
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్‌మెంట్ పూర్తి కానుంది.
వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్‌మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.
ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది.
Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB
— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025