Bashar al Assad
-
సిరియాపై ట్రంప్ వ్యాఖ్యలు.. టర్కీ కౌంటర్
అంకారా: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు టర్కీ కౌంటరిచ్చింది. టర్కీకి చెందిన కొందరు కీలక వ్యక్తులే తిరుగుబాటుదారుల వెనుక ఉండి.. సిరియా బషర్ అల్ అసద్‌ను దేశం వెళ్లిపోయేలా చేశారు. సిరియాను ఆక్రమించుకోవడంలో టర్కీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలను టర్కీ తిరస్కరించింది.ఈ నేపథ్యంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ ట్రాడ్కాస్టర్.. ట్రంప్ వాదనలను కొట్టేశారు. ఈ సందర్భంగా ఫిదాన్ మాట్లాడుతూ.. సిరియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాచరిక వ్యవస్థకు ప్రజలే స్వస్థి చెప్పారు. దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం అని అనలేము. ఎందుకంటే సిరియా ప్రజల సంకల్పం మేరకే ఇలా జరిగిందని మేము భావిస్తాం. ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సిరియాలో జరిగిన పరిణామాలకు టర్కీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా పాలన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధిపత్యం కాదు.. ప్రతీ ఒక్కరికి ప్రజల సహకారం అవసరం అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. 2011లో చెలరేగిన అసద్ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభ రోజుల నుండి టర్కీ అతని పాలనపై వ్యతిరేకంగా ఉంది. ఈ క్రమంలో సిరియాలో మద్దతుదారులకు కీలకంగా ఉంది. రాజకీయ అసమ్మతివాదులతో పాటు మిలియన్ల మంది శరణార్థులకు టర్కీ ఆతిథ్యం ఇచ్చింది. ఇదే సమయంలో సైన్యంతో పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులకు కూడా మద్దతు ఇచ్చింది. -
సిరియా నుంచి పారిపోయిన అసద్
-
రసాయనదాడి.. ఓ కట్టుకథ: అసద్
తమ మీద క్షిపణులతో దాడి చేయడానికి అమెరికా ’రసాయన దాడి’ అనే కట్టుకథను ఉపయోగించుకుందని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తీవ్రంగా మండిపడ్డారు. నూటికి నూరుశాతం.. కచ్చితంగా అది కట్టుకథేనని, కేవలం తమ దేశం మీద దాడి చేయడం కోసం అమెరికా ఈ మొత్తం కథను అల్లేసిందని ఆయన అన్నారు. రసాయన ఆయుధాలన్నింటినీ సిరియా సైన్యం ఎప్పుడో విడిచిపెట్టేసిందని చెబుతూ.. అమెరికా దాడి చేసినంత మాత్రాన తమ సైనిక సామర్థ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. సిరియా సైన్యం చేసిందని చెబుతున్న రసాయన దాడిలో ఇప్పటివరకు 87 మంది మరణించారు. వాళ్లలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో మృతుల, క్షతగాత్రుల ఫొటోలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే సిరియా మాత్రం అసలు తాము ఈ తరహా దాడులే చేయలేదని చెబుతుండగా రష్యా కూడా దాన్ని సమర్థించింది. తిరుగుబాటుదారుల వద్ద విషపూరిత పదార్థాలతో కూడిన డిపో ఒకటి ఉందని, దానిమీద సిరియా వైమానిక దళం బాంబులు వేయడంతో దాన్నుంచి విషవాయువులు బయటకు వచ్చి ఉంటాయన్నది సిరియా, రష్యా వర్గాల వాదన. అసలు ఖాన్ షైఖుమ్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న దాడుల మీద కూడా అసద్ అనుమానం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియోలలో వాస్తవం ఎంతో తెలియదన్నారు. ఆ పిల్లలు నిజంగా ఖాన్ షైఖుమ్ ప్రాంతంవారో కాదో ఎలా చెప్పగలమని, ఇప్పుడు చాలా వరకు ఫేక్ వీడియోలు ఉంటున్నాయని అన్నారు. రసాయన దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సిరియాలోని ఒక వైమానిక స్థావరంపై మధ్యధరా సముద్రం నుంచి 59 తోమహాక్ క్షిపణులు ప్రయోగింపజేసిన విషయం తెలిసిందే. సిరియాలో ఆరేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే మొదటిసారి. -
‘అసలైన యుద్ధానికి’ రెడీగా ఉండు..!
ట్రంప్‌కు రష్యా, ఇరాన్ వార్నింగ్! సిరియాలో అధ్యక్షుడు అసద్ సేనలు లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అసద్‌కు కొమ్ముకాస్తున్న రష్యా, ఇరాన్ తాజాగా అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వ సేనలు లక్ష్యంగా అమెరికా మరిన్ని దాడులు చేస్తే.. తాము సైనిక దాడులతో బదులు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించాయి. అసద్ సేనలపై క్షిపణీ దాడులు నిర్వహించడం ద్వారా ట్రంప్ లక్ష్మణ రేఖ (రెడ్‌లైన్)ను దాటారని పేర్కొన్నాయి. ‘ఇప్పటినుంచి భద్రతా పరమైన లక్ష్మణరేఖను ఉల్లంఘిస్తే మేం దీటుగా సమాధానమిస్తాం. మేం ఎలా బదులివ్వగలమో అమెరికాకు బాగా తెలుసు’ అని రష్యా, ఇరాన్ ఆర్మీ చీఫ్‌లు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లండన్‌లో రష్యా రాయబార కార్యాలయం ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిరియా విషయంలో రష్యాకు అల్టిమేటం ఇస్తే ఇక అసలైన యుద్ధం తప్పదని హెచ్చరించింది. ఇటీవల సిరియాలోని రెబెల్స్ అధీనంలో ఉన్న ప్రాంతంలో రసాయనిక దాడి జరగడం.. ఈ దాడి అసద్ ప్రభుత్వం పనేనని ఆరోపణలు రావడంతో సిరియా విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. గత మంగళవారం సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు నిర్వహించింది. అంతేకాకుండా సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హెలీ తాజాగా స్పష్టం చేశారు. అయితే, అసద్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్న రష్యా, ఇరాన్.. ట్రంప్ సర్కారును బాహాటంగా సవాల్ చేస్తున్నాయి. -
అసద్‌పై ట్రంప్ యూటర్న్.. ఇక గద్దె దించుడే!
వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని అమెరికా కుండబద్దలు కొట్టింది. సిరియాలో తాజాగా జరిగిన రసాయన దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఈ మేరకు యూటర్న్ తీసుకొంది. అసద్ పదవి నుంచి వైదొలగడం అనివార్యమని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హెలీ స్పష్టం చేశారు. సిరియాలో రెబెల్స్ అధీనంలో ఉన్న ఖాన్ షిఖౌన్ పట్టణంలో జరిగిన రసాయనిక దాడిలో 89 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అసద్ ప్రభుత్వమే ఈ దాడి చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మంగళవారం ఏకంగా సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు నిర్వహించింది. రసాయని దాడికి గురైన ప్రజల దయనీయ ఫొటోలను చూసి ఖిన్నుడైన ట్రంప్.. రెబెల్స్‌పై దాడులకు కారణమైన పశ్చిమ సిరియాలోని షాయరత్ వైమానిక స్థావరాన్ని పేల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా సీఎన్ఎన్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నిక్కీ హెలీ ’అసద్‌ను కూలదోయడం మా ప్రాధాన్యం. అంతేకాకుండా మరోవైపు ఐఎస్ఐఎస్ను ఓడించడానికీ ప్రయత్నిస్తున్నాం. అసద్ ఉన్నంతకాలం సిరియాను శాంతియుతంగా చూడలేం. ఇరాన్ ప్రభావాన్ని కూడా తొలగించాల్సిన అవసరముంది. చివరగా సిరియాలో రాజకీయ పరిష్కారాన్ని కనుగొంటాం’ అని చెప్పారు. ఒకవైపు ఐఎస్ఐఎస్పై పోరాడుతూనే.. మరోవైపు అసద్‌ను గద్దె దించాలని చూడటం మూర్ఖత్వమని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న సంగతి తెలిసింది. రసాయనిక దాడికి ముందు కూడా అసద్‌ను గద్దె దించడం తమ ప్రాధాన్యం కాదని ట్రంప్ సర్కారు పేర్కొంది. కానీ, రసాయనిక దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో రష్యా మద్దతున్న అసద్‌ను గద్దె దించితీరుతామని స్పష్టం చేసింది. మరోవైపు గుడ్డిగా అసద్‌ను వెనకేసుకొస్తున్న రష్యా.. ఈ విషయంలో అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. -
రష్యాకు ఎదురుదెబ్బ!
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో అగ్రరాజ్యం రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అసద్ అలెపో నగరంలో జరిపిన దాడికి మద్దతునివ్వడం ద్వారా రష్యా యుద్ధనేరాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో హక్కుల మండలిలో ఆ దేశానికి చుక్కెదురైంది. హక్కుల మండలిలో సభ్యత్వం కోసం రష్యా చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. 47 మందితో కూడిన హక్కుల మండలిలో తాజాగా 14 దేశాలకు సభ్యత్వం కల్పించేందుకు 193మంది సభ్యులతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో 112 ఓట్లు మాత్రమే సాధించిన రష్యా హంగేరి, క్రోషియా చేతిలో ఓడిపోయింది. హక్కుల మండలిలో రష్యా సభ్యత్వాన్ని దాదాపు 87 హక్కుల సంఘాలు వ్యతిరేకించాయని హక్కుల మండలి ఐరాస డిప్యూటీ డైరెక్టర్ అక్షయకుమార్ తెలిపారు. ‘అలెపోలో జరిగిన అరాచకాలను మరిచిపోవడం అంత సులభం కాదు. ఓటు వేసిన వారి మనసులో ఆ ఘటనలు గుర్తుండిఉంటాయి’ అని ఆయన తెలిపారు. రష్యాకు ఇది చరిత్రాత్మక తిరస్కరణ ఆయన స్పష్టం చేశారు. అమెరికా-రష్యా కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో అలెపో నగరంలో పరిస్థితులు మరింత దారుణంగా మారి సంక్షోభం మరింత ముదిరింది. రష్యా మద్దతున్న అసద్ ప్రభుత్వం తూర్పు అలెప్పో నగరంలో బలంగా ఉన్న తిరుగుబాటుదారులను ఏరివేసేందుకు భారీ ఎత్తున దాడులు జరుపుతుండటంతో ఇక్కడ ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.