
ఇరాన్ వెల్లడి
ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌కు హెచ్చరిక
జెరూసలేం: హమాస్ రాజకీయ విభా గం చీఫ్ ఇస్మాయిల్ హనియె మృతికి స్వల్ప శ్రేణి క్షిపణి దాడే కారణమని ఇరాన్ సైన్యంలో అత్యంత కీలకమైన రివల్యూ షనరీ గార్డ్స్ విభాగం ప్రకటించింది. అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి తెగబడిందని శనివారం ఆరోపించింది.
‘‘హనియె బస చేసిన భవనాన్ని 7 కిలోల బరువున్న పేలుడు పదార్థంతో కూడిన రాకెట్ తాకింది. దాంతో భవనం ధ్వంసమైంది’’ అని తెలిపింది. యుద్ధోన్మాద ఇజ్రాయెల్‌కు తగు సమయంలో తగు రీతిలో దీటుగా బుద్ధి చెబుతామని హెచ్చరించింది. అయితే దాడి జరిగిన ప్రాంతం తదితరాలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.