
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) దాదాపు అన్ని దేశాలపైన సుంకాలు విధించారు. మనుషులున్న దేశాలు లేదా ప్రాంతాలపై సుంకాలు విధిస్తే సరే అనుకోవచ్చు.. కానీ మనుషులే లేని దీవులపై కూడా సుంకాలు విధించడం చర్చనీయాంశమైంది.
ట్రంప్ సుంకాలు విధించిన ప్రాంతాల జాబితాలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అధీనంలో ఉన్న హియర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు కూడా ఉన్నాయి. నిజానికి ఈ దీవులు పెంగ్విన్ పక్షులు, సీల్స్, వివిధ పక్షి జాతులకు మాత్రమే నిలయం. ఈ దీవులపై ట్రంప్ సుంకాలను విధించారు.. కానీ ఎందుకు విధించారనే సంగతి చెప్పలేదు.
ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు సుమారు 4100 కిమీ దూరంలో ఉన్న ఈ హియర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు 1947 నుంచి ఆస్ట్రేలియా భూభాగంగా ఉన్నాయి. భూమిపై అత్యంత మారుమూల ఉన్న ఈ ప్రాంతాల్లో జనావాసం ఉండదు. ఈ దీవులను సముద్రం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక నౌకలను ఉపయోగించి ప్రయాణం చేయడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.
ఎవరూ నివసించని దీవులపై ట్రంప్ ప్రభుత్వం 10 శాతం సుంకం విధించడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెంగ్విన్ పక్షుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారా? అని ఒకరు కామెంట్ చేస్తే.. అమెరికా ఇప్పుడు చేపలపై కూడా సుంకాలు విధిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.
భారత్‌పై 26 శాతం
ప్రపంచంలోని చాలా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ భారతదేశం మీద కూడా 26 శాతం సుంకం ప్రకటయించారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో తాము సగం మాత్రమే విధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ మామీద 52 శాతం సుంకం విధించింది. మేము ఇండియాపై 26 శాతం సుంకం విధిస్తున్నామని ఆయన అన్నారు. అమెరికా అత్యధిక సుంకం విధించిన దేశాలలో కంబోడియా (49 శాతం) ఉంది.
Trump administration has put a 10 percent tariff on the Heard and McDonald Islands….
which has a population of 0 people and is inhabited only by penguins. pic.twitter.com/oSx7LyU0b3— MaineWonk (@TheMaineWonk) April 2, 2025