ఐదుగురు భారతీయులు గల్లంతు
8 మందిని కాపాడిన సిబ్బంది
దుబాయ్: ఒమన్ సమీప సముద్రజలాల్లో సరకు మూడు రోజుల క్రితం రవాణా నౌక మునిగిపోయిన ఘటనలో ఐదుగురు భారత, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. మూడ్రోజుల అన్వేషణ తర్వాత 8 మంది భారతీయులను, ఒక శ్రీలంక వ్యక్తిని కాపాడ గలిగారు. మిగతా వారికోసం అన్వేషణ సాగుతోంది. దుబాయ్ నుంచి బయలుదేరిన నౌక దుక్మ్ పట్టణం సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది.
కొమొరోస్ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్టు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒమన్‌లోని ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దుక్మ్ పోర్ట్ ప్రధాన కేంద్రంగా ఉంది. 117 మీటర్ల పొడవైన ఫాల్కన్ నౌకను 2007లో నిర్మించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులే.
Comments
Please login to add a commentAdd a comment