అంకారా: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు టర్కీ కౌంటరిచ్చింది. టర్కీకి చెందిన కొందరు కీలక వ్యక్తులే తిరుగుబాటుదారుల వెనుక ఉండి.. సిరియా బషర్ అల్ అసద్‌ను దేశం వెళ్లిపోయేలా చేశారు. సిరియాను ఆక్రమించుకోవడంలో టర్కీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలను టర్కీ తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ ట్రాడ్‌కాస్టర్.. ట్రంప్ వాదనలను కొట్టేశారు. ఈ సందర్భంగా ఫిదాన్ మాట్లాడుతూ.. సిరియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాచరిక వ్యవస్థకు ప్రజలే స్వస్థి చెప్పారు. దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం అని అనలేము. ఎందుకంటే సిరియా ప్రజల సంకల్పం మేరకే ఇలా జరిగిందని మేము భావిస్తాం. ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సిరియాలో జరిగిన పరిణామాలకు టర్కీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా పాలన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధిపత్యం కాదు.. ప్రతీ ఒక్కరికి ప్రజల సహకారం అవసరం అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. 2011లో చెలరేగిన అసద్ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభ రోజుల నుండి టర్కీ అతని పాలనపై వ్యతిరేకంగా ఉంది. ఈ క్రమంలో సిరియాలో మద్దతుదారులకు కీలకంగా ఉంది. రాజకీయ అసమ్మతివాదులతో పాటు మిలియన్ల మంది శరణార్థులకు టర్కీ ఆతిథ్యం ఇచ్చింది. ఇదే సమయంలో సైన్యంతో పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులకు కూడా మద్దతు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment