ఒమన్ సమీపంలో సరుకు రవాణా నౌక మునక
దుబాయ్: ఒమన్ సమీప సముద్రజలాల్లో సరకు మూడు రోజుల క్రితం రవాణా నౌక మునిగిపోయిన ఘటనలో ఐదుగురు భారత, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. మూడ్రోజుల అన్వేషణ తర్వాత 8 మంది భారతీయులను, ఒక శ్రీలంక వ్యక్తిని కాపాడ గలిగారు. మిగతా వారికోసం అన్వేషణ సాగుతోంది. దుబాయ్ నుంచి బయలుదేరిన నౌక దుక్మ్ పట్టణం సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. కొమొరోస్ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్టు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒమన్‌లోని ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దుక్మ్ పోర్ట్ ప్రధాన కేంద్రంగా ఉంది. 117 మీటర్ల పొడవైన ఫాల్కన్ నౌకను 2007లో నిర్మించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులే. -
హౌతీల క్షిపణి దాడి.. నౌక మునక
దుబాయ్: హౌతీ మిలిటెంట్ల క్షిపణి దాడిలో దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18వ తేదీన బాబ్ ఎల్ మండెల్ సింధుశాఖ వద్ద రుబీమర్ అనే నౌకపైకి హౌతీలు క్షిపణులను ప్రయోగించారు. దీంతో, ఆ నౌక దెబ్బతినడంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ నౌక నుంచి ఇంధన లీకవుతూ క్రమేపీ మునిగిపోతూ వచి్చంది. శనివారం మధ్యాహా్ననికి రుబీమర్ పూర్తిగా నీట మునిగినట్లు యెమెన్ అధికారులు ధ్రువీకరించారు. -
సరుకు కలెక్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా మునిగిపోయిన ఓడ: వీడియో వైరల్
టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్ల లోడ్‌ని దింపుతోంది. ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. SEA EAGLE isimli konteyner gemisinden denize düşen 24 konteynerin tamamı denizden çıkarılmış olup, dalgıç marifetiyle batık bölgesinde gerekli kontroller yapılarak deniz yüzeyinin temizlenmesine müteakip batıkla ilgili çalışmalara devam edilecektir. pic.twitter.com/RV19PsH7PZ — DENİZCİLİK GENEL MÜDÜRLÜĞÜ (@denizcilikgm) September 18, 2022 Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl — focuSEA (@focuseatv) September 19, 2022 (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్) -
Russia-Ukraine war: మాస్క్వా మునిగింది
కీవ్: గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. బ్లాక్‌సీ ఫ్లీట్‌కే తలమానికమైన నౌక మునిగిపోవడం రష్యాకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఇకపై ఉక్రెయిన్ రాజధానిపై మరిన్ని మిసైల్ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్ ప్రత్యేకతలు ► రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లలో ఇది ఒకటి ► సిబ్బంది సంఖ్య: 680 ► పొడవు: 186 మీటర్లు ► గరిష్ట వేగం: 32 నాటికల్ మైళ్లు(59 కి.మీ.) ఆయుధ సంపత్తి ► 16 యాంటీ షిప్ వుల్కన్ క్రూయిజ్ మిస్సైళ్లు ► ఎస్–300 లాంగ్ రేంజ్ మెరైన్ వెర్షన్ మిస్సైళ్లు ► షార్ట్ రేంజ్ ఒస్సా మిస్సైళ్లు ► రాకెట్ లాంచర్స్, గన్స్, టార్పెడోస్ తూర్పు ఉక్రెయిన్ వైపు రష్యా బలగాలు మరలడంతో కీవ్‌లో జనజీవనం సాధారణస్థాయికి చేరుకుంటోంది. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో తిరిగి బంకర్లలో తలదాచుకోవాల్సివస్తుందని నగర పౌరులు భయపడుతున్నారు. మాస్క్వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్వా కానుంది. ఇది రష్యాకు ఒకరకమైన ఓటమిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 5 కాదు 50 రోజులు ఉక్రెయిన్ ఆక్రమణకు గట్టిగా ఐదు రోజులు పడుతుందని రష్యా భావించిందని, కానీ 50 రోజులైనా రష్యా దాడులను తట్టుకొని నిలిచామని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సమావేశంలో చెప్పారు. మాస్క్వా మునక గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పోరాడాలని ఉక్రేనియన్లు నిర్ణయించుకొని 50 రోజులైందన్నారు. యుద్ధారంభంలో చాలామంది ప్రపంచ నేతలు తనకు దేశం విడిచి వెళ్లమని సలహా ఇచ్చారని, కానీ ఉక్రేనియన్లను వారు తక్కువగా అంచనా వేశారని చెప్పారు. 50 రోజులు ఎదురునిలిచి పోరాడుతున్నందుకు దేశప్రజలు గర్వించాలన్నారు. అయితే మరోవైపు మారియూపోల్‌పై రష్యా పట్టుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరాన్ని రష్యా సేనలు దాదాపు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు దొరక్క అలమటిస్తున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. నగరంలో రష్యా సైనికుల అకృత్యాలకు త్వరలో ఆధారాలు లభిస్తాయని, చాలా శవాలను రష్యన్లు రహస్యంగా ఖననం చేశారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా సేనలు బొరోవయా ప్రాంతంలో పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి 7గురిని పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. వీటిని రష్యా ఖండించింది. మాస్క్వాకు అణు వార్‌హెడ్స్? గురువారం నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్వాపై రెండు అణు వార్ హెడ్స్ అమర్చిఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై వెంటనే విచారణ జరపాలన్న డిమాండ్ చేశారు. బ్రోక్ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సిబ్బందిలో చాలామంది మరణించే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో 58 మంది మాత్రమే బతికారని, 452 మంది మునిగిపోయారని రష్యా బహిష్కృత నేత పొనొమరేవ్ ఆరోపించారు. మాస్క్వా మునకపై అడ్మిరల్ ఐగొర్ ఓసిపోవ్ను అరెస్టు చేశారని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. 20 వేల రష్యా సైనికులు మృతి? ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్లను తీవ్రంగా హెచ్చరించింది. స్వదేశానికి 10 లక్షల మంది ఉక్రేనియన్లు యుద్ధం ముగియనప్పటికీ ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన వారిలో దాదాపుగా 10 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పుడప్పుడే రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా రోజుకు 30 వేల మంది దాకా తిరిగొస్తున్నట్టు సమాచారం. పోలండ్, రుమేనియా తదితర దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌లోకి రావడానికి ప్రజలు భారీగా క్యూ కట్టారు. కీవ్ చుట్టుపక్కల 900 మందికిపైగా మృతి కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం చుట్టూ మోహరించిన రష్యన్ సేనలు వెనక్కుమరలడంతో అక్కడ వారు చేసిన ఘోరాలు బయటపడుతున్నాయి. కీవ్ పరిసర ప్రాంతాల్లో 900 మందికి పైగా పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రీ చెప్పారు. చాలాచోట్ల మృతదేహాలు రోడ్లపై పడిపోయి ఉన్నాయని, కొన్ని చోట్ల అరకొర పూడ్చివేతలున్నాయని చెప్పారు. వీరిలో 95 శాతం మంది తుపాకీ గాయాలతో మరణించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దేహాలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. ఎక్కువగా కీవ్‌కు సమీపంలోని బుచాలో 350 మృతదేహాలు దొరికినట్లు వివరించారు. -
మునిగిపోయిన సబ్‌మెరైన్.. 53 మంది గల్లంతు
జకార్తా: 53 మంది సభ్యులతో కూడిన సబ్‌మెరైన్ గల్లంతైంది. ఈ దారుణం ఇండోనేషియాలో బుధవారం చోటు చేసుకుంది. మిలిటరీ చీఫ్ హదీ తహ్జం తెలిపిన వివరాల ప్రకారం.. మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా ‘కేఆర్ఐ నంగాల 402 సబ్‌మెరైన్’ గల్లంతైందని తెలిపారు. బాలి దీవి ఉత్తర తీరం నుంచి నీటిపై 95 కిలోమీటర్ల దూరం తర్వాత దాని నుంచి సిగ్నల్స్ సరిగా రాలేదు. ఎంత సేపటికీ ఆ సబ్‌మెరైన్ నుంచి ఎటువంటి సమాచరం రాకపోవడం, సిగ్నల్స్ మొత్తంగా బ్లాక్ కావడంతో మునిగిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. మెరైన్ను కనుగొనేందుకు సింగపూర్, ఆస్ట్రేలియాల సాయం కోరామని ఆయన అన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ సైతం నీటి మీద తిరుగుతూ మెరైన్ జాడను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ఆచూకీ తెలియడం లేదు. ఇండోనేషియా మీడియా చూపిస్తున్న వివరాల ప్రకారం సముద్ర మట్టం నుంచి 2,300 అడుగుల లోతులో అది మునిగిపోయినట్లు తెలుస్తోంది. సబ్‌మెరైన్ ప్రారంభమైన చోట ఆయిల్ లీకైన జాడలను ఓ హెలికాప్టర్ గుర్తించిందని అందులో పేర్కొన్నారు. బహుశా ఈ ప్రమాదానికి కారణం ఆయిల్ లీకేనని అధికారులు భావిస్తున్నారు. ( చదవండి: జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసు: అతడే దోషి ) -
కేరళ: అంబుకుట్టి గ్రామంలో వింత ఘటన
-
ఓడ మునక..భారతీయులు గల్లంతు
టోక్యో(జపాన్): జపాన్ తీరంలో సరుకు రవాణా నౌక మునిగిన ఘటనలో పది మంది భారతీయులు కనిపించకుండాపోయారు. హాంగ్‌కాంగ్‌లో రిజిస్టరయిన 33వేల టన్నుల ఎమరాల్డ్‌స్టార్ అనే సరుకు రవాణా నౌక శుక్రవారం తెల్లవారుజామున ఒకినావ సమీపంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న జపాన్ కోస్టుగార్డులు వెంటనే సంఘటన స్థలికి చేరుకున్నారు. ఓడలోని 26 మంది భారతీయ సిబ్బందిలో 16మందిని మాత్రం రక్షించగలిగారు. అయితే, బలమైన టైఫూన్ తుఫాను కారణంగా వెంటనే రక్షణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. మిగతా 10 మంది జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు, బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
వంటింటి చిట్కాలు
♦ ఉపయోగించిన టూత్ బ్రష్‌లతో వంటింట్లో సింకులు, కంప్యూటర్ కీ బోర్డులు, టీవీ రిమోట్లు శుభ్రం చేసుకోవచ్చు. ♦ ఛీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ♦ కోసిన ఉల్లిపాయ సగమే వాడినప్పుడు మిగతా సగం ముక్కకు వెన్న రాసి ఉంచాలి. తాజాగా ఉంటుంది. ♦ వేడి చేసిన గరిటెతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ♦ బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పుట్టదు. ♦ పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి కలపాలి. ♦ కూరల్లో, పులుసులో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల శనగపిండిని వేయించి కలపాలి. ♦ మరీ నిల్వ ఉంచిన శనగపిండిని పారేయకుండా స్టీలు గిన్నెలు, వెండి సామాన్లను తోమితే శుభ్రపడతాయి. ♦ మజ్జిగ పల్చనైతే పది కరివేపాకు ఆకులు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కబడుతుంది. ♦ తెల్లని బట్టలు ఉతికాక పసుపు మరకలు అలాగే ఉంటే బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్ది సేపు నానబెట్టి, ఉతికి ఎర్రటి ఎండలో ఆరేయాలి. ♦ రోజ్‌వాటర్‌లో ముంచిన దూది ఉండను హ్యాండ్‌బ్యాగులో ఉంచితే దుర్వాసన రాదు. ♦ హ్యాండ్ వాష్ లిక్విడ్‌ను దూదితో అద్దుకొని తుడిస్తే లెదర్ బ్యాగుల దుమ్ము సులువుగా వదిలిపోతుంది. -
పసిడి, వెండి ఎగిసిపాటుకు బ్రేక్
న్యూఢిల్లీ : పసిడి, వెండి ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. వరుసగా రెండో రోజూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.30వేల మార్కును నుంచి రూ.250 కిందకుజారి, రూ.29,850గా మంగళవారం బులియన్ మార్కెట్ లో నమోదైంది. అంతర్జాతీయంగా పసిడికి బలహీనమైన ట్రెండ్ కొనసాగడంతోపాటు ఈసారి వివాహాది శుభకార్యాలు ముగియడంతో జ్యువెల్లర్ల దగ్గర్నుంచి డిమాండ్ పడిపోయింది. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర కిందకి దిగొచ్చింది. వెండి సైతం కిలోగ్రాముకు రూ.600 పడిపోయి, కేజీ రూ.40,600గా నమోదైంది. కాయిన్ తయారీదారుల నుంచి, పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోలు ఆసక్తి లేకపోవడంతో వెండి ధరలు కూడా నష్టాలపాలయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ కు 1.89శాతం పడిపోయి, 1,263.40 డాలర్లుగా న్యూయార్క్ లో నమోదైంది. సిల్వర్ సైతం 2.55 శాతం పతనమైంది. -
రష్యా తూర్పుతీరసముద్ర౦లో మునిగిపోయినపడవ