వాషింగ్టన్:సిరియా సంక్షోభంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిరియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఈ వ్యవహారానికి అమెరికా సైన్యం దూరంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో తాజాగా ఓ పోస్టు చేశారు.
సిరియా అధ్యక్షుడు అసద్ అమెరికా సాయానికి అర్హుడు కాదని పేర్కొన్నారు. తాజాగా సిరియాలో సంకక్షోభం ముదిరి రెబెల్స్ అక్కడి కీలక హోమ్స్ నగరాన్ని ఆక్రమించారు. ఈ పరిణామంతో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అసద్‌కు ఇరాన్, రష్యా మద్దతుండడం గమనార్హం.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా సిరియా అంతర్యుద్ధంపై స్పందించారు. తమ ప్రభుత్వం సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ శనివారం(డిసెంబర్ 8)నోట్రె డ్యామ్ చర్చి ప్రారంభానికి ప్యారిస్ విచ్చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: సిరియాలో కల్లోలం దేశం వీడిన అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment