దుబాయ్: హౌతీ మిలిటెంట్ల క్షిపణి దాడిలో దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 18వ తేదీన బాబ్ ఎల్ మండెల్ సింధుశాఖ వద్ద రుబీమర్ అనే నౌకపైకి హౌతీలు క్షిపణులను ప్రయోగించారు. దీంతో, ఆ నౌక దెబ్బతినడంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ నౌక నుంచి ఇంధన లీకవుతూ క్రమేపీ మునిగిపోతూ వచి్చంది. శనివారం మధ్యాహా్ననికి రుబీమర్ పూర్తిగా నీట మునిగినట్లు యెమెన్ అధికారులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment