Missile attack
-
సిరియా సైనిక స్థావరాల్లో 80 శాతం ధ్వంసం
ఇజ్రాయెల్: సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో 80 శాతం ప్రాంతాలపై దాడి చేసి ఆ దేశ సైనిక సామర్థ్యాలను చావుదెబ్బతీశామని ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన అంతమైన కొద్ది రోజులకే సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై తమ సేనలు గురిపెట్టి పని పూర్తిచేశామని ఇజ్రాయెల్ తెలిపింది. గత 48 గంటల్లో 400కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న నిస్సైనీకరణ(బఫర్ జోన్) ప్రాంతంలోకి దళాలను పంపామని, 80 శాతం సిరియా సైనిక స్థావరాలను నేలమట్టంచేశామని వెల్లడించింది. ఆయుధ నిల్వలపై దాడి చేసి, అవి తిరుగుబాటుదారుల శక్తుల చేతుల్లో పడకుండా నిరోధించామని తెలిపింది. అన్ని రకాల ఆయుధాలు ధ్వంసం ‘‘అల్–బైదా పోర్టు, లటాకియా పోర్టు, డమాస్కస్, ఇతర కీలక నగరాల్లో శత్రు వుల యుద్ధవిమానాలను కూల్చే ఆయుధ వ్యవస్థలు, ఆయుధాగారాలకు చెందిన 15 నావికాదళ నౌకలను ధ్వంసం చేశాం. సముద్రతలంపై 80 నుంచి 190 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు సముద్రతలం నుంచి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసంచేశాం. స్కడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, ఉపరితలం నుంచి సముద్రం వరకు, ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణు లు, మానవసహిత యుద్ధ వాహకాలు (యూఏవీ), యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రాడార్లు, ట్యాంకులు, హ్యాంగర్లు తదితర వ్యూహాత్మక ఆస్తులను నిరీ్వర్యం చేశాం’’అని సిరియా సైన్యం పేర్కొంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వందలాది దాడులు చేసింది.అసద్ పతనంపై నెతన్యాహు ఏమన్నారంటే..అసద్ పాలన అంతమై రోజు చారిత్రాత్మకమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్, అసద్‌లకు ప్రధాన మద్దతుదారులైన హెజ్బొల్లాలను తాము చావు దెబ్బ కొట్టిన ఫలితమే అసద్ పాలన అంతానికి అసలు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలనుకునేవారికి స్వేచ్ఛ, సాధికారత ఇజ్రాయెల్ కలి్పంచిందని ఆయన ఒక వీడియో ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను, ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనా హమాస్ కీలక నేతలను, లెబనాన్ హెజ్బొల్లా సీనియర్ నాయకులను ఇజ్రాయెల్ వరసబెట్టి అనూహ్య దాడుల్లో అంతంచేయడం తెల్సిందే. -
బైడెన్ గ్రీన్‌సిగ్నల్..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు
కీవ్: అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్రేంజ్ ఆర్మీ ట్యాక్టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్‌ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.రష్యాపై లాంగ్రేంజ్ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యాతమ దేశంపైకి ఉక్రెయిన్ ఆరు అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్‌ను ధ్వంసం చేసింది.ధ్వంసమైన మిసైల్‌కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా -
టెల్ అవీవ్‌పై హెజ్బొల్లా దాడి.. విమాన సర్వీసుల నిలిపివేత
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ శివారులోని నిరిట్ ప్రాంతంలో మిసైల్స్‌తో దాడి చేశామని లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా గ్రూప్ ప్రకటించింది. హెజ్బొల్లా మిసైల్స్‌తో దాడులకు తెగపడిన సమయంలో టెల్ అవీవ్‌లో వైమానిక దాడి సైరన్లు మోగాయి. అయితే ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం గురించి పూర్తి సమాచారం తెలియరాలేదు.మరోవైపు.. హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో దాడి చేసిన సమయంలో చెలరేగిన పొగ.. లెబనాన్ మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్స్ (MEA) విమానానికి కమ్ముకుంది. ఈ విమానం బీరుట్-రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొంత సమయానికి ఆ విమానానికి పొగ కమ్ముకుంది. టెల్ అవీవ్ వైపు హెజ్బొల్లా క్షిపణులను ప్రయోగించటంతో బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలును అధికారులు నిలిపివేశారు. 🚨#BREAKING Hezbollah Strikes Tel Aviv: IOF Targets Its Own as Mossad HQ HitHezbollah has launched a direct strike on #TelAviv, hitting the Glilot Mossad base with ballistic missiles. In a failed interception, an Iron Dome missile fell on a civilian home, once again exposing… pic.twitter.com/lD6A4B7bYT— Al Fait Accompli (@AlFaitAccompli) October 22, 2024ఇజ్రాయెల్ 24 గంటల్లో లెబనాన్‌లోని 300 హెజ్బొల్లా లక్ష్యాలను ఢీకొట్టిన మరుసటి రోజే హెజ్బొల్లా దాడి చేసింది. మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం మధ్యప్రాచ్య పర్యటనను ఇజ్రాయెల్‌లో ప్రారంభించనున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని దక్షిణ శివారులోని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో సోమవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
Israel-Hamas war: గాజా మసీదుపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: పశ్చిమాసియాలోఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్ పట్టణంలో పాలస్తీనా పౌరులు ఆశ్రయం పొందుతున్న అల్–అక్సా అమరవీరుల మసీదుపై ఆదివారం ఉదయం బాంబుల వర్షం కురిపించింది. దాంతో కనీసం 19 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. డెయిర్ అల్–బలాహ్ సమీపంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై దాడుల్లో నలుగురు మృతిచెందారు. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మసీదు, పాఠశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జబాలియా దిగ్బంధం ఉత్తర గాజాలోని జబాలియా టౌన్‌ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను హెచ్చరించింది. జబాలియాపై వైమానిక, భూతల దాడులకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు జబాలియా వైపు కదులున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జబాలియాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం ఉంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ‘యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించాం’ అంటూ కరపత్రాలను జబాలియాలో జారవిడిచారు. ఉత్తర గాజాలో ఆదివారం భారీగా దాడులు జరిగినట్టు స్థానిక అధికారులు చెప్పారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. జబాలియాలో తమ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, తన తల్లిదండ్రులతోపాటు మొత్తం 12 మంది కుటుంబ సభ్యులు మరణించారని ఇమాద్ అలారాబిద్ అనేది వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ హమద్, అనస్ అల్–షరీఫ్ అనే జర్నలిస్టులు మృతిచెందారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరినీ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. బీరుట్లో ఆరుగురి మృతి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ దద్దరిల్లిపోతోంది. నగర దక్షిణ శివారు ప్రాంతమైన దాహియేపై సైన్యం విరుచుకుపడుతోంది. హెజ్»ొల్లా స్థావరాలే లక్ష్యంగా శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు సాగిస్తోంది. 30కిపైగా క్షిపణి దాడులు జరిగాయని, భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. సెపె్టంబర్ 23 తర్వాత ఇవే అతిపెద్ద దాడులని పేర్కొంది. గ్యాస్ స్టేషన్, ఔషధాల గోదాముతోపాటు ఒక ఆయుధాగారంపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించిందని వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. హెజ్»ొల్లా కూడా వెనక్కు తగ్గకుండా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక శిబిరాలపై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో గత రెండు వారాల్లో 1,400 మంది మృతిచెందారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది లెబనీయులు సిరియా చేరుకున్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించారని, 93 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది. -
పశ్చిమాసియా చిచ్చుకు బాధ్యులెవరు?
లెబనాన్‌పై దాడి, హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో ఇరాన్ విరుచుకు పడింది. వాటిలో అనేకాన్ని ఇజ్రాయెల్ కూల్చివేయగలిగిందిగానీ వాళ్ల నగరాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఇదే కొనసాగితే దారుణ విధ్వంసం తప్పదు. ఇప్పటికైనా దౌత్య యత్నాలు సాగుతాయా అన్నది ప్రశ్న. యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాదమనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది. అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది.ఇరాన్ ఈ నెల ఒకటవ తేదీ రాత్రి ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో దాడి చేసింది. అవి అగ్ని బాణాల వలె ఇజ్రాయెల్ పైకి దూసుకుపోయి కురుస్తుండటం ఆ రోజు రాత్రి ఆకాశంలో కనిపించి ప్రపంచమంతా ఊపిరి బిగ బట్టింది. ఇక రానున్న రోజులలో ఏమి కావచ్చునన్నది అందరి ఆందో ళన, భయం. ఇందుకు దోహదం చేసిన పరిణామాలు గత కొద్ది రోజు లలో చోటు చేసుకున్నాయి. హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేసింది. లెబనాన్‌పై దాడులు ప్రారంభించింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం నాడు ఒక వీడియో విడుదల చేస్తూ నేరుగా ఇరాన్‌ను ఉద్దేశించి రెండు కీలకమైన మాటలు అన్నారు. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ బలానికి అతీతమై నది కాదన్నది మొదటిది. ఇరానియన్ నాయకుల వల్లనే అక్కడి ప్రజలు పేదరికానికి, ఇతర సమస్యలకు గురవుతున్నారనీ, వారు లేకుంటే ఇరాన్ బాగా అభివృద్ధి చెందుతుందనీ, వారికి తమ నాయ కుల సమస్య త్వరలో తీరిపోతుందన్నదీ రెండవది. హెజ్బొల్లా అధినేత హత్య నేపథ్యంలో ఇటువంటి హెచ్చరికలతో ఇరాన్ అగ్ర నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని వెంటనే తాము సురక్షితమనుకునే రహస్య స్థావరానికి తరలించారు.త్వరత్వరగా చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి జరిపింది. ఇరాన్ వందలాది మిసైళ్లలో అనేకాన్ని ఇజ్రాయెల్‌తో అమెరికా నౌకా దళాలు కూల్చివేశాయి గానీ, మరెన్నో ఇజ్రాయెలీ నగరాలను, సైనిక స్థావరా లను ధ్వంసం చేశాయి కూడా. ఇది ఇంతటితో ఆగుతుందా, లేక యుద్ధం పెచ్చరిల్లుతుందా అనే ప్రశ్నకు సమాధానం ప్రధానంగా ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మాత్రం మంగళవారం రాత్రే ఒక ప్రకటన చేస్తూ, తమవైపు చర్యలు ప్రస్తుతానికి ఇంతటితో ఆపుతున్నామనీ, ఇజ్రాయెల్ వైఖరిని బట్టి తదుపరి చర్యలుంటాయనీ అన్నారు. మరొకవైపు ఇజ్రా యెల్ ప్రధాని, సైన్యాధిపతి తాము ప్రతీకారం తీర్చుకొనగల మన్నారు. లోగడ హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హానియేను తమ దేశంలోనే హత్య చేసినందుకు, అదే విధంగా తమ అగ్రశ్రేణి సైనిక బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిల్ఫరోషాన్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్లతో దాడి జరిపి, అది తమ హెచ్చరిక అని ప్రకటించింది. అపుడు కూడా ఇజ్రాయెల్ ప్రతీ కార ప్రకటనలు చేసింది. కానీ బయటి రాజ్యాలు ఇజ్రాయెల్ వైపు కొన్ని, ఇరాన్ వైపు కొన్ని దౌత్య యత్నాలు చేయటంతో అది అంత టితో నిలిచిపోయింది. ఇపుడు తిరిగి అటువంటి స్థితే తలెత్తుతున్నది. అయితే ఈసారి కూడా దౌత్య యత్నాలు సాగుతాయా లేక పరిస్థితి విషమిస్తుందా అన్నది ప్రశ్న. గతానికి, ఇప్పటికి కొన్ని తేడాలు ఉన్నా యన్నది గమనించవలసిన విషయం. పోయినసారివలె గాక ఇపుడు లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ అధినేతలను హత్య చేయగలమనే నర్మగర్భమైన హెచ్చరికలు చేసింది. పశ్చిమ దేశాల నౌకా బలాలు మధ్యధరాలో ప్రవేశించటమేగాక, ఇరాన్ మిసైళ్లను ఎదుర్కొనే రూపంలో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొ న్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతును మరొకమారు ప్రకటించారు. ఇవీ తేడాలు. కనుక, రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు. లేదా జరగక పోవచ్చు. అన్ని వివాదాలకు, ఘర్షణలకు, యుద్ధాలకు కారణమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానిదే ఏదీ ఆగబోదన్నది మౌలిక విషయం. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయా లున్నాయి. మొదటిది–గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం. హమాస్ దళాలు గత అక్టోబర్‌లో తమ భూభాగంపై దాడి జరిపి సుమారు 1,200 మంది పౌరులను హత్య చేశారన్న దాన్ని సాకుగా చేసుకుని ఇప్పటికే ఇజ్రాయెల్ 42,000 మంది పాలస్తీనియన్లను గాజాలో చంపివేసింది. గాజాకు సంబంధించి మరొక స్థాయిలో ఇజ్రాయెల్ చెప్తున్నది, అక్కడ తమ సైనిక నియంత్రణ ఇక శాశ్వతంగా ఉంటుంది. పాలస్తీనియన్లే పాలించినా పర్యవేక్షణ తమదవుతుంది. ఐక్యరాజ్య సమితి సైతం వ్యతిరేకిస్తున్నా, అసలు వెస్ట్ బ్యాంక్ మొత్తంగా ఇజ్రాయెల్‌లో భాగమే, తమదే అనటం రెండవది! పాలస్తీనియన్లకు మద్దతుగా హెజ్బొల్లాతో పాటు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ తదితర దేశాల మిలిటెంట్లు ఎన్ని నష్టాలనైనా ఎదుర్కొంటూ నిలవడమన్నది మూడవ ముఖ్యమైన విషయం. లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నాల్గవ ముఖ్య విషయం. ఇక చివరిది ఇరాన్. వారి సైనిక బలం సంఖ్య రీత్యా ఇజ్రాయెల్‌ను మించినదే అయినా, వైమానిక బలం, సాంకేతిక శక్తి అందుకు సాటిరావు. పైగా, ఉక్రెయిన్‌లో వలెనే ఇక్కడ కూడా మొత్తం అమెరికా కూటమి తమ ఆయుధ శక్తి, ధన బలంతో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. రెండు దేశాల మధ్య భూతల యుద్ధం జరిగితే ఇరాన్‌ది పైచేయి కావచ్చునేమోగానీ, మధ్యలో సిరియా, జోర్డాన్, ఇరాక్ భూభాగాలు ఉన్నందున అది వీలయ్యేది కాదు. అందువల్ల క్షిపణులు, యుద్ధ విమానాలపై ఆధారపడాలి.అంతమాత్రాన ఇజ్రాయెల్ గెలిచి తీరుతుందని కాదు. ఫలితం ఎట్లున్నా... ఇరాన్‌తో పాటు పాలస్తీనియన్లు, హెజ్బొల్లా, హౌతీలు, లెబనాన్‌తో పాటు ఇరాకీ మిలిటెంట్లు ఒకేసారి విరుచుకుపడితే ఇజ్రా యెల్‌కు తీవ్ర నష్టాలు తప్పవు. పైగా, ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధాలు జరిగినప్పుడల్లా ప్రపంచమంతటి నుంచి ముస్లిం యువకులు వేలాదిగా వెళ్లి పాల్గొనటాన్ని చూశాము. దీనంతటి పర్యవసానం యుద్ధం పూర్తి స్థాయికి పరిణమించటం.అట్లా జరగకుండా ఉండాలంటే ఏకైక మార్గం దౌత్య యత్నాలు! అయితే, అమెరికా కూటమి బాహాటంగా ఇజ్రాయెల్‌తో నిలవటం, గాజా యుద్ధాన్ని ఆపించక పోవటమేగాక ఐక్యరాజ్యసమితిని, ప్రపంచాభిప్రాయాన్ని తోసిరాజంటోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌తో ముడిపడి వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు అటువంటివి. సుమారు 120 సంవత్సరాల క్రితం మొదలై, 80 ఏళ్ల నుంచి క్రమంగా జటిలంగా మారుతూ, మరొక 20 ఏళ్లకు కొరకరానికొయ్య అయిపోయిన ఈ సమస్యకు మొట్టమొదటి నుంచి కూడా ఏకైక కారణం వారి ప్రయోజనాలే. 1948కి ముందు అసలు లేనే లేని ఇజ్రాయెల్ సృష్టిని, యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో ఆమోదించి పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాద మనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది.అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. పశ్చిమం చిచ్చును సృష్టించింది. దీన్ని ఇన్ని దశాబ్దాలుగా సాగిస్తున్నది వారు మాత్రమేనని మరొకసారి చెప్పనక్కర లేదు. ముఖ్యంగా గాజా మారణహోమం నుంచి మొదలుకొని జరుగుతున్నదేమిటో ఇజ్రా యెల్, అమెరికాలు గుర్తించక తప్పదు. వారు తమ ఆయుధ బలంతో పైచేయి సాధిస్తుండవచ్చుగాక. కానీ, ప్రపంచం దృష్టిలోనే గాక అంత ర్జాతీయ సంస్థల ఎదుట గతంలో ఎన్నడూ లేనంతగా ఏకాకు లయ్యారు. వియత్నాం యుద్ధం తర్వాత అంతటి వ్యతిరేకతను, ఏహ్యతను తిరిగి 50 ఏళ్ల తర్వాత చూస్తున్నాము. అపుడు జరిగిన అమెరికా క్యాంపస్ ప్రదర్శనలు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనంతటి నుంచి ఇజ్రాయెల్, అమెరికాలు పాఠాలు నేర్చుకుంటే వారికే మంచిది. చరిత్రలో అనేక సామ్రాజ్యాలు బలంతో విర్రవీగి నేల కూలాయి. అమెరికా సైతం నెమ్మదిగా అదే దిశలో పయనిస్తున్నదని పలువురు పాశ్చాత్య మేధావులే హెచ్చరిస్తున్నారు కూడా!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇజ్రాయెల్‌లో మా వాళ్లు ఎలా ఉన్నారో?
ఆర్మూర్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్ దేశానికి వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల కుటుంబాలు ఇక్కడ భయాందోళనలకు గురవుతు న్నాయి. తమ వారికి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు సైతం భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊళ్లలో సరైన పనులు దొరక్క నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల జిల్లాలతో పాటు తెలంగాణవ్యాప్తంగా సుమారు 800 మంది ఇజ్రాయెల్‌లో ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరిలో పలువురు ఇజ్రాయెల్ వాసుల ఇళ్లలో కేర్టేకర్లుగా పనులు చేస్తున్నారు. మరో వైపు ఆ దేశంలో సుమారు ఐదు వేల మంది తెలుగు వారు వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నివాసం ఉంటున్నారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డ కార్మికులు ఇప్పుడు ఏడాది కాలంగా యుద్ధ పరిస్థితులతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయె ల్లోని రమద్‌గాన్ పట్టణం తలవిల ప్రాంతంలో అత్య«ధికంగా తెలంగాణ వాసులు నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లు తోందని తెలంగాణ వాసులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల్లో భాగంగా బాంబుల దాడి సమయంలో అధికారులు సైరన్ మోగిస్తారు. వెంటనే ప్రజలు ఇళ్లు, అపార్ట్మెంట్లలో పటిష్టంగా నిర్మించిన బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకుంటారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నాం.. బుధవారం ఇక్కడ నూతన సంవత్సరం. అందరం సామూహిక ప్రార్థనల్లో ఉన్నాం. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి టెల్ అవీవ్ పరిసరాల్లో సుమారు ఐదువేల మంది వరకు ఇక్కడ వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతానికి మాకు భయమేమీ లేదు. భద్రంగానే ఉన్నాం. ఏదైనా ముప్పు ఉంటే ముందే హెచ్చరిస్తారు. బంకర్లు సిద్ధంగా ఉన్నాయి. – లాజరస్ కొల్లాబత్తుల(ఇజ్రాయెల్), మల్కిపురం, కోనసీమ జిల్లా, ఏపీ రక్షణ చర్యలు చేపట్టారుఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరుల రక్షణకు గట్టి చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల తెలంగాణ వాసులు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. – సోమ రవి,తెలంగాణ – ఇజ్రాయెల్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుభద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాము..ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించిన ప్రకారం భద్రతాపరమైన చర్య లను తీసుకుంటున్నాం. దాడులు సరిహద్దు ల్లోనే జరుగుతున్నాయి కాబట్టి మాకు ప్రాణభయం లేదు. కోవిడ్‌లో ఉపాధి లభించక ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు యుద్ధం కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. – శ్రీనివాస్ (ఇజ్రాయెల్), అమ్దాపూర్, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం -
మా దాడులు ముగిశాయి: ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై తమ దాడులు ముగిశాయని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగకపోతే మా దాడులు ముగిసినట్లేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభిస్తే తాము మరింత తీవ్రంగా, శక్తివంతంగా స్పందిస్తామని తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమతి భద్రతామండలి బుధవారం(అక్టోబర్2) మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులపై సమావేశం నిర్వహించనుంది. ఇరాన్ యుద్ధానికి దిగే దేశం కాదు: అధ్యక్షుడుఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే దాడులు చేశామని, ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అలర్ట్ -
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది. దాంతో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తుంది. బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ తీవ్రంగా విరుచుపడుతున్నట్టు సమాచారం. ఈ దాడికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. దీంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 400లకు మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇక తాజా పరిస్ధితిపై అమెరికా వైట్ హౌస్ స్పంధించింది. ఇరాన్ దాడిపై బైడెన్, కమలా హారిస్ సమీక్షిస్తున్నారు. మిస్సైళ్ల దాడి నుంచి సామాన్య ప్రజలను రక్షించాలని బైడెన్ అమెరికా ఆర్మీని ఆదేశించారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో 51 మంది మృతి
టెల్ అవీవ్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల దాడి మూడోరోజు బుధవారం కూడా కొనసాగింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోగా, 223 గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు. హెజ్బొల్లా అగ్రనాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో సోమ, మంగళవారాల్లో 564 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం తెలిపారు.మొస్సాద్ ప్రధాన కార్యాలయం పైకి.. హెజ్బొల్లా బుధవారం ఇజ్రాయెల్‌పైకి డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది. ఏకంగా టెల్ అవీవ్‌లోని నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైకి ఖాదర్–1 బాలిస్టిక్ మిసై్పల్ను ప్రయోగించినట్టు ప్రకటించింది. టెల్ అవీవ్‌లో, సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. దాంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భూతలం నుంచి భూతల లక్ష్యంపైకి ప్రయోగించిన క్షిపణిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి సెంట్రల్ ఇజ్రాయెల్‌ను చేరుకోవడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
ఇద్దరు టాప్ కమాండర్ల మృతి
బీరుట్: బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర క్షిపణి దాడిలో హెజ్బొల్లా విభాగం ఎలైట్ రద్వాన్ ఫోర్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్ మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో సీనియర్ కమాండర్ అహ్మద్ వహబీ కూడా చనిపోయినట్లు ప్రకటించింది. ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుందని తెలిపింది. వీరిలో ఏడుగు రు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నట్లు వివరించింది. క్షతగాత్రులైన 68 మందిలో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియడ్ శనివారం చెప్పారు. మరో 23 మంది జాడ తెలియడం లేదన్నారు. నేలమట్టమైన అపార్టుమెంట్ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని మంత్రి పేర్కొ న్నారు. కాగా, శుక్రవారం తమ దాడిలో హెజ్బొల్లాకు చెందిన 16 మంది హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. హెజ్బొల్లా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.శనివారం హెజ్బొల్లా మీడియా విభాగం జర్నలిస్టులను ఘటనాస్థలికి తీసుకెళ్లింది. మొత్తం 16 అపార్టుమెంట్లున్న ఆ సముదాయంలో క్షిపణి దాడి తీవ్రతకు మిలిటెంట్ల సమావేశం జరిగిన పక్క అపార్టుమెంట్ కూడా దెబ్బతింది. క్షిపణి భవనాన్ని చీల్చుకుంటూ నేరుగా బేస్మెంట్లోకి దూసుకుపోయిందని ఏఎఫ్‌పీ తెలిపింది. ఆ సమీపంలోని పలు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిన ఘటనల్లో గాయపడిన వారితో దేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయని ఆరోగ్య మంత్రి ఫిరాస్ చెప్పారు.అకీల్‌పైనే ఎందుకు గురి?ఇబ్రహీం అకీల్ ప్రధాన లక్ష్యంగా శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. బీరుట్‌లోని తమ ఎంబసీపై 1983లో జరిగిన దాడికి అకీలే సూత్రధారి అని అమెరికా అనుమానం. అప్పటి నుంచి అతడిని హిట్‌లిస్టులో ఉంచింది. పట్టిచ్చిన/ జాడ తెలిపిన వారికి 70 లక్షల డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. బీరుట్‌లోని జనసమ్మర్థం ఉండే ప్రాంతంలోని ఆ అపార్టుమెంట్ సముదాయం బేస్మెంట్లో అకీల్ మిలిటెంట్లతో సమావేశమైనట్లు తమ కు ముందుగానే సమాచారం అందిందని శుక్రవారం ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు దాడి చేపట్టామని వెల్లడించింది. కాగా, హెజ్బొల్లా కార్యకలాపాల్లో దశాబ్దాలుగా మహ్మద్ వహబీ కీలకంగా ఉన్నాడు. ఇతడిని ఇజ్రాయెల్ 1984లో బంధించి జైలులో ఉంచింది. 1997లో దక్షిణ లెబనాన్‌లో 12 మంది ఇజ్రాయెల్ సైనికులను చంపిన ఫీల్డ్ కమాండర్లలో వహబీ ఒకరని చెబుతారు. లెబనాన్‌పై మరిన్ని దాడులులెబనాన్ దక్షిణ ప్రాంతంపై శనివారం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగించింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని తెలిపింది. హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పైకి పెద్ద సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. వాటితో వాటిల్లిన నష్టమెంతో తెలియాల్సి ఉంది. -
ఇజ్రాయెల్‌పై మిసైల్ దాడి
జెరూసలెం: ఇజ్రాయెల్‌పై హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఆదివారం(సెప్టెంబర్15) ఉదయం మిసైల్‌తో దాడి చేశారు.యెమెన్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.తూర్పు వైపు నుంచి మిసైల్ దూసుకువచ్చింది. అది ఓ బహిరంగ ప్రదేశంలో పడింది. మిసైల్ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలవలేదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.మిసైల్ దాడి కారణంగా రాజధాని టెల్అవీవ్తో పాటు సెంట్రల్ ఇజజ్రాయెల్లో సైరన్ అలర్ట్ మోగింది. దీంతో పౌరులు సురకక్షిత పప్రాంతాల్లో తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు.క్షిపణి దాడితో భారీ శబ్దాలు వచ్చాయని, ఐరన్‌డోమ్ వ్యవస్థ క్షిపణిపై దాడి చేయడం వల్లే ఈ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.కాగా, జులైలో యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్లు రాజధాని టెల్‌అవీవ్‌పై చేసిన డ్రోన్ దాడిలో ఓ పౌరుడు మృతి చెందాడు. ఇరాన్ మద్దతుతోనే హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి..పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి -
Russia-Ukraine war: 150పైగా డ్రోన్లు కూల్చేశాం: రష్యా
మాస్కో: ఉక్రెయిన్ తమపైకి భారీ సంఖ్యలో డ్రోన్ల దాడికి పాల్పడిందని రష్యా పేర్కొంది. శనివారం రాత్రి మొత్తం 158 డ్రోన్లను కూల్చేశామని రష్యా ఆర్మీ తెలిపింది. ఇందులో రాజధాని మాస్కోపైకి రెండు, పరిసరప్రాంతాలపైకి మరో దూసుకువచ్చిన తొమ్మిది డ్రోన్లు కూడా ఉన్నాయంది. సరిహద్దులకు సమీపంలోని ఉక్రెయిన్ బలగాలు ప్రస్తుతం తిష్ట వేసిన కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్లు, బ్రియాన్‌స్‌్కలో 34, వొరెనెజ్‌లో 28 డ్రోన్లతోపాటు, బెల్గొరోడ్పైకి వచి్చన మరో 14 డ్రోన్లను కూలి్చనట్లు వివరించింది. సుదూర ట్వెర్, ఇరనొవో సహా మొత్తం 15 రీజియన్లపైకి ఇవి దూసుకొచ్చాయని తెలిపింది. మాస్కో గగనతలంలో ధ్వంసం చేసిన డ్రోన్ శకలాలు పడి ఆయిల్ డిపోలో మంటలు రేగాయని మేయర్ చెప్పారు. బెల్గొరోడ్ రాజధాని ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణితో 9 మందికి గాయాలయ్యాయి. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ రిజియన్‌లోని పివ్నిచ్నె, వ్యింకా పట్టణాలు తమ వశమయ్యాయని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. కురకోవ్ నగరంపై రష్యా క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా మరో 9 మంది క్షతగాత్రులయ్యారు. శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన 11 క్షిపణుల్లో ఎనిమిదింటిని కూలి్చవేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఖరీ్కవ్పై రష్యా ఆర్మీ ఆదివారం చేపట్టిన దాడుల్లో 41మంది గాయపడ్డారు. -
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య మిసైల్స్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మిసైల్స్‌తో మెరుపుదాడి చేసింది. హిజ్బుల్లా ఉగ్రసంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎందుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం లెబనాన్‌లో ముందస్తు దాడులను చేపట్టింది. సుమారు 40 మిసైల్స్‌ను లెబనాన్‌పై ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా వెంటనే స్పందించిన హిజ్బుల్లా ఉగ్రసంస్థ.. ఇజ్రాయెల్‌పై సుమారు 320 కట్యూషా రాకెట్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.🇮🇱 🇱🇧 Following large scale attacks on Hezbollah, Israel has stated that in conjunction with the U.S., intelligence was uncovered pointing to an imminent large scale attack. Throughout Tel Aviv and Jerusalem shelters have been opened, airports have suspended normal procedures,… pic.twitter.com/9skRJyAWUe— Americas News (@AmericasNewsCO) August 25, 2024 ‘‘తమ సైనిక కమాండర్ ఫువాద్ షుక్ర్ హత్యకు ప్రతిస్పందనగా ఈ దాడులకు దిగాం. ప్రత్యేక సైనిక స్థావరాలే లక్ష్యంంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర సైనిక స్థావరాలపై దాడి చేశాం’’ అని ఉగ్రసంస్థ హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు అత్యవసర పరిస్థితిని రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించారు. అయితే హిజ్బుల్లా లక్ష్వంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ముందు రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఫోన్ లాయిడ్ ఆస్టిన్‌తో మాట్లడినట్లు తెలుస్తోంది. ‘‘ఇజ్రాయెల్ పౌరులపై దాడుల ముప్పును అడ్డుకోవడానికి లెబనాన్‌లోని హిజ్బుల్లా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించాం. బీరూట్‌లోని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇజ్రాయెల్ పౌరుల రక్షణ కోసం మేము అన్ని మార్గాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం’’ అని గాలంట్ పేర్కొన్నట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా వెల్లడించింది.JUST IN ⤵️⤵️pic.twitter.com/0QG60D787QHundreds #Hezbollah rocket and drone attacks targeting northern #Israel https://t.co/OktRoPt9g4— -🇦🇺|🇺🇲- (@KINGDEMANACATOS) August 25, 2024 ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. మరో యుద్ధం మొదలైతే మరింత ప్రమాదం తప్పదన్న తీవ్ర భయాందోళనలు గతకొంత కాలంగా వ్యక్తమవుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడూ దాడులకు దిగిన హిజ్బుల్లా ప్రస్తుత దాడుల తీవ్రతను గమనిస్తే.. నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.☄️#BREAKING We have FOOTAGE of ENDLESS Rocket 🚀 attacks HAPPENING NOW in Israel!They are under ATTACK!#Israel#Lebanon pic.twitter.com/0ztlimgxH1— Galaxy News United(GNU) (@GalaxyNewsUnit) August 25, 2024 -
ఉక్రెయిన్ రాజధానిపై మిసైల్ దాడులు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి రష్యా మిసైల్ దాడులకు దిగింది. రష్యా నుంచి వచ్చిన బాలిస్టిక్ మిసైళ్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. దాడుల విషయాన్ని కీవ్ నగర మేయర్ కిట్ష్కో నిర్ధారించారు. కీవ్‌పై ఎయిర్ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. కీవ్ శివార్లలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టమేమైనా జరిగిందా లేదా అనేది తెలియరాలేదు. కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 నుంచి జరుగుతోంది. -
Israel-Hamas war: గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్–అల్–బలాహ్: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న అల్–తబీన్ స్కూల్‌పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా డజన్ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్‌తో 10 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. స్కూల్లోని హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ప్రకటనను హమాస్ ఖండించింది. దాడి తీవ్రతకు విశాలమైన ఆ పాఠశాల భవనం శిథిలాల దిబ్బగా మారి, గ్రౌండ్ ఫ్లోర్లో మొండిగోడలు మాత్రమే మిగిలున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. 100కు మృతదేహాలను స్థానికులు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ ఫదెల్ నయీమ్ చెప్పారు. స్కూలు భవనంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా హెచ్చరికల్లేకుండా ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు 6 వేల మంది తలదాచుకుంటున్న ఈ భవనంపై 3 క్షిపణులు పడ్డాయని అధికారులు చెప్పారు. చాలా మృతదేహాలు గుర్తు పట్టేందుకు కూడా వీలులేనంతా ఛిద్రమయ్యాయన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. -
క్షిపణి దాడిలోనే హనియె చనిపోయారు
జెరూసలేం: హమాస్ రాజకీయ విభా గం చీఫ్ ఇస్మాయిల్ హనియె మృతికి స్వల్ప శ్రేణి క్షిపణి దాడే కారణమని ఇరాన్ సైన్యంలో అత్యంత కీలకమైన రివల్యూ షనరీ గార్డ్స్ విభాగం ప్రకటించింది. అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి తెగబడిందని శనివారం ఆరోపించింది. ‘‘హనియె బస చేసిన భవనాన్ని 7 కిలోల బరువున్న పేలుడు పదార్థంతో కూడిన రాకెట్ తాకింది. దాంతో భవనం ధ్వంసమైంది’’ అని తెలిపింది. యుద్ధోన్మాద ఇజ్రాయెల్‌కు తగు సమయంలో తగు రీతిలో దీటుగా బుద్ధి చెబుతామని హెచ్చరించింది. అయితే దాడి జరిగిన ప్రాంతం తదితరాలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
‘సుదర్శన్ ఎస్-400’ పరీక్ష విజయవంతం
భారత వైమానిక దళం ‘సుదర్శన్ ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి ‘సుదర్శన్ ఎస్-400’ను తయారుచేసినట్లు చెప్పారు.ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..‘సుదర్శన్ ఎస్-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా-భారత్ కలిసి వీటిని ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్లు సిద్ధం అవుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!సుదర్శన్ ఎస్-400 ఐదు స్క్వాడ్రన్ల కోసం గతంలో రెండు దేశాలు రూ.35,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎంఆర్-సామ్ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ దళంలో చేరింది. దాంతోపాటు ‘ఇజ్రాయెలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్’ క్షిపణి వ్యవస్థ సైతం ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది. తాజాగా ఎస్-400 కూడా వాటికి తోడవడంతో వైమానిక దళం గేమ్ ఛేంజర్‌గా మారిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కుషా’తో మరింత సమర్థవంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు భద్రతపై గతంలోనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. -
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
ఉక్రెయిన్‌పై రష్యా మిసైల్స్ దాడి.. 20 మందికిపైగా మృతి
కీవ్: రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని పలు సిటీలు టార్గెట్‌గా భీకర దాడులకు తెగపడింది. సోమవారం ఉక్రెయిన్ నగరాలపై పదుల సంఖ్యలో మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఉకక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ చిన్న పిల్లల హాస్పిటల్‌పై మిసైల్స్‌తో దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. ఇక్కడితో ఆగకుండా క్రైవీ రిహ్ సిటీలోని సెంట్రల్ యూనివర్సిటీపై మరోదాడి చేశారు. ఈ మిసైల్స్ దాడిలో 10 మంది మృతి చెందారు. ‘‘ఉక్రెయిన్‌లోని ఐదు సిటీలను రష్యా సైనికులు టార్గెట్ చేశారు. పలు భవనాలు, అపార్టుమెంట్లపై 40కి పైగా మిసైల్స్ ప్రయోగించారు. ప్రపంచం ప్రస్తుతం మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే రష్యా ఏంటో, ఆ దేశం ఎలాంటి దాడులో చేస్తోందో ప్రపంచం మొత్తం గమనించాలి’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు.‘రష్యా సైన్యం సోమవారం చేసిన దాడుల్లో సుమారు 20కిపైగా మంది మృతి చెందారు. మిసైల్ దాడుల్లో సుమారు 50 మంది గాయపడ్డారు’అని ఉక్రెయిన్ మంత్రి ఇహోర్ క్లైమెన్కో తెలిపారు.క్రైవీ రిహ్ నగరంలో జరిగిన దాడుల్లో 10 మంది మృతి చెందగా 31 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ ఒక్కసారిగా పెద్దఎత్తున మిసైల్స్ దాడి జరిగిందని అధికారుల వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో మూడు రోజుల నాటో సమావేశాల నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో మెరుపుదాడులకు దిగటం గమనార్హం. -
Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో దాడులు..
కీవ్: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమణలో ఉన్న ఖెర్సన్, లుహాన్స్క్లపై జరిగిన దాడుల్లో కనీసం 28 మంది మృతి చెందారు. ఖెర్సన్‌లోని సడోవ్ పట్టణంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గైడెడ్ బాంబు, క్షిపణి దాడుల్లో 22 మంది చనిపోగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా, లుహాన్స్క్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతోపాటు, కుబాన్, అస్ట్రఖాన్,, తుల, క్రిమియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత జపొరిఝియాకు 900 కిలోమీటర్ల దూరంలోని కాకసస్ నార్త్ ఒస్సేతియాలోని సైనిక స్థావరం లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు వివరించింది. -
Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. రష్యా 32 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
Houthi Rebels: చైనా ఆయిల్ నౌకపై ‘హౌతీ’ల దాడి
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు దాడులు పెంచారు. తాజాగా శనివారం(మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై హౌతీలు బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) ఆదివారం(మార్చ్ 24) ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది. MARCH 23 RED SEA UPDATE From 2:50 to 4:30 a.m. (Sanaa time) March 23, the Iranian-backed Houthis launched four anti-ship ballistic missiles (ASBM) into the Red Sea in the vicinity of M/V Huang Pu, a Panamanian-flagged, Chinese-owned, Chinese-operated oil tanker. At 4:25 p.m.… pic.twitter.com/n1RwYdW87E — U.S. Central Command (@CENTCOM) March 24, 2024 ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ 30 నిమిషాల్లో వాటిని ఆర్పివేశారు. అనంతరం నౌక మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. చైనా, భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు తాజా దాడితో మాట తప్పారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతోంది. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తన్నాయి. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే ! -
హౌతీల దాడి.. భారత యుద్ధనౌక సాహసం
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి.. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని భారత యుద్ద నౌక కాపాడింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో యెమెన్ హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్ఎస్ కోల్‌కతా.. 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. #IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden. Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp — SpokespersonNavy (@indiannavy) March 7, 2024 ఇందుకోసం ఐఎన్‌ఎస్‌లోని హెలికాప్టర్, బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో.. ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్నివారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికా దళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహరా కాస్తోంది. ఇదిలా ఉంటే.. యూరప్‌తో ఆసియా, మిడిల్ ఈస్ట్‌ను కలిపే ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నవంబర్ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్‌కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది.