
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది.
బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి.
హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్‌కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment