syria
-
సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా షరా
డమాస్కస్: సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా తిరుగుబాటు నేత అహ్మెద్ అల్ షరా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాత్కాలిక శాసనసభను ఏర్పాటు చేసే బాధ్యతను షరాకు అప్పగించినట్లు సిరియా సైనిక అధికారి హసన్ అబ్దెల్ ఘనీ ప్రకటించారు. షరా నాయ కత్వం వహిస్తున్న హయత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగు బాటు కూటమి మెరుపు దాడులు చేసి గత ఏడాది డిసెంబర్ ఎనిమిదో తేదీన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనకు చరమగీతం పాడిన విషయం విదితమే. -
బషర్ అసద్‌పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్‌కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్‌పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
అసద్ భార్యకు లుకేమియా
సిరియా తాజా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య అస్మా లుకేమియా (బ్లక్ క్యాన్సర్)తో పోరాడుతున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆమె బతికే అవకాశాలు సగమేనని సమాచారం. ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించేందుకు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్మా 2019లో రొమ్ము కేన్సర్ బారిన పడ్డారు. వ్యాధి నుంచి పూర్తిగా బయట పడ్డట్టు ఏడాది చికిత్స తరువాత ప్రకటించారు. కానీ కొంతకాలానికే ఆమెకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. అస్మా తల్లిదండ్రులు సిరియావాసులు. ఆమె 1975లో లండన్‌లో జన్మించారు. ఆమెకు బ్రిటిష్–సిరియా పౌరసత్వముంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఫ్రెంచ్ సాహిత్యం చదివారు. 2000 డిసెంబర్లో బషర్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు సిరియాలో తిరుగుబాటు మొదలైనప్పటి నుంచే ఆస్మా తన పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఇటీవల తిరుగుబాటు సేనలు దేశాన్ని ఆక్రమించుకోవడంతో అసద్ పదవీచ్యుతుడవడం తెలిసిందే. కుటుంబంతో సహా ఆయన రష్యాలో దలదాచుకుంటున్నారు. అయితే మాస్కో జీవితంపై అస్మా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. దేశం వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ రష్యా కోర్టుకు ఆమె పెట్టుకున్న దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు. అసద్ నుంచి విడాకుల కోసం కూడా అస్మా దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొచ్చినా వాటిని రష్యా ఖండించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిరియాలో మళ్లీ ఘర్షణ.. 17 మంది మృతి
డెమాస్కస్: సిరియాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భాగంగా 17 మంది మృతిచెందారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడిన ఓ అధికారిని అరెస్టు చేసే సమయంలో ఈ ఘర్షణ వెలుగు చూసింది.వివరాల ప్రకారం.. సిరియాలోని టార్టస్ ప్రావిన్స్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడిన ఓ అధికారిని అరెస్టు చేసేందుకు బలగాలు ప్రయత్నించే క్రమంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఘర్షణలో 17 మంది చనిపోయారని అక్కడి మీడియా తెలిపింది. ఇదే సమయంలో సిరియా కొత్త అధికారుల జనరల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 14 మంది చనిపోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.ఇదిలా ఉండగా.. ఇటీవల సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలసిందే. అనంతరం, రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించింది. మరోవైపు.. సిరియాలో తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసద్ హయాంలో పలు నేరాలకు పాల్పడిన అధికారులను టార్గెట్ చేస్తున్నారు. -
ఇజ్రాయెల్ సంచలన ప్రకటన.. ఇరాన్, సిరియా వార్నింగ్
టెహరాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా మీద తామే దాడిచేసి అంతమొందించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించడంతో ఇరాన్ ఘాటుగా స్పందించింది. హనియాను చంపడం హేయమైన ఉగ్రవాద చర్యగా ఇరాన్ వ్యాఖ్యానించింది.తాజాగా హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను తాము అంతమొందించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హూతీలపై కూడా ఇదే విధంగా దాడి చేస్తామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో హూతీ ఉగ్రవాదులు- ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. వారికి ఇదే మా హెచ్చరిక. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లాలను ఓడించాం. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇక హూతీలను తుదముట్టిస్తాం అని కామెంట్స్ చేశారు.దీంతో, కాట్జ్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవాని మాట్లాడుతూ.. హనియాను ఇజ్రాయెల్ చంపడం హేయమైన ఉగ్రవాద చర్య కిందికి వస్తుంది. ఇజ్రాయెల్ ఉగ్ర పాలన ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పుగా మారుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేయడంలో తప్పు ఏమీ లేదని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వ్యాఖ్యలపై తాజాగా సిరియా కూడా స్పందించింది. ఈ సందర్బంగా తమ దేశంలో గందరగోళం సృష్టించవద్దని సిరియా నూతన విదేశాంగశాఖ మంత్రి అసద్ హసన్ అల్-షిబానీ.. ఇరాన్‌ను హెచ్చరించారు. ఇదే సమయంలో సిరియా ప్రజల ఆకాంక్షను గౌరవించాలి అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్ చర్చల ప్రయత్నాలకు హనీయే నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 31న టెహ్రాన్‌లోని గెస్ట్‌హౌస్‌లో హనీయేను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. అలాగే, సెప్టెంబరు 27న, ఇజ్రాయెల్ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బీరూట్ బాంబు దాడిలో హతమార్చింది. దీని తర్వాత అక్టోబరు 16న గాజాలో హనీయే వారసుడు యాహ్యా సిన్వార్ హత్య జరిగింది. -
అసద్ భార్య విడాకుల పిటిషన్
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. -
సిరియా భవిష్యత్తు ఏమిటి?
సంక్షోభంలో కూరుకు పోయిన సిరియాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. 13 ఏళ్ల అంతర్యు ద్ధాన్ని, ఐదు దశాబ్దాల నియంతల కుటుంబ పాలనను చవిచూసిన ఆ దేశం ఇప్పుడు కొత్త గాలుల్ని పీల్చుకుంటోంది. జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. పాఠశాలలు తెరుచుకున్నాయి. పిల్లలు తరగతులకు హాజరవుతున్నారు. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు బయట కొచ్చారు. దాదాపు 7,600 మంది శరణార్థులుగా వెళ్లినవారు టర్కీ సరి హద్దుల మీదుగా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. సిరియాను 50 ఏళ్ల పాటు అసద్ కుటుంబమే పాలించింది. 2000 నుంచి మొన్న అధికారం కోల్పోయే వరకూ అసద్ పాలిస్తే అంతకు ముందు... 1970 నుంచి 2000 వరకూ అసద్ తండ్రి హఫీజ్ ఏలాడు. ఇద్దరూ నియంతలుగానే పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు 2011లో ప్రారంభమయ్యాయి. ఇవే అంతర్యుద్ధంగా రూపు దాల్చాయి. ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. రష్యా, ఇరాన్ దేశాల మిలటరీ; హెజ్బొల్లా ఆయుధాలతో దేశంలో 2/3 వంతు భూభాగంపై అసద్ తన పట్టు బిగించాడు. సొంత ప్రజలపైనే రసాయన, సిలిండర్ దాడులు చేయించి లక్షలాది మందిని జైళ్లపాలు చేశాడు. దాదాపు 3 లక్షల మంది దాకా జైళ్లలో మగ్గుతూ ఉంటారని అంచనా.అసద్ పాలనలో సిరియా దుర్భర పరిస్థితులను చవి చూసింది. 90 శాతం ప్రజలు దారిద్య్రరేఖ దిగువకి చేరారు. ప్రజలకు 24 గంటల కరెంట్ అందుబాటులో లేదు. మందులు లేవు. పెట్రోలుకి రేషన్ ఉంది. బ్రెడ్ కొనుక్కోవటానికి గంటల తరబడి లైన్లో నిలబడాలి. చాలా మందికి ఉపాధి లేదు. పొట్ట చేతపట్టుకుని ఎక్కడెక్కడికో వెళుతున్నారు. సిరియా పౌండ్ దాని విలువలో 99 శాతం కోల్పో యింది. రాజధాని నగరమైన డమాస్కస్ మినహా దేశం ఏ నగరాన్ని చూసినా ఇప్పుడు యుద్ధం మిగి ల్చిన విధ్వంసపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశాన్ని పునర్నిర్మించటానికి 250 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా.అసద్‌ను పదవి నుంచి తొలగించి సున్నీ పాలనను స్థాపించాలనే లక్ష్యంతో పోరాడిన హయత్ తహీర్ ఆల్ షమ్ (హెచ్‌టీఎస్) సంస్థ విజయం సాధించింది. రెండో తిరుగుబాటు బృందం సిరియన్ డెమాక్రటిక్ ఫోర్సెస్ కుర్దుల మిలటెంట్ల సమూహం. మూడోది అటు అసద్‌నూ, ఇటు కుర్దులనూ వ్యతి రేకించే సిరియన్ నేషనల్ ఆర్మీ. సిరియాలో రెబెల్ గ్రూపులకు ప్రధానంగా హెచ్‌టీఎస్‌కు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. సిరియన్ నేషనల్ ఆర్మీకి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైన్యాన్ని అందించటంతో పాటు రాజకీయంగా కూడా మద్దతుగా నిలిచింది. అలాగే సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూపునకు వ్యతిరేకంగా అమెరికా పోరాడుతోంది. సిరియా మిలటరీ స్థావరాలపై ఇటీవల కాలంలో అనేక మార్లు ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఆగ్నేయ ప్రాంతంలోని క్వెనిత్రా లోని రోడ్లు, విద్యుత్ ప్రసార సాధనాలు, వాటర్ నెటవర్క్స్ను ధ్వంసం చేసింది. తాము సిరియాలో ఉన్న ఇరాన్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తు న్నామని... ఆ దేశం ఈ దాడులను సమర్థించుకుంటోంది. అసద్‌ను పదవీచ్యుతుడిని చేసిన హెచ్‌టీఎస్ కమాండర్ ఇన్ ఛీఫ్ అహ్మద్ ఆల్ షారా సిరియా నాయకత్వ బాధ్యతలను మహ్మద్ అల్ బషర్ చేతిలో పెట్టారు. ఆయన ఇడిబ్ లోని సిరియన్ సాల్వేషన్ గ్రూపు (ఎస్ఎస్జీ) నాయకుడు. ప్రస్తుతం కేర్ టేకర్ ప్రభుత్వానికి బషర్ నాయకునిగా వ్యవహరిస్తారు. మార్చి 1 వరకూ ఆయన పదవిలో ఉంటారు. పౌర సేవలు సక్రమంగా అందటానికి, సాయుధ దళాల చేతిలోకి అధికార పగ్గాలు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఒకప్పుడు ఆల్ ఖైదాకు అనుబంధంగా పని చేసిన హెచ్‌టీఎస్‌ను తీవ్రవాద సంస్థగా ముద్ర వేసినా, ఇప్పుడు హెటీఎస్ నేతలతో బైడెన్ ప్రభుత్వం టచ్‌లో ఉంటోంది. యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ దీనిపై మాట్లాడారు. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.– డా‘‘ పార్థసారథి చిరువోలు,సీనియర్ జర్నలిస్టు -
సిరియాపై ట్రంప్ వ్యాఖ్యలు.. టర్కీ కౌంటర్
అంకారా: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు టర్కీ కౌంటరిచ్చింది. టర్కీకి చెందిన కొందరు కీలక వ్యక్తులే తిరుగుబాటుదారుల వెనుక ఉండి.. సిరియా బషర్ అల్ అసద్‌ను దేశం వెళ్లిపోయేలా చేశారు. సిరియాను ఆక్రమించుకోవడంలో టర్కీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలను టర్కీ తిరస్కరించింది.ఈ నేపథ్యంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ ట్రాడ్కాస్టర్.. ట్రంప్ వాదనలను కొట్టేశారు. ఈ సందర్భంగా ఫిదాన్ మాట్లాడుతూ.. సిరియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాచరిక వ్యవస్థకు ప్రజలే స్వస్థి చెప్పారు. దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం అని అనలేము. ఎందుకంటే సిరియా ప్రజల సంకల్పం మేరకే ఇలా జరిగిందని మేము భావిస్తాం. ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సిరియాలో జరిగిన పరిణామాలకు టర్కీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా పాలన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధిపత్యం కాదు.. ప్రతీ ఒక్కరికి ప్రజల సహకారం అవసరం అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. 2011లో చెలరేగిన అసద్ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభ రోజుల నుండి టర్కీ అతని పాలనపై వ్యతిరేకంగా ఉంది. ఈ క్రమంలో సిరియాలో మద్దతుదారులకు కీలకంగా ఉంది. రాజకీయ అసమ్మతివాదులతో పాటు మిలియన్ల మంది శరణార్థులకు టర్కీ ఆతిథ్యం ఇచ్చింది. ఇదే సమయంలో సైన్యంతో పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులకు కూడా మద్దతు ఇచ్చింది. -
ఎటు చూసినా మృతదేహాలే
డమాస్కస్: ఎక్కడ చూసినా శవాల కుప్పలు. రాజధాని డమాస్కస్‌తోపాటు కుతైఫా, ఆద్రా, హుస్సేనియాల తదితర ప్రాంతాల్లో సామూహిక సమాధులు! సిరియాలో ఇటీవల కుప్పకూలిన అసద్ ప్రభుత్వం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుగుబాటుదారులను బంధించి జైళ్లలో చిత్రహింసలు పెట్టడమే గాక దారుణంగా హతమార్చినట్టు తేలింది. అలా అదృశ్యమైనవారి మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. సిరియా అంతటా సామూహిక సమాధులేనన్న వార్తల నేపథ్యంలో సిరియన్ ఎమర్జెన్సీ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇటీవల దేశంలో పర్యటించింది. దాని పరిశీలనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటికొచ్చాయి... లక్షల మంది గల్లంతు సిరియాలో తిరుగువాబాటు చేసిన వారందరినీ బషర్ అల్ అసద్ ప్రభుత్వం నిర్బంధించింది. జైళ్లలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసింది. ఆ క్రమంలో వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అలా 2011 నుంచి ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా అదృశ్యమయ్యారు. 2014లో కనపించకుండా పోయిన సోదరుడి కోసం ఓ మహిళ, 2013లో అరెస్టయిన కుమారుడి కోసం ఓ తండ్రి ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారు. హయత్ తహ్రీర్ అల్షామ్ (హెచ్‌టీఎస్) తిరుగుబాటు సంస్థ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, అసద్ రష్యాకు పారిపోవడం తెలిసిందే. అనంతరం సిరియా రక్షణ దళం వైట్హెల్మెట్స్తో కలిసి హెచ్‌టీఎస్ సిరియా అంతటా జైళ్లు, నిర్బంధ కేంద్రాలను తెరిచింది. అసద్ హయాంలో నిర్బంధించిన వేలాది మందిని విడుదల చేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన తమ ఆత్మీయులకోసం అనేకమంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారేమైనట్టు? తిరుగుబాటుదారులను చిత్రహింసలు పెట్టి చంపాక అసద్ సర్కారు సామూహికంగా ఖననం చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా ఇప్పటికే ఏకంగా లక్షకు పైగా మృతదేహాలను కనుగొన్నారు! సామూహిక సమాధులున్న మరో 66 ప్రాంతాలనూ గుర్తించారు. డమాస్కస్ వాయవ్యంగా ఉన్న కుతైఫా పట్టణంలో వేలాది మృతదేహాలను వేర్వేరు చోట్ల సామూహికంగా ఖననం చేసినట్లు ఈటీఎఫ్ తెలిపింది. డమాస్కస్ విమానాశ్రయ మార్గంలో హుస్సేనియేయాలోనూ సామూహిక సమాధులు బయటపడ్డాయి. దక్షిణ సిరియాలో పన్నెండు సామూహిక సమాధులు కనుగొన్నారు. సిరియాలో గల్లంతైన వారిలో 80,000 మందికి పైగా చనిపోయినట్టు హక్కుల సంఘం ఇప్పటికే తేలి్చంది. 60,000 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బ్రిటన్‌కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. గుర్తించలేని స్థితిలో శవాలు ఖననం చేసి చాలాకాలం కావడంతో చాలావరకు శవాల అవశేషాలే మిగిలాయి. దాంతో మృతులనుగుర్తించడం కష్టంగా మారింది. చేసేది లేక పుర్రెలు, ఎముకలనే భద్రపరుస్తున్నారు. డీఎన్ఏ నమూనాల డాక్యుమెంటేషన్, తదుపరి విశ్లేషణ కోసం బ్లాక్ బాడీ బ్యాగుల్లో విడిగా ఉంచుతున్నారు. హత్యకు గురైన వారిని మున్ముందైనా గుర్తించగలమని ఈటీఎఫ్ ఆశాభావం వెలిబుచి్చంది. -
ఖైదీ కాదు, గూఢచారి!
డమాస్కస్: అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తీవ్ర భంగపాటుకు గురైంది. అమాయకుడని చెబుతూ సిరియా జైలు నుంచి ఇటీవల ఆ సంస్థ చొరవ తీసుకుని మరీ విడుదల చేసిన ఓ ఖైదీ నిజమైన ఖైదీ కాదని తేలింది. తాజా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో నిఘా విభాగంలో పని చేసిన అధికారి అని నిజ నిర్ధారణలో వెల్లడైంది. అతని పేరు సలామా మహమ్మద్ సలామా అని, చిత్రహింసలకు, దోపిడీలకే గాక యుద్ధ నేరాలకు కూడా పాల్పడ్డాడని స్థానిక నిజ నిర్ధారణ సంస్థ వెరిఫై–సై తెలిపింది. దాంతో సీఎన్ఎన్ తన తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడింది. ఎందుకంటే సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్, అమె బృందం తిరుగుబాటు బృందంతో పాటు ఇటీవల సిరియా ఇంటలిజెన్స్ కార్యాలయంలోకి వెళ్లింది. అక్కడి ఓ జైలు గదిని తిరుగుబాటుదారులు తెరిచారు. అందులో ఒక వ్యక్తి వణుకుతూ కన్పించాడు. తన పేరు అదెల్ గుర్బల్ అని, మూడు నెలలుగా బందీగా దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు. అతన్ని వార్డ్ బృందం చొరవ తీసుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ దృశ్యాలను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసుకుంది. ఇది తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన అని వార్డ్ చెప్పుకొచ్చారు. అసద్ క్రూరమైన పాలన తాలూకు బాధితుల్లో అతనొకడని సీఎన్ఎన్ అభిర్ణించింది. అతనికి ఆహారం అందించి అత్యవసర సేవల విభాగంలో చేర్చినట్టు కథనం ప్రసారం చేసింది. దాంతో పలువురు నెటిజన్లు సీఎన్ఎన్ను అభినందించారు. కానీ ఈ వ్యవహారంపై వెరిఫై–సై అనుమానాలు వ్యక్తం చేసింది. 90 రోజులు ఏకాంతంలో, వెలుతురు కూడా లేని గదిలో తీవ్ర నిర్బంధంలో ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా కన్పిస్తారని ప్రశ్నించింది. అసలతను స్థానికుడేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. అనంతరం కూపీ లాగి, అతను సలామా అని, అసద్ వైమానిక దళం నిఘా విభాగంలో ఫస్ట్ లెఫ్టినెంట్‌గా చేశాడని వెల్లడించింది. వసూళ్ల తాలూకు అక్రమ సంపాదనను పంచుకునే విషయంలో పై అధికారితో పేచీ రావడంతో నెల రోజులుగా జైల్లో ఉన్నట్టు వివరించింది. అతను సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా బయట పెట్టింది. దాంతో సీఎన్ఎన్ కంగుతిన్నది. ఆ వ్యక్తి తమకు తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని అప్పుడే అనుకున్నామంటూ మాట మార్చింది. అతని నేపథ్యం గురించి తామూ లోతుగా విచారణ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీఎన్ఎన్ వివాదాస్పద రిపోర్టింగ్ శైలితో అభాసుపాలు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది ఇజ్రాయెల్, గాజా సరిహద్దు వద్ద రిపోర్టింగ్‌కు సంబంధించి కూడా క్లారిస్సా వార్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
అది భూకంపం కాదు.. బాంబు దాడే!
నియంత పాలకుడి పీడ విరగడైందన్న సిరియా ప్రజల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓపక్క ప్రభుత్వ ఏర్పాటునకు తిరుగుబాటు దళాలు కొర్రీలు పెడుతున్న వేళ.. మరోవైపు మిలిటరీ స్థావరాలు, ఆయుధ కారాగార ధ్వంసం పేరిట ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు ఆ దేశ ప్రజలు. తాజాగా..తాజాగా.. టార్టస్ రీజియన్‌లో భూమి కంపించినంత పనైంది. రిక్టర్ స్కేల్‌పై 3 తీవ్రత నమోదైంది. అది భూకంపం అని భావించినవారందరికీ.. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ షాకిచ్చింది. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడి అని ప్రకటించింది.వైమానిక దాడుల్లో భాగంగా.. స్థావరాలపై బాంబులు ప్రయోగించాయి ఇజ్రాయెల్ బలగాలు. ఆ ప్రభావంతో.. అగ్ని గోళం తరహాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భూమి కంపించినంత పనైంది. 2012 నుంచి ఇప్పటిదాకా సిరియా తీరం వెంట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. అతిపెద్ద దాడి ఇదేనని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్స్ రైట్స్ ప్రకటించింది. 23వ ఎయిర్ ఢిపెన్స్ బ్రిగేడ్ బేస్‌పై జరిగిన దాడిగా ఇది తెలుస్తోంది. JUST IN: 🇮🇱 Israel continues to conduct airstrikes in Syria. pic.twitter.com/06nQDxz3Fw— BRICS News (@BRICSinfo) December 15, 2024 ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇది భూకంపం కంటే రెండు రేట్ల వేగంతో ప్రయాణించిందట. అలా.. 800 కిలోమీటర్ల దూరంలోని టర్కీ నగరం ఇస్నిక్లోని భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించడం గమనార్హం.Thank you, @CeciliaSykala . The #explosion of the ammunition depot at #Tartus , Syria was detected at Iznik, Türkiye magnetometer station 820 km away. Signal took 12 minutes to travel in the lower ionosphere. That's about twice as fast as earthquake signals travel. https://t.co/rs2nH1wtwL pic.twitter.com/3u4KYbD57f— Richard Cordaro (@rrichcord) December 16, 2024ఇక.. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చాలాకాలంగానే కొనసాగుతున్నాయి. హెజ్బొల్లాకు అత్యాధునిక ఆయుధాలు చేరకుండా ఉండేందుకే వైమానిక దాడులతో నాశనం చేస్తున్నామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. సిరియాతో యుద్ధం మా అభిమతం కాదు. కానీ, మా దేశ భద్రతకు ముప్పు వాటిల్లో అంశంపై.. మరీ ముఖ్యంగా ఉత్తర సరిహద్దుపైనే మా దృష్టి ఉంది అని బెంజిమన్ నెతన్యాహూ చెబుతున్నారు. మరోవైపు.. సిరియాకు ఆయుధ సహకారం అందించిన రష్యా.. తాజా పరిణామాలతో తన స్థావరాలను ఖాళీ చేస్తోంది. తాజాగా దాడి జరిగిన స్థావరం కూడా రష్యాకు చెందినదే అనే ప్రచారం నడుస్తోంది. -
సిరియాతో టచ్‌లోనే అమెరికా.. బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు
జోర్డాన్: సిరియాలో తిరుగుబాటుదారుల మొహమ్మద్ అల్ బషీర్ ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. సిరియా ప్రజల కోసం ఇతర పార్టీలతో కూడా అమెరికా చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.ఆంటోని బ్లింకెన్ జోర్డాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిరియాతో కొత్త ప్రభుత్వంతో బైడెన్ టచ్‌లో ఉన్నారు. బషీర్ ప్రభుత్వం సహా ఇతర పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం. సిరియా ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా సిద్దంగా ఉంది. పాలనలో బషీర్ ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఇదే సమయంలో తాము సిరియా అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.మరోవైపు.. జోర్డాన్ విదేశాంగ మంత్రి అమాన్ సఫాది మాట్లాడుతూ.. సిరియాలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం మాకు ఇష్టం లేదు. బషీర్ పాలనలో సిరియా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్.. దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అసద్ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్ సిరియాను వదిలివెళ్లిన తర్వాత అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం, తిరుగుబాటుదారుల మద్దతుతో అల్ బషీర్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. -
‘సిరియా విషయంలో రష్యా, ఇరాన్ జోక్యం వద్దు’
డెమాస్కస్: సిరియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారుల దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అసద్‌కు రష్యా, ఇరాన్ మద్దతుపై తుర్కీయో కీలక వ్యాఖ్యలు చేసింది.తాజాగా తుర్కీయే విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ మాట్లాడుతూ..‘సిరియా, డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలకు రష్యా, ఇరాన్‌లు మద్దతు ఇవ్వకూడదు. అసద్‌కు మద్దతు తెలిపే విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికే వారితో మేము చర్చించాం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్లు అసద్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారు. అయితే, ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే తిరుగుబాటుదారుల కారణంగా సిరియా కల్లోల పరిస్థితుల నెలకొన్నాయి. అధ్యక్షుడు అసద్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు.మరోవైపు.. సిరియా తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన మొహమ్మద్ అల్ బషీర్ 2025 మార్చి ఒకటో తేదీదాకా పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అల్ బషీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. -
సరికొత్త సంకటంలోకి సిరియా
ఒక సమస్య నుంచి బయటపడిన సిరియాను బయటి శక్తుల రూపంలో మరో సమస్య వెన్నాడటం అప్పుడే మొదలైపోయింది. అటువంటి శక్తులలో అన్నింటికన్న ప్రధానమైనది ఇజ్రాయెల్. సిరియా అధ్యక్షుడు అసద్ పతనం ఈనెల 8వ తేదీన జరిగింది. కాగా సిరియాకు పొరుగునే ఉన్న ఇజ్రాయెల్ సైన్యం, అంతకన్న ఒకరోజు ముందే సరిహద్దులు దాటి చొచ్చుకు వచ్చింది. అలా ప్రత్యక్ష దురాక్రమణ మొదలు కాగా, ఇప్పటికి దేశమంతటా కొన్నివందల వైమానిక దాడులు జరిపింది. ఈ చర్యలను ఐక్యరాజ్యసమితితో సహా వివిధ దేశాలు ఖండించినా ఇజ్రాయెల్ ఆపటం లేదు. గోలన్ హైట్స్ప్రాంతం తమదేననీ, దానిని వదలుకునే ప్రసక్తే లేదనీ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. అంటే, దాన్ని వారిక ఖాళీ చేయబోరు!సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దులలో గోలన్ హైట్స్ పేరిట పర్వత శ్రేణులున్నాయి. పాల స్తీనా సమస్యను పురస్కరించుకుని అరబ్ దేశాలకూ, ఇజ్రాయెల్‌కూ 1967లో జరిగిన యుద్ధంలో, సిరియాకు చెందిన గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో పూర్తిగా విలీనం చేసుకుంటున్నట్లు 1981లో ప్రకటించింది. ఆ చర్య అంతర్జా తీయ చట్టాలకు విరుద్ధం గనుక గుర్తించబోమని ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా సైతం ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ లెక్క చేయ లేదు. గోలన్ హైట్స్ మొత్తం విస్తీర్ణం సుమారు 18 వేల చ.కి.మీ. కాగా, అందులో 12 వేల చ.కి.మీ.ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌కు, సిరియాకు మధ్య నిర్యుద్ధ భూమి ఏర్పడింది. ఆ ప్రాంతం ఐక్య రాజ్యసమితి దళాల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఇపుడు అసద్ పతన సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం అకస్మాత్తుగా ఆ నిర్యుద్ధ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి ఆక్రమించింది.తాత్కాలిక చర్య అనుకోగలమా?ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్యసమితితో పాటు సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్, ఖతార్ తదితర దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ సేనలు వెనుకకు పోవాలన్నాయిగానీ, అందుకు ప్రధాని నెతన్యాహూ ససేమిరా అన్నారు. ఇక్కడ చెప్పుకోవలసిన ఒక విషయమేమంటే, గోలన్ ఆక్రమణను మొదట వ్యతిరేకించిన అమెరికా, తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2017లో ఆమోదించింది. ఇపుడు తిరిగి ట్రంప్ రానున్నందున అమెరికా వైఖరి ఏమి కాగలదో ఊహించవచ్చు. నెతన్యాహూ ధైర్యానికి అది కూడా కారణమై ఉండాలి. అమె రికా మాట అట్లుంచితే, అసలు గోలన్ ప్రాంతం యావత్తూ తమకు చెందినదేననీ, కనుక దానిని వదలుకునే ప్రసక్తే లేదనీ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. అక్కడి జనాభాలో గల సిరియన్లను వేధించటం, అక్కడినుంచి తరలిపోయేట్లు చేయటం, వేలాదిమంది యూదుల కోసం సెటిల్మెంట్లు సృష్టించటం ఒక విధానంగా అనుసరి స్తున్నారు. ఆ విధంగా అక్కడి సిరియన్లు మైనారిటీగా మారారు. ఇప్పుడు తాజాగా నిర్యుద్ధ లేదా నిస్సైనిక మండలంలోకి వెళ్లి, సమితి సైన్యాన్ని కాదంటూ ఆక్రమించిన దరిమిలా, ఇది తాత్కాలిక చర్య మాత్రమేననీ, ఆ ప్రాంతంలో సిరియన్ తీవ్రవాదులు పుంజుకోకుండా ముందు జాగ్రత్త కోసమనీ నెతన్యాహూ వివరించే యత్నం చేస్తున్నారు.కానీ, ఆయన వివరణను నమ్మేందుకు సమితిగానీ, మరొకరు గానీ సిద్ధంగా లేరు. యథాతథంగా ఇజ్రాయెల్ చర్య సిరియా సార్వ భౌమత్వానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. నిస్సైనిక ప్రాంతం సమితి సేనల అధీనంలో ఉన్నందున ఆ ప్రాంత నిర్వహణను సమితికే వదలి వేయాలి తప్ప ఇజ్రాయెల్ జోక్యం తాత్కాలికం పేరిటనైనా సరే ఆమోదనీయం కాదు. అందుకు సమితి ముందస్తు అనుమతి కూడా లేదు. ఈ విధంగా తాత్కాలిక ఆక్రమణ లేదా పర్యవేక్షణ పేరిట పాల స్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లోని ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించి, ఇప్పటికి అరవై సంవత్సరాలు గడిచినా ఖాళీ చేయటం లేదు. ఇటీవల ఒక కొత్త వాదాన్ని ముందుకు తెచ్చింది. దాని ప్రకారం, అసలు వెస్ట్ బ్యాంక్ అనేది ఇజ్రాయెల్‌లో ఒక భాగమే తప్ప దానికి పాలస్తీనాతో సంబంధం లేదు. అందువల్ల తమ సెటిల్మెంట్లు చట్ట విరుద్ధం కాదు. క్రమంగా ఆ ప్రాంతాన్నంతా ఇజ్రాయెల్‌లో విలీనం చేస్తాం. ఇక్కడ కాకతాళీయమైన ఒక విశేషమేమంటే ఆ విధానాలను, అక్కడి జెరూసలేంకు ఇజ్రాయెల్ రాజధానిని టెల్ అవీవ్ నుంచి బదిలీ చేయటాన్ని ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో ఆమోదించారు. ఈ పరిణామాలను ప్రస్తుతం గోలన్ ప్రాంతంలో జరుగుతున్న దానితో పోల్చితే ఏమనిపిస్తుంది? నిస్సైనిక మండలంలోకి ఇజ్రాయెలీ సేనల ప్రవేశం తాత్కాలికమని నమ్మగలమా? పైగా, ఆ పర్వత శ్రేణులన్నీ తమవేనని నెతన్యాహూ గతంలోనే స్పష్టంగా ప్రకటించిన స్థితిలో?గోలన్ హైట్స్ ఇజ్రాయెల్కేనా?విషయం ఇంతటితో ముగియటం లేదు. తమ ఆక్రమణకు బయట ఇంకా సిరియా అధీనంలోనే గల ప్రాంతాన్ని, ఆ పరిసరాలను కూడా ‘స్టెరైల్ జోన్’ (నిర్జీవ మండలం)గా మార్చివేయగలమన్న నెతన్యాహూ అందుకోసం తమ సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ మాటకు ఆయన చెబుతున్న అర్థం ఇక అక్కడ సిరియన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు గానీ, స్థావరాలకుగానీ శాశ్వతంగా ఎటువంటి అవకాశాలు లేకుండా చేయటం. వినేందుకు ఇది సహేతు కంగా తోచవచ్చు. కానీ, పైన చెప్పుకొన్న వివరాలలోకి వెళ్లినపుడు ఇజ్రాయెల్ అసలు ఉద్దేశాలు ఏమిటనేది అర్థమవుతుంది. సూటిగా చెప్పాలంటే, గోలన్ ప్రాంతాన్ని వారిక ఖాళీ చేయబోరు. తమ అధీనంలో లేని భాగాన్ని కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆక్రమణ లోకి తెచ్చుకుంటారు.ఇదంతా నిరాటంకంగా సాగేందుకు ఇజ్రాయెల్ సేనలు 8వ తేదీ నుంచే ఆరంభించి మరొక పని చేస్తున్నాయి. అది, సిరియా వ్యాప్తంగా నిరంతరం వందలాది వైమానిక దాడులు. అవన్నీ సిరియా ఆయు ధాగారాలపై, ఉత్పత్తి కేంద్రాలపై, వైమానిక, నౌకా స్థావరాలపై జరుగుతున్నాయి. యుద్ధ విమానాలను, రాకెట్లను, నౌకలను ఇప్పటికే దాదాపు ధ్వంసం చేశారు. వాటిలో అసద్ కాలం నాటి రసాయనిక ఆయుధాలు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెప్తున్నది. ఇవన్నీ సిరియాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తీవ్రవాదుల చేతికి రాకూడదన్నది తమ లక్ష్యమైనట్లు వాదిస్తున్నది. వాస్తవానికి ఇంతటి స్థాయిలో కాకున్నా ఐసిస్ కేంద్రాలని చెప్పే ఈశాన్య ప్రాంతానికి పరిమితమై అమెరికా కూడా దాడులు సాగిస్తున్నది. సమస్య ఏమంటే, అటు గోలన్ ఆక్రమణలు గానీ, ఇటు ఈ దాడులు గానీ సిరియా సార్వభౌమ త్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, సమితిలో ఎటువంటి ప్రమేయం లేకుండా ఏకపక్షంగా జరుగుతున్నవి.కొత్త ప్రభుత్వపు అడుగులుసిరియా ప్రజలు అయిదు దశాబ్దాల నియంతృత్వం నుంచి,అంతకు మించిన కాలపు వెనుకబాటుతనం నుంచి ఒక కొత్త దశలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ఒక నియంతను కూల దోయటం ద్వారా ఒక అడుగు వేసి 24 గంటలైనా గడవకముందే, బయటి శక్తులు తమ ప్రయోజనాల కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడితే, ఆ ప్రజలు ఏమి కావాలి? సదరు ఆయుధాలన్నీ సిరియా దేశపు రక్షణ సంపద. అక్కడ కొత్తగా అధికారానికి వచ్చేది ఎవరన్నది ఇంకా తెలియదు. దేశంలో వేర్వేరు గ్రూపులు ఉండటం, వాటిలో ఒకటి రెండింటికి ఇస్లామిస్ట్ తీవ్రవాద నేపథ్యం ఉండటం నిజమే. కానీ ఆ సంబంధాలను వారు బహిరంగంగా తెంచివేసుకుని సుమారు ఎనిమిది సంవత్సరాలవుతున్నది. ఇపుడు డమాస్కస్‌లో అధికారానికి వచ్చిన తర్వాత, ప్రధాన గ్రూపు నాయకుడైన మహమ్మద్ జొలానీ, తాము దేశంలోని అన్ని జాతులు, వర్గాల ప్రజలను ఐక్యం చేసి అందరి బాగు కోసం పాలించగలమని ప్రకటించారు. మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశించగలమన్నారు. మహిళలపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. అసద్‌కు పూర్తి మద్దతునిచ్చిన రష్యా, ఇరాన్‌లతోనూ సత్సంబంధాలకు సుముఖత చూపుతున్నారు. అసద్ హయాంలోని మంత్రి వర్గాన్ని తాత్కాలిక ప్రాతిపదికపై కొనసాగిస్తూ, దేశంలో పరిస్థితులు కుదుట పడేట్లు చూస్తున్నారు.ఉద్యమాల దశలో ఎవరికి ఏ నేపథ్యం ఉన్నా, వారి పరివర్తనలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్యం. ఆ విజ్ఞత లేని బయటి శక్తులు కేవలం తమ ప్రయోజనాల కోసం ఏవో సాకులు చెప్తూ ఈ విధంగా వ్యవహరించటం ఆమోదించదగిన విషయం కాబోదు.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
సిరియాలో సైనిక ఆస్తులు ధ్వంసం
-
సిరియా సైనిక స్థావరాల్లో 80 శాతం ధ్వంసం
ఇజ్రాయెల్: సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో 80 శాతం ప్రాంతాలపై దాడి చేసి ఆ దేశ సైనిక సామర్థ్యాలను చావుదెబ్బతీశామని ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన అంతమైన కొద్ది రోజులకే సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై తమ సేనలు గురిపెట్టి పని పూర్తిచేశామని ఇజ్రాయెల్ తెలిపింది. గత 48 గంటల్లో 400కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న నిస్సైనీకరణ(బఫర్ జోన్) ప్రాంతంలోకి దళాలను పంపామని, 80 శాతం సిరియా సైనిక స్థావరాలను నేలమట్టంచేశామని వెల్లడించింది. ఆయుధ నిల్వలపై దాడి చేసి, అవి తిరుగుబాటుదారుల శక్తుల చేతుల్లో పడకుండా నిరోధించామని తెలిపింది. అన్ని రకాల ఆయుధాలు ధ్వంసం ‘‘అల్–బైదా పోర్టు, లటాకియా పోర్టు, డమాస్కస్, ఇతర కీలక నగరాల్లో శత్రు వుల యుద్ధవిమానాలను కూల్చే ఆయుధ వ్యవస్థలు, ఆయుధాగారాలకు చెందిన 15 నావికాదళ నౌకలను ధ్వంసం చేశాం. సముద్రతలంపై 80 నుంచి 190 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు సముద్రతలం నుంచి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసంచేశాం. స్కడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, ఉపరితలం నుంచి సముద్రం వరకు, ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణు లు, మానవసహిత యుద్ధ వాహకాలు (యూఏవీ), యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రాడార్లు, ట్యాంకులు, హ్యాంగర్లు తదితర వ్యూహాత్మక ఆస్తులను నిరీ్వర్యం చేశాం’’అని సిరియా సైన్యం పేర్కొంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వందలాది దాడులు చేసింది.అసద్ పతనంపై నెతన్యాహు ఏమన్నారంటే..అసద్ పాలన అంతమై రోజు చారిత్రాత్మకమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్, అసద్‌లకు ప్రధాన మద్దతుదారులైన హెజ్బొల్లాలను తాము చావు దెబ్బ కొట్టిన ఫలితమే అసద్ పాలన అంతానికి అసలు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలనుకునేవారికి స్వేచ్ఛ, సాధికారత ఇజ్రాయెల్ కలి్పంచిందని ఆయన ఒక వీడియో ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను, ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనా హమాస్ కీలక నేతలను, లెబనాన్ హెజ్బొల్లా సీనియర్ నాయకులను ఇజ్రాయెల్ వరసబెట్టి అనూహ్య దాడుల్లో అంతంచేయడం తెల్సిందే. -
ఈ తిరుగుబాట్లు ఎందుకు జరిగాయంటే...
సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో కనిపించిన దృశ్యాలే ఇవాళ సిరియా అధ్యక్ష భవనంలో కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి గురై షేక్ హసీనా దేశాన్ని వీడిన వెంటనే ఆమె ప్రధానమంత్రి అధికారిక నివాసంలో తిరుగు బాటుదారులు దాడిచేసి ఇంటిని లూటి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సీన్ సిరియా అధ్యక్ష భవనంలో రిపీట్ అయ్యింది. ఆ దేశ నియంత బషీర్ అల్ అసద్ తిరుగుబాటుదారుల దాడికి దేశాన్ని వీడారు. ఆ వెంటనే అధ్యక్ష భవనంలోకి తిరుగుబాటుదారులు జొర బడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లటం చూస్తున్నాం. సిరియా అధ్యక్షుడిగా రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశాన్ని ఏలిన బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.సిరియా దాదాపు 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతం అవుతూనే ఉంది. దీనిలో ‘తిలాపాపం తలా పిడికిడు’ అన్నట్లు రష్యా, అమెరికా వంటి దేశాల పాత్రను కూడా మరిచిపోకూడదు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన మరణానంతరం అసద్ అధికారంలోకి వచ్చారు. అంటే ఏకంగా 54 ఏళ్ళుగా అసద్ కుటుంబ నియంతృత్వ పాలనలోనే సిరియా మగ్గి పోయింది. ఉగ్రవాదాన్ని, అంతర్యుద్ధాన్ని కట్టడి చేయ లేకపోవటం ప్రజాస్వామిక విధానాలను దరిదాపుల్లోకి రానీయకపోయిన ఫలితాన్ని అసద్ ఇవాళ చవిచూస్తున్నారు. దేశాన్ని వదిలి రష్యా నీడన ఆశ్రయం పొందుతున్నారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ ఆల్ షామ్ (హెచ్‌టీఎస్) సంస్థను ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్–జులానీ ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది. అంటే సిరియా దేశంలో నియంతృత్వం అంతరించే సూచనలు కనుచూపు మేరలో కనిపించకపోగా... ఆ దేశ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సిరియా, బంగ్లాదేశ్ పరిస్థితులను ఒకే గాటన కట్టలేకపోవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగి అవి హింసాత్మంగా మారటంతో పరిస్థితి చేయి దాటిపోయింది బంగ్లాదేశ్‌లో. హసీనా ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసు కున్నా... అప్పటికే ఆమె నిరంకుశ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా ఎగిసిపడింది. ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ మత ఛాందస దిశగా అడుగులు వేయటం ఆందోళనకరమైన అంశం. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వీటికి సంకేతాలు.కాస్త వెనక్కి వెళితే... రెండేళ్లు వెనక్కి వెళితే 2022 జూలైలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా కూడా ఇదే విధంగా పెట్టేబేడా సర్దుకుని ఉన్నపళంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తటంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. అదే సమయంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసానికి కూడా నిప్పు పెట్టారు. ప్రజాగ్రహానికి తలొంచి రణిల్ సైతం ఆ రోజు రాజీనామా చేయక తప్పలేదు. ఇక సిరియా లాంటి తిరుగుబాటును 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చవిచూశారు. దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్యుద్ధాలకు కేంద్రంగా మారిన అఫ్గానిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ నియంతలా పాలన చేశారు. చివరకు తాలిబాన్ల దాడిని ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయారు. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇస్లాం చట్టాల పేరుతో ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది.చదవండి: ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?ఈ నాలుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలు వేర్వేరు కావచ్చు, తీవ్రతల్లో తేడాలు ఉండొచ్చు. కాని ఫలితం మాత్రం ఒకటే. అంతే కాదు, పర్యవసానాల్లోనూ సారూప్యత కనిపిస్తోంది. శ్రీలంక మినహాయిస్తే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, సిరియాల్లో మత ఛాందసవాదమే రాజ్యమేలేటట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ యా దేశాల ప్రజలకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం.- రెహానా బేగం రాష్ట్ర సమాచార కమిషనర్, ఏపీ -
సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్
డమాస్కస్: అసద్ నిరంకుశ పాలనకు తెరదించిన హయత్ తహ్రీర్ అల్ షామ్, ఇతర తిరుగుబాటుదారుల గ్రూప్‌లు ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. 2025 మార్చి ఒకటో తేదీదాకా ఈయన తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో సభ్యులతో కలిసి మంగళవారం డమాస్కస్‌లో సమావేశం నిర్వహించిన ఆయన... తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. మైనారిటీలను గౌరవిస్తూ ప్రజాస్వామిక రీతిలో నడిచినంత కాలం సిరియా ప్రభుత్వానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆదేశ విదేశాంగ మంత్రి చెప్పారు. -
సిరియా నుంచి బయటపడిన 75 మంది భారతీయులు
-
సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
-
సిరియాలో విధ్వంసం.. స్వదేశానికి బయలుదేరిన భారతీయులు
డెమాస్కస్/బీరూట్: సిరియాలో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవతో దాదాపు 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో, అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.సిరియా నుండి కనీసం 75 మంది భారతీయులు పప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. డెమాస్కస్, బీరూట్ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్టు వెల్లడించింది.ఇక, ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు.. డమాస్కస్‌లోని దౌత్యకార్యాలయం ద్వారా తగిని సాయం పొందాలని కోరింది. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, వాట్సాప్, ఈ-మెయిల్ hoc.damascus@mea.gov.in ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.Pics of 75 Indians evacuated from war torn #Syria, they are reaching home soon. https://t.co/uw6TWEtIUP pic.twitter.com/wNqagbh758— Abhishek Jha (@abhishekjha157) December 10, 2024 -
ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్ అల్ అసద్ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.అసద్ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్ అల్ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్‌దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) చీఫ్ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్ గ్రూప్‌లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టీఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్‌ను బషర్ అసద్ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్ ఘాజీ జలానీ.. హెచ్‌టీఎస్ చీఫ్ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్‌లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్‌తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఐసిస్ ప్రభావమెంత?బషర్ అసద్ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గణాంకాల్లో వెల్లడైంది. ఐసిస్‌ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీ ఎస్ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ఐసిస్ను ఎలా కట్టడిచేశారు?హెచ్‌టీఎస్ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టీఎస్ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్‌ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్‌ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్ పని అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ సగేర్ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.ఐసిస్‌ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?హెచ్‌టీఎస్ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సోఫాన్ గ్రూప్ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్ అన్నారు. ‘‘ అసద్‌ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్ నుంచి సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం. -
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది?
అది 1957వ సంవత్సరం.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విమానంలో అమెరికా వెళుతూ, మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. అప్పటికి భారత్- సిరియా మధ్య ఏడేళ్ల దౌత్య సంబంధాలున్నాయి.కశ్మీర్ అంశంపై భారత్‌కు సిరియా మద్దతునెహ్రూ డమాస్కస్‌ను సందర్శించినందుకు గుర్తుగా అక్కడి ఒక వీధికి జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దశాబ్దాలు గడిచాయి. అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిరియా యుద్ధ కాలాన్ని చూసింది. ఇది ఇరు దేశాల స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక భారత్- సిరియా మధ్య దోస్తీ ఏమికానున్నదనే ప్రశ్న తలెత్తుతోంది.తొలుత హఫీజ్ అల్ అసద్ పాలనలో, తరువాత బషర్ అల్ అసద్ పాలనలో సిరియా.. భారత్‌కు పలు అంశాలలో మద్దతు పలికింది. ముఖ్యంగా కశ్మీర్ సమస్యకు మద్దతునిచ్చింది. కశ్మీర్ విషయంలో పలు ముస్లిం దేశాలు పాకిస్తాన్ తీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే సిరియా భారతదేశానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చే కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.ఇరు దేశాల మధ్య సారూప్యతఅసద్ లౌకిక ప్రభుత్వం, భారతదేశం కట్టుబడిన సూత్రాల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది పునాదిగా నిలిచింది. 2019లో కశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని భారతదేశం తొలగించినప్పుడు, సిరియా ప్రభుత్వం దానిని భారతదేశ అంతర్గత సమస్యగా పేర్కొంది. ఆ సమయంలో రియాద్ అబ్బాస్ న్యూఢిల్లీలో సిరియా రాయబారిగా ఉన్నారు. ఆయన భారత్‌కు మద్దతునిస్తూ ‘ప్రతీదేశ ప్రభుత్వానికి తమ దేశంలోని ప్రజల భద్రత కోసం తమ భూమిలో ఏదైనా చేసే హక్కు ఉంటుంది. మేం భారత్‌తోనే ఉంటాం’ అని పేర్కొన్నారు.సిరియాకు తీవ్రవాద గ్రూపుల ముప్పుబషర్ అల్ అసద్ పతనం తరువాత ఇప్పుడు సిరియాలో తీవ్రవాద గ్రూపులు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ఇది భారతదేశానికి సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ ప్రభావవంతంగా ఉన్నప్పుడు రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియా ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావాన్ని చాలా వరకు అరికట్టింది. అయితే ఇప్పుడు ఈ రాడికల్ గ్రూపులు మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.సిరియా తీర్మానానికి భారత్ మద్దతుఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థల పెరుగుదల భారతదేశానికి పలు భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశంలోని సంఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు సిరియా చేసిన తీర్మానానికి భారతదేశం మద్దతు పలికింది. సిరియా అంతర్యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలోనూ డమాస్కస్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది. గోలన్ హైట్స్‌పై సిరియా చేస్తున్న వాదనలకు భారతదేశం మద్దతు పలికింది. అయితే దీనిని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. 2010లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డమాస్కస్‌ను సందర్శించి మనదేశ వైఖరిని పునరుద్ఘాటించారు.సిరియాను సందర్శించిన వాజ్పేయిభారత్-సిరియా మధ్య సంబంధాలు ఆర్థిక, సాంస్కృతిక మార్పిడిపై ఆధారపడి ఉంటాయి. 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిరియాలో పర్యటించి బయోటెక్నాలజీ, చిన్న పరిశ్రమలు, విద్యకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. డమాస్కస్‌లోని బయోటెక్నాలజీ సెంటర్ కోసం భారత్ 25 మిలియన్ డాలర్ల రుణంతో పాటు ఒక మిలియన్ డాలర్ల సాయం అందజేసింది.ఎగుమతులు.. దిగుమతులు ఇలా..2008లో బషర్ అల్ అసద్ భారత్‌ను సందర్శించారు. నాడు సిరియాలో ఐటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని భారతదేశం ప్రతిపాదించింది. గత ఏడాది విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి వి మురళీధరన్ బషర్ అల్ అసద్‌తో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వృద్ధి దశలో కొనసాగుతున్నాయి. భారతదేశం సిరియాకు వస్త్రాలు, యంత్రాలు, మందులను ఎగుమతి చేస్తుంటుంది. కాటన్, రాక్ ఫాస్ఫేట్ వంటి ముడి పదార్థాలు సిరియా నుంచి భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
సిరియా పయనమెటు?
ఒకే ఒక్క వారం. కేవలం ఏడు రోజుల వ్యవధిలో సిరియాలో సర్వం మారిపోయింది. పాలకుడు బషర్ అల్ అసద్ కాడి పడేసి పారిపోయాడు. దేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిపోయింది. అసద్‌ల 50 ఏళ్ల నియంతృత్వ పాలనకు ఎట్టకేలకు తెర పడిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమైనా, రెబెల్స్ పాలనలో సిరియా మరో అఫ్గాన్‌గా మారొచ్చన్న అంచనాలు అంతర్జాతీయ సమాజంలో గుబులు రేపుతున్నాయి. కుట్రలు, అంతర్యుద్ధం తదితరాల పరిణామంగా 1970లో గద్దెనెక్కిన హఫీజ్ అల్ అసద్ నియంతృత్వ పోకడలకు మారుపేరుగా పాలించారు. 1982లో ఇస్లామిక్ ఫ్రంట్ సారథ్యంలో దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణిచేసే క్రమంలో ఏకంగా 40 వేల పై చిలుకు పౌరులను పొట్టన పెట్టుకున్నారు. 2000లో గద్దెనెక్కిన బషర్ నియంతృత్వ పోకడల్లోనూ, క్రూరత్వంలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. 2011 అరబ్ విప్లవాన్ని అణిచివేసేందుకు ఏకంగా 4 లక్షల పై చిలుకు మందిని బలి తీసుకున్నారు. ఆయన పాతికేళ్ల పాలనలో కనీసం 5 లక్షల మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డట్టు అంచనా. అంతటి రక్తసిక్త చరిత్రను వారసత్వంగా మిగిల్చి అవమానకర పరిస్థితుల్లో దేశం వీడి రష్యాలో తలదాచుకున్నారు. సాయుధ మిలిటెంట్ గ్రూప్ హయాత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) సారథి అబూ మొహ్మద్ అల్ జొలానీ అలియాస్ అహ్మద్ అల్ షరాకు సిరియా ప్రధాని మొహమ్మద్ గాజీ జలాలీ తాజాగా లాంఛనంగా అధికారాన్ని అప్పగించారు. దాంతో అసద్‌ల 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర పడ్డా సిరియా భవితవ్యం మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. హెచ్‌టీఎస్ సారథ్యంలో ఏర్పడబోయే సర్కారుకు ముళ్లబాటే స్వాగతం పలుకుతోంది. ఇప్పటికైతే మధ్యేమార్గమే! అసద్ ఇంత త్వరగా పారిపోతారని, దేశం తమ సొంతమవుతుందని నిజానికి హెచ్‌టీఎస్ కూడా ఊహించలేదు. దాంతో మిగతా మిలిటెంట్ గ్రూపులు, రాజకీయ పారీ్టలు తదితరాలతో చర్చలు జరపడం, వాటితో అధికార పంపిణీ క్రతువును సజావుగా పూర్తి చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దానికి సవాలుగా మారింది. దాంతోపాటు జొలానీ సారథ్యంలో కొలువుదీరబోయే హెచ్‌టీఎస్ సర్కారుకు అంతర్జాతీయ గుర్తింపు ఏ మేరకు దక్కుతుందనేది కూడా కీలకమే. ఈ విషయంలో కీలక పొరుగు దేశమైన తుర్కియేతో పాటు యూరోపియన్ యూనియన్, అమెరికాలది కీలక పాత్ర కానుంది. హెచ్‌టీఎస్ మూలాలు అల్‌ఖైదాతో ముడిపడి ఉండటం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేలా కని్పస్తోంది. పూర్తి ప్రజాస్వామిక పాలనపై ఎవరికీ ఆశలు లేకపోయినా, అతివాద పోకడలకు హెచ్‌టీఎస్ తాత్కాలికంగానైనా దూరంగా ఉండాల్సి రావచ్చు. అంతేగాక కుర్ది‹Ùల స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సమాజం విధించే పలు షరతులకు కట్టుబడాల్సిన పరిస్థితి తలెత్తేలా కని్పస్తోంది. ఈ దిశగా జొలానీ ఇప్పటికే పలు సంకేతాలైతే ఇచ్చారు. విపక్షాల పట్ల సహయంతో వ్యవహరిస్తామని సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మతపరమైన మైనారిటీల హక్కులకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మాదిరిగా మహిళల వస్త్రధారణపై ఆంక్షల వంటి వాటి జోలికి పోబోమని సోమవారం ఆయన కుండబద్దలు కొట్టారు కూడా. అయితే శరణార్థులుగా దేశాలు పట్టుకుని పోయిన సిరియన్ల తిరిగి రాక మరో పెద్ద అంశం కానుంది. అంతర్గత కల్లోలం నేపథ్యంలో కొన్నేళ్లుగా భారీగా దేశం వీడిన సిరియన్లంతా తిరిగొస్తున్నారు. వారందరికీ ఆశ్రయంతో పాటు ఉపాధి కల్పన సవాలు కానుంది. వీటికి తోడు పలు ప్రాంతాలను ఆక్రమించుకుని గుప్పెట్లో పెట్టుకున్న చిన్నాచితకా మిలిటెంట్ గ్రూపులతో కొత్త ప్రభుత్వం నెట్టుకొస్తుందనేది ఆసక్తికరం.స్థిరత్వం నెలకొనాలి: భారత్న్యూఢిల్లీ/మాస్కో/జెరూసలేం: సిరియాలో వీలైనంత త్వరగా స్థిరత్వం నెలకొంటుందని భారత్ ఆశాభావం వెలిబుచి్చంది. సిరియాలోని భారతీయుల క్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. సిరియాలో అధికార మార్పును ఈయూతో పాటు అమెరికా తదితర దేశాలు స్వాగతించాయి.అసద్‌కు ఆశ్రయమిచ్చాం: రష్యాఅసద్కు రాజకీయ ఆశ్రయం కలి్పంచినట్టు రష్యా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాలో ఆయన ఎక్కడ తలదాచుకున్నదీ వెల్లడించలేదు.ఇజ్రాయెల్ వైమానిక దాడులుసిరియాలో పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సోమ వారం భారీ వైమానిక దాడులకు దిగింది. దీర్ఘశ్రేణి రాకెట్లు, రసాయనిక ఆయుధాలు రెబెల్స్ చేతిలో పడకుండా వాటిని ధ్వంసం చేసేందుకే దాడులు చేసినట్టు ప్రకటించింది. అమెరికా కూడా సిరియా లో 75 ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్‌కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్‌తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్‌టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్‌కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్‌ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్‌ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్‌ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్‌టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
సిరియా సంక్షోభం.. భారత్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ:సిరియా సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 9) ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత, అందరినీ కలుపుకుపోయే రాజకీయ ప్రక్రియ సిరియాలో స్థిరత్వం తీసుకువస్తుందని అభిప్రాయపడింది.సిరియాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపింది.సిరియాలోని అన్ని పక్షాలు ఐక్యమత్యం,సార్వభౌమత్వం కోసం పనిచేయాలని సూచించింది. దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది.సిరియా రాజధాని డెమాస్కస్‌లోని భారత ఎంబసీ కొనసాగుతుందని, భారతీయులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంబసీని సంప్రదించాలని కోరింది. కాగా, సిరియాలో నియంత పాలనను కూలదోసి రెబల్స్ అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: పిల్ల చేష్టలనుకుంటే నియంత పాలన అంతానికి నాంది పలికింది -
Syria: పిల్ల చేష్టలనుకుంటే.. నియంత పాలన అంతానికి నాంది పలికింది!
ఏ పని చేస్తే ఏం జరుగుతుందో.. తెలిసీతెలియని వయసులో ఆ బాలుడు చేసిన పని.. సిరియా ముఖచిత్రాన్నే మార్చేసింది. నిరంకుశ పాలనపై దేశం మొత్తాన్ని ఒకతాటిపైకి తెచ్చి నిరసన గళం విప్పేలా చేసింది. అసద్ నియంత పాలనకు వ్యతిరేకంగా అప్పటిదాకా రెబల్స్ చేస్తున్న తిరుగుబాటును.. ముమ్మరం చేయడానికి నాంది పలికింది. ఆ చర్యే.. దశాబ్దాల పోరు తర్వాత సిరియాకు స్వేచ్ఛా వాయువుల్ని అందించబోతోంది. కానీ, యుక్తవయసుకొచ్చిన అతని ముఖంలో మాత్రం సంతోషం కనిపించడం లేదు.తన తండ్రి హఫీజ్ మరణాంతరం వారసత్వంగా వచ్చిన సిరియా అధ్యక్ష పదవిని బలవంతంగానే అంగీకరించాడు డాక్టర్ బషర్ అల్ అసద్. అయితే నియంత పోకడకు అలవాటు పడడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. అదే సమయంలో అరబ్ విప్లవం మొదలైంది. కుటుంబ పాలనలో నలిగిపోయిన సిరియన్లకు ఈ విప్లవం ఓ ఆశాజ్యోతిలా కనిపించింది. దారా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మువావియా సియాస్నే.. ఈజిప్ట్, ట్యూనీషియలో ఏం జరిగిందో టీవీల్లో చూశాడు. పరుగున వెళ్లి తన స్నేహితులను పోగు చేశాడు. స్కూల్ ఆ గోడ మీదే కొన్ని రంగులు తీసుకుని రాతలు రాశాడు.‘‘డాక్టర్.. తర్వాత నీ వంతే!’’ అంటూ అధ్యక్షుడు అసద్‌ను ఉద్దేశించి సరదాగా రాసింది సియాస్నే బృందం. పిల్ల చేష్టలనుకుని.. ఎవరూ ఆ రాతల్ని పట్టించుకోలేదు. కానీ, కొన్నాళ్లకు పోలీసులు ఆ రాతలను సీరియస్‌గా తీసుకున్నారు. దగ్గర్లోని కొందరు కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని రాసిందో ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈలోపు విషయం సియాస్నే తండ్రికి తెలిసి భయపడ్డాడు. ‘ఎందుకు రాశావ్?’ అనే కొడుకును అడిగితే.. అలా జరిగిపోయిందంటూ నిర్లక్క్ష్యపు సమాధానం ఇచ్చాడు. అయితే వెంటనే దాక్కోమని సలహా ఇచ్చాడు ఆ తండ్రి. ఉదయం వెళ్లొచ్చులే అని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ బాలుడు. అయితే..వేకువజామున 4 గం. ప్రాంతలో మువావియా సియాస్నే చేతులకు బేడీలు పడ్డాయి. గోడ మీద రాతలు రాసే టైంలో మరో ముగ్గురు స్నేహితులు మువావియా వెంట ఉండడంతో.. వాళ్లనూ లాక్కెళ్లారు. పాడై పోయిన భోజనం, ఒంటి మీద నూలుపోగు లేకుండా కర్రలతో బాదుతూ.. కరెంట్ షాక్‌తో థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. దాదాపు నెలన్నరపాటు ఆ నలుగురికి నరకం అంటే ఏంటో చూపించారు. ఇంతలో తమ బిడ్డల కోసం ఆ తండ్రులు స్టేషన్ల గడప తొక్కారు.‘‘వీళ్లను మరిచిపోండి. ఇళ్లకు పోయి మీ పెళ్లాలతో మళ్లీ పిల్లల్ని కనండి. చేతకాకపోతే.. మీ ఆడాళ్లను మా దగ్గరకు పంపండి’’ అంటూ అతిజుగుప్సాకరంగా మాట్లాడిన ఆ పోలీసుల మాటలను దిగమింగుకుని వాళ్ల తండ్రులు వెనుదిరిగారు. మానవ హక్కుల సంఘాల ద్వారా తమ పిల్లలను విడిపించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈలోపు నెల గడిచింది. విషయం దేశం మొత్తం పాకింది.అధ్యక్షుడు అసద్‌కు కోపం తెప్పించిన ఆ నలుగురు పిల్లల విముక్తి కోసం వేల మంది రోడ్డెక్కారు. వాళ్లను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. ఈ ఉద్యమం దావానంలా వ్యాపించింది. మార్చి 15, 2011లో అసద్ పాలనకు వ్యతిరేకంగా సిరియా వ్యాప్తంగా సంఘటితంగా జరిగిన ప్రజా నిరసన కార్యక్రమాలు(Day of Rage).. ఆ దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే.. అప్పటికే అణచివేతను అలవాటు చేసుకున్న అసద్.. ఆ ఉద్యమాన్ని హింసాత్మకంగా మారేదిశగా కవ్వింపు చర్యలకు దిగాడు. అది కాస్త.. లక్షల మందితో తిరుగుబాటుగా తయారైంది. 45 రోజుల తర్వాత.. క్షమాభిక్ష పేరిట ఆ నలుగురిని విడిచిపెట్టారు. మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల వైపు చూడకూడదని లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. అయితే.. మువావియా జీవితం అప్పటి నుంచి కుదేలయ్యింది. నాలుగేళ్ల తర్వాత అంతర్యుద్ధంలోనే తన తండ్రి తుటాలకు బలయ్యాడు. ఆ తర్వాతి రోజుల్లో సిరియా విముక్తి పేరిట ఏర్పాటైన సైన్యంలో చేరాడతను. ఇన్నేళ్ల అంతర్యుద్ధాన్ని.. అందులో పోయిన లక్షల ప్రాణాలను తల్చుకుంటూ.. తాను అలాంటి పని చేయకుండా ఉండాల్సిందని కాదని అంటున్నాడు.‘‘మేం జైలు నుంచి బయటకు వచ్చాక.. బయట ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. వాళ్లంతా మాకు మద్దతుగా వచ్చారా? అని ఆశ్చర్యపోయాం. ఆ క్షణం సంతోషంగానే అనిపించింది. కానీ, ఇప్పుడు ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది. ఆనాడు అలా నేను గోడ మీద రాసి ఉండకపోతే.. అసద్‌కు కోపం తెప్పించి ఉండకపోతే.. తిరుగుబాటు ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదేమో!. లక్షల ప్రాణాలు పోయేవి కావేమో అని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు’’.. అయితే అసద్ పాలనకు ముగింపు పడినందుకు మాత్రం తనకు సంతోషంగానే ఉందంటున్నాడతను.కీలక పరిణామాలు..మువావియా-అతని స్నేహితుల అరెస్ట్.. తదనంతర పరిణామాల తర్వాత అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమాలు చేశారు. ఉగ్ర సంస్థలు, తిరుగుబాటు దారులు మరోవైపు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టే యత్నం చేశారు. కానీ, వీటినీ అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చింది. నిరంకుశ పాలన దిశగా అసద్‌ను అడుగులేయించింది. 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకోగా.. 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా సిరియాలో రంగ ప్రవేశం చేశాయి.మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి.అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 13 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు.అయితే 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ మిత్రదేశం రష్యాకు పలాయనం చిత్తగించక తప్పలేదు. హమ్జా అలీ అల్ ఖతీబ్.. బషర్ అల్ అసద్ కర్కశపాలనకు బలైన ఓ పసిప్రాణం. కేవలం 13 ఏళ్ల వయసులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నాడంటూ అభియోగాలు మోపి అరెస్ట్ చేసి.. కస్టడీలో తీవ్రంగా హింసించారు. చివరకు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. రమారమి.. మువావియా సియాస్నేని హింసించిన సమయంలోనే ఈ ఘటనా జరిగింది. అయితే సోషల్ మీడియాలో సిరియా నియంతాధ్యకక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా.. హమ్జా పేరిట నడిచిన ఉద్యమం ఈనాటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. -
సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు
-
తరం నుంచి తరానికి దేశానికో సంస్కృతి
ప్రాంతాలు, జాతుల వారీగా తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఎప్పటికీ వదులుకోలేరు. దేశ దేశాల్లో వేల ఏళ్లుగా వస్తున్న సంస్కృతిలో వారి మనుగడ కూడా ఉండటం విశేషం. తమ ఆచారాలను ముందు తరాలకూ పరిచయం చేస్తూతమ కమ్యూనిటీ సంప్రదాయాన్ని బతికించుకుంటున్నారు. ఈ సంప్రదాయాలన్నీ యునెస్కో వారసత్వ సంపదలోకి చేరి, ఆ దేశాల గొప్పతనాన్ని చాటుతున్నాయి. సౌదీ అరేబియాలోని తైఫ్ ప్రాంతంలో గులాబీ తోటలను విరివిగా సాగు చేస్తారు. ఇక్కడి సామాజిక, మతపరమైన ఆచారాలలో అంతర్భాగంగానూ, ముఖ్యమైన ఆదాయ వనరగానూ ఉంటుంది. మార్చిలో ప్రారంభమయ్యే పంట కాలంలో రైతులు, వారి కుటుంబాలు తెల్లవారుజామున గులాబీలను ఎంచుకొని స్థానిక మార్కెట్‌కు విక్రయించడానికి వెళతారు. కొన్ని కమ్యూనిటీలు ఈ గులాబీలతో సౌందర్య ఉత్పత్తులు, సాంప్రదాయ ఔషధం, ఆహారం, పానీయాలలో రోజ్ వాటర్, నూనెను తయారుచేస్తాయిజపాన్లో కోజి అచ్చుతో సాకే తయారీజపాన్లో పవిత్రమైన బహుమతిగా భావించే పానీయం ఒకటుంది. దానిపేరు సాకే. గింజలు, నీటితో తయారు చేసే ఆ ఆల్కహాలిక్ పానీయం జపాన్ లో పండుగలు, వివాహాలు, ఆచారాలు, ఇతర సామాజిక సాంçస్కృతిక సందర్భాలలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. జపనీస్ సంస్కృతిలో భాగమై΄ోయిన ఈ పానీయం పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడానికి కోజి అచ్చును ఉపయోగిస్తారు. ఈ అచ్చును హస్తకళాకారులు తయారు చేస్తారు. వీటిలో పదార్ధం దీనికి అవసరమైన ఉష్ణోగ్రత అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సిరియాలోని అలెప్పో ఘర్ సబ్బు కళఆలివ్ నూనె, లారెల్ ఆయిల్‌ను ఉపయోగించి సిరియాలో సబ్బు తయారుచేస్తారు. కొంతమంది కలిసి చేసే ప్రక్రియలో తరతరాల అనుభవం ఉంటుంది. ముందుగా పదార్థాలను ఎంపిక చేసి వండుతారు. ఆపై సంప్రదాయ సబ్బు మిశ్రమాన్ని కలిపి, మిద్దెలపైన ΄ోస్తారు. మిశ్రమం చల్లబడిన తర్వాత హస్తకళాకారులు పెద్ద చెక్క బూట్లు ధరించి, తగిన పరిమాణంలో కత్తిరిస్తారు. ఆ తర్వాత ఆ సబ్బులను చేతితో స్టాంప్ చేసి, వరుసగా పేర్చుతారు.ఉత్తర ఆఫ్రికా హెన్నా ఆచారాలుఉత్తర ఆఫ్రికా, మధ్య్ర ప్రాచ్యంలోని కమ్యూనిటీలు గోరింటాకు తోటలను సాగుచేస్తారు. హెన్నా పేస్ట్‌ను సాధారణంగా మహిళల అలంకారానికి ఉపయోగిస్తారు. ఇది ఆనందానికి చిహ్నం, దైనందిన జీవితంలో, పుట్టినరోజులు, వివాహాల వంటి పండుగ సందర్భాలలో ఉపయోగించబడుతుంది. దీని ఉపయోగం శతాబ్దాల నాటి సామాజిక నియమాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉంది.థాయిలాండ్ టోమ్యుమ్ కుంగ్ సూప్టోమ్యుమ్ కుంగ్ అనేది థాయిలాండ్‌లో ఒక సంప్రదాయ రొయ్యల సూప్. మూలికలతో ఉడకబెట్టి, స్థానిక మసాలా దినుసులను కలిపి ఈ రొయ్యల సూప్‌ను రుచిగా తయారుచేస్తారు. సూప్ ఒక విలక్షణమైన వాసన, శక్తివంతమైన రంగులను కలిగి ఉంటుంది. తీపి, పులుపు, కారం, క్రీము, కొద్దిగా చేదు వంటి అనేక రుచులను మిళితం చేస్తుంది. ఈ వంటకం ముఖ్యంగా వర్షాకాలంలో శక్తిని, ఆరోగ్యాన్నిప్రోత్సహిస్తుందని నమ్ముతారు. ఇది థాయిలాండ్‌లోని సెంట్రల్ ప్లెయిన్స్‌లోని బౌద్ధ నదీతీర సమాజాల పాక జ్ఞానం, పర్యావరణం, ఔషధ మూలికల గురించి వారి సాంప్రదాయ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. గుడ్లను అలంకరించే కళఉక్రెయిన్, ఎస్టోనియాలో మైనాన్ని ఉపయోగించి గుడ్డుకు సాంప్రదాయ నమూనాలు, చిహ్నాలను తీసుకువస్తారు. గుడ్లను అలంకరించే ఈ కళ ఈస్టర్‌తో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, మతంతో సంబంధం లేకుండా ఉక్రేనియన్ కమ్యూనిటీలకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. (చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!) -
సిరియా సంక్షోభం.. అసద్ కుటుంబానికి అండగా పుతిన్
మాస్కో: తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచివెళ్లిపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇదే సమయంలో ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్ రష్యాలో ఉన్నట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. రష్యా మీడియా ప్రకటనలో ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.సిరియాలో తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా విమానంలో బయలుదేరారు. అనంతరం, ఆయన విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాదానికి గురైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై మొదట రష్యా స్పందిస్తూ.. అసద్ చనిపోలేదని క్లారిటీ ఇచ్చింది. అనంతరం, అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పుకొచ్చాయి. ఈ ప్రకటనలో అసద్.. రష్యాలో సురక్షితంగా ఉన్నారని తెలిసింది.ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ సిరియాను వీడారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయానికి వచ్చారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది.BREAKING: 🇸🇾🇷🇺 Bashar al-Assad and his family are in Moscow, Russia and have been granted asylum. pic.twitter.com/7vO9SBMoGA— BRICS News (@BRICSinfo) December 8, 2024 -
ఉగ్ర చీఫ్ నుంచి దేశ సారథి దాకా!
బీరూట్: 14 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని ఎలాగోలా పరిపాలన సాగిస్తున్న అసద్‌ను చావుదెబ్బతీస్తూ దాడులు మొదలెట్టిన కేవలం 11 రోజుల్లో దేశంపై పట్టుసాధించిన అబూ మొహమ్మెద్ అల్ గోలానీ గురించి సర్వత్రా చర్చ మొదలైంది. జిహాదీ ఉగ్రవాదిగా మొదలైన ప్రస్థానం నేడు దేశాధినేత స్థాయిలో కొత్త పంథాలో కొనసాగనుంది. 42 ఏళ్ల గోలానీ 2003లో తొలిసారిగా అల్‌ఖైదాతో చేతులు కలిపారు. ఇరాక్‌లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. అమెరికాకు చిక్కి ఐదేళ్లు జైలుజీవితం గడిపారు. ఈ సమయంలోనే భావసారుప్యత ముఠాలను ఒక్కతాటి మీదకు తెచ్చి అల్‌ఖైదా.. అబూ బకర్ అల్ బాగ్దాదీ సారథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌ను స్థాపించింది. 2011లో సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించాలంటూ అబూబకర్.. గోలానీని సిరియాకు పంపించాడు. అక్కడ అల్‌ఖైదా అనుబంధ నుస్రా ఫ్రంట్‌ను స్థాపించారు. దీనిని ఆనాడే అమెరికా ఉగ్రసంస్థ ముద్రవేసింది. గోలానీని పట్టిస్తే ఒక కోటి డాలర్లు ఇస్తామని నజరానా ప్రకటించింది. 2013లో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యాక నుస్రా ఫ్రంట్‌ను ‘ఇరాక్ అల్‌ఖైదా’లో కలిపేసి కొత్తగా ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)’ను స్థాపించాని అబూబకర్ సూచించారు. అయితే ఐసిస్ ఏర్పాటు నచ్చక సొంతంగా నుస్రా ఫ్రంట్‌ను గోలానీ కొనసాగించారు. 2013లో గోలానీని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. 2016లో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుని సొంతంగా జభాత్ ఫతే అల్–షామ్(ది సిరియా కాంక్వెస్ట్ ఫ్రంట్)ను గోలానీ స్థాపించారు. ఇంకొక ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీర్ అల్ షామ్(సిరియా విమోచన సంస్థ)గా నామకరణం చేశారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో తన పట్టు నిలుపుకున్నారు. స్వతంత్రంగా పోరాటంచేసే వేర్వేరు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధిపత్యాన్ని అణచివేసి, వారిని తమలో కలుపుకుని సంస్థను మరింత పటిష్టవంతం చేశారు. తుర్కియే అండతో చెలరేగిపోయిన వేర్పాటువాదుల దాడుల్లో చనిపోయిన కుర్దుల కుటుంబాలను కలిసి మంచివాడిగా పేరుతెచ్చుకున్నారు. 2016లో తొలిసారిగా బహిరంగంగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అమెరికన్ జర్నలిస్ట్‌కు తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ సంస్థ పశి్చమదేశాలకు వ్యతిరేకంగా పనిచేయబోదని, సిరియాపై ఆంక్షలు విధించడం సబబుకాదని, పరోక్షంగా అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ పశి్చమదేశాల విదేశాంగ విధానాలను విమర్శించిన మాట వాస్తవమే. కానీ మేం అమెరికా, యూరప్ దేశాలతో యుద్ధాలకు దిగాలనుకోవట్లేము. మాకు శాంతిస్థాపనే ముఖ్యం’’ అని గోలానీ గతంలో వ్యాఖ్యానించారు. -
సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన
డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ చెందారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. కానీ ఆయన జాడ గురించి ప్రస్తావించలేదు. ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని రెబల్స్ పూర్తిగా ఆక్రమించారు. దీంతో బషర్ ఆల్-అసద్ అధ్యక్ష పదవిని రెబల్స్‌కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పరారయ్యారు. ఆ విమానాన్ని రెబల్స్ కూల్చి వేశారని, కూల్చి వేతతో బషర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రష్యా కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా అధికారాన్నిఅప్పగించాలని రెబల్స్ ఆదేశాలు ఇవ్వడంతో బషర్ అల్ అసద్ తన పదవిని విడిచిపెట్టారని, ఆపై దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.కానీ, అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలే వెళ్లే సమయంలో జరిపిన చర్చలలో తాము పాల్గొనలేదని పేర్కొంది. మరోవైపు, సిరియాని రెబల్స్ స్వాధీనం చేసుకున్న పరిణామల నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచామని, అయితే ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని పేర్కొంది.అసద్‌కు అండగా రష్యాసిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. బషర్ ఆల్-అసద్ పదవి విడిచి పెట్టిన అనంతరం జరుగుతున్న వరుస పరిణామలపై రష్యా గమనిస్తుంది. -
తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా.. అధ్యక్షుడు అసద్ విమానం కూల్చివేత!
డెమాస్కస్: సిరియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డెమాస్కన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోయారని రెబల్స్ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు.సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ కనిపించకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. అయితే, అసద్ విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల సమాచారం ఇచ్చాయి. ఈ ప్రదేశం లెబనాన్ గగనతలం పరిధిలో ఉంది. ఎవరైనా దీనిని కూల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.🚨Syrian rebels enter Bashar al-Assad's presidential palace in Damascus. pic.twitter.com/LsB7F2eNmF— Lou Rage (@lifepeptides) December 8, 2024మరోవైపు..హెచ్‌టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని నగరం డెమాస్కస్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసద్, ఆయన కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను, అధికార చిహ్నాలను తిరుగుబాటుదారులు ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాము రాజధాని చుట్టూ బలమైన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నామని సిరియా హోం శాఖ చెబుతోంది. ఇక, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.Syrian state television aired a video announcing the fall of President Bashar al-Assad. pic.twitter.com/p2wi5RI5Ov— Geo View (@theGeoView) December 8, 2024Em Deir ez-Zor, leste da Síria, cai a estátua de Hafez al-Assad. Na foto ao lado, arde a imagem de seu filho, Bashar al-Assad, que fugiu há pouco da Síria dando fim a um regime que perdura desde 1971. pic.twitter.com/zKTjccvbaB— GugaNoblat (@GugaNoblat) December 8, 2024ఇదిలా ఉండగా.. సిరియా పరిస్థితులపై తిరుగుబాటుదారులు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా..‘50 ఏళ్ల అణచివేత, 13 ఏళ్ల నేరాలు, దౌర్జన్యాలు, సుదీర్ఘ కాలం అవస్థలు, యుద్ధం, ఆక్రమిత సేనల నియంత్రణ నేటితో ముగిశాయి. ఇది ఒక చీకటి యుగం. ఇక సిరియాలో సరికొత్త శకం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం సిరియా ఎదురు చూస్తోందని’ తెలిపారు.Syrians tear down a large poster of Soleimani and Nasrallah outside the Iranian embassy in Damascus pic.twitter.com/n7F77kfNVN— Aleph א (@no_itsmyturn) December 8, 2024Did Bashar al-Assad's Plane Crash?Sudden Disappearance and Altitude Change Suggests It Was Shot Down!!Unconfirmed information is being circulated about the sudden descent of the plane that was reportedly carrying Assad after it disappeared from radar and dropped suddenly from… pic.twitter.com/fpFQxQaq0K— khaled mahmoued (@khaledmahmoued1) December 8, 2024అసద్ శకం ముగిసింది..మరోవైపు సిరియా ఆర్మీ కమాండ్ ఇప్పటికే అధ్యక్షుడు అసద్ శకం ముగిసిందని తమ ఆఫీసర్లకు సమాచారం అందించినట్లు మీడియా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో సిరియా ప్రధాన ప్రతిపక్షం హది అల్ బహ్ర కూడా దేశ రాజధాని అసద్ నుంచి విముక్తి పొందిందని తెలిపింది. -
సిరియా సంక్షోభం..ఆర్మీకి ట్రంప్ కీలక సూచన
వాషింగ్టన్:సిరియా సంక్షోభంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిరియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఈ వ్యవహారానికి అమెరికా సైన్యం దూరంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో తాజాగా ఓ పోస్టు చేశారు.సిరియా అధ్యక్షుడు అసద్ అమెరికా సాయానికి అర్హుడు కాదని పేర్కొన్నారు. తాజాగా సిరియాలో సంకక్షోభం ముదిరి రెబెల్స్ అక్కడి కీలక హోమ్స్ నగరాన్ని ఆక్రమించారు. ఈ పరిణామంతో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అసద్‌కు ఇరాన్, రష్యా మద్దతుండడం గమనార్హం.అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా సిరియా అంతర్యుద్ధంపై స్పందించారు. తమ ప్రభుత్వం సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ శనివారం(డిసెంబర్ 8)నోట్రె డ్యామ్ చర్చి ప్రారంభానికి ప్యారిస్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సిరియాలో కల్లోలం దేశం వీడిన అధ్యక్షుడు -
అసద్ పాలన అంతం
డమాస్కస్/బీరూట్: అర్ధ శతాబ్దానికిపైగా అసద్ కుటుంబ అరాచక, నిరంకుశ పాలనలో, అంతర్యుద్ధంతో అణచివేతకు, వెనకబాటుకు గురైన పశ్చిమాసియా దేశం సిరియా చరిత్రలో కీలక పరిణామం సంభవించింది. ఒక్కో నగరాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఆదివారం దేశ రాజధాని డమాస్కస్‌లో కాలుమోపి అసద్ పాలనకు తెరదించారు. అధ్యక్షుడుసహా భద్రతా బలగాలు దేశాన్ని విడిచి పారిపోవడంతో ఇక సిరియాకు స్వేచ్ఛ లభించిందని తిరుగుబాటుదారులు ప్రకటించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయిన ప్రజలు ఆయన పాలన అంతమైందని తెల్సి వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. భద్రతా బలగాలు వదిలివెళ్లిన తుపాకులు టీనేజర్లు తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అన్యాయంగా ఏళ్ల తరబడి కారాగారాల్లో చీకటి కొట్టాల్లో మగ్గిపోయిన అమాయకులందరినీ సయ్యద్నాయా జైలు నుంచి విడిపించినట్లు తిరుగుబాటుదారులు ప్రభుత్వ టెలివిజన్ ఛానెల్లో అధికారికంగా ప్రకటించారు. రక్షణశాఖ కార్యాలయం ఉన్న ప్రఖ్యాత ఉమాయద్ స్కే్కర్ వద్దకు చేరుకుని జనం మూడు నక్షత్రాలు, త్రివర్ణ సిరియా విప్లవ జెండాలను ఎగరేశారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ ఇడ్లిబ్ నుంచి మొదలెట్టి డమాస్కస్ సిటీదాకా రావడానికి తిరుగుబాటు సింహాలకు ఎంతోకాలం పట్టలేదు. మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని స్థానికులు ఆనందంతో చెప్పారు. దేశాధ్యక్షుడు, సైనిక కాపలాలేని అధ్యక్ష కార్యాలయం, అసద్ కుటుంబ నివాసాల్లోకి జనం చొరబడి అక్కడి విలువైన వస్తువులు, నిత్యావసర సరకులు ఎత్తుకెళ్లారు. దేశం రెబెల్స్ చేతుల్లోకి వెళ్లడంపై దేశ ప్రధాని మొహహ్మెద్ ఘాజీ అల్ జలానీ స్పందించారు. ‘‘ అధ్యక్షుడు పారిపోయారు. నేనెక్కడికీ పారిపోలేదు. నా సొంతింట్లోనే ఉన్నా. అధికారంలోకి రాబోతున్న విపక్షాలు, తిరుగుబాటుదారులకు ఇదే నా ఆహ్వానం. అధికార మార్పిడికి సిద్ధం. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేయడం, లూటీచేయడం మానుకోవాలి’’ అని ప్రధాని ఘాజీ జలానీ వీడియో సందేశంలో ప్రకటించారు. నిరంకుశ పాలన ముగిందని తెలిసి గత 14 ఏళ్లుగా తుర్కియే, జోర్డాన్, లెబనాన్ దేశాల్లో తలదాచుకుంటున్న సిరియన్లు చాలా మంది మళ్లీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఇడ్లిబ్ వద్ద జాతీయరహదారి వద్ద క్యూ కట్టిన కార్లతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లెబనాన్‌లోని మస్కా బోర్డర్ గుండా సిరియన్లు లోపలికి వస్తున్నారు. ‘‘ బషర్ పాలనతో పోలిస్తే ఇకపై సిరియాలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉండొచ్చు. అందుకే స్వదేశం వెళ్తున్నాం’’ అని హమా నుంచి శరణార్థిగా లెబనాన్‌కు వచ్చిన సమీ అబ్దెల్ లతీఫ్ చెప్పారు.మెరుపువేగంతో ఆక్రమణ2018 ఏడాది తర్వాత తిరుగుబాటుదారులు మళ్లీ డమాస్కస్ దాకా రాలేకపోయారు. కానీ నవంబర్ 27 నుంచి విపక్షాల దన్నుతో రెబల్స్ మెరుపువేగంతో ముందుకు కదిలారు. సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్న ఇరాన్, రష్యాల నుంచి అసద్ సైన్యానికి ఎలాంటి ఆయుధ, సైనిక సాయం లేకపోవడంతో తిరుగుబాటుదారులకు ఎదురే లేకుండాపోయింది. అలెప్పో, హమా, హోమ్స్ మొదలు సిరియా దక్షిణప్రాంతాన్నంతా ఆక్రమించిన రెబెల్స్ వడివడిగా రాజధాని డమాస్కస్ వైపుగా కదిలి విజయపతాకం ఎగరేశారు. హయత్ తహ్రీర్ అల్–షామ్(హెచ్‌టీఎస్) గ్రూప్ నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులు అసద్ సైన్యంతో పోరాడి యావత్ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 2017 నుంచే వాయవ్య సిరియా మొత్తాన్ని పాలిస్తున్న హెచ్‌టీఎస్ గ్రూప్ ఇప్పుడు యావత్సిరియాను సురక్షిత దేశంగా ఏ విధంగా పాలిస్తుందో వేచిచూడాల్సిందే. అంతర్యుద్ధాన్ని రూపుమాపి, అమెరికా ఆంక్షలను తట్టుకుని దేశాన్ని ముందుకు నడిపించాల్సి ఉంది. అంతర్జాతీయ సమాజంతోపాటు, మైనారిటీల మెప్పు పొందేందుకు బహుళత్వాన్ని, పరమత సహనాన్ని సాధించేందుకు హెచ్‌టీఎస్ అధినేత అబూ మొహమ్మెద్ గోలానీ ఏ మేరకు సిద్ధపడతారోనని పశ్చిమాసియా దేశాలు ఎదురుచూస్తున్నాయి. ‘‘తక్షణం జెనీవాలో చర్చలు మొదలెట్టి కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు, సాధారణ రాజకీయ, అధికార మార్పిడి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి’’ అని ఐరాసలో సిరియా రాయబారి గెయిర్ పెడర్సన్ కోరారు. సిరియాలో అసద్పాలన అంతమైన నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్, రష్యా, తుర్కియే, ఖతార్ దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. అదును చూసి ఆక్రమించిన ఇజ్రాయెల్సిరియాతో సరిహద్దును పంచుకుంటున్న ఇజ్రాయెల్ ఈ పరిణామాన్ని తనకు అనువుగా మార్చుకుంటోంది. 1974లో కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ గోలన్‌హైట్స్ సమీప నిస్సైనికీకరణ(బఫర్‌జోన్) ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సేనలు ఆక్రమించాయి. యుద్ధం సందర్భంగా 1967 జూన్‌లో సిరియా నుంచి గోలన్‌హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన విషయం విదితమే. దేశం తమ స్వాధీనంలోకి వచ్చిన నేపథ్యంలో తన పేరును అహ్మద్ అల్షారాగా గోలానీ మార్చుకున్నారు. తొలిసారిగా డమాస్కస్‌లోని ఉమయ్యాద్ మసీదుకు వచ్చి అందరి సమక్షంలో ప్రసంగించారు. ‘‘ ప్రభుత్వ సంస్థల వద్ద కాల్పులు జరపకండి. అధికార మార్పిడి జరిగేదాకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రధాని ఘాజీ జలానీ సారథ్యంలోనే పనిచేస్తాయి’’ అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఆపేందుకు సోమవారం ఉదయం దాకా డమాస్కస్‌లో కర్ఫ్యూ విధించారు. ‘‘ సిరియా ఇప్పుడు అందరికీ. డ్రూజ్‌లు, సున్నీలు, అల్లవీట్, మైనారిటీలందరికీ సమాన హక్కులుంటాయి’’ అని రెబల్ కమాండర్ అనాస్ సల్ఖాదీ ప్రకటించారు. రెబల్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆదివారం యెమెన్ ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్‌సహా చాలా యూరోపియన్ దేశాలు అసద్ పాలన అంతంపై హర్షంవ్యక్తంచేశాయి. 🚨Breaking NewsDamascus has fallen. Syria Rebel forces took over the capital.🇸🇾 Assad is expected to leave the country soon, US officials say. pic.twitter.com/YAsXFu0lO1— MediaMan (@Mr_Sheriiii) December 8, 2024సురక్షితంగా భారతీయులు న్యూఢిల్లీ: అసద్ ప్రభుత్వం కూలిపోయి సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లినాసరే అక్కడి భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత సర్కార్ ఆదివారం స్పష్టంచేసింది. డమాస్కస్‌లో భారత రాయబార కార్యాలయం యథాతథంగా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్కడి భారతీయులతో ఇండియన్ ఎంబసీ సంప్రతింపులు జరుపుతోందని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆయా వర్గాలు వెల్లడించాయి.రష్యాలో అసద్ ?మిత్రదేశాలు ఇరాన్, రష్యాల నుంచి సైనికసాయం అందక, సొంత సైన్యంతో తిరుగుబాటుదారులను ఎదుర్కొనే సామర్థ్యంలేక అధ్యక్షుడు అసద్ దేశాన్ని వీడారు. రష్యా తయారీ ఇలూషిన్–ఐఎల్76 రకం సిరియా ఎయిర్‌ఫ్లైట్ నంబర్ 9218 విమానంలో ఆదివారం తెల్లవారుజామునే అసద్ దేశం వదిలి పారిపోయారని సిరియా స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అసద్ రష్యా లేదా ఇరాన్‌కు పారిపోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే అసద్‌కు, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించినట్లు ఆదివారం రాత్రి వార్తలు వెలువడ్డాయి. ఆయన మాస్కో చేరుకున్నట్లు తెలిపాయి. అసద్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారుల జాడ కూడా తెలీడంలేదు. సైన్యాధికారులు ఇరాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. దేశం విడిచివెళ్లడానికి ముందే అసద్.. తిరుగుబాటుదారులతో హడావిడిగా చర్చలు జరిపి శాంతియుతంగా అధికార మార్పిడిపై తగు సూచనలు చేసి వెళ్లారని రష్యా విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇంకా తమ సైనిక స్థావరం సిరియాలోనే కొనసాగుతుందని రష్యా స్పష్టంచేసింది. రష్యా ముఖం చాటేయడంతోనే అసద్ పారిపోయాడని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.సుస్థిర శాంతి సాధ్యమా?ఇన్నాళ్లూ అసద్ ఏలుబడిలో యావత్ సిరియా లేదని వాస్తవ పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. 14 రాష్ట్రాలకుగాను కేవలం మూడు రాష్ట్రాల్లోనే అసద్ పాలన కొనసాగుతోంది. మిగతా చోట్ల వేర్వేరు తిరుగుబాటుదారుల కూటములు, మిలిటెంట్ ముఠాలు పాలిస్తున్నాయి. తక్కువ ప్రాంతానికి పరిమితమైనాసరే ఇరాన్, రష్యాల ప్రత్యక్ష సహకారం ఉండబట్టి అసద్ పరిపాలిస్తున్న ప్రాంతానికి మాత్రమే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీఎస్ తిరుగుబాటుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. గోలన్హైట్స్సహా కొంతభాగాన్ని దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.زندانیان آزاد شده از زندان صیدنایاPrisoners released from Saydnaya Prison#دمشق #سوریه #Syria #Damascus #بشار_الأسد pic.twitter.com/HI0ZW6G9H0— Nima Cheraghi (@CheraghiNima) December 8, 2024 -
డెమాస్కస్ శివార్లకు చొచ్చుకొచ్చిన రెబెల్స్
డెమాస్కస్: సిరియాలో అస్పాద్ ప్రభుత్వంపై తిరుగుబాటుదార్ల పైచేయి కొనసాగుతోంది. శనివారం రాత్రి వారు హోమ్స్ నగరంలోని శివారు ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాజధాని డెమాస్కస్ శివార్ల దాకా చొచ్చుకొచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హోమ్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అస్సాద్ అనుకూల బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పల్మీరా తదితర ప్రాంతాల నుంచి బలగాలను, సైనిక వాహనాలను రప్పిస్తోంది. అంతకుముందు, దక్షిణ ప్రాంతంలోని నా లుగో నగరం దారాలో తిరుగుబాటుదార్లు తిష్టవేయడం తెల్సిందే. పరిస్థితులు వేగంగా మారుతుండటంతో బషర్ అల్ అస్సా ద్ ప్రభుత్వం యూఏఈ, జోర్డాన్, ఇరాక్ ప్రభుత్వాలను ఆయుధ సాయం, నిఘా సమాచారం అందించాలంటూ కోరినట్లు చెబుతున్నారు. పరిస్థితులు విషమిస్తున్నందున వెంటనే దేశం విడిచి వెళ్లాలని అస్సాద్‌కు అరబ్ నేతలు కొందరు సూచించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.అమెరికా జోక్యం చేసుకోబోదు: ట్రంప్సిరియా సంక్షోభంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని అమెరికా కాబో యే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘సిరియా సమస్యల్లో చిక్కుకుంది. అయితే, అది మా మిత్ర దేశం కాదు. అమెరికాకు ఆ దేశంతో సంబంధం లేదు. అది మా పోరాటం కాదు. వాళ్లను పోరాడుకోనివ్వండి. మేం తలదూర్చం’అని తెలిపారు. ‘ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలమునకలుగా ఉన్న రష్యా మిత్రదేశం సిరియాలో తిరుగుబాటుదార్లను ఆపలేకపోతోందనుకుంటున్నా. సిరియా నుంచి రష్యా బలగాలను వెళ్లగొడితే అది రష్యాకే మంచిది. ఎందుకంటే సిరియా లో ఉండి రష్యా లాభ పడిందేమీ లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
సిరియాలో దాడుల టెన్షన్.. భారత పౌరులకు హెచ్చరికలు జారీ
డెమాస్కస్: సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు విజృంభిస్తున్నారు. ప్రభుత్వ దళాలు చేతులెత్తేసిన కారణంగా నగరాలకు నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిరియాలో ఉన్న వారందరూ డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తెలిపింది. వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది.సిరియాలో దాడుల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని తెలిపింది. అలాగే, ఇప్పటికే సిరియాలో ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అక్కడ ఉన్న వారంతా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంలో టచ్‌లో ఉండాలని కోరింది. భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఇదే సమయంలో అత్యవసర సహాయం కోసం +963993385973, hoc.damascus@mea.gov.inను సంప్రదించాలని పేర్కొంది.ఇదిలా ఉండగా.. సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగాయి. హోమ్స్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు హెచ్‌టీఎస్ ప్రకటించింది. హోమ్స్ కూడా ప్రభుత్వ దళాల చేతుల్లోంచి చేజారిపోతే, తిరుగుబాటుదళాల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉంది.Travel advisory for Syria:https://t.co/bOnSP3tS03 pic.twitter.com/zg1AH7n6RB— Randhir Jaiswal (@MEAIndia) December 6, 2024మరోవైపు తూర్పు సిరియాలో తుర్కియేకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులు కూడా క్రియాశీలమయ్యారు. వారు ఇరాక్ సరిహద్దుల్లోని దేర్ ఎల్ జోర్ నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. జోర్డాన్ సరిహద్దుల దగ్గర కూడా అధ్యక్షుడు అసద్ సేనలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ పలు చెక్ పాయింట్ల నుంచి ప్రభుత్వదళాలు పారిపోయాయి. వీటిని స్థానిక సాయుధవర్గాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దక్షిణ ప్రాంతంలో డ్రూజ్ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుండడం అసద్ బలగాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరియాతో తన సరిహద్దును జోర్డాన్ మూసివేసింది. -
చేజారిన మరో నగరం
బీరూట్: బషర్ అల్ అస్సాద్ సారథ్యంలోని సిరియా ప్రభుత్వం మరో వైఫల్యాన్ని ఎదుర్కొంది. ప్రభుత్వ సేనలతో మూడు రోజుల తరబడి పోరాడిన సిరియా తిరుగుబాటుదారులు ఎట్టకేలకు హమా నగరాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో విస్తీర్ణంపరంగా దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన హమా ఇప్పుడు తిరుగుబాటుదారుల వశమైంది. హమా నగరంలోని పోలీసు కమాండ్ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం, కేంద్ర కారాగారంపై తిరుగుబాటుదారులు పట్టుసాధించారు. జైళ్లో ఉన్న వందల మంది తోటి తిరుగుబాటుదారులు, ఖైదీలను బయటకు వదిలేశారు. తిరుగుబాటుదారులు నగరం మధ్యలోకి వచ్చేయడంతో ఘర్షణలతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇష్టంలేక తాము నగరాన్ని వదిలేసి వచి్చనట్లు సైన్యం గురువారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ సిటీపై ఇప్పుడు తిరుగుబాటుదారులు గురిపెట్టారు. ఆక్రమించిన హమాకు ఈ నగరం కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘‘దేశ రాజధాని డమాస్కస్‌కు సింహద్వారంగా హోమ్స్ సిటీకి పేరుంది. డమాస్కస్ నుంచి పాలన సాగిస్తున్న అస్సాద్‌కు ఇది మింగుడుపడని వ్యవహారమే. ఎందుకంటే హమాపై పట్టు కోల్పోయారంటే అస్సాద్ త్వరలో దేశంపైనా పట్టుకోల్పోతారని అర్థం’’అని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంస్థ ‘వార్ మానిటర్’చీఫ్ రమీ అబ్దుర్రహమాన్ వ్యాఖ్యానించారు. ‘‘మేం హమాను గెలిచాం’’అని బుధవారం అలెప్పో సిటీలో స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుబాటు సంస్థ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేత అల్గోలానీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఆక్రమణలతో తిరుగుబాటుదారులు మున్ముందుకు రాకుండా రోజుల తరబడి నిలువరిస్తూ ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2011 మార్చిలో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. చివరకు తుర్కియే దన్నుతో తిరుగుబాటుదారులు, జిహాద్ ఉగ్రవాదులు, సిరియా వ్యతిరేక శక్తుల సమూహంగా కొత్త రూపం సంతరించుకుని ఇటీవలి కాలంలో ఉధృతమైంది. ప్రస్తుతం అస్సాద్ ప్రభుత్వపాలనానీడలో కేవలం కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గతంలో అస్సాద్‌కు పూర్తి అండదండలు అందించిన రష్యా, ఇరాన్‌లు ఇప్పుడు సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్నాయి. మిత్ర దేశం సిరియాకు సైనిక, ఆర్థిక సాయం చేసేంత తీరిక వాటికి లేదు. ఉక్రెయిన్‌తో రష్యా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధంలో మునిగిపోవడం తెల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుని ఇటీవలి కొద్దినెలలుగా తిరుగుబాటుదారులు తమ ఆక్రమణలకు వేగం పెంచారు. తిరుగుబాటుదారులు బుధవారం ఆక్రమించిన హమా పేరు మూడు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 1982 ఊచకోత ఈ నగరంలోనే జరిగింది. అస్సాద్ తండ్రి హఫీజ్ కర్కశ ఏలుబడిలో ప్రభుత్వం ఇస్లామిక్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి ఊచకోతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు
న్యూయార్క్:సుదీర్ఘంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. సిరియాలో అంతర్యుద్ధానికి కారణమైన ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ రెబల్స్‌కు ఉక్రెయిన్ సాయం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఐక్యరాజ్యసమితి(యూఎన్)లో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరియాలో అధ్యక్షుడు బషర్ అసద్ అల్ పాలనపై తిరుగుబాటు చేస్తున్న రెబల్స్‌కు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అండదండలున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ తమకు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయాన్ని కొంత మంది రెబల్స్ బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు.రెబల్స్‌కు శిక్షణ కూడా ఇస్తున్నారన్నారు. కాగా,రెబల్స్ నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తూ తిరుగుబాటుదారులపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. -
సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం!
సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదార్ల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికిపైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడం తాలూకు మూలాలు ఉక్రెయిన్–రష్యా, ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఉన్నాయి.2011లో ‘అరబ్ వసంతం’ పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకూ స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణచేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సైన్యంలో అసద్‌ను వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదార్లుగా మారారు. దేశమంతటా వేర్వేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్‌ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యం. అసద్ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదార్లకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్‌కు మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. ఉగ్ర సంస్థలకు చేదు అనుభవం సిరియా పరిణామాలను అల్‌ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదార్లకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సాయంతో విరుచుకుపడటంతో అల్‌ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు సిరియాలో పలు ప్రావిన్స్‌లను తిరుగుబాటుదార్లు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వా«దీనం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులూ ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటినుంచీ కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల అ«దీనంలోనే ఉండిపోయింది.నాయకత్వం ఎవరిది? సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’కు హయత్ తా హ్రీర్ అల్–షామ్ సంస్థ నాయకత్వం వహి స్తోంది. ఇది గతంలో అల్–నుస్రా ఫ్రంట్ పేరు తో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్‌లో అధికారం చెలాయి స్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్‌లు తాహ్రీర్ అల్–షామ్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడే ఎందుకీ అలజడి? అసద్ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హెజ్బొల్లా గ్రూప్‌కూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటినుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడకుంటూ తిరుగుబాటుదార్లు క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’ పేరిట కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్‌కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్లిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా? లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలో తొలి వర్ణమాల ఇదే!
సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది. దాదాపు 4,400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాల పరిశోధకుల బృందం ప్రకటించింది. క్రీస్తుపూర్వం 2,400 సంవత్సరంలో పశ్చిమ సిరియాలోని ప్రాచీన పట్టణ ప్రాంతం టెల్ ఉమ్–ఎల్ మర్రా వద్ద జరిపిన తవ్వకాల్లో చేతి వేళ్ల ఆకృతిలో ఉన్న చిన్న మట్టి వస్తువులపై ఈ వర్ణమాలను గుర్తించారు. ఒక సమాధిని తవ్వితీయగా ఇవి లభించాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ నిర్ధారించిన దాని కంటే ఈ లిపి మరో 500 ఏళ్ల క్రితంనాటిదని అంచనావేస్తున్నారు. ఆమ్స్టర్ డ్యామ్ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా జాన్ హాప్కిన్స్ వర్సిటీలో పురాతత్వవేత్త, ప్రొఫెసర్ గ్లెన్ స్వార్జ్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో 16 ఏళ్ల క్రితమే తొలిసారిగా తవ్వకాలు జరిగాయి. తొలి కంచు యుగంనాటి ఈ సమాధిలో ఆరు అస్తిపంజరాలు, బంగారు, వెండి ఆభరణాలు, వంట పాత్రలు, ఒక బాణం, మృణ్యయ పాత్రలను కనుగొన్నారు. తొలి తరం నాగరికతలు తమలో తాము సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కొత్త తరహాలో అనుసంధాన విధానాలను అనుసరించేవని ఈ మట్టి వస్తువులపై ఉన్న రాతలను బట్టి అర్థమవుతోందని పరిశోధకులు చెప్పారు. ‘‘ నాటి సమాజాల్లో రాజరికం, అత్యున్నత స్థాయి వర్గాలే కాదు సామాన్యులూ వర్ణమాల ద్వారా రాయగలిగే సామర్థ్యాలను సంతరించుకునే ప్రయత్నాలు చేశారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు’’ అని స్వార్జ్ అన్నారు. ‘‘ వీటిపై ఉన్న లిపి లాంటి అక్షరాలను చూస్తుంటే వేర్వేరు పాత్రల్లో ఏమేం నిల్వచేశారో తెలిసేందుకు ఒక్కో పాత్రపై ‘లేబుల్’లాగా ఈ లిపిని వాడి ఉంటారని అర్థమవుతోంది. ఈ అక్షరాలను మనం తర్జుమా చేయకుండా అసలు ఇవేంటో ఒక నిర్ధారణకు రావడం చాలా కష్టం. కార్భన్–14 డేటింగ్ ద్వారా తెలిసిందేమంటే ఈ రాతలు చరిత్రలో ఇప్పటిదాకా కనుగొన్న వర్ణమాల కంటే పురాతనమైనవని తేలింది. క్రీస్తుపూర్వం 1900 సమీపకాలంలో ఈజిప్ట్, పరిసర ప్రాంతాల్లో తొలిసారిగా వర్ణమాల రూపొందినట్టు ఇన్నాళ్లూ భావించాం. కానీ సిరియాలో వెలుగుచూసిన అక్షరాలను చూస్తుంటే ఎన్నడూ ఊహించని ప్రదేశాల్లోనూ వర్ణమాలకు మూలాలున్నాయని అర్థమవుతోంది’’ అని స్వార్జ్ వ్యాఖ్యానించారు. నవంబర్ 21న జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఓవర్సీస్ రీసెర్చ్ వార్షిక సమావేశంలో స్వార్జ్ తన పరిశోధన వివరాలను బహిర్గతంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిరియా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ప్రాణ నష్టం
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 15 మంది చనిపోయినట్టు సిరియా స్టేట్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా రాజధానికి పశ్చిమాన ఉన్న మజ్జే, ఖుద్సాయా శివారులో ఉన్న భవనాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 15 మంది మరణించినట్టు స్థానిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా సిరియాలో ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అయితే, గాజా యుద్ధానికి దారితీసిన ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత ఏడాది అక్టోబర్ 7 దాడి చేసినప్పటి నుండి డెమాస్కస్‌లో దాడులను వేగవంతం చేసింది. హిజ్బొల్లాకు చెందిన కమాండర్లు, రివల్యూషనరీ గార్డ్లు మజ్జేలో నివసిస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 🔶 Reports: The IDF attacked the Almazehh neighborhood in Damascus - shortly after a senior Iranian adviser landed in the cityAccording to reports, in the last few minutes the Air Force carried out an airstrike in the Almazzeh neighborhood .. pic.twitter.com/hMnhuiAJzq— Monika (@Monika_is_His) November 14, 2024 ఇదిలా ఉండగా.. హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 🇮🇱🇸🇾 Israel wipes out an entire neighborhood in Damascus, Syria pic.twitter.com/TarWpmw8We— HOT SPOT (@HotSpotHotSpot) November 14, 2024 -
సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం
సిరియాలోని డమాస్కస్‌కు దక్షిణంగా ఇరాన్ అనుకూల గ్రూపు హెజ్బొల్లాకు చెందిన అపార్ట్‌మెంట్‌పై ఇజ్రయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన ఓ కమాండర్‌తో సహా తొమ్మిది మంది మరణించారని ఓ వార్ మానిటర్ వెల్లడించారు. లెబనీస్ పౌరసత్వం కలిగిన ఆ హెజొబొల్లా కమాండర్.. సిరియాలో కీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. సెప్టెంబరు 23న లెబనాన్‌లోని హిజ్బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది. సిరియా రాజధానికి దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ ఇజ్రాయెల్ దాడి చేసింది. లెబనీస్ కుటుంబాలు, హెజ్బొల్లా సభ్యులు నివసించే అపార్ట్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయటంతో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన కమాండర్ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతను లెబనీస్ జాతీయుడు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాకు చెందిన నలుగురు పౌరులు (ఒక మహిళ , ఆమె ముగ్గురు పిల్లలు), హిజ్బొల్లాల కమాండర్‌తో సహా మరో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన కమాండర్ పేరు తెలియరాలేదు’’అని బ్రిటన్ ఆధారిత వార్ మానిటర్‌కు నాయకత్వం వహిస్తున్న రామి అబ్దేల్ రెహ్మాన్ వెల్లడించారు. మరోవైపు.. శనివారం ఉత్తర, వాయువ్య సిరియాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన ఐదుగురిలో నలుగురు ఇరాన్ అనుకూల ఫైటర్లు ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. సిరియాలో వందలాది దాడులకు పాల్పడింది. హెజ్బొల్లా సైనిక స్థావరాలు, ఫైటర్ల లక్ష్యంగా దాడులు చేసింది. సిరియాలో ఇరాన్ తన ఉనికిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తూ వస్తోంది. -
సిరియా: ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు
న్యూయార్క్: సిరియాలోని ఐసిస్ స్థావరాలపై పలు వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. తమ దాడులతో ఐసిస్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ‘‘శనివారం ఉదయం ఐసిస్ క్యాంప్‌లపై అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు వైమానిక దాలు చేశాం. ఈ దాడులు.. అమెరికా, దాని మిత్రదేశాలు , భాగస్వాములపై దాడులకు ప్లాన్ చేయటం, దాడుల నిర్వహించటం వంటి ఐసిస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ దాడులుకు సంబంధించి సమాచారం అందిస్తాం’ అని అమెరికా పేర్కొంది. అయితే ఈ దాడుల్లో మృతుల సంఖ్య తదితర వివరాలు అమెరికా వెల్లడించకపోవటం గమనార్హం.U.S. Central Command conducts airstrikes against multiple ISIS camps in Syria. pic.twitter.com/i8Nqn1K97p— U.S. Central Command (@CENTCOM) October 12, 2024ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు నెల చివరిలో ఐసిస్ స్థావరాలే టార్గెట్‌గా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది హతమైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
సిరియాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
డమాస్కస్:సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోగా 11 మంది దాకా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో పిల్లలు,మహిళలు ఉన్నట్లు సిరియా మీడియా వెల్లడించింది. దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపింది.ఇజ్రాయెల్‌లోని గోలాన్ హైట్స్ నుంచి మూడు మిసైల్స్ అపార్ట్‌మెంట్‌పైకి దూసుకువచ్చి ఈ దాడులు జరిపాయి. ఇరాన్ మిత్రదేశమైన సిరియాపై కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. అక్టోబర్7 హమాస్ తమపై జరిపిన మెరుపు దాడుల తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.ఇదీ చదవండి: హెజ్బొల్లా చితికిపోయింది: అమెరికా -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
సహించరాని ఉన్మాదం
ముందు ఇరుగుపొరుగుతో... ఆ తర్వాత పశ్చిమాసియా దేశాలన్నిటితో ఉన్మాద యుద్ధానికి ఇజ్రా యెల్ సిద్ధపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలూ, దేశాలూ ఈ మాదిరిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతే ఇది కాస్తా ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదని మంగళ, బుధవారాల్లో లెబనాన్, సిరియాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలియజెబుతున్నాయి. వరసగా రెండురోజులపాటు పేజర్లనూ, వాకీటాకీలనూ, ఇళ్లల్లో వినియోగించే సౌరశక్తి ఉపకరణా లనూ పేల్చటం ద్వారా సాగించిన ఆ దాడుల్లో 37 మంది మరణించగా నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.లెబనాన్‌లో హిజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయటానికే ఈ దాడులు చేసినట్టు కనబడుతున్నదని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అర్ధసత్యం మాత్రమే. ప్రాణాలు కోల్పోయినవారిలో మిలిటెంట్లతోపాటు పసిపిల్లలూ, అమాయక పౌరులూ, ఆరోగ్యసేవా కార్య కర్తలూ ఉన్నారు. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు... అదొక రాజకీయ పక్షం, ధార్మికసంస్థ. కనుక ఆ పేజర్లు సామాన్య పౌరులకూ చేరివుండొచ్చు.గాజాలో దాదాపు ఏడాదిగా మారణ హోమం సాగుతోంది. దాన్ని ఆపటానికీ, శాంతియుత పరిష్కారం సాధించటానికీ ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. మొన్న ఫిబ్రవరిలో అమెరికా వైమానిక దళ సీనియర్ ఎయిర్మాన్ ఆరోన్ బుష్నెల్ ఆత్మాహుతి చేసుకునేముందు ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సందేశం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. కళ్లెదుట మారణ హోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవటాన్ని... తన చేతులకూ నెత్తురంటడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆ సందేశంలో ఆయన రాశాడు. అమెరికాకు చీమ కుట్టినట్టయినా లేదు. లెబనాన్, సిరియాల్లో జరిగిన దాడులపై ఒక మీడియా సమావేశంలో పదే పదే ప్రశ్నించినా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ జవాబిచ్చేందుకు నిరాకరించటం దీన్నే ధ్రువపరుస్తోంది. ఉగ్రవాదానికి విచక్షణ ఉండదు. తన విధ్వంసకర చర్యలు ఎవరికి చేటు చేస్తాయన్న ఆలోచన ఉండదు. వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి లోనయితే జరిగే నష్టంకన్నా రాజ్యాలు ఉగ్రవాదాన్నిఆశ్ర యిస్తే కలిగే నష్టం అనేక వందల రెట్లు ఎక్కువ. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అలాంటిధూర్త రాజ్యాలు వేరే దేశాలపై సైతం ఆ మాదిరిగానే దుందుడుకు చర్యలకు దిగి ప్రపంచాన్నిపాదాక్రాంతం చేసుకోవటానికి కూడా సిద్ధపడతాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను అందరూ వ్యతిరేకించింది అందుకే. ఒక దేశాన్ని దురాక్రమించి, అక్కడి పౌరులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేస్తూ అందుకు ప్రతిఘటన ఉండకూడదనుకోవటం తెలివి తక్కువతనం. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడి, చివరకు ఒప్పందం కుదరబోతున్న దశలో సైతం అడ్డం తిరిగి మొండికేసిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాలతో తరచు గిల్లికజ్జాలకు దిగటంతోపాటు ఇథియోపియా, ఉగాండా, నైజర్, కెన్యావంటి సబ్ సహారా దేశాల, లాటిన్ అమె రికా దేశాల నియంతలకు ఆయుధాలిచ్చి అండదండలందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. చూస్తూ ఉంటే మేస్తూ పోయినట్టు ప్రపంచం స్థాణువై మిగిలిపోతే ఈ అరాచకాలకు అంతంఉండదు. సమస్య ఉన్నదని గుర్తించటం దాని పరిష్కారానికి తొలి మెట్టు. కానీ ఇంతవరకూ అమెరికాగానీ, దానికి వంతపాడుతున్న యూరప్ దేశాలుగానీ అసలు పాలస్తీనా అనేది సమస్యే కానట్టు నటిస్తున్నాయి. తాజాగా జరిగిన పేలుళ్ల వెనకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగెరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారుచేయటం లేదనీ, హంగెరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకుని ఉత్పత్తి చేస్తోందనీ తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ఇందుకు తమకు పశ్చిమాసియా దేశంనుంచి నగదు ముడుతున్నదని సంస్థ వివరించింది. హంగెరీ మీడియా సంస్థ కథనం ఇంకా విచిత్రంగా ఉంది. అది చెప్తున్న ప్రకారం బీఏసీ కాదు, బల్గేరియాలోని నోర్టా గ్లోబల్ అనే సంస్థ ఈ పేజర్లను సరఫరా చేసిందట. బీఏసీకి ఉత్పాదక సామర్థ్యంలేదనీ, అది కేవలం ఒక ఏజెంటు మాత్రమే ఉండే కన్సెల్టింగ్ ఏజెన్సీ అనీ హంగెరీ ప్రభుత్వం చెబుతోంది. ఇక బల్గేరియా అయితే అసలు పేజర్ల ఉత్పాదక సంస్థ తమ గడ్డపైనే లేదంటున్నది. ప్రజల ప్రాణాలు తీసే దుష్ట చర్యకు పాల్పడి నేరం తాలూకు ఆనవాళ్లు మిగల్చకపోవటం, అది ఘనకార్యమన్నట్టుసంబరపడటం ఉగ్రవాద సంస్థల స్వభావం. దాన్నే ఇజ్రాయెల్ కూడా అనుకరిస్తూ పైచేయి సాధించానని భ్రమపడుతున్నట్టుంది. కానీ ఈ మాదిరి చర్యలు మరింత ప్రతీకార వాంఛను పెంచుతాయి తప్ప దాని స్థానాన్ని పదిలం చేయలేవు.ఇంతవరకూ పేలుళ్ల బాధ్యత తనదేనని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. తమ శత్రువు ఎక్కడున్నా వెదికి వెదికి పట్టుకుని మట్టుబెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందుకు వాడుకోవటం ఇజ్రాయెల్‌కు కొత్తగాదు. ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి చొరబడి మాల్వేర్ను ప్రవేశ పెట్టడం, పౌరుల గోప్యతకు భంగం కలిగించటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్లు పేలిపోయేలా చేయటం ఇజ్రాయెల్ సంస్థల నిర్వాకమే. మిత్రపక్షం కదా అని ధూర్త రాజ్యాన్ని ఉపేక్షిస్తే అదిప్రపంచ మనుగడకే ముప్పు కలిగిస్తుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ చర్యలు సారాంశంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘన. అందుకు పర్యవసానం లేకపోతే శతాబ్దాలుగా మానవాళి సాధించుకున్న నాగరిక విలువలకు అర్థం లేదు. -
హెజ్బొల్లా క్షిపణి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
మస్యాఫ్: సిరియాలోని హెజ్బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. వైమానిక దళానికి చెందిన ఎలైట్ షాల్డాగ్ యూనిట్ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. -
Intercontinental Cup football 2024: టీమిండియాకు ‘సున్నా’
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్ మార్క్వెజ్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంటర్ కాంటినెంటల్ కప్ తొలి పోరులో తమకంటే బలహీనమైన మారిషస్‌పై ఒక్క గోల్ కూడా కొట్టకుండా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఊహించినట్లుగానే తమకంటే పటిష్టమైన సిరియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గోల్ లేకుండా ఆటను ముగించింది. సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా 3–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోరీ్నలో మారిషస్ జట్టు రెండో స్థానంలో నిలువగా... భారత్ చివరిదైన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషస్‌పై గెలిచింది. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన సిరియా అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిరియా తరఫున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్...76వ నిమిషంలో మొహసీన్ దలెహో గోల్స్ సాధించారు. ఆట చివర్లో పాబ్లో డేవిడ్ (90+6 నిమిషంలో) మరో గోల్ కొట్టి టోర్నీని ముగించాడు. భారత్ కంటే ఒక గోల్ తక్కువగా ఇచి్చనందుకు మారిషస్ జట్టుకు రెండో స్థానం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సిరియా జట్టుకు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌ను అందజేశారు. సమష్టి వైఫల్యం... ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సిరియా వరుసగా దాడులు చేసింది. దానికి 7వ నిమిషంలోనే ఫలితం దక్కింది. మహమూద్ బాక్స్ ఏరియా నుంచి కొట్టిన షాట్‌ను భారత డిఫెండర్లు నిలువరించగలిగినా... రీ»ౌండ్లో అతను దానిని ఛేదించగలిగాడు. గుర్ప్రీత్ ఆపలేకపోవడంతో సిరియా ఖాతాలో గోల్ చేరింది. తొలి 25 నిమిషాల్లో భారత పోస్ట్‌పై సిరియా ఐదుసార్లు అటాక్ చేయగా, భారత్ ఒక్కసారి కూడా చేయలేదు. తొలి అర్ధ భాగం ముగియడానికి నాలుగు నిమిషాల ముందు భారత్ పదే పదే దాడులు చేసింది. రాహుల్ భేకే, సమద్, మాని్వర్ గట్టిగా ప్రయతి్నంచినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. రెండో అర్ధభాగంలో మూడు నిమిషాల వ్యవధిలో భారత్ గోల్ కొట్టేందుకు చేరువగా వచి్చనా, ప్రత్యర్థి కీపర్ అడ్డుకోగలిగాడు. మరోవైపు బాక్స్ వద్ద తనకు లభించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ సిరియా ఆటగాడు తమ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 87వ నిమిషంలో భారత ప్లేయర్ ఎడ్మండ్ అద్భుతంగా కొట్టిన షాట్‌ను కీపర్ హదయా ఆపాడు. ఇంజ్యూరీ టైమ్‌లో సిరియా మరో దెబ్బ కొట్టి భారత్‌కు వేదనను మిగిలి్చంది. -
Intercontinental Cup 2024: సిరియాతో నేడు భారత్ పోరు... గెలిస్తేనే టీమిండియాకు టైటిల్
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టైటిల్ కోసం నేడు భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సిరియా జట్టుతో భారత్ తలపడనుంది. మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మారిషస్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 0–0తో ‘డ్రా’ చేసుకోగా... సిరియా జట్టు 2–0తో మారిషస్ జట్టును ఓడించింది. ఈ నేపథ్యంలో నేడు భారత్‌తో జరిగే మ్యాచ్‌ను సిరియా ‘డ్రా’ చేసుకుంటే చాలు టైటిల్‌ను దక్కించుకుంటుంది. భారత జట్టుకు టైటిల్ లభించాలంటే సిరియాపై గెలవాలి. ఇప్పటి వరకు భారత్, సిరియా జట్లు ముఖాముఖిగా ఏడుసార్లు తలపడ్డాయి. 3 మ్యాచ్‌ల్లో సిరియా, 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో సిరియా 93వ స్థానంలో, భారత్ 124వ స్థానంలో ఉన్నాయి. నేడు రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్18–3 టీవీ చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఇంటర్కాంటినెంటల్ కప్: సిరియా ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో సిరియా 2–0తో మారిషస్‌పై ఘన విజయం సాధించింది. ఈ పరాజయంతో మారిషస్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కాగా... సోమవారం జరిగే ఆఖరి పోరులో ఆతిథ్య భారత్‌తో సిరియా తలపడుతుంది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిరియా ఫుట్‌బాలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టు సంపాదించారు. పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా దాడులకు పదునుపెట్టారు. కానీ ప్రత్యర్థి డిఫెండర్ బ్రెండన్ సిటొరా చేసిన తప్పిదంతో సిరియా ఖాతా తెరిచింది. ఆట 32వ నిమిషంలో సిటోరా సెల్ఫ్‌గోల్‌తో సిరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత రెండో అర్ధభాగంలో అల్ మవాస్ (70వ నిమిషంలో) సాధించిన గోల్‌తో సిరియా ఆధిక్యం (2–0) రెట్టింపైంది. మరోవైపు మారిషస్ కూడా రెండో సగంలో గోల్ కోసం చేసిన ప్రయత్నాల్ని సిరియా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. -
అల్ ఖైదా అనుబంధ గ్రూప్ కీలక నేత హతం
న్యూయార్క్: సిరియాలో జరిగిన దాడుల్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ కీలక నేతను హతమార్చినట్లు అమెరికా మిలిటరీ వెల్లడించింది. అల్ ఖైదా కీలక నేత అబూ అబ్దుల్ రెహ్మాన్ అల్ మక్కీని టార్గెట్ చేసి దాడి చేశామని, ఈ దాడుల్లో ఆయన మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM)సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. రెహ్మాన్ అల్ మక్కీ.. హుర్రాస్ అల్-దిన్ షురా కౌన్సిల్ సభ్యుడు, సిరియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.U.S. Central Command Forces Killed Hurras al-Din Senior LeaderEarlier today, U.S. Central Command Forces killed Hurras al-Din senior leader Abu-’Abd al-Rahman al-Makki in a targeted kinetic strike in Syria. Abu-’Abd al-Rahman al-Makki was a Hurras al-Din Shura Council member… pic.twitter.com/eIxqqU1vFq— U.S. Central Command (@CENTCOM) August 23, 2024హుర్రాస్ అల్-దిన్ సిరియాలో ఉన్న అల్-ఖైదా అనుబంధ గ్రూప్ అని అమెరికా తెలిపింది. అమెరికా, పాశ్చాత్య దేశాలే లక్ష్యంగా నిర్వహించటంలో అల్ ఖైదాకు ఈ గ్రూప్ సహాయం చేస్తోందని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ను అంతం చేయటం కోసం అంతర్జాతీయంగా ఏర్పాటైన సైన్యంలో 900 మంది అమెరికా సైనికులు ఉన్నారని తెలిపింది. ఇరాక్, సిరియాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న అల్-ఖైదా గ్రూప్‌ను ఎదుర్కోవడం కోసం ఈ సైన్యం 2014లో స్థాపింపించారు. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి... 10 మంది మృతి
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 10 మంది సిరియన్ దేశస్తులు ప్రాణాలు కోల్పోయారు. నబాటియే ప్రావిన్స్‌లోని వదీ అల్–కె¸ûర్‌పై ఈ దాడి జరిగింది. మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ఆయుధ డిపో లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ ప్రాంతంలో సామగ్రి తయారీ యూనిట్ ఉందని స్థానికులు తెలిపారు. బాధితులంతా సిరియా నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్నవారేనన్నారు. -
Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడి
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్ అరబ్ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు. అండగా ఉంటామన్న అమెరికా ఇరాన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి. ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఖండించిన ప్రపంచదేశాలు ఇరాన్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇరాన్ సైనికచర్యను తప్పుబట్టాయి. పౌరుల భద్రతపై భారత్ ఆందోళన ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!
యుద్ధం సృష్టించే విలయం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని పరాయి దేశాలకు పారిపోయి శరణార్థులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆలాంటి దుస్థితినే చవిచూసింది ఓ ఒలింపియన్. ఆమె కూడా యుద్ధం వాతావరణం నుంచి తప్పించుకునేందుకు పడవ ఎక్కితే..మృత్యువు నీ వెంటే ఉన్నా అన్నట్లు సడెన్‌గా నడి సంద్రంలో ఇంజెన్ ఫెయిల్. అంతటి దురదృష్టంలోనూ బతకాలన్న ఆశతో.. తనతో ఉన్నవారి ప్రాణాలను కాపాడేలా తపించింది. నాటి సాహస ఫలితమే ఒలింపియన్ క్రీడాకారిణిగా అవతరించేలా చేసింది. ఏం జరిగిందంటే..సిరియా ఎంతలా అంతర్యుద్ధంతో అట్టుడుకిపోయిందో మనకు తెలిసిందే. నిరంతర యుద్ధంతో అక్కడ చిన్నారుల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవ్వగా, మరి కొందరూ సర్వస్వం కోల్పోయి ఎందుకు బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలోనే ఉంది యుస్రా మర్దిని కుటుంబం. అమె తన చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మింగ్‌లో గెలుచుకున్న పతకాలు, సాధించిన విజయాలను గురించి కథలు కథలుగా వింటు పెరిగింది. ఓ పక్క యుద్ధ బీభత్సానికి యుస్రా కుంటుంబ ఇంటిని కోల్పోయి బంధువలు ఇళ్లల్లో తలదాచుకునే స్థితికి వచ్చేసింది. అలా ఓ పక్క రైఫిళ్ల మోత బాంబుల బీభత్సం మధ్య పెరిగింది యుస్రా. చెప్పాలంటే ఆ భయానక వాతావరణానికి అలవాటు పడపోయింది. ఓ రోజు యుద్ధం తమ ప్రాంతంలో సృష్టించిన విలయానికి తల్లడిల్లి యుస్రా కుటుంబం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుని గట్టిగా నిర్ణయించుకుంది. అలా యుస్రా 13వ ఏటన ఆమె కుటుంబం ప్రాణాలు అరచేత పట్టుకుని లెబనాన్ మీదుగా టర్కీకి చేరుకుంది. అక్కడ నుంచి గ్రీసుకి సముద్రం మీదుగా వెళ్లే క్రమంలో పడవ ఎక్కింది యుస్రా కుటుంబం. అక్కడ దురదృష్టం నీడలా వెంటాడిందా..? అన్నట్లు నడి సంద్రంలో ఉండగా ఇంజిన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియని భయానక స్థితి. అయితే పడవలో చాలామంది ఉన్నారు దీంతో యుస్రా ఆమె అక్క సారా, బోటు నడిపే వ్యక్తి సుమద్రంలోకి దిగి ముగ్గురు గంటల తరబడి బోటును నెట్టుకుంటూ వచ్చారు. అలా 25 రోజులు ప్రయాణించి జర్మనీ చేరుకున్నారు. చెప్పాలంటే యుస్రా, ఆమె అక్క తమ తల్లిదండ్రుల ప్రాణాల తోపాటు బోటులో ఉన్న ఇతర ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఇక అక్కడ జర్మనీలో శరణార్థులుగా జీవితాన్ని ప్రారంభించింది యుస్రా కుటుంబం. అయితే యుస్రా చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మంగ్ విజయాలను వినడం వల్ల మరేదైన కారణమో గానీ తాను కూడా స్విమ్మర్ అవ్వాలనే అనుకుంది. తానే ఏ దుస్థితిలోనూ ఉన్నప్పటికీ తన కలను వదులోకోలేదు యుస్రా. అలా ఆమె బెర్లిన్‌లోని స్థానిక స్విమ్మింగ్ క్లబ్లో చేరింది. అక్కడ ఆమె అసాధారణమైన ప్రతిభ కోచ్‌లను ఆకర్షించింది. దీంతో వారి ప్రోద్భలంతో 2016లో రియో శరణార్థుల ఒలింపిక్ జట్టులో సభ్యురాలిగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. అక్కడ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈతలో మంచి ప్రదర్శన కనబర్చి ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది. అంతేగాదు 2020 ఒలింపిక్ క్రీడలలో కూడా పోటీ పడింది. యుస్రా ఆ ఒలింపిక్ స్టేడియంపై నిలబడి మాట్లాడుతూ."నేను నా దేశం జెండాను మోయకపోయినా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే ఒలింపిక్ జెండాను మోస్తున్నానని సగర్వంగా చెప్పింది". View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) ఆ మాటలకు ఆ స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఒక్కసారిగా మీడియాతో సహా యావత్తు ప్రపంచం దృష్టిని యుస్రా ఆకర్షించింది. ఇక యుస్రా యూఎన్‌హెచ్‌సీఆర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న అతి పిన్న వయస్కురాలు ఆమె. అంతేగాదు యుస్రా విజయగాథే 2022లో "ది స్విమ్మర్స్" అనే మూవీ విడుదలయ్యింది. ఇక 2023లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా నిలవడం విశేషం. ఇక్కడ యుస్రా స్విమ్మింగ్ క్రీడాకారిణిగా సత్తా చాటి శరణార్థుల హక్కుల కోసం పోరాడటమే గాక వారి కష్టాలను ప్రపంచానికి తెలియజేసింది. నిజం చెప్పాలంటే పోరాటం అంటే ఎలా ఉండాలనేది అందిరికి తెలియజేసింది. ఆమె వియగాథ ఎందరిలోనో స్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. చిన్న కష్టాలకు అమ్మో అనుకునేవాళ్లకు ఆమె విజయగాథ కష్టాల్లో కూడా లక్ష్యాన్ని ఎలా వదలకూడదో చెబుతుంది. View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?) -
సిరియాలో బాంబు పేలి.. ఏడుగురు చిన్నారులు మృతి
డెమాస్కస్: సిరియాలో కల్లోలిత దరా ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఏడుగురు చిన్నారులు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో తెలియా ల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దరా ప్రావిన్స్‌లో జరిగిన వివిధ ఘటనల్లో 100 మందికి పైగా చనిపో యారు. ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్, జోర్డాన్‌కు మధ్యలో దరా ప్రావిన్స్ ప్రాంతముంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధానికి బీజం పడిందిక్కడే. -
సిరియాలో ఇరాన్ ఎంబసీపై దాడి.. 11 మంది మృతి
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరపగా.. 11 మంది మృతి చెందారు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది.సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్?సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్‌కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదుసిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
ఇజ్రాయెల్ టార్గెట్ మిస్?.. ఇరాన్ ఎంబసీపైకి మిస్సైళ్లు!
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్? సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్‌కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు సిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1– లాంగ్రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్‌లోని సరిహద్దు పట్టణం అల్–క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల ‘హష్ద్–అల్– షబి’, కతాయిబ్ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. -
విజయమే లక్ష్యంగా సిరియాతో బరిలోకి...
ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత జట్టు నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా జట్టుతో ఆడుతుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో సినియా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో సిరియాపై తప్పనిసరిగా నెగ్గాలి. ఇతర గ్రూప్‌ల ఫలితాలు కూడా తమకు అనుకూలించాలని ఆశించాలి. -
పరిణతితో ప్రవర్తించాలి
ప్రపంచంలో ఉన్న ఘర్షణలు చాల్లేదన్నట్టు కొత్త తగువులు పుట్టుకొస్తున్న తీరు ఆందోళన కలిగి స్తోంది. ఇస్లామిక్ రాజ్యాలైన ఇరాన్, పాకిస్తాన్‌లు ఉగ్రవాదాన్ని అణిచే పేరిట పరస్పరం క్షిపణులతో, డ్రోన్లతో దాడులు జరుపుకోవటం తాజా పరిణామమైతే ఇంతవరకూ ఇరుపక్షాలకూ సర్దిచెప్పటా నికి ఎవరూ ప్రయత్నిస్తున్నట్టు లేదు. పాక్ గగనతలాన్ని అతిక్రమించిన ఇరాన్ విమానాలు సున్నీ మిలిటెంట్ సంస్థ జైష్ అల్ అదల్ స్థావరాలపై దాడులు చేయగా పాకిస్తాన్ సైతం ఇదే వంకతో ఇరాన్ భూభాగంపై బాంబులు కురిపించింది. ఇరాక్, సిరియాలపైనా ఇరాన్ దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలై రెండేళ్లు దాటుతుండగా, మూడు నెలల క్రితం గాజాలో ఇజ్రాయెల్ మొదలెట్టిన దాడులు విరామం లేకుండా సాగుతూనేవున్నాయి. దాదాపు 24,000 మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలయ్యాయి. అటు ఎర్ర సముద్రంలో హౌతీలపై అమెరికా, బ్రిటన్లు చేస్తున్న దాడులు ఫలిస్తున్న సూచనలు కనబడటం లేదు. ఇండో–పసిఫిక్ప్రాంతం రానున్న కాలంలో పెను సవాలు కాబోతున్నదని అగ్రరాజ్యాలు అంచనా వేసుకుని పది హేనేళ్లుగా పథక రచన చేస్తుండగా తాజా పరిణామాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. దేశాల మధ్య ఉన్న విభేదాలు దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండిపోతే అవి ఏదో ఒక దశలో కొత్త బలాన్ని సంతరించుకుని మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పుడు ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలు, ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రాంతాలు గమనిస్తే ఈ సమస్యలు కొత్తగా తలెత్తి నవి కాదని అర్థమవుతుంది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం చోటుచేసుకుని అప్పటి పాలకుడు ఇరాన్ షా పదవీచ్యుతుడయ్యేవరకూ ఇరాన్, పాకిస్తాన్ రెండూ అమెరికాకు గట్టి మిత్ర దేశాలు. మనతో 1965లోనూ, ఆ తర్వాత 1971లోనూ పాకిస్తాన్ తలపడినప్పుడు ఆ దేశాన్ని అన్నివిధాలా ఆదుకున్న చరిత్ర ఇరాన్‌ది. పాకిస్తాన్ విచ్ఛిన్నాన్ని సహించబోనని ఇరాన్ షా పరోక్షంగా మన దేశాన్ని హెచ్చరించాడు. అలాగని ఇరాన్–పాకిస్తాన్ సరిహద్దులు ఎప్పుడూ ప్రశాంతంగా లేవు. అక్కడ స్థావరాలు ఏర్పర్చుకుని ఆ రెండింటినీ చికాకు పెడుతున్న బలూచిస్తాన్ మిలిటెంట్లకు కొదవ లేదు. కానీ ఇరాన్లో ఆయతుల్లా ఖొమైనీ ఏలుబడి తర్వాత అక్కడ షియాల ఇస్లామిక్ రాజ్యం ఏర్పడ్డాకే ఆ దేశానికి సున్నీ మెజారిటీ పాకిస్తాన్‌తో సమస్యలు బయల్దేరాయి. అటు పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో వుండగా, ఇటు ఇరాన్ అమెరికా విధించిన ఆంక్షలతో ఊపిరాడకుండా వుంది. ఇలాంటి గడ్డు స్థితిలో అక్కడ తక్షణం యుద్ధం తలెత్తే ప్రమాదం వుండకపోవచ్చు. అలాగని ఆ రెండు దేశాలూ ఒక అంగీకారానికి రాకపోతే ఏమైనా జరగొచ్చు. వాస్తవానికి ఇజ్రాయెల్ అస్తిత్వా నికి ఏ బెడదా లేకుండా చేయటానికీ, పశ్చిమాసియాలో తన పట్టు జారకుండా చూసుకొనేందుకూ అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. పాలస్తీనా విషయంలో 1973 వరకూ ఏకతాటిపై ఉన్న అరబ్ దేశాలూ, ఇతర ముస్లిం దేశాలూ ఆ తర్వాత కాలంలో పరస్పరం విభేదించుకోవటంలో అమె రికా పాత్ర తక్కువేమీ కాదు. 1979లో ఇజ్రాయెల్–ఈజిప్టు మధ్య సయోధ్య కుదిర్చిన మాదిరిగానే 1994లో జోర్డాన్‌తో, ఈమధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, మొరాకోలతో ఇజ్రా యెల్‌కు సఖ్యతను ఏర్పర్చింది కూడా అమెరికాయే. మరోపక్క సిరియాలో బషర్ అల్ అసద్‌తో, యెమెన్‌లో హౌతీలతో, గాజాలో హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫ్రంట్లతో, లెబనాన్‌లో హిజ్బొ ల్లాతో జట్టుకట్టి అమెరికా అనుకూల ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించటంలో ఇరాన్ చాన్నాళ్లుగా బిజీగా వుంది. ఇజ్రాయెల్‌కు దగ్గరైన దేశాల్లో చాలా భాగం సున్నీ ఆధిపత్యంలోనూ, ఇరాన్ కూడగడుతున్న దేశాలు షియా ప్రాబల్యంలోనూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈమధ్యలో చైనా ఏడెనిమిదేళ్లుగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ఫలించి నిరుడు మార్చిలో ఇరాన్–సౌదీ మధ్య చర్చలు మొదలయ్యాయి. ఏదీ కారణం లేకుండా మొదలు కాదు. విస్తరించదు. బలూచిస్తాన్‌లో ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరించటంలో ఇరాన్, పాకిస్తాన్ రెండూ వైఫల్యం చెందటం వల్లే ఆ ప్రాంతం చాన్నాళ్లుగా భగ్గుమంటోంది. బలూచిస్తాన్‌లో అటు షియాలూ, ఇటు సున్నీలూ ఉన్నా జాతి, తెగల పరంగా ఆ వర్గాలమధ్య ఎన్నో వ్యత్యాసాలున్నా ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలూ, భాష వగైరాల్లో అక్కడి ప్రజల తీరుతెన్నులే వేరు. తాము అటు ఇరాన్‌కూ, ఇటు పాకిస్తాన్‌కూ చెంద బోమని, తమది ప్రత్యేక విధానమని వారి వాదన. స్వతంత్ర సిస్తాన్–బలూచిస్తాన్ ఏర్పాటులోనే తమ భవిష్యత్తు ముడిపడివున్నదని అక్కడి పౌరులు భావిస్తుంటారు. ఈ మైనారిటీల మనోభావా లను సకాలంలో గుర్తించి, సరిచేసేందుకు ప్రయత్నించివుంటే మిలిటెంట్ సంస్థల ప్రభావం అక్కడ వుండేది కాదు. కానీ అటు ఇరాన్, ఇటు పాకిస్తాన్ అణిచివేతనే నమ్ముకున్నాయి. పైగా మీ మెతక దనంవల్లే సమస్య ముదిరిందని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తాజా ఇరాన్ దాడుల వెనక పశ్చిమాసియా ఘర్షణలను విస్తరించాలన్న ఆలోచనలున్నాయని కొందరు విశ్లేషకులు అనుమానిస్తు న్నారు. కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలు ఇప్పటికే ప్రపంచాన్ని పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయేలా చేశాయి. రష్యానూ, ఇజ్రాయెల్‌నూ అదుపు చేసేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో మరో సంక్షోభాన్ని పెంచటం క్షమార్హం కానిది. కనుకనే పాకిస్తాన్, ఇరాన్ రెండూసంయమనం పాటించి చర్చలకు సిద్ధపడాలి. ఆ ప్రాంత మైనారిటీల మనోభావాలేమిటో తెలుసు కుని పరిణతితో ఆలోచిస్తే శాశ్వత పరిష్కారం అసాధ్యం కాదని గుర్తించాలి. -
సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
టెహ్రరాన్: సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కెర్మాన్, రాస్క్లలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది. సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని -
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి
వాషింగ్టన్: సిరియాలో ఇరాన్ మద్దతునిస్తున్న దళాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ తెలిపారు. ఇరాన్ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ సంక్షోభం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గాజా యుద్ధానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ఉందని, వాటిని ఏమాత్రం సహించబోమన్నారు. ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్‌లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడి సైనికులపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా గత వారంలోనే రెండోసారి దాడికి పాల్పడింది. ఈ పరస్పర దాడులు ఇరాన్-అమెరికా మధ్య పశ్చిమాసియాలో మరో అలజడి చెలరేగేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజాలో 10,500 మంది మరణించారు. ఇదీ చదవండి: Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది -
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు!
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. దీనిని అమెరికా రక్షణ విభాగం ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేపట్టామని, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాని అనుబంధ విభాగాలు ఈ స్థావరాల్ని ఉపయోగించుకుంటున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాక్, సిరియాలో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 17 నుంచి ఇరాన్ ప్రోత్సాహక ఉగ్ర సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులు హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినట్లు ప్రకటించింది అమెరికా. అయితే ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభానికి, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్ స్పష్టం చేశారు. అమెరికా ట్రూప్లపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీకి గురువారం నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటన వెలువడి రోజు గడవక ముందే సిరియాలోని ఇరాన్ స్థావరాల్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. -
గాజా, సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Israel-Hamas war: హమాస్‌పై ముప్పేట దాడి
రఫా(గాజా్రస్టిప్)/జెరూసలేం/న్యూఢిల్లీ/టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా గాజాలో వైమానిక దాడులు నిర్వహించగా, ఇక సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజాతోపాటు సిరియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగాయి. మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్ మసీదును హమాస్ మిలిటెంట్లు అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సిరియా ఎయిర్‌పోర్టులపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. రన్వేలు దెబ్బతిన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైన్యం సన్నద్ధతపై నెతన్యాహూ సమీక్ష ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించారు. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ శనివారం రాత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో సైన్యం సన్నద్ధతపై ఈ భేటీలో సమీక్ష సమాచారం. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో వేలాదిగా ఇజ్రాయెల్ సైనికులు మోహరించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే 7 లక్షల మంది జనం దక్షిణ గాజాకు వెళ్లిపోయినట్లు అంచనా. అనూహ్య స్థాయిలో ‘తదుపరి దాడి’ గాజాపై జరుగుతున్న వైమానిక దాడులు ‘యుద్ధంలో తదుపరి దశ’కు రంగం సిద్ధం చేయడానికేనని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తదుపరి దాడి అనూహ్య స్థాయిలో ఉంటుందని అన్నారు. తమ పదాతి దళాలు గాజా భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా సానుకూల పరిస్థితులు సృష్టించడానికి వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడే తదుపరి దశ యుద్ధంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని అన్నారు. హమాస్‌ను అంతం చేయడానికి గాజాలో అడుగుపెడతామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవీ చెప్పారు. మిలిటెంట్ల సన్నద్ధతను తక్కువ అంచనా వేయొద్దని తమ సైన్యానికి సూచించారు. ఆయన తాజాగా ఇజ్రాయెల్ సైనికాధికారుతో సమావేశయ్యారు. గాజాలో ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు. కిక్కిరిసిన జనాభాతో గాజా స్ట్రిప్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. శత్రువులు మన కోసం అక్కడ ఎన్నో యుద్ధ రీతులను సిద్ధం చేసి పెట్టారని, మన ప్రతిస్పందన అత్యంత చురుగ్గా, వేగంగా ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్ తాజా హెచ్చరిక గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే మొబైల్ ఫోన్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు చేరవేశారు. ‘‘ఉత్తర గాజాలో మీకు ముప్పు పొంచి ఉంది. దక్షిణ గాజాకు వెళ్లకుండా ఉత్తర గాజాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నవారిని హమాస్ సానుభూతిపరులుగా పరిగణిస్తాం’’ అని అందులో పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. 6.5 టన్నుల ఔషధాలు, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని పంపించింది. ఔషధాలు, సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానం ఆదివారం భారత్ నుంచి నుంచి బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్–అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. మానవతా సాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో గాజాకు చేరవేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, సర్జికల్ సామగ్రి, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్టు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు తదితర సామగ్రిని గాజాకు పంపించినట్లు తెలియజేశారు. పాలస్తీనియన్లకు మరింత సాయం పంపిస్తామని వెల్లడించారు. గాజాలో సామన్య ప్రజల మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొమమ్మద్కు అబ్బాస్‌కు ఫోన్ చేసి, సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు నుంచి గాజాకు రెండో షిప్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడులతో అల్లాడిపోతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం ఇప్పుడిప్పుడే చేరుతోంది. నిత్యావసరాలు, ఇతర సహాయక సామగ్రితో కూడిన 17 వాహనాలు ఆదివారం ఈజిప్టు నుంచి గాజాలో అడుగుపెట్టాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో షిప్మెంట్. శనివారం 20 వాహనాలు ఈజిప్టు నుంచి గాజాకు చేరుకున్నాయి. -
ఇక సిరియాపైకి గురి.. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక
హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని గాజాను విచ్ఛిన్నం చేసిన ఇజ్రాయెల్.. తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని సిరియా యాక్టివేట్ చేసింది. అయితే.. ఈ దాడుల్లో డమాస్కస్ ఎయిర్పోర్ట్ వద్ద నలుగురు, అలెప్పో వద్ద ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దాడుల వల్ల విమానాశ్రయం దెబ్బతినడంతో రాకపోకలను రద్దు చేసినట్లు సిరియా వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాల్లో విమానాలను గ్రౌండింగ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. పొరుగు దేశమైన సిరియాతో కూడా ఇజ్రాయెల్ దశాబ్దాలుగా పోరాడుతోంది. ప్రధానంగా ఇరాన్ మద్దతిస్తున్న హిజ్బుల్లా ఫైటర్స్‌తోపాటు సిరియా ఆర్మీని కూడా టార్గెట్ చేసింది. అయితే ఎప్పుడూ కూడా సిరియాపై దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. కానీ, తాజాగా గురువారం సిరియాపై ఎయిర్‌స్ట్రైక్స్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు.. ఈ దాడులు రాబోయే రోజుల్లో ఉధృతంగా కొనసాగుతాయని పేర్కొంది. Israeli Air Force attacked positions near Damascus airport. The plane, flying from Iran to Syria, was forced to turn around. According to some reports, the Iranian Regime’s Foreign Minister is scheduled to fly to Syria tomorrow.#Israel pic.twitter.com/WrC6g5K4Mw — Pouria Zeraati (@pouriazeraati) October 12, 2023 అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ సందర్శించారు. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. సిరియా బషర్ అల్ హసద్‌తో ఫక్షన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతిస్తున్న హమాస్ ఆధిపత్యం ఉన్న గాజాతోపాటు సిరియాపై కూడా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు జరిగి నేటికి ఆరు రోజులు గడిచింది. ప్రతిదాడులతో హోరెత్తిస్తున్న ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌లో 1200 మందికి చంపేసింది. ఇందులో హమాస్ బలగాలతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తరపున కూడా ప్రాణనష్టం భారీగానే సంభవించింది. ఇరువైపులా ప్రాణ నష్టం 3వేలు దాటినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
ఇజ్రాయెల్‌కు కొత్త ముప్పు.. హమాస్‌తోపాటు మరో రెండు దేశాలతో పోరాటం
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అతలాకులతమవుతోంది. గాజాస్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’ పేరుతో మెరుపు దాడి చేపట్టింది. కేవలం 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్లతో విరుచుపడింది. హమాస్ విధ్వంసానికి దిగడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. హమాస్ ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఐడీఎఫ్ దళాలను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులను ధీటుగా ఎదుర్కొంటూ గాజాపై బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతోంది. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. గత అయిదు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3000 మంది మరణించారు. చదవండి: పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం తాజాగా ఇజ్రాయెల్‌కు మరో ముప్పు పొంచుకొచ్చింది. హమాస్‌తోపాటు లెబనాన్, సిరియా రెండు దేశాల నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకున్న హమాస్ ఉగ్రవాద దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని షియా ఇస్లామిస్ట్ గ్రూప్ హిజ్బుల్లాతో కూడిన ప్రాంతీయ కూటమి.. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్‌తో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో హమాస్ దాడికి కొన్ని రోజులకే లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ ట్యాంక్‌పై గైడెడ్ క్షిపణిని ప్రయోగించింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ దాడికి పాల్పడించింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా తమ ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. దీని తర్వాత లెబనాస్- ఇజ్రాయెల్ సరిహద్దులో హింస అత్యంత తీవ్రంగా మారిది. కాగా ఇస్లామిక్ విప్లవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, ఇజ్రాయెల్ దళాలతో పోరాడటానికి హిజ్బుల్లాను 1982లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థాపించారు. మరోవైపు సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. సిరియా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక దాడులు జరుగుతున్నట్లు సైన్యం చెబుతోంది. ముఖ్యంగా సిరియా నుంచి మోర్టార్ షెల్స్, శతఘ్ని గుండ్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే 1967లో ఆరు రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాలు మధ్య వైరుద్ధం ఏర్పడింది. -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023 -
భూకంప శిథిలాల కింద ఊపిరిపోసుకున్న బిడ్డ ఇప్పుడిలా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటే ఇంకా ఆ దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ శిథిలాల కిందే ఓ శిశువు ఊపిరి పోసుకుంది. ఆ 'జననం ఓ అద్భుతం' అనే చెప్పాలి. అంతటి విషాదంలో అందరిలో ఓ కొత ఆశను రేకెత్తించినట్లు 'మిరాకిల్‌గా ఆ బేబి' పుట్టడం అందర్ని ఒకింత ఆనందసభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడూ ఆ శిశువు ఎలా ఉందంటే? నాటి సిరియా భారీ భూకంపంలో శిథిలాల కింద ఆ పసికందు కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఆకర్షించింది. తల్లి లేకపోయిన ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల సాయంతో కోలుకుంది. ఇప్పుడు ఆ శిశువుకి ఆరు నెలలు. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్ పట్టణంలో ఆ చిన్నారి తన మేనత్త, మేనమామ, వారి ఏడుగురు పిల్లల మధ్య పెరుగుతోంది. ఆమె నవ్వుతుంటే వాళ్ల నాన్న, అక్కలే గుర్తుకొస్తున్నారని ఆ చిన్నారి మేనమామ ఖలీల్ అల్ సవాడీ అన్నారు. ఆ విషాద ఘటనలో ఆమె తండ్రి, తల్లి, నలుగురు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రానే. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు కూడా. ఆఖరికి అయినవాళ్ల అయిన ఆ చిన్నారి మేనమామ, మేనత్తలకు ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. ఎన్నో టెస్ట్‌లు నిర్వహించిగానీ వారికి ఆ పాపను అప్పగించలేదు ఆస్పత్రి యజమాన్యం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చేసిన పని ఆ పాపకు కొత్తపేరు పెట్టడమే. ఆ చిన్నారికి ఆమె తల్లి 'అఫ్రా' పేరునే పెట్టారు. నిజానికి ఆ శిశువుని కాపాడిని రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం ఆ చిన్నారికి 'అయా' అని పేరు పెట్టడం జరిగింది. 'అయా' అంటే అరబిక్‌లో అద్భుతం అని అర్థం. ఆమె నా కూతుళ్లలో ఒకత్తని, దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేనన్నారు ఆ చిన్నారి మేనమామ ఖలీల్. ఇక జిండిరెస్‌లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు కూడా బాగా భూకంపం కారణంగా బాగ దెబ్బతిందని, అందువల్ల తాముఅక్కడే ఎక్కువ కాలం ఉండలేకపోయామన్నారు ఖలీల్. దీంతో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టయిందని, పిల్లలను స్కూల్‌కి పంపే స్థోమత కూడా లేదని ఖలీల్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఖలీల్ లాగానే ఎన్నో వేల కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నాయి. అంతేగాదు ఆ విషాద ఘటనలో దాదాపు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది కూడా. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురికి లండన్‌లో ఉద్యోగం) -
రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్
సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది. బ్రిటీష్ మ్యాగజైన్ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది. సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సిరియాకు చెందిన మాజోన్ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు! -
ఐఎస్ఐఎస్ చీఫ్ మృతి..ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు
అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్ ఖురాషి సిరియాలో మృతి చెందినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్‌లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాన్ అన్నారు. 2013లో డేష్/ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటిగా నిలిచింది. ఇంటిలిజెన్స్ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్‌లోని ఒక జోన్‌ని మూసివేసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు ఎర్డోగాన్. ఈ ఆపరేషన్‌లో ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న పాడుపడిన పోలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. టర్కీ 2020 నుంచి ఉత్తర సిరియాలో దళాలను మోహరించి ఈ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సహాయకుల సాయంతో మొత్తం జోన్లను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఐఎస్ఐఎస్ మునుపటి చీఫ్ అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి మరణించినట్లు నవంబర్ 30న ప్రకటించింది టర్కీ. అతని స్థానంలోకి ప్రస్తుతం టర్కీ చనిపోయినట్లు ప్రకటించిన ఐఎస్ఐఎస్ అబూ హుస్సేన్ అల్-ఖురాషీ వచ్చాడు. కాగా, అమెరికా కూడా ఏప్రిల్ మధ్యలో హెలికాప్టర్ దాడులతో ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్-హాజీ అలీని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంతేగాదు 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చంపినట్లు యూఎస్ ప్రకిటించింది. ఆ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఒకప్పుడూ నియంత్రించి తరిమికొట్టినప్పటికీ ఇప్పటికీ సిరియాలో దాడలు చేస్తుండటం గమనార్హం. (చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..) -
టర్కీ భూకంప బాధిత చిన్నారుల కోసం ఫుట్‌బాల్ ప్రేమికులు ఏం చేశారో చూడండి..!
ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ దేశాన్ని భారీ భూకంపం (రిక్టర్ స్కేలుపై 7.8 మ్యాగ్నిట్యూడ్) అతలాకుతలం చేసిన విషయం విధితమే. ఈ మహా విలయంలో దాదాపు 50000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఘనా స్టార్ ఫుట్‌బాలర్, న్యూకాస్టిల్ వింగర్ క్రిస్టియన్ అట్సూ కూడా ఉన్నాడు. ఈ భారీ భూకంపం టర్కీతో పాటు సిరియా దేశంపై కూడా విరుచుకుపడింది. భూకంపం తెల్లవారు జామున 4:17 గంటల సమయంలో రావడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. ఇదిలా ఉంటే, టర్కీ సూపర్ లీగ్‌లో భాగంగా ఫిబ్రవరి 26న అంటాల్యాస్పోర్-బెసిక్టాస్ క్లబ్‌ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా బెసిక్టాస్ అభిమానులు తమ మానవతా దృక్పథాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని బెసిక్టాస్ అభిమానులు టర్కీ, సిరియా భూకంప బాధిత చిన్నారుల కోసం ఖరీదైన బొమ్మలు, గిఫ్ట్‌లు, కండువాలను మైదానంలోకి విసిరారు. ఊహించని విధంగా ఇలా జరగడంతో లీగ్ నిర్వహకులు మ్యాచ్‌ను కాసేపు (4 నిమిషాల 17 సెకెన్ల పాటు) నిలిపివేసి దాతలను ఎంకరేజ్ చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. చిన్న పిల్లల కోసం బెసిక్టాస్ అభిమానులు చేసిన వినూత్న సాయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి దాతృత్వ హృదయాలకు జనం సలాం కొడుతున్నారు. -
తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా!
మనిషి చూపులు అంతరిక్షం అంచులను తాకుతున్నాయి! కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో? ఏం జరుగుతుందో.. దుర్భిణుల సాయంతో ఇట్టే పసిగట్టగలుగుతున్నాం! కానీ.. మన కాళ్లకింద నేల లోపలి రహాస్యాలు మాత్రం.. ఇప్పటికీ చేతికి చిక్కకుండానే ఉన్నాయి! తుర్కియే- సిరియాల్లో ఇటీవలి భూకంపాలు రెండూ.. ఇందుకు తాజా నిదర్శనం! వాన రాకడ.. ప్రాణం పోకడలను కొంచెం అటు ఇటుగానైనా గుర్తించగల మానవ మేధ..భూకంపాల విషయానికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతోంది? ఫిబ్రవరి ఆరు.. 2023.. తెలతెలవారుతుండగానే తుర్కియే ఆగ్నేయ ప్రాంతాన్ని మహా భూకంపం కుదిపేసింది. ప్రజలింకా నిద్రలో ఉండగానే.. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచుకొచ్చిన ఈ విలయం తాకిడికి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం గురించి ప్రపంచానికి తెలిసింది కూడా ప్రకంపనల ద్వారానే అంటేనే ఈ భూకంపాలు ఎంత నిశ్శబ్దంగా మనిషిని కబళించగలవో ఇట్టే అర్థమైపోతుంది. తుర్కియేలో తొలి భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత సిరియా ఉత్తర ప్రాంతంలో సుమారు 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. రెండు భూకంపాల కేంద్రాలూ భూమికి అతితక్కువ లోతులోనే పుట్టాయి. దీంతో కదలికల తీవ్రత ఎక్కువగా ఉండింది. ప్రధాన భూకంపం తరువాత వచ్చిన ప్రకంపనలూ ఎక్కువ కాలం కొనసాగాయి. రక్షణ చర్యలకు విఘాతం కలిగించే స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. సహాయక పనుల కోసం అక్కడికి చేరుకున్న వారు కూడా.. నేల కుప్పకూలిపోవడం, గ్రౌండ్ లిక్విఫికేష¯Œ వంటి ప్రమాదాల్లో చిక్కుకునే రిస్క్ ఉందని అమెరికా జియలాజికల్ సర్వే హెచ్చరించింది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం వీలైంది. 228 గంటల తరువాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అందరి మనసులను.. ఈ భూకంపాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయామన్న ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపాలతో సుమారు 41 వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గాజియాన్‌టెప్ పట్టణం సమీపంలో తొలి భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఆఫ్టర్‌షాక్స్ మధ్యలోనే ఇంకో భూకంపమూ సంభవించింది. తొలి భూకంపం తీవ్రత 7.8. ఆ లెక్కల ప్రకారం ఇది చాలా పెద్ద భూకంపం. భూమి లోపల వంద కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్‌లైన్ లో రావడంతో పరిసరాల్లోని భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. ఏటా సంభవించే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలను పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కేవలం రెండు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం, అంతకుముందు పదేళ్లలోనూ నాలుగు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం. అలాగని కేవలం ప్రకంపనల ఫలితంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రజలు ఇళ్లల్లో నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకో కారణం.. ఆ ప్రాంతాల్లోని భవనాల దృఢత్వం! తుర్కియే, సిరియా.. రెండింటిలోనూ భూకంపాలను తట్టుకోగల భవనాలు దాదాపుగా లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 200 ఏళ్లుగా భూకంపాల్లేవు.. తుర్కియే, సిరియాల్లో గత 200 ఏళ్లుగా చెప్పుకోదగ్గ తీవ్రతతో భూకంపాలు లేవు. పోనీ చిన్నస్థాయిలోనైనా ప్రకంపనలేవైనా నమోదయ్యాయా? అంటే అదీ లేదు. దీంతో ఆ ప్రాంతంలో భూకంపాల సన్నద్ధత కూడా తక్కువగానే ఉండింది. 1970 నుంచి ఈ ప్రాంతంలో ఆరు కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మూడే మూడు నమోదయ్యాయి. ఇంతకీ భూకంపాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయన్న అనుమానం కలుగుతోందా? సమాధానాలు తెలుసుకుందాం! కాకపోతే ఇందుకోసం భూమి నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మాదిరిగానే భూమి కూడా పొరలు పొరలుగా ఉంటుందని మనం చదువుకుని ఉంటాం. ఈ పొరల్లో అన్నింటికంటే పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు. మన కాళ్ల కింద మొదలై కొన్ని కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది ఈ పొర. దాని దిగువన మాంటెల్, అంతకంటే దిగువన కోర్ అని పేర్లున్న పొరలు ఉంటాయి. ఇప్పుడు పై పొర క్రస్ట్ గురించి కొంచెం వివరంగా.. భూమి మొత్తం ఇది ఒకే ఒక్కటిగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కో ముక్కను టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. ఈ ప్లేట్లు స్థిరంగా కాకుండా.. కదులుతూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్లు కదిలే క్రమంలో ఘర్షణ పుడుతూంటుంది. రెండు ప్లేట్లు ఢీకొనడం.. లేదా ఒకదాని కిందకు ఒకటి చేరడం.. లేదా ఒకదానికి ఒకటి దూరంగా జరగడం వంటి నాలుగు రకాల కదలికల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ జరగుతూ ఉంటుంది. అత్యధిక పీడనం నిల్వ అవుతూ వస్తుంది. ఈ పీడనం కారణంగా ఒక్కోసారి ఒక ప్లేట్ అకస్మాత్తుగా ఇంకోదానిపై జరగడం వల్ల అప్పటివరకూ అక్కడ నిల్వ ఉన్న పీడనం భూకంపం రూపంలో విడుదల అవుతుంది. తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించిన ప్రాంతం మూడు టెక్టానిక్ ప్లేట్ల సంగమ స్థలం. అనటోలియా, అరేబియన్ , ఆఫ్రికా ప్లేట్లు కలిసే చోటనే భూకంపాలు సంభవించాయి. అరేబియా ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్‌పై ఒత్తిడి తెచ్చిన కారణంగా భూకంపం సంభవించింది. 1822 ఆగస్టు 13న ఈ ప్రాంతంలోనే 7.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఆ తరువాత ఆ స్థాయి భూకంపం వచ్చింది ఈ ఏడాదే. 1822 నాటి భూకంపంలోనూ ఈ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం ఎక్కువగానే నమోదైంది. ఒక్క అలెప్పో నగరంలోనే 7000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏడాది పాటు కొనసాగిన ప్రకంపనలు మరింత విధ్వంసం సృష్టించాయి. తాజాగానూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాం? వాస్తవానికి భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి టెక్నాలజీ లేదు. చాలా చాలా కష్టమైన వ్యవహారమీ భూకంపాలు. భూకంపం జరిగిన తరువాత కూడా కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే దాని సంకేతాలు మనకు తెలుస్తూంటాయి. అందుకే భూకంపాల గురించి తెలిసే ఈ అతికొద్ది సమాచారం ఆధారంగా వాటిని ముందుగానే గుర్తించడం పెను సవాలుగా మారింది. నిజానికి 1960ల నుంచే భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టెక్టానిక్ ప్లేట్ల అమరిక, లోటుపాట్లు (ఫాల్ట్‌లైన్స్) అత్యంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఇప్పటివరకూ సాధించింది కొంతే. ప్రపంచం మొత్తం వ్యాపించిన ఫాల్ట్లైన్లకు తోడు భూమి లోపలి నుంచి పలు రకాల శబ్దాలు, సంకేతాలు వెలువడుతూండటం కూడా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. భూకంపం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎంత? అన్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగల పద్ధతిని ఆవిష్కరించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. జంతువుల ప్రవర్తన నుంచి అయనోస్ఫియర్ వరకూ.. భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశారు. భూకంపం వచ్చే ముందు జంతువులు ప్రవర్తించే తీరుతో మొదలుపెట్టి భూ వాతావరణపు పైపొర అయనోస్ఫియర్‌లోని కణాల పరిశీలన వరకూ అనేక రకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా మనుషులు గుర్తించలేరేమో అని.. సూక్ష్మమైన సంకేతాలను గుర్తించేందుకు కృత్రిమ మేధను వాడే ప్రయత్నమూ జరుగుతోంది. భూమి మాదిరిగానే ఉండే మోడల్‌ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ సాయంతో ఇటలీలోని సేపియేంజా యూనివర్సిటీ అధ్యాపకుడు క్రిస్ మరోన్ ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనశాలలో తాము భూకంపాలను బాగానే గుర్తించగలగుతున్నామని, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం విఫలమవుతున్నామని మరోన్ తెలిపారు. చైనాలో శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్‌లో విద్యుదావేశంతో కూడిన కణాలు భూకంపాల వల్ల ఏవైనా కంపనలు సృష్టించాయా? వాటి ద్వారా ముందస్తు గుర్తింపు వీలవుతుందా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఫోర్క్యాస్టింగ్కు చెందిన జింగ్ లియూ అంచనా ప్రకారం భూకంపానికి ముందు రోజుల్లో అయనోస్ఫియర్‌లో మార్పులు జరుగుతాయి. ఫాల్ట్ జోన్ల ప్రాంతం పైన భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం వల్ల విద్యుదావేశ కణాలు కంపనలు సృష్టిస్తాయి. 2010 ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలోని బాజా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దానికి పది రోజుల ముందే అయనోస్ఫియర్‌లో మార్పులను గమనించామని ఆయన చెబుతున్నారు. చైనా ఇంకో అడుగు ముందుకేసి అయనోస్ఫియర్‌లో జరిగే ఎలక్ట్రికల్ తేడాలను గుర్తించేందుకు 2018లో ‘చైనా సెసిమో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శాటిలైట్’ను ప్రయోగించింది కూడా. గత ఏడాది చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ భూకంపానికి 15 రోజుల ముందు అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ల సాంద్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2021 మే, 2022 జనవరి నెలల్లో చైనాలో వచ్చిన భూకంపాలకు ముందు ఈ పరిశీలనలు జరిగాయి. ఇజ్రాయెల్‌లోని ఏరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము భూకంపాలను 48 గంటల ముందే 83 శాతం కచ్చితత్వంతో గుర్తించగలమని ఇటీవలే ప్రకటించారు. గత 20 ఏళ్లలో అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ కంటెంట్‌లో వచ్చిన మార్పులకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్‌లో కొంతమంది కొన్ని విచిత్రమైన సూచనలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో నీటి ఆవిరి ఆధారంగా భూకంపాలను ముందుగానే గుర్తించవచ్చునని, అది కూడా 70 శాతం కచ్చితత్వంతో చేయవచ్చునని చెబుతూండటం విశేషం. కాకపోతే ఈ పద్ధతిలో నెల రోజులు ముందు మాత్రమే భూకంపాన్ని గుర్తించ వచ్చు. మరికొందరు భూ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చే మార్పుల ఆధారంగా భూకంపాలను గుర్తించవచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే.. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ భూకంపాలను అవి సంభవించేందుకు ముందుగానే కచ్చితంగా గుర్తించడం సాధ్యంకావడం లేదనేది నిష్ఠుర సత్యం!! మీకు తెలుసా..? ► యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే లెక్కల ప్రకారం భూమి ఏటా కొన్ని లక్షల సార్లు కంపిస్తూంటుంది. వీటిల్లో చాలావాటిని మనం అస్సలు గుర్తించం. తీవ్రత తక్కువగా ఉండటం, లేదా జనావాసాలకు దూరంగా సంభవించడం దీనికి కారణం. అయితే ఏటా సంభవించే భూకంపాల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగినవని దాదాపు 17 వరకూ ఉంటాయి. ఎనిమిది స్థాయి తీవ్రత ఉన్నది ఒక్కటైనా ఉంటుంది. ► టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం మొత్తం లాస్ ఏంజిలెస్ వైపు కదులుతోంది. మన గోళ్లు పెరిగినంత వేగంగా అంటే ఏడాదికి రెండు అంగుళాల చొప్పున ఈ కదలిక ఉన్నట్లు అంచనా. సా¯Œ ఆండ్రియాస్ ఫాల్ట్ రెండు వైపులు ఒకదాని కింద ఒకటి జారిపోతూండటం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఈ రెండు నగరాలు కలిసిపోయేందుకు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల సమయం ఉందిలెండి! ► 2011 మార్చి 11న జపాన్ తీరంలో 8.9 తీవ్రతతో వచ్చిన భూకంపం మన రోజు లెక్కను మార్చేసింది. భూమిలోపలి పదార్థం పంపిణీ అయిన తీరులో భూకంపం మార్పు తేవడంతో భూమి కొంచెం వేగంగా ► భూకంపం తరువాత ఆ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోని నీరు కొంచెం కంపు కొడతాయి. అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్న వాయువులు పైకి రావడం దీనికి కారణం. ► 2010 ఫిబ్రవరి 27న సంభవించిన 8.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా చిలీలోని కోన్ సెప్కియాన్ నగరం పశ్చిమం దిక్కుగా సుమారు పది అడుగులు జరిగింది! మొత్తం భూకంపాల్లో 90 శాతం పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి వస్తూంటాయి. ► 2015లో నేపాల్‌లో వచ్చిన 7.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా పలు హిమాలయ పర్వతాలు కుంగిపోయాయి. ఇందులో ఎవరెస్టు కూడా ఉంది. కనీసం ఒక్క అంగుళం మేర దీని ఎత్తు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య
అంకారా: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు రెండు దేశాల్లో 50,000పైగా మృతి చెందారు. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అదే విధంగా సిరియాలో 5,914 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. కాగా ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో సెను భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. తెలవారుతూండగానే 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఘోర విపత్తులో ఎత్తైన భవనాలు నెలకొరిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1,60,000 భవనాలు, 5,20,000 అపార్టుమెంట్లు ధ్వంసమవడం లేదా దెబ్బతినడం జరిగిందని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే ఇంతటి విషాదం తర్వాత కూడా టర్కీలో పలుమార్లు మళ్లీ భూకంపాలు నమోదవ్వడం గమనార్హం. -
Turkey-Syria earthquakes: శిథిలాల కింద 12 రోజులు...
అన్‌టాకియా: తుర్కియే, సిరియాను భూకంపం కుదిపేసి 12 రోజులు గడుస్తున్నా ఇంకా కొందరు శిథిలాల కింద నుంచి మృత్యుంజయులుగా బయట పడుతున్నారు. హతాయ్ ప్రావిన్స్‌లోని అన్‌టాకియా నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ శిథిలాల కింద 296 గంటలుగా ఇరుక్కున్న ఒక కుటుంబంలో ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. సిమెంట్ పెళ్లల కింద క్షణమొక యుగంలా గడిపిన ఒక కుటుంబంలోని ముగ్గురి మూలుగులు ఉన్న సహాయ సిబ్బంది వారిని బయటకి తీశారు. వీరిలో భార్యాభర్తలిద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ఉంటే వారి 12 ఏళ్ల కుమారుడి ప్రాణాలు మాత్రం వైద్యులు కాపాడలేకపోయారు. రెండు దేశాల్లోనే భూకంప మృతుల సంఖ్య 44 వేలు దాటింది. తుర్కియేలో మొత్తం 11 ప్రావిన్స్‌లకు గాను రెండు తప్ప తొమ్మిది ప్రావిన్స్‌లలో సహాయ చర్యలు నిలిపివేసినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భూకంప బాధితుల కోసం అమెరికా నుంచి వచ్చిన సహాయ సామగ్రిని టర్కీలోని అడెనా ఎయిర్ బేస్ వద్ద ట్రక్కుల్లోకి చేరేయడంలో యూఎస్ సైనిక సిబ్బందికి సాయం చేస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్. భూకంప ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. -
టర్కీ భూకంపం.. రెండుగా చీలిన గ్రామం..13 అడుగులు కుంగిన ఇళ్లు
ఇస్తాన్‌బుల్: టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం 11 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 46వేల మందికిపైగా మరణించారు. అయితే ఈ భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిర్కోప్రు అనే గ్రామం రెండుగా చీలీపోయిది. భూప్రంకనల ధాటికి భారీ పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోకి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపం ముందు రోడ్డపక్కన కన్పించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి. 1000 మంది నివసించే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కన్పిస్తోంది. తన ఇల్లు 4 మీటర్ల లోతులోకి కుంగిపోయిందని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ గ్రామంలో తొలినాళ్లలోనే ఈయన ఇల్లు కట్టుకున్నాడు. అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కానీ చాలామందికి గాయాలయ్యాయని వివరించాడు. భూకంపం వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల కిటికీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. భూప్రకంపనల వల్ల ఈ గ్రామంలోని ఓ పశువుల కొట్టం కూడా కుంగిపోయింది. దాని మధ్యలో చీలికలు వచ్చాయి. దీంతో ఓ ఆవు అందులోనే కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
‘ఎవరీ మేజర్ బీనా తివారీ’
తుర్కియే - సిరియా భూకంప బాధితులకు అండగా నిలుస్తోన్న ఇండియన్ ఆర్మీ మేజర్ బీనా తివారీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇది భారత్ ఇమేజ్ అంటూ తాజాగా బీనా ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుర్కియే, సిరియాలో గతవారం సంభవించిన భారీ భూకంపంలో మృత్యువిలయం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 41వేలకు చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. భూకంపం సంభవించి తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల ఆర్తనాధాలు వినిపిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురించింది. ఇక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న భూకంప బాధితులకు భారత్ భరోసా ఇస్తోంది. 'ఆపరేషన్ దోస్త్' పేరుతో మీకు మేమున్నాం’ అంటూ గడ్డకట్టే చలిలోనూ ఇండియన్ ఆర్మీ సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా భారత్ నుంచి సహాయక చర్యల కోసం అక్కడికి వెళ్లిన మేజర్ బీనా తివారీ సేవలపై స్థానికుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె తమపట్ల చూపిస్తున్న ఆత్మీయతకు తుర్కియే వాసులు కరిగిపోతున్నారు. తుర్కియే మహిళ బీనా తివారీని ప్రేమగా ముద్దాడిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ చిత్రాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తాజాగా ఆమె ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో భారత్ ఒకటి. సహాయకచర్యలు, పీస్‌కీపింగ్‌లో మనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇదీ భారత్ ఇమేజ్’ అని ప్రశంసించారు. ఎవరీ మేజర్ బీనా తివారీ 28 ఏళ్ల ఇండియన్ మేజర్ బీనా తివారీ తుర్కియే భూకంప బాధితురాల్ని కాపాడింది. అందుకు కృతజ్ఞతగా బుగ్గన ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేయగా..ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన బీనా తివారీ కుటుంబ సభ్యులు మొత్తం దేశానికి సేవలందిస్తున్నారు. ఇప్పటికే బీనా తివారీ తాత కైలానంద్ తివారీ (84) కుమావ్ రెజిమెంట్ సుబేదార్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ఆమె తండ్రి మోహన్ చంద్ర తివారీ (56) అదే రెజిమెంట్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వర్యంలో అస్సాంలో పనిచేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరి 7న తుర్కియే - సిరియా క్షతగాత్రుల్ని కాపాడేందుకు 99 మంది వైద్య నిపుణుల బృందాన్ని అక్కడికి పంపిన విషయం తెలిసిందే. వారిలో మేజర్ బీనా తివారీ కూడా ఉన్నారు.