హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని గాజాను విచ్ఛిన్నం చేసిన ఇజ్రాయెల్.. తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని సిరియా యాక్టివేట్ చేసింది. అయితే.. ఈ దాడుల్లో డమాస్కస్ ఎయిర్‌పోర్ట్ వద్ద నలుగురు, అలెప్పో వద్ద ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
దాడుల వల్ల విమానాశ్రయం దెబ్బతినడంతో రాకపోకలను రద్దు చేసినట్లు సిరియా వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాల్లో విమానాలను గ్రౌండింగ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.
పొరుగు దేశమైన సిరియాతో కూడా ఇజ్రాయెల్ దశాబ్దాలుగా పోరాడుతోంది. ప్రధానంగా ఇరాన్ మద్దతిస్తున్న హిజ్బుల్లా ఫైటర్స్‌తోపాటు సిరియా ఆర్మీని కూడా టార్గెట్ చేసింది. అయితే ఎప్పుడూ కూడా సిరియాపై దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. కానీ, తాజాగా గురువారం సిరియాపై ఎయిర్‌స్ట్రైక్స్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు.. ఈ దాడులు రాబోయే రోజుల్లో ఉధృతంగా కొనసాగుతాయని పేర్కొంది.
Israeli Air Force attacked positions near Damascus airport.
— Pouria Zeraati (@pouriazeraati) October 12, 2023
The plane, flying from Iran to Syria, was forced to turn around.
According to some reports, the Iranian Regime’s Foreign Minister is scheduled to fly to Syria tomorrow.#Israel pic.twitter.com/WrC6g5K4Mw
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ సందర్శించారు. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. సిరియా బషర్ అల్ హసద్‌తో ఫక్షన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతిస్తున్న హమాస్ ఆధిపత్యం ఉన్న గాజాతోపాటు సిరియాపై కూడా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేయడం గమనార్హం.
ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు జరిగి నేటికి ఆరు రోజులు గడిచింది. ప్రతిదాడులతో హోరెత్తిస్తున్న ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌లో 1200 మందికి చంపేసింది. ఇందులో హమాస్ బలగాలతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తరపున కూడా ప్రాణనష్టం భారీగానే సంభవించింది. ఇరువైపులా ప్రాణ నష్టం 3వేలు దాటినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment