ఖామిష్లీ/వాషింగ్టన్: ఉత్తర సిరియాలోని టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్లింది. రాస్ అల్–అయిన్, తాల్ అబ్యాద్, కొబానె వంటి కీలక ప్రాంతాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుందని సిరియన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఉత్తర సిరియాలో తిష్టవేసిన కుర్దు ఉగ్రవాదులపై దాడులకు టర్కీ సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం వెనక్కి మళ్లినట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదులపై సైనిక అపరేషన్ చేపట్టాలన్న టర్కీ నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు. టర్కీ దీర్ఘకాలిక ప్రణాళికకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. టర్కీ అతి త్వరలోనే తన కార్యాచరణ ప్రారంభిస్తుందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో అమెరికా సైన్యం పాల్గొనే ప్రసక్తే లేదని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment